భారతదేశపు మేధావులు
నేను 1970 లలో హైదరాబాద్ లో రిసెర్చి చేస్తున్నపుడు, “ కార్మిక, కర్షక,
విద్యార్ధి, మేధావి ఐక్యత వర్ధిల్లాలి” అనే రాతలు వెల్లవేసిన గోడల మీద ప్రతి
ఫర్లాంగ్ దూరానికి కనిపించేవి. ఈ మేధావులు ఆ మేధావులు.
భారతదేశమున మేధావులు అధికం. వీరిలో రేషనలిష్టులు
ఎక్కువ. వీరు ఏ మతమును అనుసరించరు. హిందూ మతమును, ప్రాచీన భారతదేశపు సంస్కృతిని ఇప్పుడని, అప్పుడని
లేదు. మెళకువ వచ్చినప్పుడల్లా ఆడిపోసుకుంటూంటారు.
మరే మతము జోలికి పోరు. భయమో, భక్తో, రెండూనో, మరే మతములోనూ వారికి ఏ విధమైన లోటు పాట్లు కనిపించవు.
లేచింది మొదలు నిద్రపోయే దాకా భారతదేశపు పూర్వ సంస్కృతి మీద, నాగరికత, వైభవము, సంస్కారముల మీద ద్వేషము విద్వేషము, అక్కసు
మాత్రమే వీరి మాటల్లో, రాతల్లో ఉంటుంది. ఉపన్యాసాలూ అంతే. సంఘానికి, దేశానికీ
ఉపయోగించే ఒక్క ఆలోచన కాని, మాట కాని, చేత కాని
వీరికి చేతకాదు.
వారికంటూ ఒక ఆలోచనా ధోరణి, సరళి ఉండవు. ఏదైతే, పురాతన
సంప్రదాయము, సంస్కృతి, సంస్కారమునకు
అనుగుణంగా ఉంటాయో అవి వీరికి నచ్చవు. నోటికొచ్చినట్టు
తిడతారు. ఏమయినా అంటే మా పీకలని నొక్కేస్తున్నారు, మా వాక్ స్వాతంత్ర్యాన్ని, కళాసృష్టి ని
చిదిమేస్తున్నారు, అంటారు. వాళ్ళ ప్రేలాపనలకు అడ్డు, అదుపు, ఆపు ఉండవు.
మనం ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనేది వాళ్ళే నిర్ణయిస్తారు.
ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా తిరగనియ్యమంటారు. ఏమైనా
అయితే కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలియజేస్తారు.
మారథన్ రన్ లు నిర్వహిస్తారు. మనల్ని మన పిల్లల్ని ప్రశాంతముగ
పెంచుకోనివ్వరు. అలా, అర్ధరాత్రి, అపరాత్రి అని
లెక్క చెయ్యకుండా ఆడపిల్లల్ని బయట తిరగనియ్యమంటారు. వాళ్ళ
స్వంత కూతుళ్ళని ఎలా పెంచుతారో మనకి తెలియదు.
అర్ధరాత్రి మగవాళ్ళకే రక్షణ లేదు ఇక ఆడపిల్లలు తిరగడం ఏమిటయ్యా అంటే మన మీద తిరగబడతారు. ఆడపిల్లలను వంటింటికి, పడకటింటికి పరిమితం చేసే దుష్ట సంప్రదాయపు రోజులు పోయాయంటారు.
అన్ని విషయాలలోను వాళ్ళే నిర్ణయించి మనందరిని అలా
మసలమంటారు. వాళ్ళ గీచిన గీటు మనము దాటరాదు. హిందూ మతంలో కంటే
ఇతర మతాలలో స్త్రీల పట్ల ఎక్కువ వివక్షత చూపబడుతోంది కదా ఏమీ మాట్లాడరేమిటంటే
ఏమీ మాట్లాడరు. ఉలుకూపలుకు ఉండదు.
వీళ్ళలో ఎక్కువ మంది వారి మాతృభాషను తప్ప మరే
భాషను నేర్వరు. ఈ మేధావులందరూ ఇంచుమించు రచయితలు, కవులు, విశ్వవిద్యాలయ
ఆచార్యులు. ఆంగ్ల భాషను ఆడిపోసుకుంటారు. ఆ భాషా
సాహిత్యాల వల్ల తమ సొహిత్యాలకు గుర్తింపు రావటం లేదంటారు. వీరిలో ఎక్కువ మంది పుర్రచేతి భావాల ప్రియులు. సంఘంలోని
అన్ని వ్యవస్థలను కబ్జా చేసి సంఘ జీవితాన్ని అతలాకుతలం, ఛిన్నాభిన్నం
చేయడం వీరి జీవిక.
వీరిలో చాలామందికి సాంఘికశాస్త్రాలలోనో, మాతృభాషలో
సాహిత్యం లోనో డిగ్రీలుంటాయి. విజ్ఞానశాస్త్ర పఠనం వీరెవరూ చేసి
ఉండరు. భౌతిక, రసాయన, జీవ, జీవ భౌతిక, జీవ రసాయన, గణిత, సంగణక, ఇతర సాంకేతిక, విజ్ఞానశాస్త్రములలో
వీరికి ఏమీ , ఏవిధమైన ప్రవేశము ఉండదు, ఆ యా
శాస్త్రముల లోని లొసుగులు, విషయములపై ఏ
విధమైన అవగాహన, పట్టు ఉండవు. కు తర్కకర్కశములతో వితండ వాదన చేస్తారు. సైంటిఫిక్
టెంపర్ గురించి వివిధరకాల ఉపన్యాసాలను
ఇస్తారు.
తాము ఏది నమ్ముతారో అందరూ అదే నమ్మాలంటారు. భగవంతుడు
లేడంటారు. అది మీ నమ్మకం మాత్రమే అంటే వినరు. "చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు" అన్నట్టు
ఉంటుంది వీళ్ళ వ్యవహారం.
భారతదేశ ప్రగతి వీరికి అనవసరం. వాళ్ళ, వాళ్ళ
సిద్ధాంతరాద్ధాంతాలు వీరికి అమిత ప్రియం.
నూతిలో కప్ప వ్యవహారం వీళ్ళది. తమకు తెలిసినదే అంతా అంటారు. వీరికి
అహంభావం, అమాయకత్వం ఎక్కువ. తాము పట్టిన
కుందేటికి మూడే కాళ్ళు అంటారు.
*********
పదముల హోలీ, రసముల రాజ్ఞి! సరసముల పుట్ట. ఆహ్లాదముల అంబుధి. రస హృదయము. సరసుల మానస సరోవరమున ఫుల్లారవిందం.
*************
ప్రపంచం వేషాలకి మోసపోయినట్టు, నిజాన్ని గుర్తించదు. అబద్ధపు మాటలకి, వేషాలకి అంత ఇంద్రజాలం ఉంటుదన్నమాట. అబద్దంలో ఆకర్షణ, నిజములో వికర్షణ ఉంటాయేమో?
*************
డబ్బులు ఎగేసే వాళ్ళకు సిగ్గు, శరం, మానాభిమానాలు ఉండవు.అన్నింటికీ తెగించిన వారు వారు. మొండివాడు రాజుకన్న బలవంతుడు కదా.
***********
Commotion of thoughts is a sign of peacelessness.
************
పూజ కొద్దీ బాయ్ / గర్ల్ ఫ్రెండ్, పుణ్యం కొద్దీ ఉద్యోగం.
*************
భాష రాక ఊహించుటయు చేతకాక అలంకరించుట
ముందే తెలియక ఏదో సిద్ధాంత పంజరపు చిలకలై
చెప్పినదే చెప్పు రాతగాళ్ళు మన నుదుటి రాతలు
కవనముల ఖూనీ చేయు వీరు పిడివాదులు వాదముల
వాదనలో వాది ప్రతివాదులై కుతర్కముల మునిగి తేలు
కాల సంహారకులు సమన్వయము సమత మమతా హంతకులు
******************
ధరించిన దుస్తులు ఏవైనా లోపలి శరీరము అదే
ఏం భాషను ప్రయోగించినా పలుకుల సారమదే;
మతమేదైనా కరుణలవే; మారణహోమములవే;
వేదాంతమేదైనా తత్త్వమదే; స్త్రీ పురుషులు ఎవరైనా
శృంగారమదే; యవతీయువకులెవరైనా మన్మథుని
అల్లరి అదే; మానవులెవరైనా మృత్యు కౌగిలి అదే
*************
తల్లి వేసిన దుస్తులతో అందగిస్తుంది పసిపిల్ల; దుస్తుల గురించి, అందం గురించీ దానికేమీ తెలియదు. భగవంతుని కరుణతో అందగిస్తుంది మన జీవితం. మన కేమీ తెలియదు.
***********
పలకలు బలపములు పట్టి దిద్దితిమి అ ఆ లు
బట్టీ పట్టితిమి ఎక్కాలు, వ్యాకరణ సూత్రాలు
మంచి మంచి సుభాషితములు, సూక్తులు, పద్యాలు
సాహితీ సుగంధముల నాఘ్రాణించితిమి నేడు మరునాడు
చదువుల సంరంభమే మారిపోయె నేడు, విద్య నేర్చుబ
హుళక్కి; దృష్టి అంతయు అంతమున వచ్చు, ఉద్యోగము
తెచ్చునేమో తను అను ఆశ కలిగించు, కాగితపుముక్కకై;
చదువు అర్థము ప్రయోజనములు కోల్పోయె వ్యథయ్యను
*************
Indian Secularism and socialism
Can just opposing RSS and BJP makes one secular and socialist? India is ridiculously and intelligently misled all these years by intellectuals of left and under-privileged community leaders to believe that if you talk against Hindu faith and ancient Indian wisdom you are not communal and are secular and if you side and are biased towards a caste, a region or sub-nationality culture, or an alien faith, you are neither communal nor fascist.
India is grossly divided by politicians and pseudo intellectuals so that no emotional integration is present among Indians. Unless we feel for the nation and work towards it we cannot progress under the leadership of caste, region, sub-nationality, ideologically blind leaders. Let us defeat the divide and ask for votes policy of narrow-minded leadership of self-proclaimed intelligentsia and redeemers.
************
The noise made by immature opposition, media and like people and organisations in relation to de-monetisation is silenced by UP voters I think. Just talking for opposing sake sans substance and their inefficient and biased perspective regarding ordinary citizens and their minds in the fight towards black money and corruption is sanctioned and commended by informed and sagacious voters is a boost for the economic and financial reforms initiated sincerely by the government. Wish such insight is shown and practiced by rest of Indians.

No comments:
Post a Comment