Thursday, March 30, 2017

మరుసటి ఉగాదికి ఆహ్వానము; ఆకర్షణ - అవసరము; జీవిత పరమార్ధము - జీవన సాఫల్యము; భుక్తి - కౌశలములు

మరుసటి ఉగాదికి ఆహ్వానము

మెళకువ రాగానే జోరీగల వలె ముసురు ఆలోచనల
మధ్యనుంచి; తుమ్మెదల వలె చుట్టుముట్టి ఝంకరించు
తలపుల బారి నుంచి తప్పించుకొని బయట పడుటయే
గగనముగనున్న నాకు ఉగాది నాడు క్రొత్త సంవత్సరపు

పేరే గందరగోళమైన నేడు, అంతా చేదే; మనసుకు స్థిమితం
లేదు; ఆహ్లాదము లేదు; కప్పల తక్కెడ వ్యవహార మైనది
తెలుగు నాట అంతయు; అన్నియు తలకో దారి
యైన పంచాంగముల, కర్తల; వాటిపై, వారిపై పండిత


మన్యుల మీమాంసలు, వాద ప్రతివాదములు; ప్రతి వాడును
 పంచాంగం చేయు నేడు ఏది నిజము? ఏది
అనుసరణీయము? స్పష్టత లేని ఈ రోజున మౌనముగ
భగవంతుని స్మరించుచూ, ప్రార్ధించుచూ ఉగాది జరుపు

కొనుట మేలు; పేరులోన ఏమున్నది పెన్నిధి?
ఆ పన్నెండు నెలలే ఆ తిథులే, ఆ వారములే;
రాబోవు ఉగాది వరకు ఎటులనో గడిపి, మీమాంసలు,
వృత్తి, ప్రవృత్తి అంటని ఆరామము మనసునేలుచుండగా ఆహ్వానింతము తీయగ
మరుసటి ఉగాదిని, మనందరకు మనసులు ముదమంద

ఒక్క తాటి పై నిలచి సంవత్సర నామము పట్టించుకొనక
**************
ఆకర్షణ - అవసరము

ఆడవారికి రూపము మగవారికి మేధ, శూరత్వము, ధైర్యం
ఆకర్షణనిచ్చును; పాలకునికి ప్రజలతో మమేకమై వారి కష్ట
సుఖముల పంచుకొనుట ఆకర్షణ; కవికి, రచయితకు
పాఠకులకు మానసిక వినోదము, వికాసము కల్గించుట

ఆకర్షణ; ప్రకృతీ ప్రక్రియల అవగాహన చేసుకొనుట జ్ఞానికి,
శాస్త్రవేత్తకు ఆకర్షణ; ప్రకృతీ తత్త్వమును విచారించి
తేటచేయుట తత్త్వవేత్తకు ఆకర్షణ; ఆర్తుల, జిజ్ఞాసువుల,
శిథిల మనస్కుల, అర్ధార్ధుల, భక్తుల, బ్రోచి, కాచుట

పరమేశ్వరునకాకర్షణ; త్యాగము, యోగము, రాగము,
విరాగము, మానసిక విరామము, సాయుజ్యము మనిషికి
ఆకర్షణ; ప్రేమ, అభిమానము, ఆత్మీయత, అనురాగము
గృహస్థులకు, సకల మానవాళికి ఆకర్షణ, అవసరము
***********
 చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
************

Experienced meaning is conscious awareness of sense, idea or intuition. Meaningful experience is conscious awareness of mood, understanding or insight.
***********
 జీవిత పరమార్ధము - జీవన సాఫల్యము

మనందరం భగవంతుణ్ణి రూపంగా ఆరాధించ వచ్చు; నామంగా స్మరించ వచ్చు; తత్త్వంగా అనుభవించ వచ్చు.
భగవత్ తత్వము నిర్గుణమే అయినా, రూపమునకు, గుణమునకు మన అవగాహనానుసారము, ఇష్టానుసారం మనం అన్వయించుకొని పూజలు, పునస్కారములు చేసికోవచ్చు.

సదాచరణంతో మనసు నిర్మలమై, భగవన్మయం కావడమే, ఆ స్థితిని నిరంతరం అనుభవిస్తూ, సంయమనంతో విధ్యుక్త ధర్మములను నిర్వహించడమే ఆధ్యాత్మికత పరమార్ధము. భక్తి, జ్ఞాన, కర్మ మార్గములలో మనకు నచ్చిన దానిని, ఇష్టమైన దానిని అనుసరిస్తూ, సంసార బాధ్యతలను పరమాత్మార్పణంగా నిర్వర్తిస్తూ, ముముక్షువులమై జీవిస్తూ, బ్రహ్మైక్యమునొందడమే జీవిత పరమార్థము. జీవన సాఫల్యము.
**********

భుక్తి - కౌశలములు

వృత్తులు భుక్తికై కౌశలములు. బ్రాహ్మణులు వృత్తులను కులాలు చేశారని నింద. వంశపారంపర్యంగా దీనిని మార్చేశారని మరొక ఆరోపణ. ఎవరు, ఎప్పడు ఏమి చేశారన్నది ప్రామాణికత, విశ్లేషణ, అవగాహన​ లేని ఊక దంపుడు కబుర్లు​. సంఘంలో మేధావులుగా చలామణీ కావడానికి సులువైన మార్గం.

వంశపారంపర్యంగా చేసినా, కులాల పేరుతో చేసినా, వృత్తులు చేయడం ప్రతి ప్రాంతంలోనూ, దేశంలోనూ, సంఘంలోనూ తప్పని వ్యవహారం, సమాజ వ్యాయామం. మిగతా సంఘాల్లో, దేశాల్లో, ప్రాంతాల్లో వృత్తులు ఎవరు చేశారన్నది ప్రధానము, ముఖ్యము కాదు. అక్కడ వంశపారంపర్యంగా వృత్తులు స్వీకరించబడవు. కాని అన్నిరకాల పనులు వృత్తుల రూపంలోనే జరుగుతాయి.

భారతదేశంలో మాత్రమే తండ్రి తాతల వృత్తిని బట్టి, ఇప్పటి చదువులకు, ఉద్యోగాలకు సంబంధం లేకపోయినా, రాజకీయ కారణాల దృష్ట్యా ప్రత్యేకతలు అడుగుతారు. ప్రభుత్వం వారు చూపుతారు కూడాను. ఇన్నాళ్ళూ బ్రాహ్మణులు ​చేసిన అన్యాయం వలన మిగతా కులాల వాళ్ళందరూ ఎంతో నష్టపోయారని, బ్రాహ్మణులు వారిని ఇన్ని శతాబ్దాలు అణచిపెట్టి ఉంచారని అందుకే వారు వెనకబడి పోయారని ఆ తప్పంతా బ్రాహ్మణుల మీదకి తోసేసి రకరకాల పేర్లతో ఎన్ని కులాలవారో వెనకబడిన తనాన్ని అపాదించు కున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో గారాబం చేయబడుతున్నారు.

ఈ కాగితం ముక్క చదువులు జ్ఞానాన్ని కలిగించడం లేదు, ఉద్యోగాలు తేవడం లేదు. అయినా బ్రాహ్మణుల మీద పడి ఏడవడం ఆగలేదు. పూర్వకాలపు వృత్తులన్నీ ఏదో ఒక సాంకేతిక విద్యకు సంబంధించినవి. అలా ఇప్పుడు మనం ఎగబడుతున్న సాంకేతిక విద్య రకరకాల వృత్తులలో ఇదివరకటి నుంచీ ఇమిడి ఉంది. అందుకనే ఏదైనా వృత్తిలో నిలచిన వారు ధనసంపాదన ఘనంగా చేసికుంటూ ఏ ఉద్యోగికి తక్కువ కాకుండా జీవితాలని గడుపుకుంటున్నారు. దీనిని గమనించీ ఏం మేధావి మాట్లాడడు.

అలా మనం ఇంజనీరింగ్ అని ఇప్పుడు ఎగబడుతున్న చదువులు ఎప్పుడోనే వృత్తుల రూపంలో, (కులాల పేరుతో), బ్రాహ్మణేతరులకు తరతరాలుగా అందుతూనే ఉన్నాయి. ఈ నిజం గ్రహిస్తే బ్రాహ్మణులపై శాపనార్ధాలు, అపార్ధాలు తొంభై శాతం మాయమై పోతాయి. అప్పుడు స్థిమితంగా ఏంటి​ చదువుకోవాలి, ఏ కౌశలం నేర్చుకోవాలి అనే విషయం అవగతమై, అవగాహన ఏర్పడుతుంది.

ఇంజనీరింగ్ కళాశాలలో అరవై శాతం సీట్లు ఖాళీగా ఉండిపోతున్న ప్రస్తుతం ఆమె కాగితం ముక్కతో ఉద్యోగానికై వెంపర్లాడడం బదులు, ఎవరైనా, సాంప్రదాయ వృత్తులను, సాంకేతికత పెరగడం వల్ల ఏర్పడిన క్రొత్త వృత్తులను నేర్చుకొని, మెళకువలు పట్టి జీవికను ఏర్పరచంకోవడం ఇంగితం.

కౌశలములు మాత్రమే ధనం సంపాదనకు పనికొస్తాయి. సాంప్రదాయ రీత్యా ఎవరు ఏ కులానికి చెందినా మంచి సాంకేతికత నిండిన కౌశలం నేర్చుకొని, వంటబట్టించు కొని జీవితం ఏర్పరచుకోవడం తెలివైన పని. కాగితపు ముక్క చదువుjలవలకై డబ్బునీ, సమయాన్ని, ఇతర శక్తి యుక్తులను వ్యర్థం చేసి కోవడం వృథా ప్రయాస.

No comments:

Post a Comment