Tuesday, March 24, 2015

సాధించుటలు!




సాధించుటలు!

ఇన్నాళ్ళూ
మగవాళ్ళ ధాష్టీకానికి
బలైపోయామని ఆడాళ్ళు;


బ్రాహ్మణుల స్వార్ధానికి
ఎంతో కోల్పోయామని మిగతా వాళ్ళు;

సంఘంలో ఉచిత స్థానానికై
వాదముల పేరిట రాధ్ధాంతములు
చేయుచున్న నేడు;

వారి వారి వాదములలో పస ఎంత?
గోల, గందరగోళము, హడావుడి,
నిజము, అబధ్ధము ఎంత?

ప్రతిదానిని, ప్రతివారిని
సంస్కార రహితముగ విమర్శించుచు
నోరు పారవేసుకొనుచున్న
మేధావులు, సంఘ సంస్కర్తలు
సాధించుచున్నది ఏమి?

విజ్ఞులను సాధించుటయే మిగిలినది.

No comments:

Post a Comment