గమనించు
చెలీ! రాధా!
గమనించు
చెలీ! రాధా!
నీ
చెల్లియొ నెచ్చెలియొ
ప్రత్యర్థియె
సపత్నియొ
నా
మానసిక సౌధాంతరమున
నాపై
ప్రేమ అనురాగము ఆభిమానములతో
నాతో
చెట్టా పట్టాలేసికొని
షికారులు
చేయుచున్నది
నన్నల్లుకొని
నాతో రత్యోత్సుకయై
గమనించు
సఖీ! నీ పంచనే ఉన్నది
మౌనము
దాని భాష
రాగము
దాని ప్రకృతి
రూపమున
అది అపురూపము
కలసి
నాతో తమకములు పెంచుకొనుచున్నది
క్రింద
మీదగుటకు ప్రోత్సహించుచున్నది
ఒంటిపై
నూలుపోగు లేక అందములను నాకు
కనువిందు
చేయుచున్నది పంచుటకై ఆరాటపడుచున్నది
జాగ్రత్త!
అది అకతాయిది
జాగ్రత్త!
అది సరసముల సరసి
జాగ్రత్త!
అది నిలువలేకున్నది
అగ్రజవొ
సఖివొ ప్రత్యర్థివొ సపత్నివొ
పొందుకై
అందముల విందుకై
నాతో
రసానందముల తేలుటకై
నీవే
త్వరగా రమ్ము సఖీ! రాధా!
లేనిచో
ప్రణయినీ!
ప్రాణేశ్వరీ!
అంబరమునంటు
సుఖములను
దిగంబరులమై
మనము
తనివిదీర
జుర్రుకొను సమయములు;
మన
పుట్టుకల జన్మ జన్మల అనుబంధముల
సాఫల్యమొనర్చుకొను
తరుణములు
ఈ
క్షణముననే రప్పించి
మన
ముందుంచును
నీ
అనుజ
నీ చెలి
నీ ప్రత్యర్థి
నీ
సపత్ని
నీ
మనసు!
No comments:
Post a Comment