Sunday, June 26, 2016

అభిసారికయైన ప్రేయసి

Image result for Images of Radha and Krishna
Image result for Images of Radha and Krishna

Image result for Images of Radha and Krishna


అభిసారికయైన ప్రేయసి

ప్రేయసిని నేను
నీ రక రకాల శ్రేయస్సును నేను
సఖా! అరుదెంచవోయీ మానస రమణా!

చల్లని పున్నమి వెన్నెల ఆహ్లాదముగా నున్నది
మనసు రసభరితమై ఊపుతున్నది


మన్మథుడు అనంగుడైనను అంగముల
నిలువనీకున్నాడు రాతి గుండె వాడు

ఆ అసమశరుని అమ్ముల ములుకులకు
తాళలేకున్నను ప్రియుడా! రమ్ము వెంటనే
కమ్ము జుంటు తేనియల విందారగించు భ్రమరము
వహించి యున్నాను నిండుగా మధువులు నీకై

ఓలలాడెదము ఆనందాబ్ధిని రారా రసావతారా!
మేనుల కలయికలో మనసుల డోలికలలో మనోహరా!
అనుభవింతము అద్వైతమును
మనసా వచసా కర్మణా!

1 comment: