Tuesday, June 7, 2016

కవితలు మాత్రమే అల్లగలను




 కవితలు మాత్రమే అల్లగలను


కవితలు మాత్రమే అల్లగలను; పాటలు
పాడలేను; నాట్యములు చేయలేను;
నటించలేను; చిత్రకళలో ప్రావీణ్యత సున్నా;
చెక్కలేను శిల్పములను రాతివైనా, చెక్కవైనా

అబద్ధములాడి, మోసపూరిత పనులతో
రాజకీయముల రాణించలేను; తిమ్మిని
బ్రహ్మిని చేసి డబ్బు సంపాదించలేను;
వ్యాపారముల, వ్యవహారముల నడపలేను;

మంచి పుస్తకముల చదువుట, అందు
రమించుట నా స్వభావము; కాని మము
బోంట్లకు ధనము చేకూరదు; డబ్బు చేతిలో
నుండదు; రోజూవారీ జీవనమునకై మరొక

వృత్తిని చేపట్టవలె; ఉద్యోగము చేయవలె
కవిత్వము సార్వజనీనమైననూ అందరు
జనులచే ఆస్వాదింపబడదు; ఆదాయమూ
రాదు; అయిననూ ప్రవృత్తి ఉండనీయదు కదా

రాయించుచునేయుండును రసస్థితుల నిచ్చి

No comments:

Post a Comment