గోవింద మాల
వారణాసి రామబ్రహ్మం
1. పాలు కుడిచి తల్లి చన్ను నరకు చందమున
ప్రకృతిపై మనిషి జరుపుచున్న విధ్వంస కాండకు
తనకు తాను చేసికొనుచున్న ఘాతుకములకు
మనసు చెదిరి మిక్కిలిగ వేదన నొందు నాకు
ఎవరు తోడు? ఏది ఉపశమనము?
మహాత్ముల ఆలోచనలు, భావములే తోడు
గోవిందుని స్మరించుటయే ఉపశమనము
నంద నందనుని శరణు జొచ్చుటయె మంగళ కరము
2. దేశముల మధ్య సంఘర్షణ
దేశ ప్రజల మధ్య ఘర్షణ
మరిచెను మనిషి విచక్షణ
గోవిందుడే మనకు రక్షణ
Conflict among nations
Rift among citizens
Man lost discretion
and commonsense
Only Lord Govinda can save us!
3. పట్టాల వల్ల కలుగును ఉద్యోగములు
పట్టాలున్నను కలుగవచ్చు నిరుద్యోగములు
పట్టాలు కలిగించక పోవచ్చును భాగ్యములు
గోవింద ధ్యానమున కలుగును సౌభాగ్యములు
The full moon is the beauty to the full moon night
The Sun is the beauty to the day
The stars are the beauty to the new moon night
Lord Govinda is beauty to every heart
4. మనసును చదువగల చదువే చదువు
మనసు నెరిగి మసలే భార్యయే అర్థాంగి
మనసున మనసు కలుపుటయే స్నేహము
మనసున గోవిందుడు నిండుటయే శాంతి
The learning which gives ability to read the minds
Is the real learning;
The wife who senses her husband's mind
And behaves accordingly is the better-half;
Tuning of minds and hearts
Is the friendship and love
Lord Govinda filling our mind is peace of mind
6. శ్రావ్యము కాని పాట విశ్వ శ్రేయము కాంక్షించని
కావ్యము, కన్నులకింపు గాని నృత్యము, ప్రజల బాధ
ల వ్యథల బాపి సేమము చూడని నాయకత్వము గోవిందుని
దివ్య నామము స్మరింపని హృదయము పృథివిని వృథా! వృథా!
Song which is not melodious;
Poetical work which does not profess
Well being of all creation
Dance which is not a feast to the eyes
The leadership which does not
eradicate the worries and difficulties of its citizens
And take care of their welfare
The heart which does not chant
The Divine Name of Nanada nandana Govinda
Are all waste waste on this planet
7. వాదములు ప్రసంగములు వేదాంతములు
శుష్కాయాసములు; చూపించలేవు పరంధాముని;
నిరంతర గోవింద నామ స్మరణమున
శుద్ధమైన మనసు చూచును విశ్వాత్ముని
Indulging in debates, giving lectures,
Discoursing on Vedanta
Are all futile and waste of energy
They cannot make us experience
The Divinity;
By continuously chanting Govinda's Name
The heart sees the Lord of the Universe
8. వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు
The cool breeze before it starts raining causes pleasantness
In the autumn the full moon - light makes one happy
The jasmines of the summer envelop us with their fragrances causing joy
Such pleasantness, happiness, joy are caused always
By chanting the name of Govinda!
9 . అందమైన అర్థము నిచ్చు పదములు అలంకారం రచనకి
మందమైన నడక నిచ్చు పదములు అలంకారం తరుణ రమణికి
డెందమును ఊయలలూపు పదములు అవసరం కవితకి
నంద గోపబాలుడు గోవిందుని పదములు అవసరం మనశ్శాంతికి
Aesthetic words giving beautiful meaning are ornaments to the write-up
The feet which give elephant-like slow walk give beauty to the pretty woman
The words that move the heart vigorously are necessary for the verse
The feet of Lord Govinda are necessary for peace of mind
10 . వికసించిన కమలములు నిండు సరసికి
శాంతి నిండిన మానవులు నిండు అవనికి
క్రాంతదర్శులైన జ్ఞానులు నిండు లోకమునకు
శాంతి నిచ్చు గోవిందుడు నిండు మనసుకు
Fully blown lotuses are beauty to the lake
Humans with serene minds are beauty to the globe
Enlightening seers and saints are beauty to the world
Lord Govinda giving peace of mind is beauty to the heart
11. చందురుడందం పున్నమి రేయికి
ప్రభాకరుడందం ప్రతి పగటికి
తారకలందం అమవస నిశికి
గోవిందుడందం ప్రతి హృదయానికి
12 . పసికందుని లాలించును తల్లి
పతిని పిల్లలను లాలించును సతి
సఖుని లాలించును సఖి
మనందరిని లాలించును గోవిందుడు
13 . తోటకి పూవులు సొగసు
మాటకి ప్రియము సొగసు
బోటికి సొగసు సొగసు
మనసుకు గోవిందుడు సొగసు
Flowers are beauty to the garden
Dearness and love are beauty to the talk
For the youthful girl. loving disposition and prettiness are beauty
Lord Govinda is beauty to the heart
14 . ప్రవాహమిచ్చును సోయగము నదికి
మృదుత్వమిచ్చును సోయగము సుమమునకు
యవ్వనమిచ్చును సోయగము కన్నియకు
గోవిందుడిచ్చును సోయగము మనసుకు
Swift flow gives charm to the river
Tenderness gives charm to flower
Youthfulness gives charm to the girl
Lord Govinda gives charm to our heart
15. గాంభీర్యత సహజము సాగరునికి
ఎత్తు సహజము కొండలకు
లోతు సహజము లోయలకు
కరుణ సహజము గోవిందునికి
16 . ఎత్తులు పల్లములు సహజము రమణికి
మెత్తని పల్లవములు సహజము తరువునకు
తీయని జలములు సహజము నల్లని మబ్బుకు
హాయిని కలిగించుట సహజము నల్లనయ్య గోవిందునకు
Elevations and depressions are natural to youthful girls/
Tender leaves are natural to trees/
Sweet waters are natural to black cloud/
Causing pleasantness is natural to the black Govinda!
17. మధుర ఫలముల నిచ్చుట సహజము వృక్షమునకు
తగు ఫలముల నిచ్చుట సహజము కృష్ణునకు
సతత ఇష్ట దైవ నామ స్మరణము సహజము జ్ఞానులకు
భయము ఆర్తి తీర్చుట సహజము గోవిందునకు
It is natural for the tree to give sweet fruits
It is natural to Lord Krishna to give deserving fruits to the actions
Chanting the name of the beloved Lord always is natural to seers
To remove fear and emotional longings is natural to Govinda!
18 . సింధు కన్యకు హరి అందం
అద్రి సుతకు హరుడందం
పుస్తకపాణికి బ్రహ్మ అందం
మనసుకు గోవింద ధ్యానమందం
19 . మన అధికారము ధనము ఆడంబరము గొప్ప బంధువులకు
మన సంతృప్తి శ్రేయస్సు సుఖము గొప్ప స్నేహితులకు
మన సేమము ఆత్మీయత అభిమానము గొప్ప కుటుంబమునకు
మన హృదయ నైర్మల్యము చిత్త శాంతి గొప్ప గోవిందునకు
20 . మంచును కరిగించును సూర్య కిరణములు
అజ్ఞానమును కరిగించును జ్ఞానము
చీకటిని కరిగించును వెలుగు
క్లేశములను కరిగించును గోవిందుడు
21 . ఇంద్రుని సింహాసనము అధిష్ఠించినను కలుగదు తృప్తి
రంభతో క్రీడించినను ఇంతైనను తగ్గదు రక్తి
వయసుడుగుచున్నను కలుగదు భగవద్భక్తి
గోవిందుని స్మరించిన మాత్రమున కలుగును జీవన్ముక్తి
22. వెనుకకు ప్రవాహింపవు సముద్రుని కలిసిన నదుల నీళ్ళు
మరలి రావు గడచిపోయిన ఏళ్ళు వయసు పరవళ్ళు
కొండల గుట్టల తిరిగి ఎక్కవు పొంగుచు దూకిన సెలయేళ్ళు
ఎన్నడు క్రుంగవు వీడి రావు ఇంపార గోవిందుని కలసిన మనసులు
Rivers do not flow back after joining the sea
The youthful passion and vigor will not come back
once youth has passed
The streams that jumped down the hills do not climb back
The hills and mountains
The hearts which are merged with Love
in Govinda will never severe from HIm
23 . పిట్ట పాటలో ఏటి నీటిలో
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట
24. చేయుము నా మనసు స్వచ్ఛమైన
స్ఫటికముగ ప్రతిఫలించనీయవోయి
నీ వాత్సల్య కరుణా ప్రకాశములు
విశ్వమంత కాంతులు నిండ గోవిందా!
25. ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!
26. వాడును తనువు; వసివాడదు
నిన్నెరిగిన బుద్ధి; జీవితాంతము
గుబాళించును నీపై భక్తి రక్తి
మనమున నీవు నిండిన గోవిందా!
27. స్మృతి తప్పనీయకుము నారాయణా!
మరణమాసన్నమైనపుడు; నీ నామ స్మరణము
చేయుచు, నీ చరణకమలముల దృష్టి నిలిపి
తుది శ్వాస వీడు భాగ్యమ్మునిమ్ము గోవిందా!
28. కాయము పలుకు మనసు ఇంద్రియములు బుద్ధి
ఆత్మ ప్రకృతి స్వభావము నీవెయై భాసింప గోవిందా!
కలవరములు కలతలు కష్టములు క్లేశములు లేవు నాకు
నీవే నేనను ఉపనిషద్వాక్యము మరల ఋజువైయ్యెన్
29. భావము మల్లె భక్తి సంపంగి
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట
24. చేయుము నా మనసు స్వచ్ఛమైన
స్ఫటికముగ ప్రతిఫలించనీయవోయి
నీ వాత్సల్య కరుణా ప్రకాశములు
విశ్వమంత కాంతులు నిండ గోవిందా!
25. ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!
26. వాడును తనువు; వసివాడదు
నిన్నెరిగిన బుద్ధి; జీవితాంతము
గుబాళించును నీపై భక్తి రక్తి
మనమున నీవు నిండిన గోవిందా!
27. స్మృతి తప్పనీయకుము నారాయణా!
మరణమాసన్నమైనపుడు; నీ నామ స్మరణము
చేయుచు, నీ చరణకమలముల దృష్టి నిలిపి
తుది శ్వాస వీడు భాగ్యమ్మునిమ్ము గోవిందా!
28. కాయము పలుకు మనసు ఇంద్రియములు బుద్ధి
ఆత్మ ప్రకృతి స్వభావము నీవెయై భాసింప గోవిందా!
కలవరములు కలతలు కష్టములు క్లేశములు లేవు నాకు
నీవే నేనను ఉపనిషద్వాక్యము మరల ఋజువైయ్యెన్
29. భావము మల్లె భక్తి సంపంగి
గురు భావము మందార స్నేహము విరజాజి
అనురాగము మరువము భక్తి సూత్రమున
నీకై కూర్చిన రాగమాలను స్వీకరించు గోవిందా!
30. వయసు ఉడిగిన పిమ్మట తోలుతిత్తులు స్త్రీ అవయవ సంపద
పదవి
ఊడిన పిమ్మట కాంతులు కోల్పోవు వ్యక్తి అధికార సంపద
కరుణ
జ్ఞానము లేకున్న చిల్లర పెంకు మనిషి విద్యా సంపద
ఎట్టి
పరిస్థితుల నైనా ఎప్పటి వలె నుండు గోవిందుని కరుణా సంపద
31.కోరిన రమణుల పొందు లభింపక వైరాగ్యమున
శ్రీ హరి పాద పంకజముల
నాశ్రయించినను
జీవితమున
ఆశించినవి అందక నిర్వేదమున
విరక్తికి లోనై విష్ణుని
ఆరాధించినను
తోటి
మనుజుల దూషణ భూషణ తిరస్కారముల
చెదిరిన మనసు చిక్కబట్టుటకై
ముకుందుని శరణన్నను
సంసారమున
కల్గు ఒడుదుడుకులకు విసిగి వేసారి
భవసాగర మీదుటకు పద్మనాభుని
సాయమర్థించినను
భక్తుని
భగవంతుని సహజ అనుబంధమున
నారాయణ
నామ గానము చేసినను; సాత్వికుల
సత్సంగమున
నర నారాయణ అద్వైతము తెలిసి
కొన్నను; అంతయు గోవిందుని కరుణా కటాక్షము
32. అవనిని గల అందగత్తెలనందరిని పొందినను తీరదు కామము
జగత్తుననున్న అందలములన్నియు ఎక్కినను వీడదు మోహము
భూమి రక్తపుటేరులైనను సుంతయిన తగ్గదు మత్సరము
గోవిందుని ధ్యానించిన మాత్రమున కలుగును శాంతము
Even though one enjoys sex with all beautiful women
One's lust remains the same
Even though one attains all is to be attained
One's thirst for attaining is not quenched
Even though one makes blood flow as rivers on earth
One's revengeful nature does not diminish
But just by meditating on Govinda
Our mind attains peace and
Becomes serene
భూమి రక్తపుటేరులైనను సుంతయిన తగ్గదు మత్సరము
గోవిందుని ధ్యానించిన మాత్రమున కలుగును శాంతము
Even though one enjoys sex with all beautiful women
One's lust remains the same
Even though one attains all is to be attained
One's thirst for attaining is not quenched
Even though one makes blood flow as rivers on earth
One's revengeful nature does not diminish
But just by meditating on Govinda
Our mind attains peace and
Becomes serene
33. ప్రవహించుట సహజము
నదికి
వికసించుట సహజము మొగ్గకు
చలించుట సహజము మనసుకు
కవితలల్లుట సహజము కవికి
వికసించుట సహజము మొగ్గకు
చలించుట సహజము మనసుకు
కవితలల్లుట సహజము కవికి
కరుణ చూపించుట సహజము గోవిందునికి
Flowing is natural to river
Blooming is natural to bud
wavering is natural to mind
Composing verses is natural to poet
Flowing is natural to river
Blooming is natural to bud
wavering is natural to mind
Composing verses is natural to poet
Showing compassion is natural to Govinda!
34. రామదాసు బంగారు
పలుకు శ్రీరామచంద్రుడు
క్షేత్రయ్య శృంగారపు కులుకు మువ్వ గోపాలుడు
పోతన్న హృదయంపు తళుకు నందాంగనా డింభకుడు
మనందరి హృదయాల కులుకు గోవిందుడు
క్షేత్రయ్య శృంగారపు కులుకు మువ్వ గోపాలుడు
పోతన్న హృదయంపు తళుకు నందాంగనా డింభకుడు
మనందరి హృదయాల కులుకు గోవిందుడు
35. పురందరదాసు హృదయస్పందనము పురందర విఠలుడు
అన్నమయ్య చిత్తప్రకంపనము అలమేలుమంగ పతి
త్యాగయ్య హృదయ నాదము సాకేత రాముడు
మనందరి మనసుల మౌన చలనము గోవిందుడు
అన్నమయ్య చిత్తప్రకంపనము అలమేలుమంగ పతి
త్యాగయ్య హృదయ నాదము సాకేత రాముడు
మనందరి మనసుల మౌన చలనము గోవిందుడు
36. నా తనువున అణువణువూ నారాయణ యని
కంపించుచూ; నా మనమున ప్రతి తలపూ మాధవునికై
కంపించుచూ; నా మనమున ప్రతి తలపూ మాధవునికై
తపించుచూ; చిత్తము హరి నామ
స్మరణము చేయుచు;
అన్నియు లీనము కావలె నీలో; నే తరించవలె నీవై గోవిందా!
37. నీవు నాయందే నివసించి ఉండ కృష్ణా!
ఏల యాత్రలు, పూజలు, పునస్కారములు?
మాధవా! మనోబుద్ధ్యహంకారచిత్తములను
ఫలం, పత్రం, పుష్పం, తోయముల చేసి
నిన్ను అర్చించెదను తండ్రీ! నారాయణా!
కావుము నన్ను నీ వత్సను గోపాలా! గోవిందా!
37. నీవు నాయందే నివసించి ఉండ కృష్ణా!
ఏల యాత్రలు, పూజలు, పునస్కారములు?
మాధవా! మనోబుద్ధ్యహంకారచిత్తములను
ఫలం, పత్రం, పుష్పం, తోయముల చేసి
నిన్ను అర్చించెదను తండ్రీ! నారాయణా!
కావుము నన్ను నీ వత్సను గోపాలా! గోవిందా!
38. శ్రీ రమణీ కుచదుర్గ విహారివి నీవు
శ్రీ రాధా తనులతానందనా రసికుడ వీవు
శృంగారరస సామ్రాట్టువు; రసికా వతంసుడవు
రసపట్టులో తర్కం, మెట్ట వేదాంతం ఆపమని
ఈ స్వయంభూ కుహనా సన్యాసులకు బుర్రకెక్కు
నట్టు చెప్పి; మా రత్యానందములకు పానకంలో
పుడకలు కావద్దని దంండించుమీ ఆధ్యాత్మిక
గురువుల రసావతారా! నందనందనా! గోవిందా!
39. అవగాహన లేని జ్ఞాన సముపార్జనము
ఆచరణ లేని సదాచార శ్రవణము
ఉపాసన కాని విద్యాభ్యాసము
మూఢత నిండిన గోవింద తత్త్వావలోకనము
పృథివిని నేడు ఆవరించి అలుముకున్నవి
గోవిందా! కలినేమి నీ ఈ వింత వింతలు జనార్దనా!
40. పరిమళము మల్లెకు, చల్లని వెన్నెల జాబిలికి,
జల జల పారుట సెలయేటికి, ఎత్తునుంచి మనోహరముగ
దూకుట జలపాతమునకు, తీయని పండ్లనిచ్చుట తరువుకు,
జీవనధారల వర్షధారల కురియుట మేఘ సముదాయమునకు,
పరోపకారముచేయుట మంచి మనసు కలవానికి
కరుణించుట కాచుట ప్రియ దైవమునకు సహజములు గోవిందా
Sir..Chalaa baagunnayi Govinda padyaalu. ..
ReplyDeleteSir..Chalaa baagunnayi Govinda padyaalu. ..
ReplyDelete