వ్యక్తిత్వ స్పృహ
వ్యక్తిత్వ స్పృహ లేని సమయము అద్వైత స్థితి. వ్యక్తిత్వ స్పృహ కల సమయము ద్వైత స్థితి.
వ్యక్తిత్వ స్పృహ లేని సమయాన్ని నిర్గుణ స్థితి అంటారు. వ్యక్తిత్వ స్పృహ కల సమయము సగుణ స్థితి.
అద్వైత లేక నిర్గుణ స్థితి పరమాత్మ స్థితి. ద్వైత లేక సగుణ స్థితి జీవ స్థితి.
ద్వైత స్థితిలో అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములు పనిచేస్తాయి.
జ్ఞానులు కూడా మానసికముగా వ్యవహరించాలంటే ద్వైత స్థితిలోకే వస్తారు.
అద్వైత స్థితినే తత్పర లేక తాత్పర్య స్థితి అంటారు. ఇప్పుడు ఆనందము, శాంతి, మౌనము అనుభవములుగా ఉంటాయి. భక్తి స్థితి అన్నా ఇదే. జ్ఞాత, జ్ఞేయము స్పృహ లేని నిరంతర జ్ఞాన స్థితి. ప్రజ్ఞాన స్థితి.
కర్త, కర్మ స్పృహ లేని నిరంతర క్రియా ప్రవాహమే ఈ పరా స్థితి.
అర్థ (పశ్యంతీ), వాక్య (మధ్యమా), ఉచ్చారణలు (వైఖరీ) ద్వైత స్థితికి సంబంధించినవి. వాక్యము, తలపు ఒక స్థితియే. దీనిని విభక్తి స్థితి అంటారు.
అనుభవము, అర్థము ఒకే స్థితి.
వ్యక్తిత్వ స్పృహ కల ఆహ్లాదానుభవము సంతోషము. వ్యక్తిత్వ స్పృహ లేని నిర్మలానుభవము ఆనందము.
మనిషి ఎక్కువగా జీవ స్థితిలో గడుపుతాడు. జ్ఞాని ఎక్కువగా పరమాత్మ స్థితిలో గడుపుతాడు.
పరమాత్మ స్థితినే జాగ్రత్ సుషుప్తి అంటారు. ఇది అద్వైత స్థితి. మోక్ష స్థితి అన్నా, ముక్త స్థితి అన్నా, నిర్వాణ స్థితి అన్నా ఇదే.
తెలివిలేని లేక తెలుస్తూండని అద్వైత స్థితిని సుషుప్తి అంటారు. గాఢనిద్ర అన్నా ఇదే.
మెళకువ (జాగ్రత్), కల (స్వప్న) స్థితులు జీవ స్పృహ కల, జీవ స్పృహ నిచ్చే, మానసిక కార్యకలాపములు జరిగే ద్వైత స్థితులు.
ద్వైత - అద్వైత స్థితుల మధ్య పరివర్తించడమే మనిషి మానసిక జీవనము. మనిషి జీవనము పూర్తిగా మానసికమే కదా.
ఈ నాలుగు మానసిక దశలూ కలిగి, కరగడమే మానవ జీవితం.

**************
మతంలో మతాలు
మతం అంటే నమ్మకం. అందుకనే ఒకే మతంలోనే ఎన్నో "మతాలు" ఉంటాయి.
ఒకే మతంలోని వివిధ "మతాలు" (ఇవి తెగలు; అన్ని ప్రధాన మతాలలోనూ ఉన్నాయి) వాటిలో అవి పోట్లాడుకుంటూ గందరగోళం సృష్టించాయి. సృష్టిస్తున్నాయి. మతాల మధ్య చిచ్చు, మతాలలో తెగల మధ్య చిచ్చు. మతం అంటే భయము, చికాకు కలిగించేలా చేస్తువ్నాయి. వివిధ ప్రవక్తల పేరు చెడగొడుతున్నాయి.
"ఎవరి నమ్మకం వారిది" - అని చాలామంది అనుకోరు. తమ నమ్మకాన్ని ఇతరుల మీద రుద్దడం తమ విధి అనుకుంటారు. తమ మతంపై కాక ఇతర మతాలపై నమ్మకం ఉన్న వివిధ మతానుయీయులను హింసలకు గురి చేస్తారు. వారిని చంపేస్తారు కూడా.
మతం మానుష ధర్మం కలది. దురదృష్టవశాత్తు దాన్ని కొందరు అనుయాయులు
అమానుషంగా, రాక్షసంగా మార్చేస్తారు. ఇది ప్రతి తరంలోనూ, యుగంలోనూ చర్విత
చర్వణమే.
మూర్ఖత్వము, మూఢత్వము మతానికి మరొక పార్శ్వమా ?
అన్నట్టు మతాలలోని విపరీత వాదులు, ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారు. మతాల పేరు, వాటి ఉపయోగము చెడగొడుతున్నారు. సభ్య, నాగరిక సమాజము ఈ విషయమై ఏమీ చేయలేని స్థితిలో ఉండడము శోచనీయము. విచార్యము.

No comments:
Post a Comment