1. ఆధ్యాత్మిక మార్గ పయనము
ప్రవర్తనలు మార్చుకొనక గుడులు గోపురముల చుట్టు
తిరిగిన ప్రయోజనము లేదు; నిరంతర ఇష్టదైవ నామ
స్మరణమున మనసున ఆహ్లాదము నింపుకొనక
గురువులు, సన్యాసులంచు బానిస బ్రతుకులు
బ్రతుకుట ఆధ్యాత్మికత కాదు; అవ్యయమైన
నారాయణ తత్త్వమును అవగాహన చేసికొనక
తీర్థయాత్రలనుచు తిరుగుట వృథా ప్రయాస. ఖర్చు;
భక్తిజ్ఞానకర్మమార్గములు వేరు కాదంచు గ్రహింపు లేని
దైవ దర్శనా కాంక్ష, ఆధ్యాత్మిక మార్గ పయనము,
భగవంతుడు మెచ్చని ఫలరహిత కర్మములు;
హరియంచు, హరుడంచు పరమాత్మను మనసార
భజింపని, కీర్తింపక, మూఢాచార నిర్వహణము వృథా
2. పరమపదించు విధము
ఖడ్గ తిక్కన యుద్ధములో వీరస్వర్గము నంది నట్టు
జర్మన్ మిలిటరీ జనరల్ బేటిల్ ఆఫ్ బల్జ్ లో
టాంక్ లో ముందుకు దూసుకుపోయి శత్రువుకు
తీవ్ర నష్టం కలిగించి వీర మరణం పొందినట్టు;

గంటముతో కావ్యములల్లుచునే కవి సత్తములు
సరస్వతీ సమీపమునకు చేరినట్టు; రాజ్యము ఏలుచునే
ప్రజల ఆదరాభిమానముల నందిన చక్రవర్తి తనువు
చాలించినట్టు; ప్రజాస్వామ్యమున ప్రియతమ నాయకుడు
ప్రజల అశ్రు ధారల మధ్య దివికేగి నట్టు; నటుడు
నటించుచూ రంగస్థలముననే రంభతో కూడినట్టు;
అందరి ప్రేమాభిమానములను విరివిగా, దండిగా
పొందిన శాస్త్రవేత్త, విద్యార్ధులు తన సర్వస్వము
అయిన ప్రియతమ దేశాధ్యక్షుడు అబ్దుల్ కలామ్ వర్యులు
విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించుచు శరీరము విడచిన
విధమున; మనుషులు ముసలితనముచే బాధింపబడక
తమ తమ ప్రియ కార్యములందు నిమగ్నులైయుండగా
పరమాత్మను చేరు అనాయాస మరణం గొప్ప వరము;
అందరూ నిజ విధిని నిర్వర్తించుచూ ఊపిరి విడచుట
పరమపురుష యోగము; పరమాత్మ నిజ వైభవమును
కీర్తించుచు, స్మరించుచు పరమపురుషుని చేరుట మేలు

No comments:
Post a Comment