నాస్తికులు శాస్త్రవేత్తలు కారు
నాస్తికులు వేరు, శాస్త్రవేత్తలు
వేరు.
నాస్తికులు శాస్త్రవేత్తలు కారు. శాస్త్రవేత్తలకు
ఓపెన్ మైండ్ ఉంటుంది.
వారి ఇష్టాయిష్టములకు అతీతంగా సత్యావిష్కరణ చేస్తారు. తమ రాగ,
ద్వేషములను
శాస్త్రజ్ఞులు తమ సత్యాన్వేషణకు అడ్డు రానీయరు. నిజము తమ
నమ్మకానికి విరుద్ధంగా ఉంటే సత్యానికే ఓటు వేస్తారు. పెద్ద పీట
వేస్తారు. ఆస్తికులు భగవంతుడున్నాడని నమ్ముతారు. నాస్తికులు
భగవంతుడు లేడని నమ్ముతారు.
ఇద్దరివీ నమ్మకాలే. రాగ,
ద్వేషముల వలన ఏర్పడిన ఇష్టాయిష్టములే. భగవంతుని ఉనికిని
నమ్మనంత మాత్రాన నాస్తికులు శాస్త్రవేత్తలు
కాలేరు.
కారు. ఎందరో నాస్తికులకు లోతైన
ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానము, అవగాహన సున్న. వారి
నమ్మకాలలోనికి శాస్త్రవేత్తలను ఎందుకు
లాక్కొస్తారో వారికే తెలియాలి.
ఇంచుమించు అందరు శాస్త్రవేత్తలు వినయశీలురు. ఎందరో
శాస్త్రవేత్తలు తత్త్వవేత్తలు కూడా. మతం వేరు,
తత్త్వం వేరు అని ఎందరో నాస్తికులకు తెలియదు. శాస్త్రవేత్తల
పేరు చెప్పుకొని, నాస్తికులు తమ నమ్మకము రేషనల్ అనుకుంటారు. అది వారి భ్రమ
మాత్రమే. నమ్మకం నమ్మకమే. నమ్మకానికి, రేషనలిజమ్ కీ చుక్కెదురు.
ప్రజాస్వామ్యాన్ని, పుర్రచేతిభావాలని, హేతువాదాన్ని పైనుంచి ఎవరూ క్రిందకు విసరలేదు కదా! అవీ మనుషులు సృష్టించినవే! ఈ మానసిక ప్రపంచం అంతా మానవ సృష్టే. అందులో మనం ఒప్పుకునేవి కొన్ని. ఒప్పుకోనివి ఎన్నో. మన ఇష్టాయిష్టములపై ప్రపంచం నడవదు. ప్రకృతి నియతిచే నడుస్తుంది
No comments:
Post a Comment