Monday, May 7, 2018

పెళ్లి; మోక్షం ; శరీరం; తత్త్వం-మతం-సాంఘిక జీవనం; సాహితీ పఠనాసక్తి, పఠనం; Useless

2-5-2018

మనందరము‌ మనకోసం వ్రాసెదము
ఎవరైన అది చదివిన పరమానందము

సంఘమున రచనలు చేయువారు
కోకొల్లలు; రమణీయ రచనలు కొందరివే
****
Disturbance is mind's sport; nature. However differently things are done, or happen, mind continues to be in the state of disturbance unconcerned about and for what it is getting disturbed. Peculiar and complex thing mind is.
****
పెళ్లి

కొన్ని దశాబ్దాల పూర్వం వరకు తెలుగు కుటుంబాలలో పెళ్లి జరగడం ఒక సాంప్రదాయ, సాంస్కృతిక, సాంఘిక క్రతువు. వయసొచ్చిన వెంటనే జరిగే సందడి. పెళ్లిలో చెప్పే మంత్రాల అర్థం ఏమాత్రం తెలియక పోయినా అది ఒక వేడుకలా, వేడుకగా పెద్దల ఇష్టానుసారం చేసికొని వాళ్ళ గురుత్వంలో యువతీయంవకులు, స్త్రీ పురుషులు భార్యా భర్తలు గా ఒదిగిపోయి గార్హస్థ్య ధర్మాలు నిర్వర్తించేవారు.

కాని అబ్బాయికి ఉద్యోగం ఉండడం లేదా తర తరాలుగా కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉండటంతో పాటు మంచి కుటుంబం నుంచి రావడం అర్హతలుగా ఉండేవి. వరకట్నం ఇచ్చే ఆచారం ఉండేది. అది వారి వారి మాటల్లో అంతస్థులను బట్టి నిర్ణయించుకునేవారు. కయ్యానికైనా, వియ్యానికైనా సమాన స్థాయి ఉండాలి అనేవారు. అలా నిర్ణయించుకునేవారు. దాని వల్ల కలిగే లాభనష్టాలు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ప్రారబ్ధం అని సర్దుకుపోతూ
జీవితాలు గడిపేసేవారు. 

అంతక్రితం ఉన్న కన్యాశుల్కాన్ని తోసిరాజని ప్రవేశించిన వరకట్నాన్ని ఆదరించారు. ఈ సాంఘిక పరిణామానికి కారణం తెలియదు. అంత క్రితం గురజాడ వారి ఆధ్వర్యంలో కన్యాశుల్కం నిరసించబడినట్టే కాలక్రమేణా వరకట్నం కూడా నిరసించబడింది,  కాళ్ళకూరి వారి నాటికతో. తరువాత నిషేధించబడింది కూడా. 

కానీ బడా బడా నాయకులు, డబ్బున్నవారు వరకట్నాలను ఇస్తున్నారు, స్వీకరిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలలో వరకట్నం అడగడం, ఈయడం తగ్గింది, కాని పూర్తిగా పోలేదు. కాని పెళ్లి ఖర్చు పేరుతో ఖర్చు బాగా అవుతోంది, కాని పెళ్ళి కొడుక్కి కాని, పెళ్లి కూతురికి కాని తల్లిదండ్రుల ఆదాయంలోంచి పైసా రావటం లేదు. మిగలటం లేదు.

అంత డబ్బూ మేరేజ్ హాల్స్ కి, అలంకరణ చేసే వారికి, కేటరర్స్, ఫొటోగ్రాఫర్లకి పంచబడుతోంది. వరకట్నం ఇవ్వనవసరం లేకపోవడంలోని ఆర్ధిక రిలీఫ్, వెసులుబాటు కన్యాదాతకి దక్కడం లేదు. మరి ఈ విషయం గురించి మేధావులు కాని, సాహితీ స్రష్టలు కాని పట్టించుకోవటం లేదు. 

ఆస్తుల్లో కూతురికి వాటా లేనప్పుడు తండ్రి సంపాదనలో వారి భాగంగా వరకట్నం కూతురికి మంచి, వడిదుడుకులు లేని జీవితం కోసం ఈయబడేది. తర్వాత్తర్వాత కయ్యానికైనా, వియ్యానికైనా సమాన స్థాయి పాటించకుండా అమ్మాయి తల్లిదండ్రులు తమ స్థాయిని, స్తోమతనీ మించి డబ్బు లేకపోయినా అప్పులు చేసి వరకట్నం సర్దటంతో సంఘంలో కలకలం బయలుదేరింది. 

ఎవరెంత ఆదర్శంగా కబుర్లు చెప్పినా, పెళ్లి అనేది ఒకవిధమైన ఆర్ధిక ఒప్పందం. డబ్బు ప్రసక్తి లేకుండా అమ్మాయికి కాని, అబ్బాయికి గాని పెళ్లి కాదు. మనం రోజూ, ఉద్యోగం లేని అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు అస్సలు రాకపోవడం గమనిస్తూనే ఉన్నాం. అబ్బాయి అందగాడైనా, ఆరోగ్యవంతుడైనా, గుణవంతుడైనా, సౌజన్యశీలి అయినా ఉద్యోగం లేకపోతే ఎవరూ పిల్లనిస్తామని రారు. ఇది కఠోర సత్యం. అబ్బాయిల పాలిటి ఘోర వాస్తవం. దీనిపై ఓ కన్యాశుల్కమో, వరకట్నమో లలా నాటకాలు రావటంలేదు. 

ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న జవరాళ్ళకి పెళ్లి ఆఫర్లు దండీగా రావడానికి కారణం వారు సంపాదిస్తున్న డబ్బే. అంచేత తరం తరానికి ఆర్ధిక కారణాల వల్ల పెళ్లి సంబంధాలు వచ్చే తీరు, పెళ్ళిళ్ళు జరిగే తీరు మారుతూ ఉంటాయి. మారిపోతాయి.

దశాబ్దాల క్రితం కూడా ఆర్ధిక స్థాయి పెళ్లి జరగడంలో పెద్ద పాత్ర వహించినా, పెళ్ళయ్యాక వారి ఆర్ధిక స్థాయి
ఏదైనా పెళ్ళికి, గార్హస్థ్య జీవితానికి సాంప్రదాయ కళ,
సాంస్కృతిక శోభ ఉండేవి. పెళ్లి అనే బంధాన్ని స్త్రీ పురుషులు గౌరవించేవారు. చాలా మంది నిబద్ధతతో ఉండేవారు. వారి వారి కుటుంబ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించేవారు. 

ఇళ్ళల్లో ఎన్ని గొడవలు జరిగినా, పోట్లాడుకున్నా, మాటలు అనుకున్నా కుటుంబం క్షేమం కోసం సర్దుకుపోయేవారు. బయటపెట్టే వారు కారు. సహనం చూపిస్తూ ప్రేమను పంచుతూ, భరించ
లేనప్పుడు మాటలు అనుకుంటూ, భరిస్తూ బంధాన్ని గౌరవిస్తూ గడిపేసుకునేవారు. ఇంటి పెద్ద, ఆయన మాట అందరూ వినడం వంటి సాంప్రదాయాలు ఉండేవి. అందరూ ఆ సాంప్రదాయానికి అణిగిమణిగి, ఒదిగి ఉండేవారు.

తమ తమ వ్యక్తిత్వాలను కుటుంబ సంక్షేమం కోసం
త్యాగం చేసేవారు. ఇప్పుడు భార్యాభర్తలే ఒకళ్ళకోసం ఒకళ్ళు వ్యక్తిత్వాలను త్యాగం చేసే స్థితిలో లేరు. ఇంక అత్త మామలు, ఇతర కుటుంబసభ్యుల విషయంలో చెప్పాలా?

ఇప్పుడు పెళ్లి సాంప్రదాయం, సంస్కృతి ఛాయలను కోల్పోయి, పరస్పర బాధ్యతా నిర్వహణ లను కూడా నిర్లక్ష్యం చేసికొని, వట్టి ఆర్ధిక సంబంధంగా మారిపోయింది. మారిపోతోంది. 

పెళ్లి ఇప్పుడు తన కళ, శోభలను కోల్పోతోంది. బాధ్యతలు తీసికునే విధంగా యువతీ యువకులను మలచలేకపోతోంది. వివాహ బంధం సన్నని దారంగా మారిపోయింది. ఎప్పుడు పుటుక్కున తెగుతుందో తెలియదు. పెళ్ళి బంధం ఏర్పరచలేక పోతోంది. బందీలుగా ఉన్నాం అనే నిస్పృహను పెంచుతోంది.

పెళ్లి చేసి కోవడం వ్యక్తి నిర్వహించవలసిన సామాజిక బాధ్యతలలో ఒకటి అని యువతీయువకులు గమనించడం లేదు. పెళ్ళిని రతి సుఖం కోసమే చేసుకుంటే ఆ పెళ్లి నిలవదు. ఆస్తుల కోసం చేసుకుంటే కొంత వరకు నిలుస్తుంది. పెళ్ళి చేసుకోవడం ఎవరికోసమో మాత్రమే అనుకుని, మనకోసం కూడా అనుకోకపోతే వెంటనే పెటాకులవడం తథ్యం.

మనుషుల్ని భరించే ఓపిక లేని వాళ్ళు పెళ్ళి చేసుకోకపోవడం మంచిది. లేకపోతే ఇతరులను ముంచుతారు.
1-5-2018
ప్రతివాళ్ళని శ్రమైక లేదా శ్రామిక జీవులుగా తప్ప మరొకలా చూడలేని సిద్ధాంతం తుప్పు పట్టింది;

పుట్టిన దేశంలో ఆచరించబడిన దేశాల్లో అటక ఎక్కింది; అయినా ఇంకా ఎందరో అనుయాయులు
భారతదేశంలో; మతంగా మారిన సిద్ధాంతం, ఇతర
మతముల వలె నల్లమందైనది కొందరకు; ఈ మత్తు
నుంచి బయట పడలేరట్టి వారెవరూ! పుట్టిన దేశం,
దాని సంస్కృతి ఘనత తెలియని దృష్టి హీనులు

భారతదేశానికి వచ్చిన ఇతర మతముల‌ వలె
దారుణములు, ధాష్టీములు, మారణహోమములు
నిర్దయగా చేసే మరొక ఆధునిక మతమై, అడవులకు
పరిమితమై నాగరికత మరచి నగారా మ్రోగించు

పగిలిన ఢక్క; దేశ ప్రజల ఆత్మీయత పొందలేక, ఒక్కతై, అడపాదడపా ప్రభుత్వాల నిరసించుట తప్ప మరే సత్కార్యము నిర్వహింప లేని ఓపిక లేని ముసలి ఎద్దు; ప్రజాస్వామ్యమున సాయుధపోరాటం, పౌరుల హత్య

నిర్వహించు అప్రజాస్వామిక వాది; ప్రజాస్వామ్య వ్యతిరేకి; లౌకిక వాదమంచు తన మతమును రుద్దు
ఇచ్ఛ గల దిగుమతి చేసికున్న సిద్ధాంత, వాదప్రియ ప్రతినిధి; మరెవ్వరూ మేధావులు కాదను అవివేకి

నెమ్మదిగ భారతదేశ రాజకీయ పటమున
అంతర్హితమౌ మౌన మూగ జంతుతతి

****

మోక్షం 

శరీర, వ్యక్తిత్వ స్పృహ పోవడమే మోక్షం. 

రాగ, మోహములు లేకుండుటే మోక్షం.

సకల జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞానములు, కౌశలములు అదృశ్యమై ఉండుటయే మోక్షం. 

పరమాత్మానుసంధానమగుటయే మోక్షం.

భగవదనుగ్రహం వల్లే మోక్షం కలుగుతుంది.

విష్ణు ప్రసాదేన వినా మోక్షః న లభ్యతే - అనేది ఒక నానుడి.

శివరూపాత్  జ్ఞానః త్వత్తో ముక్తిమ్ జనార్దనాకారాత్
శిఖి రూపాదైశ్వర్యం భవతశ్చ ఆరోగ్యమిచ్ఛామి

అనేది భాస్కరునికి ప్రార్థన.

జ్ఞానము శివుని నుంచి, మోక్షాన్ని విష్ణుమూర్తి నుంచి,
ఐశ్వర్యాన్ని సుబ్రహ్మణ్యుని నుంచి, ఆరోగ్యాన్ని నీ (సూర్యుని) నుంచి కోరుకుంటాను అని సాంబ కృత సూర్య స్తోత్రములో సాంబుడు కోరుకున్నాడు.

మోక్షం సగుణ మార్గంలోనూ, నిర్గుణ మార్గంలోనూ లభిస్తుంది. ఏ మార్గంలోనైనా, మోక్షం లభించడం అంటే వ్యక్తి, వ్యక్తిత్వం తన పుట్టుక స్థానమైన పరమాత్మలో లీనం కావడం. 

శరణాగతి, ప్రపత్తి, నేను కి సరియైన అన్వయం చేసికోవడం, ఇష్ట దైవ, దేవ, దేవతా నామ సతత స్మరణం, అన్ని రకముల భక్తి, జ్ఞాన, కర్మ మార్గములు ముక్తి పథంలో నడిపి మోక్షాన్ని సిద్ధింపజేస్తాయి.
మనిషిని బట్టి, కుటుంబ ఆచార, వ్యవహారాలను బట్టి, తత్త్వాన్ని బట్టి, దారులు ఎవరికి వారు గుర్తుపట్టి, ఆ యా మార్గములు అవలంబించాలి.

పిడుక్కి, బియ్యానికి ఒకటే మంత్రం కుదరనట్టు, అందరు ముముక్షువులకు ఒకే మార్గం కుదరదు.
ఎవరి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అభిరుచులను బట్టి
వారి మార్గం నిర్ణయించుకొని సాగాలి. 

మోక్షం అంటే విష్ణుమూర్తి గాని, శివుడు గాని, చతుర్ముఖ బ్రహ్మ గాని, ఇతర ఇష్ట దైవ, దేవ, దేవతా మూర్తులు గాని ప్రత్యక్షమై అడిగిన కోరికలతో పాటు అందించేది కాదు.
****
మౌనమన్న మనసు విరమణం
ఆనందమన్న శూన్యమైన వ్యక్తిత్వం
శాంతియన్న తలపుల నిష్క్రమణం
మోక్షమన్న శాంతానందమౌనం
****
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఒక నాయకుడు భార్యకు పణంగా పెడితే, ఆంధ్రులకు ఒరిగిందేమీ లేదు గాని, 
ఆ పార్టీ రెండుగా చీలిపోయింది; ఇప్పుడు మళ్ళీ 
విడదీసిన నాయకులు ఆంధ్రుల ఆత్మగౌరవం అంటున్నారు; ఏమవుతుందో? తమ రాజకీయ
జీవితం సరిగా ఉన్నంతసేపూ ఆంధ్రులు, వారి ఆత్మ
గౌరవం గుర్తుకు రావు; అది వడిదుడుకుల్లో పడేసరికి
ఆంధ్రులు, ఆత్మగౌరవం అంటూ సన్నాయి నొక్కులు

ఆంధ్రులు, వారి ఆత్మ గౌరవం ఇలా 
నిబద్ధత లేనివారి నోట్లో అపరిశుభ్రం
కావడం ఆ ఆంధ్రుల చేతకాని తనం
ప్రజల గౌరవం ప్రజలు నిలబెట్టుకోవాలి;
రాజకీయ నాయకులు నిలబెట్టరు; అంతవరకు 
ప్రేక్షకులైన వారికి ఈ నాటక వీక్షణే గతి!
****
మహర్షులు, మహాత్ములు జగతిని మనిషి
మనిషికీ వేరు; లోకమున భిన్న రుచులు; ఒకరి మహాత్ముడు మరొకరికి పనికిరానివాడు
మన మహర్షి వారికి గిట్టని వాడు

ప్రపంచమున గొప్పతనములు అనేకములు;
అనేక విధములు; ఇష్టాయిష్టములు వ్యక్తిగతములు;
చూసే మనిషిని బట్టి మాత్రమే ఇతరుల గొప్పతనం
మనం ఎంత గొంతు చించుకున్నా మనకి గొప్పవారు
ఇతరులకు ఆరాధ్యనీయులు కాబోరు; మన దృష్టి
వేరు వారి దృష్టి వేరు; అందుకే ప్రపంచంలో ఇన్ని
కొట్లాటలు; ఇంత అశాంతి; భూమిపై ఉన్న అందరికీ
ఒకడే మహర్షి, మహాత్ముడు, దేవుడు లేరు; ఉండరు

****

Nature is poetry to the heart
That can "see" and rejoice!
For poetry is creation and 
Sensing by an aesthetic heart

30-4-2018

భారతీయ జనతా పార్టీ బళ్ళారి బ్రదర్స్ ని ఎన్నికలతో సన్నిహితం చేయడం, వారెన్ని కబుర్లు చెప్పినా మింగుడుపడని అంశం.

****
ఎందుకనో క్రికెట్ ఆట మధ్య వచ్చే
సెల్ఫోన్ లో ఉన్న కెమెరాకు ప్రసిద్ధ
నటుని ప్రకటనలో కుక్కలకు, పిల్లులకు
మాత్రమే ఫొటోలు తీయబడతాయి
మనుషులెందుకు పనికిరారో? అలాగే
అందమైన ఆడకుక్కను మగకుక్కలు టి.వి లో
చూస్తూండగా రిఛార్జి అవసరం వస్తుంది
మనుషులు, కుక్కలు ఒకలాగే ఉన్నారా?
మనుషులది కుక్క బుద్ధా? ఏమిటో ఈ డిజైనర్లు
కుక్కలను, పిల్లులను మరచి మనుషులను
చూపించలేరా? ఏమిటీ వెకిలితనం? ఇది ఆధునికతా
****
మనకు పాండిత్యం, జ్ఞానం లకన్న అవగాహన ఎక్కువ మేలు చేస్తుంది. 

పాండిత్యం, జ్ఞానం దృష్టి లోకి రాకుండా దృష్టి విశ్రాంతి నొందడమే, మనసు విరమింపబడడమే
అవగాహన.

అవగాహన వల్ల మనశ్శాంతి గమ్మున అబ్బుతుంది.
****
నేలపై రాలెను పూలు తారకలై/ పక్కనే ఉదయించెను జాబిలి, కలిగినది నిండు పున్నమి; తన మోము కలువల ఱేడు; తన రూపము 
బంగరు శిల్పము; రాసిలో, వాసిలో తనే రతి
అందమునకు ప్రతి, యవ్వన చంద్ర హారతి
సంగీత సాహిత్యములందు దిట్ట భారతి,
****
"Emotions" are driving people more than commonsense. It has become a fashion to express about everything to prove your humane credentials! Ridiculous and foolish people are thriving as intellectuals among us. They are also feeling that they alone are the most responsible citizens and are full of sympathy, humane and "caring"!
****
శరీరం

వయసు మార్చును శరీరముల
గుర్తుపట్టలేనంతగా; పసికందు 
మారును బాలునిగ, బాలికగ;
ఎదుగుదురు, యవ్వనమంకురించును
మనసు, తనువుల పూర్తిగ మార్చుచు
మిడిమిని తెచ్చును వయసు ఆయా మార్పులు

తనువు, మనసు వాడును వార్ధక్యమున
ముడుతలు పడును శరీరము; పండును
వెంట్రుకలు; స్వాస్థ్యము తగ్గి పట్టుతప్పును
తనువుపై; అంతయు కాదు కాల మహిమ

శరీర ప్రకృతి అది; "శీర్యతే ఇతి శరీరమ్"
పరిణమించుచూ క్రమముగ ఎదుగుదల, క్షీణత పొందునది; సమస్తమును మనచే చేయించే
పనిముట్టు; "శరీరమాద్య ఖలు ధర్మసాధనమ్"

శరీరము లేక ఆత్మలేదు
మనసులేదు, భోగము లేదు, 
రాగము లేదు, యోగము లేదు
జ్ఞానము లేదు, భాషలు, కళలు లేవు

రోగములేదు; శరీరంతోనే అన్నీ;
శరీరంలోనే అన్నీ; ఇంతటి విశిష్ట
వస్తువు లేదు సృష్టిని; జంతువులకు
శరీరం గొప్పవరం; వయసొచ్చిన పిదప

భోగం, వయసు మీరిన పిదప తానే గొప్ప శాపం
ఏది ఏమైనా జంతువులకు శరీరం లేని జీవితం లేదు
****

మన స్ఫురణ (intuition), ఇంగితం (commonsense) చెప్పినట్లు మనం నడుచుకోవడం మనకు అన్ని విధాలా శ్రేయస్కరం.
****

తత్త్వం-మతం-సాంఘిక జీవనం

చాలా మందికి బౌద్ధం అంటే ఇష్టం. బుద్ధుడంటే ఇష్టం. ఈ ఇష్టాలకు కారణం ఏమిటి?

బుద్ధుడు కుల వివక్షతను, కుల విభజనను నిరసించాడు. ఇందువల్ల చాలా మందికి బుద్ధుడన్నా
బౌద్ధమన్నా ప్రీతి. తత్త్వం పరంగా, సామాజిక జీవనం దృష్ట్యా బౌద్ధమంటే ఏమిటో చాలామందికి తెలియదు.

భారతదేశంలో ఉపనిషత్తులతో మొదలైన తత్త్వశాస్త్రం, బౌద్ధ, జైనాలు, షడ్దర్శన, చార్వాక దర్శన, ఇతర ఆధునిక, అర్వాచీన తత్త్వాలతో కలిసి వెలిగింది. ఈ తత్త్వాలన్నీ తమ తమ మతాల ఉద్భ్వవానికి కారణం అయ్యాయి. మతంతో, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా వివిధ దర్శనాలు, తత్త్వాలు తత్త్వపరంగా పరస్పర పరిపూరకాలుగా సహకరించుకొని భారతీయ తత్త్వశాస్త్రాన్ని పరిణమింపజేశాయి. భారతీయ తత్త్వశాస్త్రానికి వన్నె తెచ్చాయి. 

బుద్ధుని తరువాత బౌద్ధం మహాయాన, హీనాయానములుగా విడిపోయి సాంఘిక, తత్త్వ
శాస్త్ర పరాలుగా క్షీణత, వృద్ధి పొందింది.

సాంఘికంగా బౌద్ధం చెప్పింది ఏమీ లేదు; కుల విభజనను, వివక్షతను నిరసించడం తప్ప. బౌద్ధం సన్యాసాన్ని ప్రోత్సాహించింది. అందువల్ల గృహ జీవితం, గృహస్థులు ఏర్పడే సావకాశం లేకుండా అయింది బౌద్ధంలో. బౌద్ధ విహారాలలో యువతీయువకులు కలిసి జీవించడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

బౌద్ధ తత్త్వాన్ని కౌగిలించుకున్న చైనా ఒక తరం తరువాత బౌద్ధ విహారాలలో యువతీయువకుల
జీవన సరళి చూసాక, విహారాలను మూసివేసి, గృహస్థ జీవితముని మరల సాంఘిక జీవితంగా
మార్చుకున్నారు. కన్ఫ్యూషియస్ సిద్ధాంతాల వైపు మళ్ళీ మళ్ళారు.

బౌద్ధం తత్త్వంగా తప్ప జీవనవిధానంగా నిలువ లేక పోవడానికి విహారములలో యువతీయువకుల జీవనశైలి కారణం. చైనాలోనే కాదు తత్త్వంగా ఎంతో ప్రభావం చూపించిన బౌద్ధం తను ఎక్కడెక్కడ అయితే ప్రాచుర్యం పొందిందో ఆ ప్రాంతాలు, దేశాలు అన్నింటిలో సాంఘిక జీవనం దృష్ట్యా దెబ్బతింది.

ఈ విషయం బౌద్ధాన్ని గుడ్డిగా పొగిడే, కాని అనుసరించని మేధావులకు బౌద్ధం ప్రియమే కాని అనుసరణీయం కాలేదు. ఏ తత్త్వమైనా సాంఘిక జీవనం సరిగా లేక రాణించలేదు.

సాంఘిక జీవనం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని
తెలియని ఉట్టి తత్త్వ ప్రియులు బౌద్ధం వల్ల పెద్దగా ప్రయోజనం పొందలేరు. ఈ మధ్య కొందరు భారతీయులు హిందూ మతం వదిలి బౌద్ధంలో చేరిపోతామని బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరింపు
ఎవరికో అర్థం కాదు.

తత్త్వపరంగా బౌద్ధం, అద్వైతం దగ్గర దగ్గరగా ఉంటాయి. అందుకే ఆస్తికులైన విశిష్టాద్వైతులు, ద్వైతులు శంకరాచార్యులను ప్రచ్ఛన్న బౌద్ధులు అని నిరసించారు, నిందించారు కూడా. 

భారతీయ తత్త్వశాస్త్రాలు, వాటిలోని తత్త్వం ఒక ఎత్తు, వాటిపై ఆధారపడి ఏర్పడిన మతాలు మరో ఎత్తు. భారతీయ తత్త్వశాస్త్రాలు మతాలు ఏర్పడడానికి ఉపయోగించుకోబడ్డాయి. కాని మతాలు తమ తమ ఆచారవ్యవహారాలకు బందీ అయిపోయి తమకు మూలమైన తత్త్వాన్ని మరచి 
భగవత్ కైంకర్యాలలో, పూజలు, పునస్కారాలు, అభిషేకములు, ఇతర సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతూ తత్త్వానికి దూరం అయ్యారు.

తత్త్వం, మతం, సాంఘిక జీవనం మనుషులకు అవసరం. సాంఘిక జీవనాన్ని విస్మరించిన తత్త్వం ఎంత గొప్పదైనా క్షీణించక తప్పదు. భారతదేశంలో, ఇతరత్రా బౌద్ధం నియమించబడిన సాంఘిక జీవనం లేక మరుగున పడింది తప్ప తరువాతి ఆచార్యుల వల్ల కాదు.

సాంఘిక జీవనాన్ని నిర్వచించని, విస్మరించిన ఏ తత్త్వమైనా, వాదమైనా, ఇజమైనా, మట్టి కరవక తప్పదు. భారతదేశంలో ఇవాళ్టి వరకు తత్త్వమేది చదువుకున్నా, మతం ఏది అనుసరించినా సాంఘిక జీవనం పరంగా సారూప్యత ఉంది.

ఇది గమనిస్తే ఏ మతంలో ఉన్నా, ఏ ఇజాన్ని ఇష్టపడినా, ఏ తత్త్వమైనా, సాంఘిక  జీవనం ఒకటేనన్న ఇంగితం కలుగుతుంది. కొంత వరకు భ్రమలు తొలగుతాయి. మతం వేరైనంత మాత్రాన 
సాంఘిక జీవనం వేరు కాదు అనే గ్రహింపు కలుగుతుంది. సంఘంలో సామరస్య జీవనానికి పునాది పడుతుంది.

మతాలేవైనా మతులు సరియైనవైతే
సరిగా ఉంటే, మతం మార్పిడులకు
కాక; రాజకీయ, సాంఘిక చైతన్యం
వచ్చి అందరం బుద్ధిగా నడుచుకుంటాం!

అబద్ధపు మాటలకు, ప్రచారాలకు
మోసపోము; మెరుగైన జీవితం ఏర్పరచుకుంటాం!
****
సాహితీ పఠనాసక్తి, పఠనం

మనలో చాలా మందిమి బద్ధకస్తులం. ఏదైనా పుస్తకాన్ని చదవాలని మనకు అనిపించదు.
కాని ఎవరైనా చదివి అంతర్జాలంలో ఆ పుస్తక సమీక్ష చేస్తే ఆవురావురుమని చదివేసి సమీక్షకునికి పొగడ్తలు అందిస్తాము. 

కాని ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు కలిగే భావ జాలం వేరు, ఇతరులు చదివినప్పుడు వారికి కలిగే భావజాలం వేరు. మనందరికీ ఎవరికి వారికి ఇష్టాయిష్టాలలో, వాద ప్రియత్వంలో; బుద్ధిలో, అవగాహనా క్రమంలో, భాషా నైపుణ్యం, నైశిత్యాలలో ప్రతి వారికి తేడాలు ఉంటాయి. ఒక పుస్తకాన్ని మన దృష్టితో చదవడం వేరు, ఇతరులు తమ దృష్టితో చదివి రాసిన సమీక్ష చదవడం వేరు. 

పుస్తకం చదవడం ఒక యోగము. యాగము. ఆ యోగ, యాగాలు ఎవరికి వారు అనుభవించడం లోని అందం, సొగసు వేరు. పుస్తక సమీక్షలో సమీక్షించినాయన దృక్పథం బయటకు వస్తుంది తప్ప మన దృక్పథం ఏమిటో మనకి తెలియదు.
మన సాహితీ ప్రియత్వం మనం చదవడానికి ఎన్నుకున్న పుస్తకాల్ని బట్టి తెలుస్తుంది. ఎదుగుతుంది. 

పుస్తకాలు చదవడంలో ఎవరి ప్రియత్వాన్ని వారు ఎఱిగి, నిర్మించుకొని, పెంపొందించుకోవడంలో 
వ్యక్తిత్వం ఉంది. సరదా ఉంది. తమదైన మానసిక వికాసం ఉంది. మనంతట మనం మనకు నచ్చిన
పుస్తకాలు చదవడంలో మన స్వతంత్రత, అభిరుచి తెలుస్తాయి. ఇతరుల సమీక్షలు చదవడం వల్ల మన సమీక్షకా ప్రియత్వం తెలుస్తుంది. 

సమీక్షలు చదివి మన సాహితీ పిపాస తీర్చు కోవడమూ ఒక విధమైన సాహితీ అభిరుచియే. నాగరికతే. సంస్కృతే. కాని అక్కడే ఆగిపోకుండా, మనదైన సాహితీ ప్రియత్వం, పాండిత్యం అలవరచుకుంటే, మనదైన సంతృప్తి కలిగి, మనదైన సంస్కృతి ఏర్పడుతుంది. 

మనుషులందరమూ "ఒకటే" అయినా, మనలోని భిన్నత, అభిరుచిలో ప్రత్యేకత ఇంద్రధనుస్సులో రంగులలాగ అలరిస్తాయి.

పూర్తిగా సమీక్షకుల మీద కాక, మనపై మనం ఆధారపడడం వల్ల మనదైన సాహితీ ప్రియత్వం, పఠనాసక్తి, పఠనం మనల్ని ప్రత్యేకంగా వెలిగిస్తాయి.
****
We need not know about every happening. Let the concerned take care of it. Our "celebrations" of news items that cause us pain and rivulsion are ill-advised.
****
Useless

Indians have developed the art of creating problems and disturbing themselves for nothing. They mastered the making mountain out of mole. Who do this are politicians, intellectuals, NGOs, various ism activists. 

Society has never been perfect during any civilization. Many crimes, inhuman things have been happening. If one cares to study incidents and events in history the  ghastly happenings of today happened in heaps. The advances in technology have given room for informing one and all as the event takes place and scope for shouting brigade to immediately start shouting as if the shouters are most perfect in the society; which they are not. 

This, making noise and shouting for every crime, happening in scores every day numbing our senses, sensitivities and sensibilities has become more a vice than protest against inhuman acts. 

Celebrating every crime by commenting, criticising, blaming and never caring for properly educating citizens through sensible and sensitive upbringing serves no purpose. 

When you expect perfect behavior from every citizen then stop exploiting them by their social divisions and affiliations politically and socially. Without these taking place, mere shouting against crimes and blaming all but you is useless.

29-4-2018

ఇంట్లో వండుకున్న వంట తినడానికి పనికిరాదు
ఇంట్లో మనుషులు సేవించడానికి పనికిరారు
వీధిన పడి భోజనాలు, ఇంట్లో వారిని అనాథల చేసి బయటి వారికి సేవలు; ఎందుకిలా మారిపోయింది?

28-4-2018
రచనలు చదివేవారి కన్నా
రచించే వారు ఎక్కువైన నేడు
సాహితీ సృష్టి ఉద్దేశ్యమేమి?
రచయిత అనిపించుకోవడానికా?

ప్రాచీన కావ్యములు పఠించమని
అంతర్జాలం నిండా ఉచిత సలహాలు
చదివే శ్రద్ధా అర్థం చేసికునే సత్తా లేని
నేడు ఈ ఉచిత సలహాలెవరికి? సలహా

ఇచ్చినవారికి కాదనుకుంటా! సలహా
ఇచ్చేందుకు ఎందరో సిద్ధం; పాటించడానికి
లేరెవరూ! మన గురించి మనం పట్టించుకోక
జనావళికై సమయము, శక్తి వృథా చేసికోవడం
ఎందుకు?  ఏమిటో అదో దురద! భాషపై ప్రేమ
మనకూ ఉండాలి! దానిని ఆచరణలో చూపాలి!

No comments:

Post a Comment