పాత సామానులు
ఎవళ్ళమ్మలు వాళ్ళకి ముద్దు
ప్రపంచానికి అవసరం లేదు కదా
ప్రపంచానికి అవసరం లేదు కదా
వారి మమతలు ముద్దులు ముచ్చట్లు;
అమ్మలవ్వాలని ఏ ముద్దు గుమ్మలూ ఇప్పుడు
తొందరపడటం లేదు; అసలు అమ్మ బాధ్యతలు
నిర్వహించడానికి వాళ్ళకి సమయమే లేదు;
కొత్త అమ్మలు తయారుకాని వాతావరణంలో
తొందరపడటం లేదు; అసలు అమ్మ బాధ్యతలు
నిర్వహించడానికి వాళ్ళకి సమయమే లేదు;
కొత్త అమ్మలు తయారుకాని వాతావరణంలో
ఏం చేసుకుంటాం ఈ పాత అమ్మల ప్రేమలూ,
అభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు
త్యాగాలు? ఎందుకీ సెలిబ్రేషన్స్? ఇల్లాలి మరణంతో
అమ్మలూ కనుమరుగయ్యారు; ఏంటో చాదస్తాలు
త్యాగాలు? ఎందుకీ సెలిబ్రేషన్స్? ఇల్లాలి మరణంతో
అమ్మలూ కనుమరుగయ్యారు; ఏంటో చాదస్తాలు
పాత సామాన్ల గదిలో పురాతన వస్తువులా
ఉండవలసిన అమ్మ కి ఎందుకీ ఆర్భాటాలు?
ఉండవలసిన అమ్మ కి ఎందుకీ ఆర్భాటాలు?
*******
మననోట్లో మన్నే
ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎక్కువ
నటనలూ నటులూ ఎక్కువే;
ఏవిధమైన నిబద్ధత లేక ఏ సిద్ధాంతం
అనుసరించక పౌరుల జీవితాలు
నటనలూ నటులూ ఎక్కువే;
ఏవిధమైన నిబద్ధత లేక ఏ సిద్ధాంతం
అనుసరించక పౌరుల జీవితాలు
అభివృద్ధి పథంలోకి ఎలా తీసికెళ్ళగలరు?
వాడ్నీ వీడ్ని తిడుతూ కూర్చుంటే
పనులౌతాయా? అసలు వీళ్ళందరూ
పనులవ్వాలనుకుంటున్నారా? లేదేమో?
వాడ్నీ వీడ్ని తిడుతూ కూర్చుంటే
పనులౌతాయా? అసలు వీళ్ళందరూ
పనులవ్వాలనుకుంటున్నారా? లేదేమో?
కలకాలం వంశ పారంపర్యంగా అధికారం
అనుభవిస్తూ వాగ్దానాలు చేస్తూ గడిపేద్దాం
అనుకుంటున్నారా? ఓటర్లు మూర్ఖులైనంత
కాలం వాళ్ళ లైను క్లియరే; మన నోట్లో మట్టే!
అనుభవిస్తూ వాగ్దానాలు చేస్తూ గడిపేద్దాం
అనుకుంటున్నారా? ఓటర్లు మూర్ఖులైనంత
కాలం వాళ్ళ లైను క్లియరే; మన నోట్లో మట్టే!
************
మనిషి భౌతిక శరీరంలో ఎన్నో శరీరాలు.
ఒకటి భౌతిక శరీరం.
రెండు భావ శరీరం.
మూడు అనుభవ శరీరం.
రెండు భావ శరీరం.
మూడు అనుభవ శరీరం.
ఈ మూడూ మానసికమే. భావ, అనుభవ రూపమే.
భౌతిక శరీరం అంటే భౌతిక శరీర స్పృహ మాత్రమే.
భౌతిక శరీరం స్థితి గతుల గురించి భావములు. వేదాంత పరంగా దీనిని స్థూల శరీరము అంటారు. స్థూల శరీర స్పృహా రాహిత్యమే అహంభావ లేమి.
భౌతిక శరీరం స్థితి గతుల గురించి భావములు. వేదాంత పరంగా దీనిని స్థూల శరీరము అంటారు. స్థూల శరీర స్పృహా రాహిత్యమే అహంభావ లేమి.
మనం ఎక్కువగా భావ శరీరం రూపంలో ఉంటాము.
ఇది ఆలోచనలు, తలపుల రూపం. శరీర, తత్సంబంధ, మనస్తత్త్వపు తలపులు, అహంకార మమకారములు దీనిలో భాగం. దీనిని సూక్ష్మ శరీరం అంటారు.
ఇది ఆలోచనలు, తలపుల రూపం. శరీర, తత్సంబంధ, మనస్తత్త్వపు తలపులు, అహంకార మమకారములు దీనిలో భాగం. దీనిని సూక్ష్మ శరీరం అంటారు.
మన బాధలు, వేదనలు, హాయిలు, సుఖాలు, దుఃఖాలు మొదలైనవి మన అనుభవం శరీరం.
దీనిని కారణ శరీరం అంటారు.
దీనిని కారణ శరీరం అంటారు.
పై మూడు శరీరాలూ మానసిక కార్యకలాపాలే.
మన భౌతిక శరీరంలో ఈ శరీరాలన్నీ జీవ భౌతిక, జీవ రసాయన శక్తుల రూపంలో "జీవి" గా ఉంటాయి. ఇవన్నీ ప్రజ్ఞానం ద్వారా గమనింపబడుతూ ఉంటాయి. వీటి సంకలనమే మనం అనబడే వ్యక్తి.
ఈ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని లీనం చేసికొని సదా గమనికగా ఉండడం మోక్షం.
మన భౌతిక శరీరం మరణించి జడమైనపుడు ఈ శరీరాలన్నీ అంతరిస్తాయి. మరల పొడసూపవు.
మనం తీసుకునే ఊపిరుల వల్ల ఆత్మ లేక బ్రహ్మము ఏర్పడుతుంది. మనకు గమనికను, మానసిక కార్యకలాపాలు నిర్వహింపబడడానికి కావలసిన శక్తిని (చిత్ శక్తి) ఇస్తుంది. ఈ శక్తి పరిణామముల వల్ల మనలో నాలుగు మానసిక దశలు ఏర్పడి మానసిక కార్యకలాపాలు జరూగుతాయి.
మెళకువ, కుల మానసిక దశలలో మనసు, ఇతర అంతఃకరణములు, జ్ఞాన కర్మేంద్రియముల ద్వారా మనము అన్ని గ్రహణలు, శారీరక, మానసిక చర్యలు, ప్రతి చర్యలు చేస్తాము.
జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశలు మానసిక కార్యకలాపాల విరామ సమయం. శాంతి నెలకొని ఉంటుంది. సుషుప్తి పదం అర్థం అన్ని మానసిక కార్యకలాపాలు విరమింపబడి ఉండడం. సుషుప్తినే గాఢనిద్ర అంటారు. మనసు ఇప్పుడు నిండుకొని ఉండడం వల్ల మనకేమీ తెలియదు. హాయిగా ఉంటుంది కాని ఆ సమయంలో మనకు తెలియదు.
కాని మెళకువ రాగానే పట్టిన నిద్ర గాఢత వల్ల ఆ హాయి కాసేపు అలా తెలుస్తూ అనుభవంగా ఉంటుంది. గాఢనిద్రలో ఉన్న గమనికనూ కారణ శరీరం అంటారు.
కాని మెళకువ రాగానే పట్టిన నిద్ర గాఢత వల్ల ఆ హాయి కాసేపు అలా తెలుస్తూ అనుభవంగా ఉంటుంది. గాఢనిద్రలో ఉన్న గమనికనూ కారణ శరీరం అంటారు.
జాగ్రత్ సుషుప్తి లో మానసిక కార్యకలాపాల విరమణ వల్ల శాంతి, మౌనం, ఆనందం అనుభవముగా ఉంటాయి. ఇదంతా తెలుస్తూ వుంటుంది. అంతర్, బాహ్య జగత్తులు తెలుస్తూ ఉంటాయి. సంకల్పిస్తే అన్ని మానసిక కార్యకలాపాలూ జరుగుతాయి.
ఇలా మన భౌతిక శరీరంలో మూడు మానసిక శరీరాలు ఉన్నాయి.
శీర్యతే ఇతి శరీరం - జీర్ణించే స్వభావం కలది శరీరం.
ఈ మూడు శరీరాలు మన భౌతిక శరీరం ఉన్నంతవరకు సేపూ కలిగి, కనుమరుగు అవుతూంటాయి. ఇవి అలా అశాశ్వతం. మన భౌతిక శరీరమూ అశాశ్వతమే.
ఈ మూడు శరీరాలు మన భౌతిక శరీరం ఉన్నంతవరకు సేపూ కలిగి, కనుమరుగు అవుతూంటాయి. ఇవి అలా అశాశ్వతం. మన భౌతిక శరీరమూ అశాశ్వతమే.
ఈ శరీరం ఉన్నంత సేపే ఈ శరీరాల జనన, మరణాలు. ఆపై ఏదీ మిగిలి ఉండదు. శరీరం మరణించినా ఆత్మ ఉంటుంది అనేది ఈ మూడు శరీరారకు మాత్రమే వర్తిస్తుంది. మన ఈ శరీరం మరణించినా ఆత్మ నిలిచి ఉంటుంది అనేది అన్వయ దోషం. ఉపనిషత్తులు మాత్రం ఇలా చెప్పలేదు.
ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
********
చదువు, సంస్కారములెక్కడ?
చదువుకున్న వారు అంతర్జాతీయ సాలెగూళ్ళలో;
చదువుకుంటున్న వారు జైళ్ళ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో; సమయము వృథా చేసికుంటున్న ఈ రోజుల్లో విద్యలెక్కడ? విద్య ప్రయోజనమేమి?
చదువుకుంటున్న వారు జైళ్ళ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో; సమయము వృథా చేసికుంటున్న ఈ రోజుల్లో విద్యలెక్కడ? విద్య ప్రయోజనమేమి?
ఏది అస్తమానూ మన్ని అంటిపెట్టుకుని ఉంటుందో
అది విద్య; దేన్ని మనం అస్తమానః అంటిపెట్టుకుని ఉంటామో అది వ్యసనం;
అది విద్య; దేన్ని మనం అస్తమానః అంటిపెట్టుకుని ఉంటామో అది వ్యసనం;
భాషల నేర్చి భావుకులగు వారేరీ? సాహితీస్రష్టలేరి?
విద్యా సముపార్జన చేసి విద్వాంసులగు వారేరీ? ఏరీ?
విద్యా సముపార్జన చేసి విద్వాంసులగు వారేరీ? ఏరీ?
మానవ జీవితపు పరమార్థము తెలియక
మాసిన భావముల మూసిన వికాసముల
కొట్టుమిట్టాడుతున్న బాలలకు యువతీయువకులకు
ఏది దిశానిర్దేశం? ఏవి వికసన మార్గములు? ఏరి
చూపు ఒజ్జలు?
మాసిన భావముల మూసిన వికాసముల
కొట్టుమిట్టాడుతున్న బాలలకు యువతీయువకులకు
ఏది దిశానిర్దేశం? ఏవి వికసన మార్గములు? ఏరి
చూపు ఒజ్జలు?
అంతయు ధనభూయిష్టమై అన్ని చదువులు,
ఉద్యోగాలు డబ్బు చుట్టూ తిరుగు నేడు ఎక్కడ
నాగరికత సంస్కృతి సంప్రదాయాలు సంస్కారాలు?
మనిషి మృగమో యంత్రమో అయ్యి తన్ను మరచిన
వేళ ఎటుల ఈ కుంగుబాటును సరిజేయుట?
ఉద్యోగాలు డబ్బు చుట్టూ తిరుగు నేడు ఎక్కడ
నాగరికత సంస్కృతి సంప్రదాయాలు సంస్కారాలు?
మనిషి మృగమో యంత్రమో అయ్యి తన్ను మరచిన
వేళ ఎటుల ఈ కుంగుబాటును సరిజేయుట?
*******
ప్రణయ కవిత్వం రాయడం
స్త్రీలను నాగరికతా, సంస్కృతీ,
సభ్యతా రహితంగా చూడడమా?
స్త్రీలను నాగరికతా, సంస్కృతీ,
సభ్యతా రహితంగా చూడడమా?
వారి సౌశీల్యాన్ని భంగపరచినట్టా?
వారి మానాన్ని హరించినట్టా?
వారి అంతరంగిక ఏకాంత జీవితంలో చొరబడ్డట్టా?
ఏమో ఆధునాతన స్త్రీ వాదులు ఏమంటారో?!
********
రాజకీయ నాయకుల ఇంట
అతి ఖర్చు ఆర్భాటాల ఆడంబరాల;
సెలిబ్రటీ జంటల జగద్విఖ్యాత, పెళ్ళిళ్ళ
వైభోగం, విభవం మన చేతి చలవేగా!
అతి ఖర్చు ఆర్భాటాల ఆడంబరాల;
సెలిబ్రటీ జంటల జగద్విఖ్యాత, పెళ్ళిళ్ళ
వైభోగం, విభవం మన చేతి చలవేగా!
**********
No comments:
Post a Comment