Friday, May 11, 2018

మన పూనకాలు; వర్తమానం; విరామ, వికాస రహిత చదువులు, జీవనం; చేటు; బ్రహ్మము-ఆత్మ;


మన పూనకాలు


మనం రాసినది మనమే చదువుతామో లేదో 
తెలియని రోజుల్లో, బరబరా అస్తమానూ ఏదో
గీకెయ్యడం; ఏమి శ్రద్ధో రాసెయ్యడం మీద;
ఎంతటి ఆపేక్షయో సారస్వత సృష్టి మీద

రచనలో సౌష్టవం లేకయే, వస్తువును మార్చకయే,
రస స్ఫూర్తి లేకనే పదే పదే అదే అదే భావములను 
పుంఖానుపుంఖాలుగా, గోలగా; కుడి భావముల 
ఎండగొడుతూ, ఎడమ భావముల ఆకాశానికి

ఎత్తేస్తూ, రాసెయ్యడం తమాషా కాదు; అది
ఒక పూనకం; రోజులు మారినా, ప్రపంచమే ఛీ కొట్టినా
మెడ పట్టుకు గెంటినా, చూరు పట్టుకు వేలాడడం;
నూతిలో కప్ప వలె భావ దారిద్ర్యమున మగ్గడం
*********
వర్తమానం

వర్తమానంలో గర్వించదగ్గ మనుషులు, సంఘటనలు
విషయాలు లేనప్పుడు మనిషి గతంలోకి జారుకుంటాడు; 
జ్ఞాపకాలలోంచి ఆనందం జుర్రు కోవడానికి ఉద్యమిస్తాడు; 
సినిమా అయినా,సారస్వతం అయినా, రాజకీయం అయినా, 

నటన అయినా, విజ్ఞానశాస్త్రమైనా, తత్త్వమైనా, 
తన జీవితమైనా; రెండో పంథాగా భవిష్యత్తును
ఆశ్రయిస్తాడు ఊహలు, స్వప్నములతో సరిపెట్టుకుంటాడు; 
మనిషి మానసిక జీవి;భావములు సంతోషకరమైనవయితే ప్రశాంతి

భావ సంపదయే మనిషికి సంపద
భావములను హాయిగా మలుచుకోవడం
మనిషి జీవన నైపుణ్యం; బ్రతకవలసిన విధం
వర్తమానాన్ని వేదాంత దృష్టితో అధిగమించాలి
*******
Being engaged in social networking sites and what's app is killing originally and creative power and is making one believe of one's own writing abilities excessively and unconcerned and uncontrolled aggression is shown without respect or aesthetics. Humans became all powerful with their internet achievements on social networking sites.
********
Consciousness is awareness of awareness.
Consciousness sans awareness is deep sleep.
Consciousness outlives awareness.
Consciousness is seer of mental happenings as well as their cessation.
Consciousness is experience of Itself, sans any awareness of external.
*******
విరామ, వికాస రహిత చదువులు, జీవనం

వేసవి సెలవుల్లేకుండా, మామూలు రోజుల్లోనూ
 విరామం ఈయని చదువు వికటించును
మనిషికి నిద్ర వలె విద్యార్థులకు విరామం అవసరం

ముక్కున బట్టి పరీక్షలో రాసేసి మరల జీవితంలో
పట్టించుకోని చదువు మేధావులను తయారు చేయదు; 
పండితులను, శాస్త్రవేత్తలను తయారు
చేయదు; రచయుతలు, కవులు పుట్టరు

సమాజమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువు చదివి
మొత్తానికి అందరమూ తలో సెల్ ఫోన్, లేప్ టాప్
చేతిలో, ఒళ్ళో పెట్టుకొని మరమనుషులమై అందగితము;

ఏమిటో మన ధోరణి, ప్రవర్తన, చదువు, చట్టబండలు
మానసిక వికాసం లేని మనకు వినోదం జుగుప్స కలిగించి 
ఎక్కడ విడిచివేయునో? ఎటుల భరింతుమో
*****
మన వారికి మనం మనస్ఫూర్తిగా ఆప్యాయత చూపించక పోవడం వల్ల, ఆత్మీయత పంచక పోవడం వల్ల మనం depressionకి గురయ్యే ప్రమాదం 99 శాతం ఉంది.
*******
Cultivating the trait of living in the present is the greatest spiritual achievement.
******
చేటు

వయసు మీద పడుట స్త్రీల అందానికి చేటు
కంటికి నచ్చిన అబ్బాయిలతో ప్రేమలో పడుట కన్నియలకు చేటు;

భగవన్నామస్మరణ చేస్తే సరిపోయి తరించే దానికి; 
స్వాములు, బాబాలు, నకిలీ ఆధ్యాత్మిక గురువుల 
వెనుక బడుట ముముక్షువులకు చేటు

తమ ఉన్నతికి, అభివృద్ధికి తమ శక్తి యుక్తుల నమ్ముకొనుట మాని, 
రాజకీయ నాయకుల నమ్ముట పౌరులకు చేటు

ఎవరెన్ని బోధలు చేసిన, ఉపదేశముల, సలహాల నిచ్చినను వినక,
 పెడచెవిని పెట్టుట; అర్థరాత్రి, అపరాత్రి యనక బయట తిరుగుట, 
పబ్లకు, పార్టీలకు పోవుట ఎవరికీ క్షేమము కాదు, అందరకు చేటు

ప్రకృతిని మరచి, విడిచి, వికృతుల పాలై జీవనములు గడుపుట స్త్రీ పురుషులకు చేటు
తమ తమ బాధ్యతల మరచి, హక్కులకోసం మాత్రమే పోరాడే జనులు పొందేది సున్న, 
వారి వారి గోరోజనాలు వారికి చేటు

ఏమీ తెలియక, ఏమీ చదవక, శ్రద్ధ, గౌరవములు మరచి 
కేవల ద్వేష, విద్వేషాలు నిండిన మనసుతో
సంఘమునకను నడుపు మేధావులు ఎంతో చేటు

నాగరికత నేర్పక, సంస్కృతికి సున్న చుట్టి,
సంస్కారమును ముందే హుళక్కి చేయు
కార్పొరేట్ విద్యా సంస్థలు సంఘమునకు చేటు

బరితెగించి అన్ని అవినీతులకు పాల్పడుచు
పౌరుల నయ వంచనతో ఆకట్టుకొని, పదవులు పొంది, 
నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా పాలించు నాయకులు
దేశానికి, సంఘానికి చేటు
********
బ్రహ్మము-ఆత్మ

ఉండుటే బ్రహ్మము.
శుద్ధ గమనికగా ఉండుటే ఆత్మ.
అస్తమానూ ఉండేది గమనిక. ( జాగ్రత్, స్వప్న, సుషుప్తి, జాగ్రత్ సుషుప్తుల యందు).
కలిగి, కనుమరుగైయ్యేవి మనసు, మానసిక కార్యకలాపాలు.
మెళకువ(జాగ్రత్), కల (స్వప్న)మానసిక దశలలో మనసు, ఇతర అంతఃకరణములు ఉండి మానసిక కార్యకలాపాలు చేస్తాయి. జరుపుతాయి.
సుషుప్తి (గాఢనిద్ర), జాగ్రత్ సుషుప్తి (మెళకువతో కూడిన నిద్ర) నిర్మల మానసిక దశలు. ఆత్మ దశలు, బ్రహ్మానుభవ సమయములు. ఈ దశలో మనసు, ఇతర అంతఃకరణములు విరమింపబడి ఉంటాయి.
సుషుప్తి దశలో మనసు పనిచేయదు. జరిగేది తెలియదు (అంతర్, బాహ్య జగత్తులలో). గమనించే తెలివి ఉండదు.
జాగ్రత్ సుషుప్తి దశలో గమనించే తెలివి ఉంటుంది. అవసరమైతే, సంకల్పిస్తే మానసిక కార్యకలాపాలు జరుగుతాయి.
సదా ఉండుటను "అహం" తెలియజేస్తుంది. దీనిని శుద్ధాహం అంటారు.
అహం బ్రహ్మాస్మి లోని అహం ఇదే. మన వ్యక్తిత్వం, తత్సంబంధ అహంకార మమకార యుత అనుభవములు, భావములు కాదు.
ఏ విధమైన మానసిక కార్యకలాపాలు జరగని స్థితియే బ్రహ్మ స్థితి. ఇప్పుడు శుద్ధ గమనిక స్థితి.
శుద్ధ గమనికయే శుద్ధాహం.
ఆత్మజ్ఞానం ఇది. దీనికి ఆస్తిక వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు భగవత్ పరంగా కూడా జరుగుతాయి.
అద్వైతాన్ని ఆస్తిక వ్యాఖ్యాతలు "నాస్తికము" అన్నారు. శంకరులను ప్రచ్ఛన్న బౌద్ధులు అని నిరసించారు.
ఒకే ప్రస్థాన త్రయమైన ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత; ఆచార్యుని, సిద్ధాంతి, వ్యాఖ్యాతను బట్టి వివిధ వేదాంతములుగా వెలిశాయి.
ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి!
******

No comments:

Post a Comment