అద్వైత ప్రకాశము - సత్ భాస్కరత - చిత్ విలాసము
నేనని లేను అంతయు అచ్యుతుడే
సత్ భాస్కరతయే చిత్ విలాసమే
నేనని లేను అంతయు అచ్యుతుడే
సత్ భాస్కరతయే చిత్ విలాసమే
నా అణువణువు నారాయణ నామగానము చేయ
నా చిత్తప్రకంపనములు ప్రణవనాదమొనరింప
నా హృదయమును లక్ష్మీపతి నివాసము చేసికొన్న
నా స్మృతి సకలలోకనాథుని జగన్నాథుని మయమైన
కనిపించును మాధవుడు తన కరుణను ప్రసరించుచు
వినిపించును విష్ణుమూర్తి తన అనుగ్రహమును కురిపించుచు
స్పర్శకందును పద్మనాభుని ప్రేమాస్పద లాలనము
రుచులకందును గోవిందుని మహిమాన్విత జ్ఞానరుచులు
నాసిక పీల్చును మధుసూదనుని వాత్సల్య పరిమళములు
మనసు గంతులువేయును అచ్యుతుని అనురాగసిరులకు
అహంకారము తనంత తాను లీనమగును నరహరిలో
చిత్తము మునిగి తేలును శ్రీధర స్మరణామృతాంబుధినందు
నా సర్వము, నేనూ హృషీకేశుని
పాదారవింద ధ్యానగతులమైన;
నేనే త్రివిక్రముడు, నారాయణుడే
నేనుగా, అద్వైతప్రకాశ మగ్నత
సత్యజ్ఞానానంద మౌనవ్యాఖ్యానము
మామక హృదయాతరంగానుభవము;
అప్పుడు నేనని లేను; అంతయు
అచ్యుతుడే; సత్ భాస్కరతయే; చిద్విలాసమే

No comments:
Post a Comment