మనుగడ
ఆదిలో లేదిక్కడ ఏ జీవీ
అప్పుడిదంతా ఓ బంజరు భూమి
ఆదిలో లేదిక్కడ ఏ జీవీ
అప్పుడిదంతా ఓ బంజరు భూమి
నెమ్మదిగా పరిణమించింది జీవం
కోకొల్లలుగా అవతరించాయి జీవాలు;
పెరిగాయి, తిరిగాయి; ప్రకృతిలో కలిసి పోయాయి
ఆ జీవ పరిణామంలో భాగంగా (?)
ప్రభవించిందో వింత మృగం!
బ్రతుకు, ఆలోచన
ఒకేసారి మొదలుపెట్టింది
"నేను, నా చుట్టూ జీవాలు
'సృష్టా ? ! ?'
అబ్బురపడింది మొదట
" కాదు కాదు,
అంతా జీవ పరిణామంలో భాగం
ఆ పరిణామ ఫలం! "
అనుకుంటోందిట.
కని, పెంచి, పోషించిందెన్నో విలువలు
సృష్టించింది అంకెలు, అక్షరాలు;
చేరింది విజ్ఞానపు శిఖరాలు
వెలిసాయి అందమైన కావ్యాలు
వినిపించాయి మరెన్నో మధుర సంగీతాలు
వెలిసాయి రమ్య హర్మ్యాలు శిల్పాలు నాట్యాలు చిత్రాలు
బుద్ధికి పదునుపెట్టే సిద్ధాంతాలు శాస్త్రాలు
కానీ, ఇప్పుడు
దాని ఆలోచనంతా కంప్యూటర్ చేస్తోంది
ఎప్పుడో న్యూట్రాన్ బాంబు, జీవ రసాయన ఆయుధములు
దాని బతుకుని ధ్వంసం చేస్తాయి
ఇక్కడో బాంబు పేలుతుంది; అక్కడో "మత పిశాచి" వెలుస్తుంది
ఇక్కడో రాజ్యం కూలుతుంది; అక్కడో యుద్ధం ప్రజ్వరిల్లుతుంది
జరిగేది ఏదయినా
విచక్షణా రహితంగా
అమాయకుల ఊచకోత మాత్రం
జరిగితీరుతుంది
ఎందరో "మనిషిని" యంత్రం అంటున్నారు
మళ్ళీ "దానిలో" జంతువుని కంటున్నారు
తాను కని, పెంచి, పోషించిన విలువలని
విజ్ఞానాన్ని మంటలో కలుపుకుంటోంది
అనుకుంటున్నారు
నేను మాత్రం
ఇలా అనుకుంటున్నాను
పక్షుల్లా ఎగురగలిగినా
చేపల్లా ఈదగలిగినా
చందమామపై కాలు పెట్టినా
ఆకాశాన్ని చుట్టినా
పరీక్ష నాళికలో ఫలదీకరణం జరిపినా
మళ్ళీ "మనం"
మనుషుల్లా వ్యవహరించకపోతే
"మన" మనుగడే
అవుతుంది ఓ గుండుసున్నా!
కోకొల్లలుగా అవతరించాయి జీవాలు;
పెరిగాయి, తిరిగాయి; ప్రకృతిలో కలిసి పోయాయి
ఆ జీవ పరిణామంలో భాగంగా (?)
ప్రభవించిందో వింత మృగం!
బ్రతుకు, ఆలోచన
ఒకేసారి మొదలుపెట్టింది
"నేను, నా చుట్టూ జీవాలు
'సృష్టా ? ! ?'
అబ్బురపడింది మొదట
" కాదు కాదు,
అంతా జీవ పరిణామంలో భాగం
ఆ పరిణామ ఫలం! "
అనుకుంటోందిట.
కని, పెంచి, పోషించిందెన్నో విలువలు
సృష్టించింది అంకెలు, అక్షరాలు;
చేరింది విజ్ఞానపు శిఖరాలు
వెలిసాయి అందమైన కావ్యాలు
వినిపించాయి మరెన్నో మధుర సంగీతాలు
వెలిసాయి రమ్య హర్మ్యాలు శిల్పాలు నాట్యాలు చిత్రాలు
బుద్ధికి పదునుపెట్టే సిద్ధాంతాలు శాస్త్రాలు
కానీ, ఇప్పుడు
దాని ఆలోచనంతా కంప్యూటర్ చేస్తోంది
ఎప్పుడో న్యూట్రాన్ బాంబు, జీవ రసాయన ఆయుధములు
దాని బతుకుని ధ్వంసం చేస్తాయి
ఇక్కడో బాంబు పేలుతుంది; అక్కడో "మత పిశాచి" వెలుస్తుంది
ఇక్కడో రాజ్యం కూలుతుంది; అక్కడో యుద్ధం ప్రజ్వరిల్లుతుంది
జరిగేది ఏదయినా
విచక్షణా రహితంగా
అమాయకుల ఊచకోత మాత్రం
జరిగితీరుతుంది
ఎందరో "మనిషిని" యంత్రం అంటున్నారు
మళ్ళీ "దానిలో" జంతువుని కంటున్నారు
తాను కని, పెంచి, పోషించిన విలువలని
విజ్ఞానాన్ని మంటలో కలుపుకుంటోంది
అనుకుంటున్నారు
నేను మాత్రం
ఇలా అనుకుంటున్నాను
పక్షుల్లా ఎగురగలిగినా
చేపల్లా ఈదగలిగినా
చందమామపై కాలు పెట్టినా
ఆకాశాన్ని చుట్టినా
పరీక్ష నాళికలో ఫలదీకరణం జరిపినా
మళ్ళీ "మనం"
మనుషుల్లా వ్యవహరించకపోతే
"మన" మనుగడే
అవుతుంది ఓ గుండుసున్నా!
No comments:
Post a Comment