Monday, November 23, 2015

తెల్లవారుతూనే లేస్తారు పిల్లలు; నిరంతర జలియన్ వాలా బాగ్ హత్యలు


తెల్లవారుతూనే లేస్తారు పిల్లలు
మొదలెడతారు కబుర్లు అల్లర్లు
కావాలని కొన్ని ఏడుపులు పెడబొబ్బలు
వద్దని కొన్ని గోలలు గొడవలు పరుగులు
జీవితానికి నిండు అందం పిల్లలు
విసిగించినా పసి మనసులతో పలకరింతురు
చిన్నిదిస్తేనే వారికి ఆనందం గంతులేయడం
కావలిసినవి తక్కువ ఆనందించడం ఎక్కువ
పసివారలు కల్మషరాహిత్యానికి ప్రతీకలు
మనవారలే అయిన పిల్లలు దేవుని ప్రతిరూపాలు



నిరంతర జలియన్ వాలా బాగ్ హత్యలు

భారతదేశ స్వాతంత్ర్య‌ సమర సందర్భాన
జరిగినవి జలియన్ వాలా బాగ్ కాల్పులు
అయాయక ప్రజల దారుణ హత్యలు
అప్పుడు డయ్యర్ దొర అజమాయిషీలో


ఇప్పుడు ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతిచోటా
అటువంటి ఊచకోతలే అయాయక ప్రజల దారుణ హత్యలే

ప్రజాస్వామిక నాగరిక ప్రభుత్వాలు ఏమీ చేయలేక
మద్దెల ఓటని వారిని వీరినీ నిందిస్తున్నారు, ఫలితం
మాత్రం శూన్యం; అప్పటి హత్యలు ప్రభుత్వాని(ల)వి
ఇప్పటి ఊచకోతలు ఉగ్రవాదులవి నరరూప రాక్షసులవి

అమాయకుల హత్యలు ఎవరు చేసినా ఖండించవలసిందే
ఆక్రమించిన పరాయి దేశ ప్రభుత్వాలైనా, కరడు గట్టిన ఉగ్రవాదులైనా;
ఇద్దరూ నర రూప రాక్షసులే; పశ్చిమదేశ ప్రభుత్వాల రెండు నాలికల ధోరణులు
మానవజాతి మనుగడకే మొప్పం తెస్తున్నాయి; కాని వారిని వీరినీ పత్తిత్తుల్లలా
బాధ్యులని చేయడం మాత్రం పకడ్బందీగా చేస్తున్నారు; దీని వల్ల ఏమి ప్రయోజనం?
వాళ్ళ వాళ్ళ ఆయుధ కర్మాగారాలు కోట్లకు పడగలెత్తడం తప్ప ఏమి ఒరుగుతుంది?

అమాయకుల ఊచకోతలు నిత్య కృత్యమవడం తప్ప
పశ్చిమదేశాల స్వార్ధ కుయుక్తులు ప్రపంచాన్ని నిత్య రణరంగంగా
ఉంచడం తప్ప; జలియన్ వాలా బాగ్ కాల్పులు హత్యలు
గ్లోబంతా విస్తరించడం తప్ప; చిత్తశుద్ధి లేని ఆదర్శ ప్రకటనలు
రోజూ మనం వినడం తప్ప; పశ్చిమదేశాల బూజు పట్టిన హితోక్తులు
మానవ హక్కుల గురించి ప్రజాస్వామ్యం గురించి శూన్య పునరుక్తులు తప్ప?

No comments:

Post a Comment