Thursday, November 12, 2015

ఉపయోగించు శూన్యములు, ఊపిరులుండగనే

ఉపయోగించు శూన్యములు

అక్షాంశ రేఖాంశములు కల్లలు; అటులనే
ఎలక్ట్రానిక్స్ లో "హోలు" ఎలక్ట్రాన్ శూన్యత
అంకెలలో సున్నకు విలువ శూన్యము
పదార్ధమునకు ఆలంబనము శూన్యము

రాత్రి కలలులేని గాఢనిద్రలో మనసు శూన్యము
చూడబడు ప్రపంచము ప్రజ్ఞానస్థితిలో శూన్యము
వస్తువు ఉంటే ఉపయోగము, లేకున్ననూ కలవు
ఉపయోగములు; ఉండుట, లేకుండుట, రెండూ ప్రయోజనములే


ఊపిరులుండగనే


గడచిపోవును జీవితము మన ప్రయత్నము లేకనే
కాలగమనము మన చేతిలోలేని విశ్వపరిణామము
ముగిసిపోవును బ్రతుకు, రచన సాగుచుండగనే
బిగిసిపోవును, సూచనీయకనే పార్ధివశరీరము
ఆగిపోవును సకల మానసిక కార్యకలాపములు;
బాగుగ జీవించవలెను ఊపిరులుండగనే మనము

తాత్కాలికము మన ఉనికి ఈ ‌నేలపై
తాత్త్వికత కాదు, ఇది పరమ సత్యము
నిదానించి చూచిన; నిర్మల మానసమున
భక్తి ప్రపత్తులతో జీవించిన తరింతుము
అంతా మిథ్య తలంచి చూచిన
గ్రహించి బంధముల తగులుకొనక
తామరాకుపై నీటి బొట్టు వలె అంటక
చరించవలె; శాంతి సౌఖ్యములే బ్రతుకు

No comments:

Post a Comment