
కృష్ణుండు యశోద బుల్లివాడు
కృష్ణుండు యశోద బుల్లివాడు
కృష్ణుండు అర్జునిని చెలికాడు
కృష్ణుండు రాధా మానసచోరుడు
కృష్ణుండు భగవద్గీతాచార్యుడు
మాధవుడు మనవాడు
మనలోని మామంచివాడు
బందుగుడు, హితుడు,
స్నేహితుడు; భగవంతుడు
కృష్ణభక్తి అలవడుట జన్మ జన్మాంతర
పుణ్యఫలము; కృష్ణుండు మనసున
నిండుట అష్టాక్షరీ మంత్రోపాసనా ఫలితము
ద్వైతము అద్వైతముల సారము ఆది దైవము
రాక్షసాంతకుడు రమణీ సంగ రసోల్లాసుడు
మన యోగక్షేమముల వహించు దైవతము
రాసలీల వలె జగములనేలు జనుల కాచు
శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్, ఉడిపి వాసియును
భాగవతుల భావనా దర్శనా గమ్యము
కుభూపతుల శిక్షించె కుంతీపుత్రరక్షకుడు
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ
దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి"
యుగే యుగే" అని మనకై అవతరించు దైవవతంసము
No comments:
Post a Comment