ఆధ్యాత్మికత-ఉప్పు
ఇక్కడే భగవంతుని చూతమన్న
ఎందరికో మనసుకు పట్టదు;
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి
సుదూర యాత్రల ఆలయముల
దేవుని దేవిని దర్శింపగోరెదరు;
సతత భగవన్నామస్మరణమున
తండ్రితో సదా గడుపుదమన్న
చాలామందికి చిన్నచూపు, వినరు;
ఇక్కడే భగవంతుని చూతమన్న
ఎందరికో మనసుకు పట్టదు;
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి
సుదూర యాత్రల ఆలయముల
దేవుని దేవిని దర్శింపగోరెదరు;
సతత భగవన్నామస్మరణమున
తండ్రితో సదా గడుపుదమన్న
చాలామందికి చిన్నచూపు, వినరు;
ఆ సన్యాసియో ఈ యతియో తన
శిష్యపరమాణువుగ స్వీకరించు వరకు
జన్మ ధన్యము కాలేదనుకొనుచు వారి
అనుగ్రహమునకై వేచిచూచు వింత ప్రకృతులు
రామనామమో కృష్ణ మంత్రమో
కడతేర్చునన్న నమ్మరు; ఆధ్యాత్మికత
అనుకొనుచు ఆశ్రమముల చుట్టూ
తిరిగెదరు; డబ్బు దస్కము సమర్పించెదరు
ఈశ్వరుడు గురువు ఆత్మ రూపములలో
దైవము కరుణించునన్న ఈశ్వరుని వదిలి
కుహనా గురువుల పట్టుకొని కడతేరని
బ్రతుకుల కాలయాపనము చేసెదరు
నీవును నీకు గురువువే నీ స్ఫురణలే
నీకు దారి చూపించునన్న తమ శక్తిని
తాము తక్కువగ అంచనా వేసికొని
కరతలామలకమైన మోక్షమునకై
వడిదుడుకులు పడెదరు; విధివిహిత
ధర్మముల నిర్లక్ష్యము చేసి మృగతృష్ణలో
దాహము తీర్చుకొనుటకై పరువులెత్తెదరు
ఆధ్యాత్మికత పేరుతో కావలసినవారిని,
నిజ బాధ్యతలను విడిచిపెట్టి, వారికి
వీరికి బానిసలై తత్త్వము ఎఱుగకనే
చివరికి శరీరముల విడిచిపెట్టెదరు
జీవితమున రుచికై, నిరామయముగ విధి
విహిత ధర్మముల నిర్వర్తించుటకై
తత్త్వము, ఆధ్యాత్మికత; రుచికై ఉప్పు,
అంతియకాని ఉప్పే తినరాదు; తినలేము
శిష్యపరమాణువుగ స్వీకరించు వరకు
జన్మ ధన్యము కాలేదనుకొనుచు వారి
అనుగ్రహమునకై వేచిచూచు వింత ప్రకృతులు
రామనామమో కృష్ణ మంత్రమో
కడతేర్చునన్న నమ్మరు; ఆధ్యాత్మికత
అనుకొనుచు ఆశ్రమముల చుట్టూ
తిరిగెదరు; డబ్బు దస్కము సమర్పించెదరు
ఈశ్వరుడు గురువు ఆత్మ రూపములలో
దైవము కరుణించునన్న ఈశ్వరుని వదిలి
కుహనా గురువుల పట్టుకొని కడతేరని
బ్రతుకుల కాలయాపనము చేసెదరు
నీవును నీకు గురువువే నీ స్ఫురణలే
నీకు దారి చూపించునన్న తమ శక్తిని
తాము తక్కువగ అంచనా వేసికొని
కరతలామలకమైన మోక్షమునకై
వడిదుడుకులు పడెదరు; విధివిహిత
ధర్మముల నిర్లక్ష్యము చేసి మృగతృష్ణలో
దాహము తీర్చుకొనుటకై పరువులెత్తెదరు
ఆధ్యాత్మికత పేరుతో కావలసినవారిని,
నిజ బాధ్యతలను విడిచిపెట్టి, వారికి
వీరికి బానిసలై తత్త్వము ఎఱుగకనే
చివరికి శరీరముల విడిచిపెట్టెదరు
జీవితమున రుచికై, నిరామయముగ విధి
విహిత ధర్మముల నిర్వర్తించుటకై
తత్త్వము, ఆధ్యాత్మికత; రుచికై ఉప్పు,
అంతియకాని ఉప్పే తినరాదు; తినలేము
No comments:
Post a Comment