Monday, October 12, 2015

నేనూ - నా సాహితీసృష్టులు

నేనూ - నా సాహితీసృష్టులు

నేనూ కవితలల్లుతాను రచనలు చేస్తాను నలుగురిలా;
కానీ కవిగా గాని రచయితగా గాని లేదు గుర్తింపు నాకు;

అంతర్జాల మాధ్యమంలో కోకొల్లలు నా సాహితీసృష్టులు
తెలుగు ఆంగ్లం సంస్కృతంలో వెలయిస్తాను సాహిత్యం;

నేను నా సృష్టులను అచ్చు వేయింంచుకోలేదు; పేరు పడిన
విమర్శకులకు నేను, నా రచనలు పరిచయంలేవు

కొందరు పాఠకులు ఆదరంగా ఆనందంగా పఠిస్తారు
నా సాహిత్యాన్ని; సంతోషాన్ని తెలుపుతారు కూడా;

అలా నేనో సాహతీస్రష్టను; చేతి చమురు భాగోతంలా
ఖర్చుపెట్టి రచనలు అచ్చేయించుకునే దృష్టి లేదు

విమర్శకుల నలుగురైదుగురి సాన్నిహిత్యము, స్నేహం
లేవు; తెలియును ఆంధ్రగోదావరీ సలిలముల మౌనముగా
కలియు కిన్నెరసాని నా కవితాస్రవంతి, అట నిశ్శబ్దముగ
వీచు పరిమళ భరిత అనిలము నా‌ రచనాలహరి యని;

ఇది చాలు నాలో సాహితీ నిర్మాణ ఉత్సాహ ఝరి ఉప్పొంగుటకు, కొండవాగై ;
పరుగులెత్తుటకు; ఆత్మతృప్తికై సాహిత్యము సృష్టించెద; ధన్యుడనయ్యెద తదాచరణమున;

No comments:

Post a Comment