భగవంతుని కొలుచు విధము
భక్తుని భగవంతుని అనుబంధము అనిర్వచనీయము. భగవంతుని కొలిచే వారు మాత్రము పలు విధములు.
కృష్ణభగవానుడే భగవద్గీతలో భక్తులని ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, మోక్షకాములుగా తారతమ్యం చెప్పాడు.

ఆర్తి, కష్టాల నుంచి తప్పించమని కొందరు, ధనము, సంపత్తి, ఆస్తుల కోసం
కొందరు, జ్ఞాన సముపార్జన కోసం కొందరు, మోక్షం కోసం కొందరు భగవంతుని
ప్రార్ధిస్తారు.
వారి వారి అర్హతలను గమనించి ఆయన అలా అలా కరుణిస్తాడు.
భగవంతుని దగ్గరకు వెళ్ళేసరికి మనం అహంకార, అహంభావములను, వ్యక్తిత్వాన్ని మరచి నిర్మల మనస్కులమై, వినమ్రతతో ఉండాలి. మన లౌకిక జీవన అంతస్తులను, ఇతర దర్పములను, బడాయిని, భేషజాన్ని, స్వాతిశయాన్ని పక్కకు పెట్టాలి.
భగవత్ సన్నిధిలో మన ప్రార్ధనలుండవచ్చు. వ్యక్తిగా మనం అదృశ్యమైపోవాలి. అప్పుడే ఆ జగన్నాథునితో
అనుసంధానం ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితిలో మనం పరమేశ్వరుని ప్రార్థించాలి. అర్ధించాలి. భగవదనుసంధానం భగవదనుగ్రహం వల్ల సాధ్యపడుతుంది.
మన ప్రార్థనంతా భగవదనుసంధానం కోసమే. అనుగ్రహించడం ఆయన చిత్తం.
భగవంతుణ్ణి, ఆయన అనుగ్రహాన్ని, మనం ఆడంబరం తోటి, దర్పసహిత పూజాపునస్కారములతోటి కొనలేము.
మన నిర్మలాంతఃకరణము నచ్చినట్టు ఆయనకి మన మరే అర్చనా విధానము, పూజలు, అభిషేకాలు, చేయడం, ఇటువంటివి చేయించడం, తీర్థములలో ములగడం నచ్చవు. సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సకలాధినేత అయిన పరమేశ్వరుని దగ్గర మన యుక్తులు పనికిరావు.
ఆయన్ని ఏమార్చడం, మోసం చేయడం, "లంచమిచ్చి" ఆకట్టుకునే ప్రయత్నం చేయడం పసితనము, అమాయకత్వము, అజ్ఞానం, అతి తెలివితేటలు.
తేట మనసుతొ తత్త్వజ్ఞుని శరణు వేడడం, ప్రపత్తితో శరణాగతినొందడం తెలివైన పని. పెద్ద మనిషి తరహా.
సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ లయ బద్దంగా తన కరుణాదృష్టి మనపై ప్రసరిస్తాడు. ఆయన జ్ఞాని. ప్రజ్ఞానఘనుడు. సకలవేదాంత సంసిద్ధ సుతత్త్వుడు.
ఆయన మన తల్లి. మన తండ్రి, గురువు, స్నేహితుడు, స్వామి, బంధువు, మన దైవము.
ఆయన నామాన్ని సతతం స్మరిస్తూ విద్యుక్త ధర్మములను నిర్వర్తించడమే మన బాధ్యత. ఫలములనొసగడం ఆయన విద్యుక్త ధర్మము.
మోక్షః విష్ణు ప్రసాదేన వినా న లభ్యతే.
భక్తి ముక్తి కారకుడైన, వాటి ఫలదాయకుడైన పరంధాముని వినయపూర్వకంగా కొలిస్తే మనం అడగకుండానే ఆ శ్రియఃపతి, శ్రీగౌరీ సతి పతికి అద్వైతుడైన శ్రీమన్నారాయణుడు మన కోరికలు తీరుస్తాడు. మన యోగ, క్షేమములను వహిస్తాడు.
ఎటొచ్చీ మనం హృదయపూర్వకంగా నమ్మాలి.
దేవదేవునికి హృదయం అర్పించి మనసులో ఆయన సన్నిధిని అనుభవించాలి.
అప్పుడు మన కోరికలన్నీ తీరుతాయి. మన మనుగడ సుఖశాంతిప్రదమౌతుంది. పండుతుంది.
సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
ఏతత్ సర్వమ్ శ్రీపరమేశ్వరార్పణమస్తు!
************
The Science of Mind and Self

Mind
is particle in a box- restricted and hindered in operation. Self is
continuous issue of infrasonic waves of frequency between 3 Hz~10Hz
reflected as brain waves.
Mind is modulated Self and is not free and is hindered by cognition and communication of object-energy modulated psychic energy.
Self is demodulated Mind and is free flow of object-energy free psychic energy pulse series..

No comments:
Post a Comment