Wednesday, April 26, 2017

"తెలుగు" విశ్వవిద్యాలయాలు; శూన్యములు - "లేకుండుట" లోని ఉపయోగములు



"తెలుగు" విశ్వవిద్యాలయాలు

తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య ఎన్నో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. విశ్వవిద్యాలయము అంటే నిర్వచనము నకు అనుగుణంగా ఈ విద్యాలయాలు లేవు. కొందరికి ఉద్యోగాలు కల్పించడానికి తప్ప వీటిని స్థాపించడానికి వేరొక కారణం కనబడదు.
 
ఇప్పుడిప్పుడే స్థాపించిన విశ్వవిద్యాలయాలలోను, ఇదివరకు స్థాపించిన ఒకటి రెండు విద్యాలయాల్లోను
బోధించే శాస్త్రాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యం, కొన్ని సాంఘిక శాస్త్రాలు తప్ప మరే ఇతర శాస్త్రాలు బోధించబడడం లేదు. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక శాస్త్రాలు బోధించబడడం లేదు. పరిశోధనలూ జరగడం లేదు. గణిత భౌతిక రసాయన జీవ వృక్ష జీవ భౌతిక జీవరసాయన ఇత్యాది​శాస్త్రాలు అస్సలు తలవనైనాబడడం లేదు.
 
తెలుగు భాషలో వీలైనన్ని శాస్త్రాలు చదవాలని తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. ఆ అకాడమీ సభ్యులు, రచయితలు/రచయిత్రులు ఎంతో శ్రమకోర్చి, మరెంతో కృషి చేసి, ఎన్నో పారిభాషిక పదాలు తెలుగు భాషలో సృష్టించి ఎన్నో పుస్తకాలు ముఖ్యశాస్త్రము లన్నింటిలోనూ వెలయించారు. ఆ సృష్టి అమోఘమైనది. ఎంతో దీక్షగా ఒక క్రతువులా చేశారు.
 
ఇదంతా 1970 లలో జరిగింది. ఆ తర్వాత పడుకుంది. ఇంత వరకు లేవలేదు. తెలుగు భాషలోనికి అన్ని ముఖ్య శాస్త్రాలలో పుస్తకాలు తేవాలంటే ఎందరో నిష్ణాతులైన అనువాదకులు కావాలి. ఎంతో ధనం కావాలి. రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్న శాస్త్రాల అనువాదాలు తేవాలంటే విశ్రమించని అనువాద కార్యక్రమాలు నిత్యం జరగాలి. వీటిలో ఏదీ జరగడం లేదు. తెలుగు భాషలో శాస్త్రాధ్యయనం ఎలా వీలవుతుంది? కాని ఆంగ్ల మాధ్యమంలో చదువుకునేవారిని తెలుగు భాషా మాధ్యమంలో చదువుకోమని ఊదరకొట్టే; పనిలేని, విషయావగాహన, విషయ పరిజ్ఞానము, ఇంగితము లేనినెటిజన్లు తప్ప తెలుగు భాషలో ముఖ్యశాస్త్రములలో పుస్తకాలు రప్పించేందుకు ప్రయత్నాలు చేసే సత్తా ఉన్న మనుషులే లేరు.

ఇంచుమించు సుమారుగా ఏభై సంవత్సరాల క్రితం తెలుగు అకాడమీ తెచ్చిన శాస్త్ర అనువాదాలు తప్ప అనువాదాలు తేవడానికి మరొక ప్రయత్నమే జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇన్ని గంపెడు విశ్వవిద్యాలయాలు ఆ ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు. ఇందరు ఆచార్యులు, కులపతులు, మంత్రులు, తదితర సంబంధీకులు ఏం చేస్తున్నారో? పనికిరాని, ద్వేష, విద్వేషపూరిత రాతలు రాస్తూ, ఉపన్యాసాలిస్తూ సిద్ధాంత రాద్ధాంతాలలో మునిగి తేలడం తప్ప మరొక ప్రయోజనఠరమైన కార్యక్రమంలో పాలుపంచుకోని, పాలుపంచుకోలేని ఈ కుహనా మేధావుల అస్తిత్వం గందరగోళాలు, ఆవేశ కావేషాలు సృష్టించడానికి తప్ప మరెందుకూ పనికిరావటం లేదు.

విశ్వవిద్యాలయాలు పూనుకొని చేయవలసిన ఈ నిరంతర, మహా కార్యాన్ని, కార్యక్రమాన్ని మరెవరు చేయగలరు?
జ్ఞానం; తెలుగు సాహిత్యం, కొన్ని సాంఘిక శాస్త్రాలు బోధించటం​, వాటిలో ఏవో పరిశోధనలు చేయడానికి మాత్రం పరిమితం చేయబడడం; అంతకుమించి ఆలోచన, ఊహ, ప్రణాళిక, శక్తి యుక్తులు విశ్వవిద్యాలయాల ఆచార్యులకు, కులపతులకు, సచివులకు లేకపోవడం దురదృష్టకరమైన వాస్తవం.
 
ఈ నాటి ఆ యా స్థానాల్లో ఉన్న మనుషుల, ఆచార్యుల, తదితరుల శ్రద్ధాసక్తులు, ఒక పరిమితికి మించి లేకపోవడం, నిజాన్ని గమనించి, ఒప్పుకొని, తెలుగు విశ్వవిద్యాలయాల్లో గణితము, భౌతిక రసాయన జీవ వృక్ష జీవ భౌతిక జీవరసాయన, సాంకేతిక శాస్త్రాలు బోధించబడడం, వాటిలో పరిశోధనా అవకాశములు కల్పించబడడం జరిగితే, ముఖ్యశాస్త్రాలలో అనువాద గ్రంథాలు వెలువడడం జరిగితే ఇవి విశ్వవిద్యాలయాలు. లేకపోతే ఇవన్నీ పన్నులు కడుతున్న పౌరులకు గుదిబండలు. విశ్వవిద్యాలయాలు అనే పేరుకు సరిపోని, వన్నె తేని కొన్ని భవనసముదాయాలు, కొందరికి జీవనోపాధి కలిగించే సంస్థలు మాత్రమే.
************


శూన్యములు - "లేకుండుట" లోని ఉపయోగములు

శూన్యము అనే సంస్కృత పదానికి ఒకే అర్థం - లేకుండుట. ఈ లేకుండుట వివిధ శాస్త్రాలలో, తత్త్వాలలో ఎంత ఉపయోగకరమో పరిశీలిద్దాం. విషయబోధకంగానూ, సరదాగానూ ఉంటుంది.

సున్న:

శూన్యము అంటే సున్న అని అర్థం. సున్నకు ఏ విలువ లేదు. అలా విలువ "లేకుండుట" సంఖ్యాశాస్త్రంలో సున్న వలన ఎంత ఉపయోగమో మనందరికీ తెలుసు.

రిక్త ప్రదేశము:

శూన్యమునకు మరియొక అర్థం రిక్త ప్రదేశము అని. రిక్త ప్రదేశము - ఖాళీ ప్రదేశము - పదార్థాభావము - వల్లే పదార్ధము వహించ బడుతోంది.

పదార్ధము యొక్క ఘన, ద్రవ, వాయు స్థితుల ఉనికి శూన్యం ఉండడం వల్ల వీలవుతోంది.

అలాగే సాంకేతిక శాస్త్రంలో సెమి కండక్టర్ ఫిజిక్స్ లో ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రాను ఖాళీ చేసిన రిక్త ప్రదేశాన్ని "హోల్" అంటారు. ఈ హోల్ అవగాహన సృజించడం వలన ఈ సెమి కండక్టర్ ఫిజిక్స్, సెమి కండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఎంతో ఎదుగుదల జరిగింది. అలా ఎలక్ట్రాన్ "లేకుండుట" అనే ఆలోచన ట్రాన్సిష్టర్ ఎలక్ట్రానిక్స్ కి పాదు వేసింది. హోల్ పదార్ధాంశము కాదు. ఈ అవగాహన కలగడం వల్ల, హోటల్ ను "సృజించడం" వలన ఈ ఎలక్ట్రానిక్స్ లో ఎంతో అభివృద్ధి జరిగింది.

మనసు లేని, జగత్ కనుపింపని, వాసనలు ప్రకోపింపని స్థితి:

తత్త్వశాస్త్రం లో శూన్యము అనే ఆలోచన, అనుభవము ఎంతో గంభీరమైనది. గహనమైనది. విలువైనది. ఉపయోగకరమైనది. శాంతానందములు కలిగించేది.

శూన్యం పదాన్ని ఎక్కువగా బౌద్ధం తో ముడిపెడుతూ ఉంటారు.

ద్వైత స్థితిలో త్రిపుటి - జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము ఏర్పడి దృష్టిలో ఉంటాయి. జ్ఞేయమేమీ దృష్టిలో లేక జ్ఞాత, జ్ఞానం మాత్రమే దృష్టిలో ఉంటే అప్పటి స్థితిని శూన్యస్థితి అంటారు. ఇక్కడ శూన్యమయ్యేది జగత్ - విషయ, విషయానుభవ సమాహారం. ఏ తలపులు, అనుభవములు కలుగవు. దృష్టి విషయరహితంగా ఉంటుంది. శూన్యత దానిదే;  శూన్యత, దృష్టి (గమనిక) లోని జగత్ (విషయ, విషయానుభవముల) కు మాత్రమే.

ఈ స్థితిలో విషయాభావముంటుంది;  కాని గమనికా ఉంటుంది. అందుకే జగత్ శూన్యము అని తెలుస్తుంది. అలా జగత్ శూన్యస్థితిలో, గమనిక ఉండడం వల్ల, అది సహజ మానసిక స్థితి అవడం వల్ల శాంతము, ఆనందము అనుభవింపబడతాయి. మనసు ప్రసన్నంగా ఉంటుంది.

బౌద్ధులు శూన్య స్థితి అన్నది వేదాంతులు పూర్ణ స్థితి అన్నారు. పూర్ణస్థితిలో మనసుకు, తద్వారా జగత్ కు ఉనికి శూన్యం. అలా అది శూన్య స్థితి. మనసుండదు. మనసు "లేకుండుట" అలా వ్యక్తిత్వ రహిత స్థితిని అనుభవింపజేస్తంంది. వ్యక్తిత్వ రహిత స్థితియే మోక్షము. ముక్తి. నిర్వాణము. శాంతము. ఆనందము. మౌనము. శుద్ధజ్ఞాన స్థితి.


ఈ విధముగా, ఇన్ని విధములుగా శూన్యము మానవ జీవితంలో, శాస్త్రాధ్యయనం లో ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో మేలు చేస్తోంది.

ఏదైనా "ఉండడం" ఎంత ఉపయోగకరమో, "లేకుండటం" కూడా అంతే ఉపయోగకరం
.
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు!

Wednesday, April 19, 2017

భౌతికశాస్త్రం - అధ్యయనావగాహనలు - మొదటి, రెండవ భాగములు

భౌతికశాస్త్రం - అధ్యయనావగాహనలు - మొదటి భాగము

ప్రకృతి శాస్త్రాల అధ్యయనం, అవగాహన; వాటిలో పరిశోధన; తత్త్వశాస్త్ర అధ్యయనం​, తత్త్వ విచారము, అవగాహన, సమానంగా మనుషులను అంతర్దృష్టి మయులను చేస్తుంది. ధ్యాన పరులను చేస్తుంది. సంతృప్తి పరుస్తుంది. మహనీయులను చేస్తుంది. వేద ఋషులతో సమానమైన తత్త్వ దృష్టి విజ్ఞాన శాస్త్ర వేత్తలది. సాంఘిక శాస్త్రవేత్తలూ వారి జ్ఞానదృష్టిలో, జ్ఞాన సముపార్జనలో తత్త్వ వేత్తలకు సరిసమానులు. ఈ మాటల్ని ఛాందసులు
ఒప్పుకోకపోవచ్చు.


భారత దేశంలో తత్వం గురించి, సాంఘిక శాస్త్రాల గురించి విన్నంతగా భౌతికశాస్త్రం గురించి వినరు. పన్నెండవ తరగతి వరకు చాలా మందికి భౌతికశాస్త్రాధ్యయనం ఉంటుంది కాని అవగాహన ఉండదు. ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలొచ్చాక చదువుల రూపురేఖలే మారిపోయాయి.

దీక్షతో, పరిశీలనతో అర్థం అవ్వాలనే తలపుతో, కోరికతో, శ్రద్ధతో శాస్త్రాధ్యయనం జరగటం లేదు. భౌతిక శాస్త్రాధ్యయనం అసలు జరగటం లేదు. మనిషికి లలిత కళాప్రవేశం, వాటిలో కృషి, పరిపూర్ణత ఇచ్చిన ఆనందం
విజ్ఞాన శాస్త్రాధ్యయనం, వాటిలో కృషి, పరిశోధన వల్ల కూడా కలుగుతుంది.

ఎమ్సెట్ పరీక్ష కోసం, ఇతర సీట్ల ప్రవేశ పరీక్షల కోసం చదివే, "నేర్చే" చదువులు, బట్టీ మాత్రం పట్టి బుర్ర లోకి ఎక్కించాలనుకోవడం, పరీక్ష, రాయగానే చదివినది, "నేర్చినది" మర్చిపోవడాల వల్ల ఏ ఆనందం కలిగించలేదు.
కూలికి బరువు మోసే వాడు గమ్యస్థానం చేరగానే బరువు దింపేసి "హమ్మయ్య" అనుకున్నట్టు నేటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మాత్రమే భౌతిక శాస్త్రాధ్యయనం చేస్తున్నారు.

అంతటి అందమైన, బుద్ధికి పదును పెట్టే intellectual pleasure ఇచ్చే భౌతిక శాస్త్రాధ్యయనం ఈ పోటీ పరీక్షలకు మాత్రమే వెళ్ళేవాళ్ళకు, ఎద్దుకు అటుకుల రుచి తెలియనట్లు తెలియదు. అంతటి మహనీమైన భౌతిక శాస్త్రం ఉత్సుకత లేని పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో విలువ కోల్పోయింది. యవ్వనంలో ఉన్న అందమైన స్త్రీ దగ్గర కొచ్చి వగలుపోతూ, వయ్యారంగా చెంప గీటితే దాని భావం, సరసం తెలియని బాలుని వలె ఈ పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో భౌతిక శాస్త్రం, దాని అధ్యయనం రసాభాస పొందుతున్నాయి​.

జ్ఞానము బుద్ధి కుశలత కలవారినే వరిస్తుంది. బుద్ధి హీనులు ఆ సౌందర్యాన్ని, సొగసుని ఆస్వాదించలేరు.
ఇలాంటి చేతకాని, శ్రద్ధ లేని పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో రూపు, ఔన్నత్యం కోల్పోతున్న మహనీయ భౌతిక శాస్త్రం గురించి, దాని ఔన్నత్యం, ఉపయోగం గురించి కొన్ని కబుర్లు విజ్ఞానాత్మకంగా, బుధజన సహృదయ హృదయంగమంగా అందించడం ఈ వ్యాస పరంపర ఉద్దేశం.

ప్రొఫెసరు కందుల వి. ఎన్. శర్మగారు Kandula V N Sarma గారు ఈ విషయమై ఆసక్తికరమైన​పోస్ట్లు పెడుతున్నారు. వారు పాత, కొత్త భౌతిక శాస్త్రముల తారతమ్యం, ఆ అందాలు, "సమానత్వాలు", విభేదాల గురించి రమణీయంగా రాస్తున్నారు. వారి రచనలు నాకు ప్రేరణ నిచ్చి ఈ ప్రయత్నం చేయడానికి ఉత్సాహపరిచాయి. వారు IISc., Bangalore లో ప్రొఫెసరుగా ఉన్నవారు.

జ్ఞానమునకు, ఇంగితమునకు పేరెన్నికగన్న భారత దేశంలో ఇప్పటి చదువుల దుస్థితీ చర్చించబడుతుంది.

*************

భౌతిక శాస్త్రం - అధ్యయనావగాహనలు - రెండవ భాగము

విజ్ఞాన శాస్త్రం ఉపయోగాలు కోకొల్లలు. విజ్ఞాన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానంగా మారినప్పుడు ఈ ఉపకారం జరుగుతుంది. ఫక్తు విజ్ఞాన శాస్త్రం చదివేవారు జిజ్ఞాసతో చదువుతారు. విజ్ఞాన శాస్త్రం లేక సాంకేతిక పరిజ్ఞానం లేదు. కాని సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న ప్రాచుర్యం, గౌరవం విజ్ఞాన శాస్త్రానికి సామాన్యులు ఇవ్వరు. బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత కలవారే విజ్ఞాన శాస్త్రాన్ని తపస్సు చేసినట్లు అధ్యయనం చేస్తారు. ఆ అధ్యయనం ఒక తత్త్వానుభవం. యోగ్యులకే ఆ అందం అందుతుంది. విజ్ఞాన శాస్త్రం చదవడం, అందులోని విషయాలను అర్థం చేసుకోవడం ఒక ఆనంద యోగం. విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేయడం దివ్యానుభవం పొందడం.

ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రంగా పిలువబడుతున్న ప్రకృతి శాస్త్రములు గ్రీక్ వేదాంతులు ప్లాటో, అరిస్టాటిల్ ల తో మొదలై​ ఇంత శాఖోపశాఖలుగా విస్తరించింది. గణితము, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, జీవభౌతిక, జీవరసాయన శాస్త్రములు ఆదిగా అభివృద్ధి చెందింది. వీటినుంచి ఎన్నో ఉపశాఖలు ఆవిర్భవించాయి. సాంకేతిక శాస్త్రపరంపరా ఈ ముఖ్యం విభాగాలనుంచే జనించింది. మహా మేధావి తత్త్వవేత్త అయిన సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో, అతని శిష్యుడైన అరిస్టాటిల్ మొదట్లో అన్ని విభాగాల్లో ప్రవేశం కలిగి వేదాంతం మొదలు ప్రకృతి శాస్త్రాలు వైద్య, శరీరశాస్త్రాలు అన్నింటికీ ఉపయోగకరమైన విషయాలను అందించారు.

అరిస్టాటిల్ గుండె అన్ని శరీర మానసిక కార్యకలాపాలకు కేంద్రం అని నమ్మాడు. ఇప్పుడు మనం మెదడు ఈ కార్యకలాపాలకు కేంద్రం అని చదువుకుంటున్నాము.

తత్త్వము, గణితము, వైద్యశాస్త్రం, ఫిజిక్స్ కెమిస్ట్రీ జీవశాస్త్రాలు అనే విభాగాలు రాను రాను ఏర్పడ్డాయి. ఇవి మరింతగా విడిపోయాయి. శాస్త్రవేత్తలు అలా‌ వారి పరిశోధనా రంగంలో సబ్జెక్ట్ పరిధి విషయంలో బాగా కుదించుకుపోయారు. ఎన్నో ప్రత్యేకత రంగాలు ఏర్పడ్డాయి. ఇవి చాలా చాలా సూక్ష్మమై పోయాయి. సబ్జెక్ట్లు బాగా కుంచించుకుపోయాయి.

దురదృష్టవశాత్తూ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు మేథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కావలసిన అవసరమైన ముఖ్యమైన సబ్జెక్టులు అనుకోరు. వాళ్ళ మీదకి బలవంతంగా రుద్దబడిన మోయలేని భారం అనుకుంటారు. ఆ సబ్జెక్టులకి, వాటిని బోధించేవారికి కూడా గౌరవం లభించడం ఒక అరుదైన విషయంగా తయారైంది. కొన్నాళ్ళలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ సబ్జెక్టులు తీసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎందుకంటే ఇదివరకు మెడిసిన్ చదివేవారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు చదివేవారు. మెడిసిన్ ఫీల్డ్లో రోగ నిర్ధారణకు ఎన్నో ఉపకరణాలు వాడతారు. అవన్నీ ఫిజిక్స్ కలిగించిన అవగాహన మీద ఆధారపడి అభివృద్ధి చేసినవే. ECG, Ultrasonics, electronics, X-RAY, many types of scanners, ఇలాంటి ఎన్నో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇచ్చిన అవగాహన మీద ఆధారపడి పనిచేసేవే. మందులన్నీ రసాయనములే. అవి పనిచేసే విధము కెమిస్ట్రీ చదివితే గాని అర్థం కాదు.
కాని ఎలా జరిగిందో, ఈ మెడికల్ కౌన్సిల్ అవీ ప్రేక్షకపాత్ర వహించి ఎందుకు ఊరుకున్నాయో మెడిసిన్ చదివేవారు ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవటం లేదు. వైద్యం చేసే డాక్టర్ అన్ని ఇన్స్ట్రుమెంట్ల, మందుల పనిచేసే విధము కూలంకషంగా తెలుసుకోనక్కరలేదు. కాని ఫండమెంటల్స్ తెలుసుకోవడం అవసరం.

కాని మన దేశంలో మనకి మనమే మినహాయింపులు ఇచ్చేసుకున్నాము. మిగతా దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరప్, జపాన్ కొరియా చైనాలలో ఇంత ఉదాసీనత, బద్ధకం, చదువు పట్ల అగౌరవం, అలక్ష్యం, అశ్రద్ధ, చల్తా హై ధోరణి ఉండవు. అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకుంటారు. అక్కడ ఎకడమిక్స్, దానికి సంబంధించిన చదువులు అందరూ చదవరు. 12వ తరగతి అయిపోగానే తమకు శ్రద్ధ, ఇష్టం ఉన్న ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఒక జీవికను ఏర్పరచుకుంటారు. ఆ జీవికనిచ్చే దానికోసమే శ్రమ పడతారు. డబ్బులు సంపాదించుకుంటారు, తమ ధోరణిలో జీవిస్తారు.

మనం, మన పిల్లలూ కూడా దేనికి రాజా లాంటి ఉద్యోగాలు వస్తాయి అందులో జేరాలి అనుకుంటాము.
ఆ కోర్సు మనకి ఇష్టం లేకపోయినా అమితంగా డబ్బు ఖర్చవుతున్నా గొఱ్ఱెదాటు వ్యవహారం గా కోచింగ్ లో చేరి
ఆ తర్వాత కోర్సు లో చేరి సర్టిఫికెట్ అనే కాగితం ముక్క సంపాదిస్తాము. అది ఉద్యోగం తెచ్చినా తేకపోయినా
గతిలేక నాలుగు వేలకో, ఐదు వేలకో ఓ "ఉద్యోగం" లో చేరతాము. కళ్ళుమూసుకుని విషంలా ఆ under and inadequate earning employment లో జీవితం గడిపేస్తాము.

రిజర్వేషన్లు ఉన్నవారు వాళ్ళ తాత తండ్రులు చేసిన వృత్తి ఆధారంగా, ఆ వృత్తితో ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం లో చేరతారు. ఆ రిజర్వేషన్లు తమ పుత్ర పుత్రికా, పౌత్ర, పౌత్రి, దౌహిత్ర, దౌహిత్రి పర్యంతం అనుభవిస్తూ తమ కులంలో వెనుకబడిన వారు అలాగే అత్తెసరు బ్రతుకులు ఈడుస్తుంటే ఏమీ పట్టనట్టు, పట్టించుకోకుండా రిజర్వేషన్లు వాళ్ళకు అందకుండా తామే తరతరాలుగా అనుభవిస్తారు.

ఇదే విధంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగి మేథ్స్​ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్ని తీసేసినా నేను ఆశ్చర్యపోను. పరీక్షల్లో డిటెన్షన్ తీసేసేక భారత దేశంలో చదువులు వాటి ప్రభావం, ప్రాముఖ్యం అడుగంటాయి. చదువుల్లో చేరడమనేది ఉద్యోగం కోసం అని నిశ్చయించేసుకొని సబ్జెక్టులు ఏమీ నేర్చుకోకుండా ఒక కాగితం ముక్క చేతపట్టుకొని హై ఫై ఉద్యోగాలు వాళ్ళ జన్మహక్కనుకొని ప్రభుత్వాలను నిలదీయడం, ఈ ప్రభుత్వాలను నడిపే; ఏ విధమైన జ్ఞానం, పరిజ్ఞానం, చదువుపై అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం లేని శుద్ధ ఎద్దు మొద్దు స్వరూపాలైన రాజకీయ నాయకులు ఈ పెడ ధోరణులకు వత్తాసు పలుకడం.

అర్హత లేకుండా అందలాలు ఎక్కాలనుకునే వారికి, కుల ప్రాంత, మత, లింగ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి గారాబం చేసే దౌర్భాగ్యపు వ్యవస్థ ఏలుతున్న నేడు సబ్జెక్ట్ కూడా నేర్చుకోండి అనడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరూ వినరు కూడా.

ఇటువంటి స్థితిలో మా లాంటి వాళ్ళం చదువు, విజ్ఞానము, వాటికి మర్యాద, గౌరవం ఇస్తూ, శ్రద్ధ, లక్ష్యం చూపిస్తూ చదువుకోమనడం, శాస్త్రాలు​ నేర్చుకోమనడం, వాటిపై అవగాహన, పట్టు కలిగి ఉండడం గురించి మాట్లాడటం చాదస్తమే.

అయినా ఎంత ఆకలేసినా, ఎవరేం చేసినా, అనుకున్నా ఆవు గడ్డి మేసే బ్రతుకుతుంది. మాంసం తినలేదు. అలాగే సింహమూ గడ్డి తిని బ్రతక లేదు.

రిజర్వేషన్ల భారతం; మన పోస్ట్లు - మన వికాసము

రిజర్వేషన్ల భారతం

భారత దేశంలో రెండు రకాల పౌరులుంటారు. రిజర్వేషన్లు ఉన్నవారు, రిజర్వేషన్లు లేని వారు. రిజర్వేషన్లు ఉన్న వర్గాల శాతం 50 కి మించకూడదని‌ సుప్రీంకోర్టు తీర్పు. అయినా దీనిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ శాతం ఎనభైకి చేరింది. ఇంకా పెరగవచ్చు.

ఇలా కుల రిజర్వేషన్లు కల వర్గాల శాతం ఏదో ఒక రోజున 98 కి చేరవచ్చు. అలా ఒక 2 శాతం మాత్రమే రిజర్వేషన్లు లేని వర్గాలు ఉంటాయి. ఈ రెండు శాతాన్ని మైనారిటీ (తక్కువ సంఖ్య) అనరు. మైనారిటీ పదం మత ప్రాతిపదికన ఉపయోగిస్తున్నారు. ముస్లిములు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు కూడా ఈ ప్రాతిపదికన మైనారిటీ ముద్ర వేయబడిన వారు.

భారత దేశం మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం కాదు. రాజ్యాంగం ఏ మతాన్ని అనుసరించి కూర్చబడినది కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మతాన్ని, ఆ మాటకొస్తే కులాన్ని, ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడకూడదు. కాని దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కుల, మత, ప్రాంత ప్రాతిపదికన కొన్ని వర్గాల పౌరులను ప్రత్యేకంగా చూస్తూ గారాబం చేసే దౌర్భాగ్యపు సంస్కృతిని రాజకీయ నాయకులు ఏర్పరచారు.

ఇలా కుల, మత, ప్రాంత ప్రాతిపదికన​ కొన్ని వర్గాల పౌరులను ప్రత్యేకంగా చూస్తూ గారాబం చేయడం రాజకీయ పార్టీల, నాయకుల, రాజ్యాంగంలో లేని, (రాజ్యాంగ విరుద్ధమైనమైన) హక్కుగా పరిణమించింది.

రాజకీయ నాయకులు పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తూ రిజర్వేషన్లని మరింతగా పెంచుతున్నారు. వీరికి, వీటికి అడ్డూ, అదుపూ లేవు. రిజర్వేషన్లు అనుభవించిన వారే తరతరాలుగా రిజర్వేషన్లు అనుభవిస్తూ అడుగున ఉన్న తమ వర్గీయులకు అందకుండా చేస్తున్నా మాట్లాడే ధైర్యం, న్యాయదృష్టి ఉన్న రాజకీయ నాయకులు, పార్టీలు లేవు.
ఎంతసేపూ భేదాలను వాడుకుంటూ, కుల, మత, ప్రాంత ఇత్యాది ప్రాతిపదికన పౌరులను విడదీసి ఓట్లు, పదవులు పట్టేస్తున్న రాజకీయ కునాయకులు దేశానికి, పౌరులకు ఎంతో ద్రోహం చేస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట, అంతూ లేవు. వీరు, రిజర్వేషన్లు కావాలనే వర్గాల వారు, రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాల వారు దేశప్రతిష్ట, అభివృద్ధి, హుందాతనం తోటి పౌరుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు.

రిజర్వేషన్లు లేక మిగిలిన రెండు శాతం వర్గాల పౌరులను ఈ దుష్ట నాయకులు పట్టించుకోరు. ఈ పౌరుల జీవితాలు ఎంతో దుర్భరంగా గడుస్తున్నా ఈ దుర్మార్గపు నాయకులకి, పార్టీలకి పట్టదు.

రిజర్వేషన్లు ఉన్న వర్గాలు, లేని వర్గాలు కూడా జీవితాలను ఎంతో కష్టపడి ఈడ్చుకొస్తున్నారు. అర్హత లేని వారిని అందలాలెక్కిస్తామని ఆశ పెట్టి, భ్రమ పెట్టి, వెఱ్ఱి వెధవలను చేసి ఎవరికీ, ఏ వర్గానికి, మతానికి ఏమీ అందించక, ఏ సహాయమూ చేయక, చేయలేక, చేసే ఉద్దేశం ఎంత మాత్రమూ లేక కేవలం తీయని మాటలతో, మోసపు వాగ్దానాలతో అందరినీ, అన్ని వర్గాల పౌరులను భ్రమ భ్రాంతులకు లోను చేసి, తాము, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అయిన వాళ్ళు, అనుయాయులు కుమ్మక్కై దేశాన్ని, పౌరుల జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నారు.
రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఏమీ ఒరగటం లేదని, ఏ లాభం కలగటం లేదని, రాజకీయ నాయకుల ఎత్తులకు మనమంతా, వర్గ, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఇడుముల పాలవుతున్నామని గ్రహించిన మరుక్షణం ఈ భేదనీతి నశించి మనం, దేశం అభివృద్ధి పథంలో ఉత్సాహంగా అడుగులు వేస్తాము.

అది లేనంత వరకు ఇలాంటి రిజర్వేషన్లను 150 లేదా 200 శాతానికి పెంచి రాజకీయ నాయకులు, తమ వంశ పారంపర్యంగా మనలను ఇలా "పాలిస్తూనే" ఉంటారు. తమ పబ్బం, తమ కుటుంబ సభ్యుల పబ్బం; ధనం, ఆస్తులు, అధికారం సంపాదించుకుంటూ; గడుపుకుంటూనే ఉంటారు. కల కాలం "ఐశ్వర్యం" తో తులతూగుతూ, తూలుతూనే, అధికార మద్యం తాగుతూ, చిత్తం వచ్చినట్లు ఏలుతూ ఎదుగుతూ ఉంటారు. మనం ఇలాగే ఒదుగుతూ, దారిద్య్రంలో బతుకులను ఈడుద్దాం.

**********

మన పోస్ట్లు - మన వికాసము

రామాయణ,, మహాభారతాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు, గజిబిజి రాతలు, ఇతరులకు సలహాలివ్వడం, ఇవన్నీ మనం రామాయణ మహాభారతాలు సూచించినట్లు జీవించకపోతే; ఈ పనులన్నీ చేతలుగా మార్చుకోలేకపోతే కంఠశోష, వృథా ప్రయాస. ఇవన్నీ ప్రహసనాలై నిరుపయోగం అవుతాయి.
జనాలని ఇబ్బంది పెడతాయి. పిలవని పేరంటంలా తయారై చిరాకు కలిగిస్తాయి.

ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రసాహిత్యము ఇతరులకు సలహాలివ్వడానికి కూర్చబడలేదు. మనం ఆచరించడానికి ఉద్దేశింపబడ్డాయి. అవి ఆచరించేవారికే ప్రవచనాధికారం ఉంటుంది. అవి కేవలం చదువుకొని, వాగాడంబరంతో ఉపన్యాసాలిచ్చేవారికి, వ్యాసాలు రాసేవారికి, పోస్టింగులు పట్టేవారికి ఉద్దేశించబడలేదు.
మనం ఆచరిస్తే మన మాటలకు విలువ ఉంటుంది.

లేకపోతే తనకు మాలిన ధర్మంలా నిరుపయోగంగా పడి ఉంటాయి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చే వారు మాతృ, పితృ భక్తుల గురించి మాట్లాడటం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోపం తెప్పించిందూ?! ఇతరులను బాగు చేయాలనే తపనలో సహస్రాంశం మనని మనం సరిదిద్దు కోవడంలో ఉంటే ఈ మాటల, రాతల, ఉపన్యాసాల, పోస్ట్ల బెడద నుంచి ఇతరులను రక్షించినవారవుతారు కదా!

సత్యం చెప్పక, అన్నమాటకు నిలబడకుండా, సత్య హరిశ్చంద్రుని గురించి చెప్పరాదు. తనపై తనకు నమ్మకం లేక, జ్ఞానము, ధర్మ, బుద్ధి సూక్ష్మతలు తెలియక కృష్ణ పరమాత్మ విషయం పలుక రాదు. భీష్ముని లా తండ్రి కోసం త్యాగం చేయలేకపోతే ఎందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోమని ఇతరులను సతాయిచడం!? అలాగే రామాయణ మహాభారతాలలో కల మంచి, వీరోచిత పాత్రల నైజాలను, ఇతర పాత్రల గురించి వ్యాస, వాల్మీకుల సృష్టి, దృష్టి లను మించి వాచాలతతో మాట్లాడరాదు.

ఇతరులను బాగుచేసెయ్యాలనే యావ మన ఎదుగుదలకు ఉపయోగించదు. అన్ని గ్రంథములను, వాటి పఠనమును మన మానసిక, బుద్ధి వికాసములకై, సద్వర్తనమునకై వినియోగించు కోవాలి. ఇతరులను ఉద్ధరించడానికి మాత్రం కాదు.

Cause for celebration; Economic offenders and "asylum"



Cause for Celebration

Ministers not resigning when courts found them enough "criminal" and "accused" in corruption cases, other type of cases going on in various courts is very bad precedent; which is being indulged by every political party and the chief ministers themselves are fighting corruption, criminal, economic offence cases without resigning with impunity is very ridiculous and is giving very bad name for Indian democracy.

Fraudsters, criminals, offenders of various types even using constitutional positions to avoid legal proceedings is a sad and dangerous reality of Indian political leaders. 

None cares for proprietary and is not at all ashamed that they are in and out of jail. And the voters electing such characters again and again is shameful implementation of democratic process in India. All other elite criminal citizens are faithfully imitating their political peers’ behavior and none from these gangs of offenders not respecting Indian democracy and legal proceedings is very unpleasant commentary on Indian nationals and nation. 

Very advanced from these gangs even claim they are innocent as they won in the people's court by getting elected again cases against them must be withdrawn.

Let us celebrate our fellow voters and the kind of representatives and rulers they elect.

***********


Economic offenders and "asylum"

UK, other European countries, the USA have been welcoming and giving asylum to all kinds of terrorists of many third world developing countries, in the name of human rights' protection. Now many economic offenders and fraudster of many kinds are also getting asylum in the UK again in the name of human rights' protection.

The problem with many western countries is their arrogant feeling that they are champions of human rights' protection and implementation.

This arrogance makes them not able to understand and appreciate the necessities of other countries when criminals commit offences in respective countries and take asylum or reside there fleeing law enforcing agencies and judiciary of that country making fun of that countries' attempt to repatriate financial fraudsters and economic offenders.

UK law and judicial process must also consider the view of governments also and not just caring for non-violation of human rights when they are repatriated to their respective countries where they committed the fraud and feeling "secure" by fleeing their countries and settling in the UK or other western countries.

Malyas, Modis are enjoying the same patronage as criminals, terrorists and other inhuman gangs is a sorry state of affairs prevailing in the UK and other western countries.

The west has been at the receiving end by terrorists and terror organizations only recently, 9/11. Hope the west helps by repatriating criminals of all hues and colors to respective to their respective countries.

Giving refuge and asylum to economic, terror related individuals and gangs unmindful of the severity of their offenses. Wish wisdom prevails UK and the rest of western countries before they become victims of these offenses.

*************

Moral authority is the highest authority. The authority of the government, rowdyism, criminals, terrorists, money, and other materialistic authorities have to sub-serve the moral authority. Revolutions of lasting nature are brought out by righteous people with their moral and spiritual traits.

 

Monday, April 17, 2017

చదువులు - ఆక్రందనలు; మనసు; Social causes; The Meditation



వసంతం ఋతువు కాదు. వసంతం శృంగార హేల. ఉత్సాహ ఉత్సవం. మళ్ళీ జనించుటయో, మనిషి వ్యక్తిత్వం కరిగిపోవడమో‌ వసంతమైతే అది నిత్య సంతోషం.
***********

చదువులు - ఆక్రందనలు

ఇంటర్ రిజల్ట్ రాగానే ప్రతి గృహంలోనూ విరిసే దుఃఖ వాతావరణాలు, పిల్లలకు మంచి మార్కులు వచ్చినా, ఎంతకూ సంతృప్తి పడక సర్వం కోల్పోయినట్లు ఆర్తనాదాలు, ఏ ధ్యానంలో కూర్చుంటే ఉపశమనం ఇస్తాయి?
ఎక్కడ కూర్చున్నా ఒకటే. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యే వచ్చి మరొక భగవద్గీత చెప్పినా ఇంతే. లోపం తల్లిదండ్రులలో ఉంది. ఈ చదువులు ఏ విధమైన జీవికనూ‌ ఈయలేవు, ఈయటంలేదు అని రోజూ చూస్తూనే ఉన్నా అర్హత లేని అందలాలు ఎక్కించాలనుకోవడం; ఎవరో చెప్పినట్టు కోచింగ్ సెంటర్ వాళ్ళని కోటీశ్వరులని చేయడానికి మాత్రమే ఈ హడావుడులు ఆక్రందనలు.

టపాకడుతున్న మనుషులు రోజూ కళ్ళముందే కనుమరుగవుతున్నా, తాము మాత్రం ఇక్కడే కలకాలం తిష్టవేసుకుని కులుకుతామనుకునే వెఱ్ఱి తనం వంటిది ఈ యావ.
 
జీవిక కోసం సరియైన ప్రత్యామ్నాయం దొరికే వరకు ఈ విద్యావ్యవస్థ ఇలాగే భ్రష్టు పట్టిపోయి ఉంటుంది. ఏ విచారము, మీమాంసా బుర్రలకెక్కవు. జ్ఞానానికీ, ఇంగితానికి ఆలవాలమైన భారతదేశంలో ఈ అవ్యవస్థ చోటుచేసుకోవడం, దరిమిలా ఈ ఆక్రందనలు శోచనీయం. బాధాకరం.

****************
మనసు

మనసు ఊహల‌ అపోహల మయం. వరుస. తలపులు, ఆలోచనలు వచ్చి కనుమరుగవడమే మనసు రూపము, స్వరూపము, స్వభావము. తలపులు, ఆలోచనలు, లేక, కలుగక మనసుకు ఉనికి లేదు.
మన మానసిక స్థితినుంచి - అనుభవములు, జ్ఞాపకములు - వాసనలు, అర్థస్పృహలు, వెతలు, వేదనలు, రక్తి, భక్తి, విరక్తి, వైరాగ్యము, భయములు, ఆందోళనలు, మానసిక స్థితులు - మానసిక గతికి - తలపులు, ఆలోచనలు - మానసిక గతులు - మారడమే మనసు ఉదయించడం, ఉనికిని పొందడం.
 
మానసిక గతి నుంచి మానసిక స్థితికి మారే ప్రక్రియనే ధ్యానము అంటారు. మనసు అంతర్ముఖం - అయ్యేలా ప్రయత్నించడమే ధ్యానం చేయడం.
*********
Social causes

Social causes need ground level workers; the efforts to be realized. Celebrities and arm-chair supporters though swarm the sites their use is limited. Social activists can not replace politicians. Unless politicians support, no reformation is possible. When citizens as voters support politicians of all colors and like to be exploited by accepting cash and freebees, nations suffer from corruption and nepotism.

***********

The Meditation 

Meditation is a process reverse to the process of generation of thoughts. Thought process happens from within to without. Meditation is mind turning to within from without. Thought processes starts as one thought relating to me and mine and scatters in many ways. Meditation starts among many thoughts and by studious and intense focusing of mind gets reduced to a single thought. At the appropriate moment even that single thought disappears and mind becomes serene sans any mental functioning. 

The state of mind sans mental functioning is called unoccupied awareness. This is also termed as pure consciousness, content-free contentment, state of peace, state of bliss, state of silence and Divine consciousness.

Meditation is doing any work with a concentrated mind.