Friday, May 20, 2016

శ్రీకృష్ణపరమాత్మ మాట వినని మనం; తెలుగు సినీ రంగం; రచనలు - రచయితల బాధ్యతలు



 శ్రీకృష్ణపరమాత్మ మాట వినని మనం

శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ప్రేమగా, అనునయంగా, స్నేహభావంతో మన కొఱకై తక్కువ ఖర్చుతో లేదా‌ ఖర్చేమీ లేకుండాసులభంగా తనను ఎలా అర్చించవచ్చో తెలిపినా, మన మన అహంభావములను, ఆడంబరములను, "ఐశ్వర్యాన్ని", డబ్బును, దస్కావ్ని విపరీతంగా ఖర్చు చేస్తూ భగవంతుణ్ణి కొలవడానికి బదులు కొనడానికి ప్రయత్నిస్తున్నాము.
 
అంతే తప్ప పరమాత్మ చెప్పినట్టు ఫలం, పత్రం, పుష్పం, తోయములతో మనః పుష్పాన్ని కూడా‌ జతచేసి పరంధాముని అర్చించడం మనకి నామోషీ. ఆయనకు ఈ మన వెఱ్ఱిలు తెలియవా ఏమి? మనం మనసు పెట్టక ఆడంబరంగా చేసే అర్చనలు స్వీకరించాలో, వద్దో, మన మనఃపరిపాకాన్ని బేరీజు వేసి నిర్ణయించుకుంటాడు. పరమాత్మను మించిన న్యాయమూర్తి లేడు.
 
ఆర్తుడు, జిజ్ఞాసువు, కోరికలు తీరాలనుకునే వాడూ, మోక్షార్ధి తనను కొలిచే వారిలో, తలచే వారిలో రకాలని ఆయన భగవద్గీతలో స్పష్టంగా‌ పేర్కొన్నాడు, అయినా, రోజూ భగవద్గీత పారాయణం చేస్తున్నా, భగవద్గీత గురించి ఉపన్యాసములు వింటున్నా మన దారి మనదే. మన అజ్ఞానము‌మనదే. భగవంతుడే మన దారికి రావాలి గాని మనం ‌పరమాత్మ చెప్పినట్టు అస్సలు నడుచుకోము.

అయినా ఆయన మనలను కాయాలనీ, మనం కోరిన కోర్కెలన్నీ తీర్చి తీరాలనీ మన పట్టు. భగవంతుడు కరుణామయుడు కూడా కనక మన ఆటలు సాగుతున్నాయి.
 
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః!
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః!

 2. తెలుగు సినీ రంగం


తెలుగు సినీ రంగాన్ని రెండు, మూడు కులములకు చెందిన కుటుంబములు ఏలుచున్నవి. సినిమా తీయడం ( technically) ఎంతో తేలికైన ఈ రోజులలో ఎవరైనా యువతీయువకులను ఊపేసే సినిమాలు తీసెయ్యవచ్చు.
సంగీతము, సాహిత్యము, నటన, ఆహార్యము, సంభాషణా గరిమా పక్కకు పెట్టి boy meets girl type సినిమాలు titilling songs, రెండు, మూడు hot and bold scenes తో , కొట్లాటలు, పోట్లాటలతో సినిమా అయిందని అనిపిస్తున్న నేడు నటీనటులు, దర్శకుడూ ఎవరైనా పరవాలేదు.
 
నిర్మాత ఒకడు తయారై లేదా ఈ కుటుంబముల వారే స్వంతంగా, ఈ కులముల కుటుంబ సభ్యులతో తీసే సినిమాలే సినిమాలయినా; ఏమి తీసినా, ఎలా తీసినా జనం విరగబడి చూసేస్తున్నారు.

కొండొకచో చరిత్రను, ప్రాచుర్యమున్న కథలనూ సినిమాగా తీసే ప్రయత్నంలో మూల కథను, మూల తత్త్వాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చెయ్యడమూ సరదా అయింది. ఇది ఎవరికీ పట్టటములేదు. పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికీ లేదు.
 
వినోదావ్ని వెఱ్ఱితలలు వేయిస్తున్న సినీ ప్రముఖులకు అడ్డూ, ఆపూ లేవు. అభిరుచిని మనం మార్చుకున్నామా? సినిమా వాళ్ళు మార్చేశారా అనేది గుడ్డు ముందా? పిల్ల ముందా? విత్తు ముందా? చెట్టు ముందా వంటి‌ ప్రశ్నలకు సమాధానములలా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేనివి.

కానీ ఈ హడావుడిలో మన సినిమాలు రెండు, మూడు కులములకు చెందిన కుటుంబ సభ్యుల చేతులలో ఇరుక్కుపోయాయి. సినిమా తీయడం చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారము. భారతదేశపు ఎన్నికల వలె సామాన్యులకు, పేదలకు అందనివి. రాజకీయము, సినిమా ఆధునిక భారత దేశంలో కొన్ని కులములకు చెందిన కుటుంబములకు పరిమితమైపోయి అధ్వాన్నం అయిపోవడం భారతీయుల స్వయంకృతాపరాధము.

3. రచనలు - రచయితల బాధ్యతలు


రచనలు చేయడం, కవితలల్లడం వృత్తి కాదు, ప్రవృత్తి. రచనా వ్యాసంగము, కవితాసృష్టి ప్రకృతీ ధర్మములు. ఋషితుల్యులే సమాజానికి ఉపయోగపడే, చిరకాలం నిలిచే రచనలు చెయ్యగలరు. కావ్యసృష్టి తపస్సు. కావ్యము తపఃఫలము.
 
మాట తూటాలానూ, ఉపశమనం కలిగించే బామ్ లానూ ఉపయోగపడుతుంది. మన ప్రవృత్తిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతాము. రచనలూ చేస్తాము. కవితలు అల్లుతాము. అవి శాంతిని పెంచవచ్చు. పంచవచ్చు. లేదా శాంతిని భంగపరచవచ్చు.
 
రచయితలు, కవులు ఎంతో బాధ్యతాయుతంగా రచనలు చేయాలి. సంఘంలో ద్వేష విద్వేషములను కలిగించరాదు. పెంచరాదు. లేనిచో సంఘమున శాంతిభద్రతలు కరవై ప్రజలు అలమటింతురు. సుఖశాంతులు కోల్పోదురు. కష్టములు పడెదరు.
 
అందువలన రచయితలు, కవులు, వీరి వంటి మేధావులు
బాధ్యతాయుతముగా వర్తించెదరు గాక! ప్రవర్తించెదరుగాక!

2 comments:

  1. Prapanchamulo dabbe praamukhyamuga unnapude mana manch maatalu aranya rodhama?

    ReplyDelete
  2. Prapanchamulo dabbe praamukhyamuga unnapude mana manch maatalu aranya rodhama?

    ReplyDelete