గురివిందలు - పెద్ద పరీక్ష
రాయికి మ్రొక్కెదరు కొందరు; రప్పకు తల
వంచెదరు ఇంకొందరు; సిద్ధాంతములకు
మ్రొక్కెదరు మరికొందరు; అందరు ఇతరులను
నిరసించెదరు, విమర్శంచెదరు తమ్ము
పొగుడు కొనుచు; తమ తమ మతములను
సిద్ధాంతములను ప్రచారములు చేయుచు;
విగ్రహారాధనను నిరసించు మేధావులు తమ
సిద్ధాంత కర్తలకు విగ్రహములు నిర్మించెదరు
నాలుగు రోడ్ల కూడలిలో; తమ తమ
సమయము, శక్తినంతయు ఇతర మత, సిద్ధాంతములను
తెగడుటకు వృథా చేయుదురు; తాము నమ్మిన
దానిని అనుసరించనే అనుసరించరు;
గురివింద గింజలు; మేధావులు, మత గురువులు ఆశ్రమ
నిర్వాహకులు; మతమంటే ఇష్టమని తెలియదు
వీరికి; ఆచారములు, మత నిర్దేశనలు గొఱ్ఱెల వలె
పాటించుట మతమని వీరి అజ్ఞానము, భ్రమ,
భ్రాంతి; తత్త్వము వంటబట్టని మతఛాందసములు
సంఘమునకు బరువులు; తత్త్వావగాహన లేని
మతాచార అనుసరణము, ఆచార వ్యవహార
నిర్వహణము భగవంతుని వద్దకు చేర్చలేవు;
తత్త్వజ్ఞత లేని మతానుసరణము, సిద్ధాంత
రాద్ధాంతములు సంఘమునకు చేటులు;
పెద్ద పరీక్ష
అవినీతిని మరిగి, అన్యాయముగ "వెనకేసిన"
డబ్బు దస్కముల, పొగరుతో దేవునికి విసరు,
వెదజల్లు, "భక్తుల" ప్రార్ధనల ఆలకించి మేలు
చేయవలసి వచ్చుట భగవంతునికి పెద్ద పరీక్షయే!
సిద్ధాంత కర్తలకు విగ్రహములు నిర్మించెదరు
నాలుగు రోడ్ల కూడలిలో; తమ తమ
సమయము, శక్తినంతయు ఇతర మత, సిద్ధాంతములను
తెగడుటకు వృథా చేయుదురు; తాము నమ్మిన
దానిని అనుసరించనే అనుసరించరు;
గురివింద గింజలు; మేధావులు, మత గురువులు ఆశ్రమ
నిర్వాహకులు; మతమంటే ఇష్టమని తెలియదు
వీరికి; ఆచారములు, మత నిర్దేశనలు గొఱ్ఱెల వలె
పాటించుట మతమని వీరి అజ్ఞానము, భ్రమ,
భ్రాంతి; తత్త్వము వంటబట్టని మతఛాందసములు
సంఘమునకు బరువులు; తత్త్వావగాహన లేని
మతాచార అనుసరణము, ఆచార వ్యవహార
నిర్వహణము భగవంతుని వద్దకు చేర్చలేవు;
తత్త్వజ్ఞత లేని మతానుసరణము, సిద్ధాంత
రాద్ధాంతములు సంఘమునకు చేటులు;
పెద్ద పరీక్ష
అవినీతిని మరిగి, అన్యాయముగ "వెనకేసిన"
డబ్బు దస్కముల, పొగరుతో దేవునికి విసరు,
వెదజల్లు, "భక్తుల" ప్రార్ధనల ఆలకించి మేలు
చేయవలసి వచ్చుట భగవంతునికి పెద్ద పరీక్షయే!
No comments:
Post a Comment