
౧. కల్లోలిత సరసిని కనిపించదే ప్రతిబింబము
నిలువదు సంక్షుభిత హృదయమున నీ మూర్తి
మదినిండ నిండి నెమ్మది నిమ్ము
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౨. నాసికాత్రయంబకమున నాజూకుగా మొదలై
మరటాంధ్ర సీమల ఏరుల సెలయేరుల కలుపుకు నదిగ మారి
భద్రగిరి రాముని పాద పద్మములకు పాద్యమై
పున్నెములప్రోవై పట్టిస వీరభద్ర స్వామిని చుట్టుముట్టి
అఖండ గౌతమై అన్నపూర్ణయై
గోదావరి లవణాబ్ధిని కౌగలించుదరి నుంటివి
ప్రసన్న వీక్షణముల ప్రపంనుని కావుము
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౩. సిద్ధి బుద్ధి పతివి నీవు శ్రీవల్లి
దేవసేనాపతి తమ్ముడు; మంచి బుద్ధుల
సిరుల సంపత్తుల నిచ్చి బ్రోతురు మమ్ము
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౪. సంసారపు బండిని లాగు మాకు
బాదిబందల దారిని కాడి భారమయ్యె
కలతల వడిని అలజడిని బాపుము
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౫. విలసిల్లును సదా పూవుల పిందెల కాయల నారికేళ వృక్షము
కళ కళలాడును గృహములు సదా పిల్లలు పాపలు పెద్దలతో
తళతళలాడును మీ మోము మామ్ము కాచుతరి భళి! భళి!
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౬. భావముల వరుసయే మనసు; నిరంతర కామ
భావనయే మన్మథుడు; ప్రియమెప్పుడు మదిని
మెదలుతయే వలపు; తలపుల సదా మీరుండుటయే భక్తి!
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౭. మీరు లేనే లేరని నాస్తికులు, అంతట మీరేనని
ఆస్తికుల తగవులాటలు మొదటినుండీ
శంకిసుమంతయును లేని నమ్మకము కుదుర్చుడు
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
౮. జగమంతయును అల్లకల్లోలములు హాహాకారములగ నున్నది
దేవుని పేరనే జరుగుచున్నవి దారుణములు
మతముల మతులు సరిచేసి మమ్ము కాచుడు
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
తటిల్లతా సమరుచి గాత్రి తల్లి పార్వతి
అనుంగుపట్టీ! అనుగ్రహము చూపి
వ్రాయించితివి నాచేత నీ అష్టకమును
వ్యాసమౌని మేటి వ్రాయసకాడా!
ప్రీతితో గొని దీనిని బ్రోవుము నన్ను
సమస్తవిద్యా ప్రదాతా! సకల విఘ్నాన్తకా!
ఈశ్వరకుమారా! ఐశ్వర్య కారకా!
పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!
EIGHT VERSES ON LORD GANESHA
I). No reflection is possible in a lake
which is not still
Your form can not stay in a disturbed mind
Fill fully in my mind and give me peace of
mind
Pillayaya! The Presiding Deity of Yanam
town!
II). Originating calmly in a tiny way in
Nasika Trayambaka
Receiving waters from tributaries and
rivulets through Maharashtra and Andhra,
Becoming water to cleanse the Divine Feet
of Lord Ramachandra at Bhadradri,
Encircling Lord Veerabhadreswara at
Pattiseema,
Turning into a huge river and Annapurna at
Rajahmundry,
Then proceeding from there, at a spot,
just
before Godavari merges her Lord, the Sea
You reside, Grace me with your benevolent
looks
Pillaraya! The Presiding Deity of Yanam
town!
III). You, the Lord of Fulfillments and Intellect
Your brother, Lord of Sri Valli and the Divine
Army, Devasena
Will be blessing us with good intentions,
riches and wealth
Pillaraya! The Presiding Deity of Yanam
town!
IV). For us, the Cart of family
responsibilities
Becomes unmanageable in the muddy path of
pulls and pushes
And are not able to bear the weight of the
yoke
Make our minds disturbance-free and fill
them with calmness
Pillaraya! The Presiding Deity of Yanam
town!
V).The coconut tree flourishes continuous
with lovely and simultaneous
Presence of leaves, flowers, tiny, tender,
and ripe nuts;
And the homes blissful with infants, babies,
kids, youth and elders;
And Your face lights up when you Grace us
Pillaraya! The Presiding Deity of Yanam
town!
VI). Continuous flow of thoughts is mind,
Constant presence of sensuous feelings is
cupid,
The beloved always recollected in thoughts
is love
Your continuous presence in our thoughts
and feelings is devotion,
Pillaraya! The Presiding Deity of Yanam
town!
VII). Atheists vouch for your non-existence
And the believers see you everywhere every
second
These quarrels exist always
Give me absolute faith in You without even
an iota of doubt
Pillaraya! The Presiding Deity of Yanam
town!
VIII). All the globe is presently in
turmoil
Innocent human-beings are massacred in the
name of religions
Repair the minds of the religions and save
us
Pillaraya! The Presiding Deity of Yanam
town!
Oh! Beloved Son of Parvathi, whose body is
effulgent lightning,
Gracing me you made me compose these verses
Oh! Divine Scribe for Sage Vyasa!
Accept and receive them with love and
affection
And bless me Giver of all Knowledge!
Remover of all Obstacles! Illustrious Son
of Lord Siva!
The Shower of riches and wealth!
Pillaraya! The Pesiding Deity of Yanam
town!
(Pillaraya is regional language name for
Lord Ganesha. Yanam is part of Union Territory of Pondicherry which is on the
banks of river Godavari and is geographically located in Andhra Pradesh,
India).
No comments:
Post a Comment