కవిత్వం శిక్షణ తో వస్తుందా? అసలు కవిత్వం
రాసి వినిపించడం పెద్ద శిక్ష అని కవిత్వం
చదవలేనివారు, ఆస్వాదించాలని లేని వారు
అంటూంటారు.
కోయిలకి పాట, కోతికి గంతులు, దూకుళ్ళు, సెలయేటికి
ఎత్తుల పల్లముల దూకుతూ ప్రవహించడం, చంద్రునికి
వెన్నెలలు చిందించడం, చేప పిల్లకు ఈదడం లలో శిక్షణ ఇవ్వడం ఎంత వరకు అవసరం?
**********
***********
" ప్రతి" నిధులు
"భోజనములు", అడ్డమైన
తిళ్ళు తిని
గోరోజనములను కొవ్వును పెంచుకొని
నీతిబాహ్యముగ పొగరుమోతులై అందరు
పౌరులను హింస పెడుతున్న వీరు ప్రజా ప్రతినిధులా?
గోరోజనములను కొవ్వును పెంచుకొని
నీతిబాహ్యముగ పొగరుమోతులై అందరు
పౌరులను హింస పెడుతున్న వీరు ప్రజా ప్రతినిధులా?
మునుపటి జమీందారులను సీమదొరలను
మించిన అధికార మద మత్తతతో తాము,
తమ సంతానము అధికారాంధతతో పోలీసులనూ
అవమానించిన ఈ ప్రతినిధులు దేనికి ప్రతినిధులు?
మించిన అధికార మద మత్తతతో తాము,
తమ సంతానము అధికారాంధతతో పోలీసులనూ
అవమానించిన ఈ ప్రతినిధులు దేనికి ప్రతినిధులు?
**********
అసభ్య రాతల అంతర్జాల సాలెగూళ్ళు
రాను రాను అంతర్జాల సాలెగూళ్ళు నాగరికత, సంస్కారం
లేని రాతలకు నెలవులవుతున్నాయి. నాగరీకము కాని అసభ్య రాతలు, సభ్యత లేని
కుసంస్కార పోస్ట్లు ఎక్కువై పోతున్నాయి. జనాలు తమ పరుషమైన, నిందాత్మక
మాటలతో కూడిన అనాగరిక భాషతో రెచ్చిపోతున్నారు.
అవును అంతర్జాల సాలెగూళ్ళు అందరి సొత్తూను.
No comments:
Post a Comment