కల్పిత బాదరబందీ - స్వయంకృత శాంతి భంగం
తెల్లారి లేస్తే మనం ఎన్నో వార్తలు వింటాం, చదువుతాం, ఎన్నో న్యూస్ ఛానెల్స్, టి.వి.
కార్యక్రమాలు చూస్తాం. ఇవన్నీ మన మానసిక సంతులతను హరిస్తాయి.
హరిస్తున్నాయి. మోదం కంటే ఖేదం, అశాంతి కలిగించే అంశాలే ఎక్కువ.
ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది
తెలుసుకోవాలి, ఏది తెలుసుకోనవసరము లేదు, వేటిని పట్టించుకోవాలి, వేటిని
వదిలెయ్యాలి పై ఆలోచన, అవగాహన, ఆకళింపు, లేకపోతే, మన వ్యక్తిగత
జీవితంలోని ఇబ్బందులతో పాటుగా ఈ నాగరిక జీవన శైలి మనకు కలతలు కలిగిస్తాయి. కొలతలు
లేని అశాంతిని అనుభవిస్తాము.
అన్నీ, అంతా మన చేతుల్లోనే ఉంది. ఎవరూ
మన్ని బలవంతంగా ఈ విషయాల్లోకి, వార్తాంశాలలోకి, కార్యక్రమాలలోకి
లాగడం లేదు. నిర్ణయం మనదే. మనం అన్నీ బాగా తెలిసిన
వాళ్ళం కాకపోయినా ఫర్వాలేదు. "నాగరీక లోకంలో" వెనకబడ్డా పర్వాలేదు. ఈ వార్తల, సంగతుల, సంఘటనల
ఎఱగకపోయినా నష్టం లేదు. పైగా మనశ్శాంతి
కోల్పోనక్కర లేని గొప్ప లాభం.
వార్తా మాధ్యమాలు, అంతర్జాల మాధ్యమాలు, సాలెగూళ్ళు
మన మనశ్శాంతిని హరిస్తూంటే వాటి జోలికి పోక పోవడమే విజ్ఞత.
వివేకం, ఇంగితం. వీటిని చూడమని, పాల్గొనమని
మన్ని ఎవరూ ఆహ్వానించటం లేదు. మనమే స్వయంకృతంగా ఈ
ధోరణులతో పాలు పంచుకుంటున్నాము. ఇదంతా మనం కల్పించుకున్న
హడావుడి మాత్రమే.
మనని మనం నియమించుకొని, సంయమనం అలవరచుకొని ఉండగలిగితే, స్వ ఇచ్ఛలో, యథేచ్ఛగా ఏ
బాదరబందీ పెట్టుకోకుండా జీవించవచ్చు.
అంతా మన ఆలోకన, అవగాహన, ఆకళింపు.
***********
మన పిల్లలకు మనం తప్ప ఎవరు చెప్పగలరు?
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై అందరికీ సానుభూతే!
ఏ విధమైన జాగ్రత్తలూ తీసిపోకుండా అర్థరాత్రి కామాగ్నికి
ఆహుతైన అమ్మాయి వెనుక దేశమే ఉంటుంది
ఏ విధమైన జాగ్రత్తలూ తీసిపోకుండా అర్థరాత్రి కామాగ్నికి
ఆహుతైన అమ్మాయి వెనుక దేశమే ఉంటుంది
ఎందుకని ఎవరూ వీరిని మద్యం సేవించి వాహనం నడిప వద్దని
అర్థరాత్రి ఒంటరిగా వెళ్ళొద్దని స్త్రీలకు ఎవరూ చెప్పరేమి?
అర్థరాత్రి ఒంటరిగా వెళ్ళొద్దని స్త్రీలకు ఎవరూ చెప్పరేమి?
చెప్పిన వారిపై ఇంతెత్తున లేవకుండా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటే
ఎందరి ప్రాణాలు, మరెందరి మానాలు రక్షింపబడతాయి?
ఎందరి ప్రాణాలు, మరెందరి మానాలు రక్షింపబడతాయి?
ఏమిటో "నాగరికత" పెరిగే కొద్ది బుద్ధి కుంచించుకు పోతోంది;
ఇంగితం అటకెక్కుతోంది; ఇతరులను తప్పు
పట్టడాలు రివాజైంది; మేధావులైనా ఎవరైనా ఉచితం
చెప్పాలి; హక్కులు బాధ్యతలూ మనిషికి ఉంటాయని;
మన జాగ్రత్తలో మనం లేకపోతే ప్రభుత్వాలు, పోలీసులు
మనకు రక్షణ కలిగించలేరు; ఎప్పటికి ఈ వాస్తవం బుర్రకు
మనకు రక్షణ కలిగించలేరు; ఎప్పటికి ఈ వాస్తవం బుర్రకు
ఎక్కుతుంది? హక్కులతో పాటుగా బాధ్యతలూ గమనించాలని
మన పిల్లలకు మనం తప్ప ఎవరు చెప్పగలరు?
**********
వార్తా పత్రికలు - న్యూస్ రీడర్స్
మనమొక వార్తాపత్రిక; అన్ని రకాల వార్తలను
పక్కపక్కనే వహిస్తాము స్పందన లేక;
**********
వార్తా పత్రికలు - న్యూస్ రీడర్స్
మనమొక వార్తాపత్రిక; అన్ని రకాల వార్తలను
పక్కపక్కనే వహిస్తాము స్పందన లేక;
ప్రమాదాలు, చావులు, ప్రమోదాలు, విషాదాలు,
సంబరాలు, శోభనాలు, హత్యలు, మోసాలు,
రాజకీయాలు; అన్నింటినీ సమముగా తీసికునే
మనము మనమున్నను బండబారిన బండరాయిలము
లేకున్న ఈ విధి వైపరీత్య వైవిధ్య వార్తలను, సముద్రుడు
నదీ జలాలను కలిపేసుకున్నట్టు; తల్లులు పిల్లల
భరించినట్లు ఎలా దిగమింగుకోగలము; లీనము చేసికొని
ఏమీ జరగటం లేదనట్టు బతుకులనిలా ఈడ్చేసుకుంటూ
పోగలము? మనందరము వార్తా చానల్స్ లో పనిచేసే
న్యూస్ రీడర్స్ ము; చదివే వార్త ఎటువంటిదైనా నిగ్రహం
కోల్పోక సంయమనంతో చదివేస్తాము; లేకున్న పత్రిక
వలె జడముగా; వార్తల చదువువారివలె మునీశ్వరులుగ
ఎటుల ఉండగలము? వార్తలు మన మనసుల అలజడి
కలిగించు సంఘటనావళులు; మనకే సంబంధము లేని
మనుషుల, ప్రదేశముల, దేశముల కాలమాన పరిస్థితుల
తెల్లారగానే మెళకువ రాగానే చద్దన్నంలా మింగేయగలమా

No comments:
Post a Comment