Sunday, May 7, 2017

సినిమా; సన్యాసము-సంసారము; Engineering education and Pure Sciences ; Woman, man God



సినిమా

సినిమాలు మాత్రమే మనలను అలరించగలవు. అలరించ గలుగుతున్నాయి. ఇరవయ్యవ శతాబ్దపు వినోద సాధనాలలో సినిమా అగ్రగణ్యంగా నిలిచింది. మన జీవితాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. చేస్తోంది.
మన మనసులను ఆకట్టుకొని మన జీవన విధానాన్ని ఎన్నో మార్పులకు గురిచేసింది. ముఖ్యంగా మన భారత దేశంలో సినిమా మన అణువణువునా ప్రాకింది. మన ఊపిరి అయిపోయింది అన్నా అతిశయోక్తి కాదు. ఇప్పుడు బాహుబలి సినిమా హడావుడి ఈ మాటకి ప్రబల సాక్ష్యం.

సినిమా నటీనటులను దేవుళ్ళు, దేవతల కన్న మిన్నగా ఆరాధించే మనం నిజ జీవితంలో భగవంతుని స్మరించడమే మానేశాము. సినిమా వాళ్ళు ప్రకటనల్లో కొనమనే వస్తువుల్ని కొంటాము. వారి అస్తవ్యస్త వ్యక్తిగత జీవితాలను పట్టించుకోము. సంఘంపై వారి విచ్చలవిడి ప్రవర్తన ప్రభావాన్ని గణించము. పైపెచ్చు అనుకరించడానికి ఉత్సుకత చూపుతాము.
 
వారు శాసనసభలకు, పార్లమెంటుకు హాజరు కాక పోయినా ఉదాసీనత వహిస్తున్నాము. చట్టసభల్లో చట్టాలు చేయడంపై వారికి కనీస అవగాహన లేకున్నా మనకు పట్టదు. వెనకాలనిర్మాత, దర్శకుడు, కథా, చిత్రానువాదము, మాటల, పాటల రచయితలు, కెమేరా మెన్, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు, మిగతా సినీ వర్కర్లు, ఇందరి కృషితో, సాయంతో సినిమా తయారవుతుందని తెలిసినా,
నటీ నటులకు మాత్రమే, ముఖ్యంగా, హీరో, హీరోయిన్ లకు మాత్రమే పెద్ద పీట వేసి మనం మనసులు వారికై పారేసుకుంటాము.
 
సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్ప కళ మొదలైన లలిత కళలు మన కనులకు ఆనవు. ఆనటం లేదు. మన మనసులను రంజింపచేయలేక పోతున్నాయి కూడా. ఇంతలా మన జీవితాలలో, జీవితాలతో మమేకమై మనల నిలువనీయ కుండా చేస్తున్న సినిమా అందిస్తున్న వినోదానికి లక్ష రెట్లు మనలను నిర్వీర్యులను చేస్తోంది. మరే కాలక్షేపం మనం చేయడం లేదు. బహుశా ఇది మన ఆస్వాదనా కళ, శక్తి పరిమితం అవడం వల్ల కూడా మన మనోరంజనము సినిమా చూసి మాత్రమే వినోదాన్ని పొందగల స్థాయిలో ఉండిపోయింది.

ఇన్నేళ్ల సినిమా యొక్క ఈ ఆగడం ఆపవలసిన సమయం ఆసన్నమైంది. ఎంతో తేలికగా మనం ఏమాత్రం అలవనవసరం లేకుండా సినిమా వినోదాన్ని అందిస్తుంది. అదే సమయంలో మన ధన, మాన, ప్రాణాలను శాసిస్తోంది కూడా. ఈ అస్తవ్యస్త అవ్యవస్త నుంచి మనలను మనం రక్షించుకునే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టాలి.
 
సినిమా వినోదాన్ని మాత్రం పంచాలి. మనలను దానికి బానిసలగా చేయకూడదు.
 
***********

సన్యాసము-సంసారము

సన్యాసము సనాతన ధర్మ సాంప్రదాయం కాదు. బౌద్ధుల, జైనుల ప్రభావము వలన సనాతన ధర్మంలో ప్రవేశించింది. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం - సనాతన ధర్మంలో ఈ మూడే ఆశ్రమాలు.
మృత్యువు విడదీసే దాకా భార్యాభర్తలు కలిసి జీవించడమే సనాతన ధర్మం. ఉపనిషత్ సాంప్రదాయం. ఉపనిషత్ స్రష్టలందరూ గృహస్థులే. కొందరు బహు భార్యాత్వం నెఱపిన వారు కూడాను. బ్రహ్మ జ్ఞాన సృష్టికి, బ్రహ్మ జ్ఞానులవడానికి వివాహము, భార్యతో సంసారము చేయడం అడ్డంకులు కావని ఆనాడే ఉపనిషత్ ఋషులు ఋజువు చేశారు.
 
నిజానికి సంసారం అంటే భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు, గొడ్డూ గోదా కాదు.
 
సుఖదుఃఖానుభవాన్నే సంసారం అన్నారు. ఈ అనుభవాలు వాసనల (జ్ఞాపకాల) రూపంలో ఉంటాయి. ఈ వాసనలు సన్యాసము తీసికున్నా వీడకపోవచ్చు. పైపెచ్చు కొత్త అవతారం ఎత్తడం (పేరు, కట్టుకునే బట్ట మార్చడం) వల్ల కలిగే అహంభావ, అహంకారాలు, శిష్య, భక్తకోటి వీరిలో కొత్త వాసనలను సృష్టిస్తాయి.
సన్యాసము అంటే "కూడా వసించడం". ఎవరి కూడా? దేని కూడా

బ్రహ్మము కూడా; బ్రహ్మమై వసించడం.
 
ఏ విధమైన అహంభావ, అహంకార, మమకారాలకు లోను కాకుండా నిర్మల మానసముతో జీవించడం సన్యాసము. పేరు, దుస్తులు, మార్చుకుని పటాటోపముతో, ఆడంబరంగా జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకోవడం మాత్రం, మాత్రమే సన్యాసము కాదు.
 
పేరు, దుస్తులు మార్చుకోనవసరం లేకుండానే, గృహస్థులుగా ఉంటూనే నిర్మల మానసము ఏర్పరచు
కొని, సంసారంలో, సంసారంతో (భార్య, పిల్లా పీచు, గొడ్డూ గోదా, ఆస్తి పాస్తులతో) సుబ్బరంగా జీవించవచ్చు. ఇప్పటి స్వాముల వలె సన్యాసము తీసుకోనవసరం లేదు. సన్యాసం మానసికము. భౌతిక పటాటోపము కాదు. మానసిక నైర్మల్యం పొందడానికి వేషం మార్చి, వేషం వేయనవసరం లేదు.
 
సన్యాసము వ్యక్తిగతము. సాంఘికము కాదు. డబ్బులు కూడబెట్టడానికి ఎన్నుకోవాల్సిన మార్గమూ కాదు. వంద ఏళ్ళ క్రితం భారతదేశంలో ఇంత సన్యాసుల తామర తంపర లేదు. మంత్రాల కన్న తుంపరలు ఎక్కువైనట్టు, సన్యాసులలో ఆధ్యాత్మిక చింతన కన్న ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ అయ్యాయి. సన్యాసం ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కాక మెట్ట వేదాంతం చెప్పి నాలుగు రాళ్లు సంపాదించడానికి తీసుకోబడుతోంది. సంఘంలో "పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందడానికి సులువైన మార్గంగా తయారైంది.

గహస్థుగా సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే సంన్యాసము - బ్రహ్మమై బ్రహ్మముతో సహవాసము - చేయవచ్చు.
పొట్టకూటికై వేషాలు వేయడం సంన్యాసము, సన్యాసము కాదు. ఇది అందరికీ తెలియవలసిన విషయం.
శుభం భూయాత్!
**********
పోతన గారి శ్రీమహాలక్ష్మి !
.
హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్
********** 
Engineering education and Pure Sciences


Engineering is technology and is application part of science. Pure science is known and famous for the concepts it provides. Both are parallel in use and existence. Being famous or otherwise in any of them is a point. But present engineering colleges are not respecting pure sciences and are not giving them their due and are trying to do away with them even in curriculum. Knowledge as a whole is disrespected in India. Present generation is familiar more with Bill Gates and Steve Jobs; neither with scientists nor engineers and technologists. Only technocrats are popular with student community.

**********
Woman, man God


Woman attracts by her beauty and man tries to attract by his "talents". God attracts through His compassion.

No comments:

Post a Comment