Wednesday, August 31, 2016

అజ్ఞానపు ఘనులు, గనులు

అజ్ఞానపు ఘనులు,  గనులు

అవధానములెన్నియో అనవధానములెన్నియో నిర్లిప్తత
లెన్నియో; సంఘమున స్వోత్కర్షలు పరనిందలు పెచ్చు
పెరిగినవి అందరు ఘనులే ఇతరుల తూలనాడుటయందు
ముసలి ఆంబోతురకములెక్కువైనవి; అవి చేయలేవు

మరొకరిని చేయనీయవు; అంతయు కుల భూతద్దమున
చూచుచు భాషను, జ్ఞానమును, శాస్త్రములను భ్రష్టు
పట్టించు బాధ్యతారహితులు మేధావులుగ చలామణీ
అవుచున్నారు; ఉన్నది విద్వేషములతో కూడిన అసూయ

తాము ప్రతిభావంతులై సంఘమును ముందుకు తీసికొని
పోవు సమర్ధతలేక,‌ ఆడలేక మద్దెల ఓటన్నట్టు ఇతరులపై
పడి ఏడవడం ఒక రివాజయింది; ప్రతిభావ్యుత్పన్నతలతో
భాషకు, జ్ఞానమునకు, శాస్త్రములకు కొంగ్రొత్త రూపుల

నిచ్చు పటిమ లేక కులగజ్జి మనసంత పట్టించుకొని
సమస్తమును విధ్వంసము చేయుచున్న మూర్ఖకులజులు
ఆ గజ్జినంతా సంఘమునకు పట్టించి తాము మహా
మేధావులమనుకొను మూఢులు సంస్కృతీ సస్యమునకు

పట్టిన చీడలు; భాష మాటలాడుటకు మాత్రమే
పరిమితమైనది కాదని, అందు సమస్త సాహిత్యము
శాస్త్రములు, జ్ఞానములు సృష్టించుటకు నిర్దుష్ట భాష
అవసరమన్న అర్థము కాని పొగరుబోతులు, సంస్కార

హీనులు కులగజ్జిచే అవస్థపడు, అవస్థపెట్టు అజ్ఞానులు
జ్ఞానరహితులు; సంఘమునకు, సంస్కృతికి, వన్నెతెచ్చు
చక్కని రచనలు చేయు సంభావ్యత లేక అలమటించు
కులభవరోగ మనస్కులు, మానసికరోగులు, దౌర్భాగ్యులు

Mr. Modi's About turn: ఉన్నది ఇందుకోసం; The recent Coming Together of the USA and India, దేవుడు ఒక్కడే

The moment Mr. Modi compromised his principles for the sake of his allies who are any way corrupt and inefficient administrators, and are experts in giving vain statements, for the sake of one or two Rajya Sabha seats, there is no difference between him and the earlier Congress - led government.

Even if it is not possible to be ideal in politics, it is expected of him to be virtuous; just not he, also his associates; because even Mr. Manmohan Singh was blemish-less at personal level. Ignoring his principles will prove costly to Mr. Modi. People already started thinking, is it not, nothing has changed after change in government, especially corruption among his allies and government machinery.

 ********************



ఉన్నది ఇందుకోసం

ఫుట్ పాత్ లున్నది రోడ్ సైడ్ వ్యాపారుల కోసం;
గవర్నమెంట్ స్థలాలున్నది లేనివారు, ఉన్నవారు
ఆక్రమించుకోవడంకోసం; ప్రభుత్వాలున్నది రాజకీయ
నాయకులు మనని వంశపారంపర్యముగా పాలించేందుకు;

ప్రభుత్వ నిర్వహణ ఉన్నది నాయకులు, ఉద్యోగులు
నొక్కుకోవడానికి; సినిమా స్టారులున్నది మన
అభిమానాన్ని దుర్వినియోగ పరుచుకోవడానికి;
మేధావులున్నది ప్రాచీన భారతీయ సంస్కృతిని

జ్ఞాన సంపదను సంస్కార రహితంగా దునుమాడడానికి;
మనమున్నది ఆధునిక పరికరముల అస్తమానూ అప్
గ్రేడ్ చేసికోవడానికి; విద్యాలయములున్నది అర్థము
పర్థము లేకుండా పెద్ద పెద్ద మొత్తములలో ఫీజులు

గుంజడానికి; దేశమున్నది పౌరులు వర్షకాలమున, వేసంగిని,
శీతకాలమున, అన్ని కాలములందు అమితమైన కడగండ్లు పడుటకు;
కాంట్రాక్టరులున్నది నాసిరకము పనులు చేసి సిగ్గు ఎగ్గూ లేక దానికే మరల,
మరల టెండర్లు వేయుటకు; భక్తులున్నది భగవంతుని ఎడతెరపి

లేకుండా కోరికలు కోరుటకు; ఆశ్రమములు స్థాపించుట
డబ్బు సంపాదనకు, వీలయితే శంగార క్రీడలకు; అంతయు
అధర్మ మయము; మాటలు ధర్మబద్ధము, చేతలు
పాపపంకిలములు; అంతయు మనుషుల దుర్నీతి
**************
Recent Coming together of the USA and India


The recent "coming" together of the USA and India shows the frustration of America with the double standards of our neighbour. But it is not a news for them or India about our neighbour's nefarious activities against us.

This friendship of USA with India seems to be out of "historical necessity" and part of international diplomacy of American foreign office. This kind of hegemony is part of American foreign policy for decades.

They condemn human rights' violation elsewhere but not in countries of its liking even though they are ruled by dictators and they have many human rights' violation there unhindered.
America is a nation of changing priorities linked to its safety and all other nations must help it achieve its goals even undermining the respective country's welfare and well-being.
Now that China is to be countered it is "helping" India on terrorism front and soliciting India's cooperation for its fight against China on South China Sea events.

None can agree that America did not know about Pakistan's repressions against "its" citizens in north west frontier province (Baluchistan), POK and Gilgit, Baltistan.

It also knows the operations of ISI and Pakistan government and so only has to kill Osama-bin-Laden in an adventurous mission. It also knows about roaming of terrorists in Pakistan who are sheltered there and have been encouraged in their operations against India.

Now that the classification of good and bad terrorists has gone awry and is eating into its operations and patience despite America donating so much money under all pretexts to Pakistan all these decades.

India must be aware of this and balance its foreign policy to suit its benefits and not surrender its judgement to American foreign policy framers.

Now that, under changed conditions the USA is providing information to India on terrorists roaming in Pakistan, which, ceded them as tools to their "foreign" policy against us, we should be doubly careful.

Hope our foreign policy framers will have all this in mind while framing our foreign affairs' policies.

**************

దేవుడు ఒక్కడే

దేవుడు ఒక్కడే ఆయన విష్ణువని వైష్ణవులు
దేవుడు ఒక్కడే ఆయన శివుడని శైవులు
దేవుడు ఒక్కడే ఆయన అల్లా అని‌ ముస్లిములు
దేవుడు ఒక్కడే ఆయన యెహోవా అని క్రైస్తవులు


దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు ఎన్నో అని సనాతన ధర్మము
దేవుడు ఒక్కడే ఆయన మనిషికి వేరు కాదని తత్త్వము

ఇందరు దేవుని స్వరూపము వర్ణించుచుండ
దేవుడే లేడని నాస్తికులు క్రిందమీద పడుచుండ

గురువులు దక్షిణామూర్తి, హయగ్రీవులు, కృష్ణ పరమాత్మల
బోధనలు నాకు దిక్సూచి నన్నుద్ధరించు ప్రమాణములు

Monday, August 22, 2016

Black Money - Political Parties - Citizens; ఆత్మీయుల అనునయం

Black Money - Political Parties - Citizens

The political parties of India cannot curb generation of black money and neither they can confiscate the money so generated.

All the political parties are accepting donations from unknown sources. Money from unknown sources is called black money in income tax parlance.

Thus political parties which accept money in black take will action on black money? Such statements will lack in credibility. The governments formed by such political parties will surely compromise.
It will be a joke to talk about black money and these governments formed by such political parties mention taking action against black money. We are all contributing to generation of black money in one or the other way.

All political parties have rejected the suggestion to reveal the sources of income through donations. They just wrote off and stoutly opposed Chief Information Commissioner's attempt to include incomes to political parties through donations under Right To Information act.

Such double speak and double standards will not help the spirit of taking action on black money generation and hiding by citizens.

*************

ఆత్మీయుల అనునయం

ప్రపంచంలో ఎందరో గొప్పవాళ్ళుంటారు. మహానుభావులుంటారు. తల్లిదండ్రులు, భార్య/భర్త ఉంటారు, స్నేహితులుంటారు. సంతానం ఉంటుంది. ఇంకా ఎందరో ఉంటారు. అయినా ఒక్కొక్క సారి మనకు కలిగిన దుఃఖము, అశాంతిని ఎవరూ పోగొట్టలేరు. మన మనసుని మనము బుజ్జగించగలిగితేనే ఆ‌ అశాంతినుంచి బయటపడగలము. అప్పుడే ఆధ్యాత్మికత అక్కరకొస్తుంది. 

ఈ అశాంతి మనకు మనం కలిగించుకున్నా, మన ప్రవర్తన వల్ల మనవారికి కలిగినా, లేక వారివల్ల మనకు కలిగినా మనసుని ఆదరంగా, ఆత్మీయంగా చక్కబరచుకుంటే అది మనశ్శాంతికి దారితీస్తుంది.

ఆధ్యాత్మిక మార్గములన్నీ ఈ కళ నేర్పడానికి, ఆచరిస్తే ఫలితం ఇవ్వడానికి ఏర్పరచబడ్డాయి. ఆత్మీయుల, భర్త/భార్య సాంత్వన వచనములు పనిచేస్తాయి. బాధ పెట్టినా, బాధ తీర్చినా తోటి మనిషే.

SAME TEXT-BOOKS - DIFFERENT LESSONS - THE PRASTHAANA TRAYA



SAME TEXT-BOOKS - DIFFERENT LESSONS

The Prasthaana Traya - the Upanishads, the Brahma Sutras and the Bhagavad-Gita are same text books of spirituality, but they gave different lessons to Aadisankaraachaarya, Ramaanuja and Madhwa. 

How, it happened and has been an interesting happening. 

Sankaraachaarya getting lessons of Advaita, Ramaanujaacharya getting lessons of Visistaadvaita and Madhwaachaarya of Dvaita from same compositions is marvel of Indian spirituality. 

And it thus informs us that the view, perception, intuition, experience of and stand taken by the commentator are primary; and the actual texts come secondary in importance and adhering.
Very strange and mysterious study and interpretations dawned then. Smart people will make a comparative study, observation and develop an individual insight. Individuals of lesser competence will faithfully but blindly follow their Guru and related interpretations. 

Spirituality so is full of liberty and freedom and no Guru must insist on one's own interested interpretation and deny the seeker room for individual and independent observations and conclusions.
And there is not merely one view, insight, experience and understanding in relation to spiritual matters and still scope is there for fresh understanding and commentary of Prasthaana Traya. Even now there are possibilities for independent interpretations adding to spirituality with the same Prasthaana Traya as source.

Indian spirituality stands for individual freedom in living and getting spiritually enlightened. This must be noted by gurus of various cults of today (and coming generations), which claim ancestry of authority on the Prasthaana Traya; before making seekers and devotees their lifetime followers.
Indian spirituality is individual-focussed and not a mobocracy.

వర్గస్వామ్య నియంతృత్వం

వర్గస్వామ్య నియంతృత్వం

వృద్ధ బ్రహ్మచారి, కండల వీరుడు ఎప్పుడు ఓ ఇంటి వాడగునో
లేదో అని ఆసక్తి లేదు; అయితే, మీడియా ఊదర కొట్టుడు
ఆగునేమోనని ఆశ; పాలనను అటక ఎక్కించి,
కోతికి కొబ్బరికాయ కాయ దొరికినట్టు ఒలింపిక్ విజేత

చుట్టూ తిరిగి రాజకీయం చేస్తున్న తెలుగు రాష్ట్రాల
అధినేతలు, వారి అనుయాయులు మామూలు స్థితికి
ఎప్పుడు వస్తారో? హమ్మయ్య! ఇవాళ్టితో పుష్కరాలు
అయిపోతాయి; ఘాట్ ల చుట్టూ, సంగమముల వద్ద

వేసుకున్న తిరిగే డ్యూటీ అయిపోతుంది; మళ్ళీ
సింగపూర్ మలేసియా, జపాన్, దావోస్, రష్యా, ఢిల్లీ
భూభ్రమణములు మెదలగునేమో? అమరావతి, ఐ.టి.,
జలయజ్ఞంల హడావుడి ఎప్పుడూ ఉండేదే, 2050 వరకు

ఇంతలో చిన్నదొరలు అక్కడా, ఇక్కడా పార్టీ పగ్గాలు
పట్టి పాలనకొస్తారు; ప్రజలు వారికి స్వాగతం పలకడానికి
తమ సంతానాన్ని సిద్ధం చేయాలి; కార్పొరేట్ చదువులు
ఇంటింటికీ వై, ఫై లు, డిజిటల్ డేటా, కులాభివృద్ధి

కార్పొరేషన్ లు, ప్రతి వర్గానికీ రిజర్వేషన్ లు; అంతా
యధావిధిగా "పాలన" సాగుతుంది; ఇంతలో ఎన్నికలు;
సరియైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల వృక్షము లేనిచోట
ఆముదపు చెట్టే మహా వృక్షము చందమున ఎన్నికవడం;

పాడిన పాటే పాడరా పాచి పళ్ళ దాసరిలా పాలనా
వ్యవహారము; చర్వితచర్వణమీ ఓటర్ల కడగండ్లు;
పాలితులు, పాలకులు సమానముగా కుల, ప్రాంతీయ భావ 
గజ్జికి, మత పిచ్చికి దోహదం చేస్తూ ప్రజాస్వామ్యం
నడుపుతారు; వివేకము, విచక్షణ, సమత్వభావనలు కల
పౌరులూ గతి లేక ఈ కలుషిత, కశ్మల ప్రవాహంలోనే 
కొట్టుకుపోతూ కొట్టమిట్టాడుతూ బతుకులీడుస్తారు
దేశంలో వర్గస్వామ్య నియంతృత్వం వేళ్ళూనుకొనును.