
ప్రణయాద్వైతము
ప్రేమ
నిండు చందమామ
ప్రేమికులు
అది చిందించు వెన్నెలలు
ప్రేమించుట
భోగమో, యోగమో
భువిని
దివిని విరాజిల్లును ప్రణయమున
కలసిన
మనసులు పాడు యుగళగీతము
కులుకు
హృదయముల రసానందము
రాధయు
కృష్ణుడును ప్రణయజీవుల మనోరాజీవములు
నిరంతర
ప్రేరణములు నిగమాంత రాగములు నితాంత అనుబంధములు
ప్రణయమున
మునిగి తేలు యువతీయువకులు
ప్రేయసీప్రియులు
స్త్రీపురుషులు; రతీమన్మథులు ఊర్వసీపురూరవులు
పద్మావతీశ్రీనివాసులు మీనాక్షీసుందరేశ్వరులు
ఆండాళ్ శ్రీరంగనాథులు
రసానందహృదయాంతరంగులు
శాంతానందయోగులు
ప్రణయము
యోగము
ప్రేమను
మనసులు ముడివడుట అద్వైతము
No comments:
Post a Comment