Friday, May 19, 2017

శ్రీ రమణ మహర్షి పలుకులు - 2; ప్రకృతి - ప్రవృత్తి; The unfairGST exemption ; BJP face in Tamilnadu


శ్రీ రమణ మహర్షి పలుకులు - 2

చిత్-అచిత్

చిత్ అంటే తెలియడము; తెలియజేసేది. అచిత్ - జడము - తెలుసుకోలేనిది. తాడుని పాము అని భ్రమిస్తే, నిజం తెలియడానికి ఆ భ్రమను తొలగిస్తే చాలు. అట్టి నివారణం లేక సత్యం గోచరించదు.

శుద్ధ మానసము తానె బ్రహ్మము. బ్రహ్మము యోగి మనస్సదృశము.


హృదయం చైతన్య స్థానము. స్థానమేమి? చైతన్యమే!

మెత్తని పరుపులు, దిండ్లూ గాఢ నిద్రను చేకూరుస్తాయని, మెలకువని అంతరింప చేస్తాయని ఆశ. అందుకే శయ్యను ఎంతోఓపికతో చక్కగా అమర్చుకుంటారు. కాని మృదు శయ్య గాఢ నిద్రలో లెక్కకు రాదు.

తాత్పర్యమేమంటే, మన సర్వ యత్నాలూ అజ్ఞానము పోగొట్టుకోవడానికే గాని జ్ఞానం సిద్ధించాక వాని ప్రహోజనము లేదు. స్వేచ్చకు, విధికి అతీతముగా ఉండడమే, స్వేచ్చ చేత విధిని జయించడము.

ఆత్మ నీ కెఱుకయే. ఆత్మ నీ ఎఱుకయే.

************


ప్రకృతి - ప్రవృత్తి

రాతలు రాసి మనమందరము ఎందరనుద్ధరింతుమో?
రాతలు వారివి మార్చగలవా, మారునా మన రాతలు?!

ఎపుడైనా ప్రపంచమున ఉపదేశించేవారే అధికము
నీతులు చెప్పడానికే ఉన్నాయన్నట్టు; ఆదరించు వారే
ఆచరించు వారే అరుదు; చెప్పుట సులువు; ఆచరించుట
శ్రద్ధా భక్తులతో కూడినది; వ్యాస వాల్మీకులనే ఉపేక్షించే

జనులు లెక్కసేతురా మన సుద్దులు ఇంగితపు పలుకులు?
రామాయణ భారత భాగవతముల మించినవా మన
సాహితీ సృష్టులు? కవనములు రచనా చమత్కృతులు?
అయినా ఎందుకో రాయకుండా ఉండలేము పంచకుండా

నియమించుకోలేము; ఇదొక ప్రకృతియేమో ప్రవృత్తేమో?
రాయుట సహజము రాయకుండా ఉండలేము మనము

***********

The unfair Tax exemption to Education and healthcare providers


It is not realistic but only pampering not to tax education and health care facilities under new GST rules.

It is a wide-spread, kabooliwala-type and unpleasant experience for middle class and lower middle class citizens from being squeezed by corporate educational institutions and health care facilities in the form of fees and hospital bills. Nothing is done in these institutions in the spirit of education and health care.

When these institutions are being run as factories and money-earning entities, why should the government exempt them from taxing? 

Is it in any way in the spirit of education when private educations are charging one lakh and more than one lakh for admission to LKG class? How ridiculous it is? Then, why the government shuns from and "shies" away from taxing these money-making organizations ignoring the spirit of the profession?

Is it because many elite individuals are running these "factories"?

It is in no way defensible to avoid these money squeezing education and health care institutions which are being run as any other business from taxation. These are no longer public service
organizations which are run in the spirit of the nobleness associated with education and healthcare provisions.

Many middle class and lower middle citizens are squeezed of money to pay the exorbitant fees they have to pay for this essential and fundamental necessities and a human being cannot abstain from getting educated and being taken care of when in illness.

Governments should not be hand in glove with corporate entities and must see the reality and tax them for the business they are doing with citizens' essential requirements. Let the government get part of this loot and do something for the citizens.

Putting education and healthcare out of tax bracket is not in tune with the exploitation these institutions are indulging in and and this exemption more out of doing favor to these big business entities.

Let not the citizens be crushed under the heavy toll of fees being collected by educational and healthcare institutions. It is not wisdom to show favoritism when the institutions are not at all caring to adhere to the nobleness of the professions and are making money at the cost of middle and lower middle class citizens of India. Let them be taxed as any other business.

Education and healthcare providing is no longer the noble professions they have been.

***********
 BJP face in Tamilnadu
 
In one TV interview, the senior BJP leader and MP, Swamy has commented that Rajanikant is not a Tamilian and so is not "eligible" to be a political leader in Tamilnadu. This is really an interesting observation.

But the history of Tamilandu informs another reality. Mr. M.G. Ramachandran the most popular leader and CM is also not a Tamilian. His disciple and another CM is also not from Tamilnadu; the leader is from Karnataka. And many say the origins of Karunanidhi are from Andhrapradesh.
So now why Swamy the intellectual is objecting in case of Rajanikant? May be lot of politics is involved in that statement.

BJP better consider Swamy as its face in Tamilnadu. But seasoned BJP is aware that voters and citizens are comfortable with entertainers from any field and never are comfortable with intellectuals. Democracy functions more by emotion and least by intellectualism. It is surprising that Swamy is not aware of this..

Thursday, May 18, 2017

తలపులు మన మానసిక ఆరోగ్యము; అనురాగము-ఆలంబన;Education

తలపులు మన మానసిక ఆరోగ్యము

మనకు కలిగే తలపులు మన మానసిక ఆరోగ్యమునకు సంకేతం. ఉత్సాహం హాయినిచ్చే తలపులను, నిరుత్సాహం బరువైన భావములను కలిగిస్తాయి. మంచి స్నేహితులు నిర్మలమైన భావములను, హాయి నిండిన తలపులను కలిగిస్తారు.

***********

అనురాగము-ఆలంబన



నేర్చుకున్న ఈత మర్చిపోము
కలిగిన అవగాహన కరిగిపోదు

విరిసిన మల్లె గుబాళించును
మురిసిన మనసు తుష్టినొందును

ఆహ్లాదమందిన హృదయము అనురాగమందించును
ప్రహ్లాద వరదుని కలిసిన మనసు క్రుంగదు వీడిరాదు

రమణీయానుభవమున ముంచి తేల్చిన రమణి
హృదయ నాయిక ఎప్పటికిని మరులొలికించు ముదిత

రామమన్న ఆనందము మానసిక విరామమన్న శాంతి
మనసు రమణవిరమణములే మానసికకలాప ప్రశాంతులు

అంతయు వరదరాజస్వామి పేరిందేవుల కరుణా
కటాక్షములు; మొదలైన మన కథను కంచికి చేర్తురు

మనిషి జీవితము బుద్బుద ప్రాయము క్షణికము
నేర్చిన కూర్చిన కళలు శాస్త్రములు వేదాంతమంలు
తత్త్వములు; పంచిన పెంచిన మమతలు శాశ్వతములు
నరుడగును నారాయణుడు నారాయణీ ఉపాసనమున

ద్వైతాద్వైతముల ద్వంద్వముల
సంచరించి అలసిన మనసు, వ్యక్తి
కరిగి లీనమగుదురు పరునియందు
భక్తిని ముక్తిని పొంది నిర్మల మానసానుభవమున
జీవింతురు తరింతురు మానవులు
ప్రకృతీ పురుషుల అనురాగమున ఆలంబనన

************

Education

Education should happen in peace and should give pleasure but never pressure. Education must prepare a free spirit full of confidence, courage and compassion and knowledge. But this atmosphere is missing in many .educational institutions in India. especially in privately run commercial establishments. Neither the faculty nor the students are allowed to breathe freely.

Many kinds of restrictions and fears are put in the garb of "educating". Many parents are treated in an undignified way by the managements. Many parents do not have an idea of education and many are thinking education is a "free passage" to job. But the certificate obtained spending thousands and lakhs in various grades of education institutions does not guarantee any job.

The free spirit one should be is becoming a psychological wreck for not getting a job or knowledge.
Liberty is essential for getting educated. Current competitive and unpleasant establishments running educational institutions as factories and the teachers as just workers in a factory; such corporate entities can never make the hearts of students blossom and make mind illumined and enlightened. In essence they cannot educate the students.

శ్రీ రమణ మహర్షి పలుకులు; పోతన; పెరట్లో మొక్కలు


శ్రీ రమణ మహర్షి పలుకులు

జీవాత్మ - మనస్సు

ప్రాణము అభివ్యక్తమయ్యే మార్గములలో మనస్సొకటి. ప్రాణ శక్తియే జీవనవ్యాపారముగా, దానిని తెలుసుకొను చైతన్యముగా (మనస్సుగా) వ్యక్తమౌతుంది. తలపు, గ్రహణా మనో వ్యాపారములే.

తలపు వ్యక్తిత్వములో ఒక దశ.

మనస్సు తలపు రూపు. జీవుడే, జీవ భావమే వ్యక్తి, వ్యక్తిత్వమూను. వ్యక్తిత్వానికి జీవుడని వ్యవహారము. మనస్సు జీవ శక్తి యొక్క రూపు. హృదయములో వసిస్తుంది. ఆత్మ చేతన మేధలో ప్రచలితము అవడమే మనకు మెలకువ రావడము, తలపులు, గ్రహించడము మొదలవడమూను.

జీవాత్మ తన్ను ఆవిష్కరించే పలురూపాల్లో తలపు ఒకటి.

శరీరములో మానసికముగా ఏర్పడిన "ఆసామీ" యే జీవాత్మ.

శరీరంలో ఏర్పడిన "ఆసామీ" నిదురిస్తూ ఉండడమే మోక్షము. ఆసామీ రహితమైన (బంధ, సంబంధ రహితమైన) గమనించే తెలివియే ఆత్మ.

ఆత్మ నీకు ఎఱుకయే. ఆత్మ నీ ఎఱుకయే.

*************


పోతన గారు ఎక్కడ నివసించారు అన్న చర్చలో సమయం గడిపే బదులు భాగవతంలోని ఆణిముత్యాల వంటి
పద్యాలను కంఠస్థం చేయడానికి ఆ సమయం ఉపయోగించడం ఆయనకు సరియైన నివాళి.
ఈ దిశలో ఎవరూ పయనించటం లేదు.

**********

పెరట్లో మొక్కలు

గెల వేసినది అరటి చిగురించినది తులసి
పెరట్లో మొక్కలు ముదమును కూర్చుచున్నవి

పనస తొనలు తీయదనము జామల దోరతనము
పసందుగా రుచి చూచు భాగ్యము కలిగె నేడు
మామిడి చెట్లు ఊరగాయలకు అందించె కాయలు
ఇచ్చె మధుర ఫలములనూ; నిత్య పంట కొబ్బరి

సపోటా నేరేడు పెరగవలె పెద్ద వృక్షములుగ అప్పుడిచ్చును
పూసి కాచి ఆరోగ్యమును కలిగించు మధుర ఫల రాజములను

ప్రకృతి పురుషుని కొఱకై చేయును ఎన్నో విందులు
ప్రకృతి లేక లేము మనము మన కలుములు సుఖములు

Sunday, May 14, 2017

ఉపనిషత్ ధ్యాన పద్ధతులు - బ్రహ్మ విద్యలు



ఉపనిషత్ ధ్యాన పద్ధతులు - బ్రహ్మ విద్యలు


శ్రీ వాశిష్ట గణపతి ముని - రమణమహర్షుల గురుత్వం

నా ఏకలవ్య శిష్యరికం

రమణుల మాటలు

ఇక్కడ రమణులు అంటే రమణి పదమునకు బహువచనము కాదు. శ్రీ రమణ మహర్షి అని.

మన మాట భావమునకు, తలపునకు, ఆలోచనకు ప్రతిఫలనము. ఫలము. భావములు​, తలపులు, ఆలోచనలు, మానసిక దృష్టులు; అనుభవమునకు, అర్థమవడానికి, అవగాహనకు, ఆకళింపుకు, ఆలోకనకు, ఆస్వాదనకు, ప్రతిఫలనము. ఫలము. అనుభవము, అవగాహన, ఆకళింపు, ఆలోకన, ఆస్వాదన, అర్థమవడం ఇవన్నీ శ్రద్ధకు, ప్రతిభావ్యుత్పన్నతలకు, జిజ్ఞాసకు, జ్ఞానార్జనకు, జ్ఞాన సముపార్జనకు తెలివితేటలకు ఫలములు.

నేను యానాంలో ఫిజిక్స్ అధ్యాపకునిగా పని చేస్తున్నప్పుడు, సహ రసాయనశాస్త్రాధ్యాపకులు, నా సహ చరులు అయిన రామాయణం సత్యనారాయణ గారు శ్రీ కొండూరి వీరరాఘవాచార్యులవారు (అప్పటికి వారు సన్యసించారు) రచించిన "ఆత్మజ్ఞానము" అనే పుస్తకం చదవడానికి ఇచ్చారు. అప్పటికి నాకు మనందరం భగవద్గీత ద్వారా విన్న, ప్రచారంలో ఉన్న ఆత్మను గురించిన రెండు మూడు మాటలు తప్ప మరేమీ తెలియవు.

ఇది వరకు అప్పటికి​ మనలో ఆత్మ ఉంటుందని,శరీరం మరణించినపుడు ఈ ఆత్మ మరణించిన శరీరంనుంచి, పునర్జన్మ ఎత్తబోయే కొత్త శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుందని విన్నాను. కాని పునర్జన్మల మీదా, ఆత్మ పరకాయ ప్రవేశం మీదా నాకు చిన్నప్పటి నుంచి స్ఫురణ రూపంగా నమ్మకం లేదు.

అందుకని ఈ ఆత్మజ్ఞానము పుస్తకము చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ విషయంపై కొన్ని కొత్త స్ఫురణలు కలిగాయి. ఆత్మ గురించి మాట్లాడుతూ ఉపయోగించ బడిన "జ్ఞ", అక్షరం అనండి, పదము అనండి, ఆత్మ మనలో ఉండి మనకు జ్ఞానము కలగడానికి తోడ్పడుతుంది, తోడ్పడుతోంది అనే స్ఫురణ కలిగింది.

ఈ స్ఫురణ కలిగినప్పుడు నాలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఈ స్ఫురణ ఆత్మ పట్ల నా దృష్టిని, దృక్పథాన్ని మార్చేసింది. మనకు అన్నీ తెలిసేలా చేసే శక్తి స్వరూపము ఆత్మ అనిపించింది. ఈ అవగాహన నా మనసుని వికసింపజేసి నన్ను ఎంతో ఉత్సాహపరచింది.

అప్పుడు అలా ఆత్మజ్ఞానము పుస్తకము చదివాను. నాకున్న విజ్ఞాన శాస్త్రావగాహనతో ఆత్మ స్వరూప స్వభావాలపై ఒక ఆకళింపు కలిగింది. ఆత్మను ఆ దృష్టితోనే పరిశీలించడం ప్రారంభించచాను.

అదే సమయంలో నేను మనసంటే ఏమిటి, మనసు వల్ల మనకింత అలజడి, బాధ, ఆవేదన, ఎందుకు కలుగుతున్నాయి తెలుసుకోవాలనే ఉత్సుకతతో మనసు, బుద్ధి ఉండేవి. ఆత్రేయ గారి మనసుపై పాటలన్నీ లోతుగా అధ్యయనం చేయడం మొదలు పెట్టాను. అదే సమయంలో జగ్గయ్య గారు ఆత్రేయ గారి సినిమా పాటల సంపుటం ప్రచురించారు. ఈ పుస్తకము మనసుపై లౌకికమైన అవగాహన కలిగించింది.

అప్పటికి నేను భగవద్గీత ఒక సారి పూర్తిగా చదివి ఒక అవగాహన ఏర్పరచుకున్నాను. మనసు మనిషియైన మనమనీ, బుద్ధి పరమాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడనీ అనిపించింది.

ఇన్ని భావములతో, ఆలోచనలతో, కించిత్ కృష్ణ పరమాత్మతో సాగించిన మానసిక సంభాషణ నా హృదయాన్ని దున్ని ఉంచాయి.

అదే సమయంలో నా స్నేహితుడు గురుప్రసాద్ తోడల్లుడైన శ్రీ గుంటూరి రామకృష్ణ గారు వారి పినతండ్రి శ్రీ గుంటూరి లక్ష్మీకాంతం గారు రచించిన శ్రీ వాశిష్ట గణపతి ముని గారి ఆత్మకథ "నాయన" ఇచ్చి చదవమన్నారు. ఆ పుస్తకము నన్ను అప్రతిభుడిని చేసింది. గణపతిముని వ్యక్తిత్వం నన్ను ఎంతో ప్రభావితుణ్ణి చేసింది.

ఆ పుస్తకం లోనే గణపతి ముని తపస్సు, బాల్యం లోనే ఆయన కవితా వ్యాసంగము, జ్యోతిషశాస్త్రం పై పట్టు, పాండిత్యం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన నవద్వీప విజయం, కావ్యకంఠ బిరుదు ప్రదానం ఎంతో ముచ్చటగొలిపాయి. ఆయన మంత్రోపాసన, మంత్రశాస్త్ర ప్రావీణ్యం, మద్రాసులో అవధాన, ఆశుకవితా నిపుణతలు, శిష్య పరంపర, శిష్యగణము గురించి చదువుతూంటే మైమరచి​పోయాను. ఆయన అభిమానినై పోయాను.

అంతటి మంత్రశాస్త్రవేత్త, తపస్వి, కవి, అవధాని, వేద పండితుడు, సంస్కృత, తెలుగు భాషలలో దిట్ట, సాహితీ
స్రష్ట, తెలుగు అధ్యాపకుడు బేలయై అరుణాచలం పై ఉన్న బ్రాహ్మణ స్వామి పాదములు పట్టుకొని తపస్సు నిర్వచనం అడిగినప్పుడు రమణ మహర్షి నాకు పరిచయమయ్యారు.

అప్పటికి రమణ మహర్షి, రమణాశ్రమం పేర్లు, అరుణాచలం, చలం గారు ఆ ఆశ్రమపరిసరాలలో నివాసం ఏర్పరచుకోవడం గురించి చదవడం తప్ప మరేమీ రమణ మహర్షి గురించి తెలియదు. నన్ను ఆకర్షించిన, ఆకట్టుకున్న గణపతి ముని రమణులని గురువుగా స్వీకరించడం నాలో రమణ మహర్షి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించింది.

అదే సమయంలో నేను రమణ మహర్షి భాషణములు అనే ఆశ్రమం ప్రచురణను చూచాను. చేప నీటిలో ఈదుతూ జీవించినట్టు నేను ఆ పుస్తక పఠనంలో ఈదుతూ గడిపాను. మొదట్లో నాకేమీ అర్థం కాలేదు. అయినా చదివేశాను. అలా నాలుగైదు సార్లు చదివేశాను. కొద్ది కొద్దిగా అవగాహన కలగడం ప్రారంభించింది.

ఆ విధంగా నేను గణపతి మునికి, రమణ మహర్షికి ఏకలవ్య శిష్యుడిని. వారిద్దరూ నాకు ఆధ్యాత్మిక గురువులు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు, నాన్నగారు కలిగించిన ఆధ్యాత్మిక అంకురం చిలవలు, పలవలు వేయడానికి గణపతి ముని, రమణులు, వారి వ్యక్తిత్వాలు, అనుభవ పూర్వక మాటలు ఎంతో తోడ్పడ్డాయి. అందుకని గణపతి మున,ి రమణులు అంటే నాకు గౌరవం, గురుభావం. భగవద్గీత గురించి వినడంతో మాత్రమే పూర్తి
అయ్యి, నా సమస్త ఆధ్యాత్మిక జ్ఞానము అయిన స్థితి నుంచి ఆత్మజ్ఞానము, బ్రహ్మముల పైన వ్యాసములు వ్రాసే స్థితికి రాగలగడానికి ఎంతో ఉపయోగపడినవి గణపతిముని, రమణుల మాటలు. నేను మా తల్లిదండ్రులకు, వాశిష్ట గణపతి ముని, రమణ మహర్షులకు నాకు కలిగిన ఆధ్యాత్మిక అవగాహన ఆకళింపు లకు ఎంతో ఋణపడి ఉన్నాను.

గణపతి ముని వ్రాసిన విశ్వ మీమాంస, రమణుల సంభాషణమంలు, నేను ఎవడును? (తమిళంలో నాన్ యార్?), ఉపదేశసారము, సూరి నాగమ్మ గారు రచించిన శ్రీరమణాశ్రమ లేఖలు నా ఆత్మ, బ్రహ్మ జ్ఞానముల లోతులు పరిశీలించే ఆకళింపు కలగడానికి ఎంతో తోడ్పడ్డాయి.

వీరందరికీ, వారి సంభాషణలు, మాటలు, లేఖలకి నేను ఎంతో కృతజ్ఞుడిని.

ఉపనిషత్తులలో పది ధ్యాన పద్ధతులున్నాయి. వీటిని బ్రహ్మ విద్యలు అంటారు.

శంకరులు భూమ విద్యా ఉపదేశకులు.

రామానుజులు శాండిల్య విద్యా ఉపదేశకులు.

రమణులు దహరా విద్యా ఉపదేశకులు.

ప్రాణోథ్గీత విద్య, అక్షరోథ్గీత విద్య, భృగు విద్య, జ్యోతిర్ విద్య, సంవర్గ విద్య, ఉపకోసల విద్య, వైశ్వానర విద్య ఇతర విద్యలు.
ఈ విద్యలన్నీ క్రమానుగతంగా చర్చించబడతాయి.

Friday, May 12, 2017

శ్రీ రమణుల బోధ


శ్రీ రమణుల బోధ

శ్లో: హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
హ్యహ్య మహ మితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతా వా
పవన చలన రోధాత్ ఆత్మ నిష్ఠో భవ త్వం 


తాత్పర్యము: 


హృదయ గుహా మధ్యమందు ఏకమైన బ్రహ్మము మాత్రమే నేను, నేనని ఆత్మ రూపముగ (న) భాసించుచున్నది. తన్ను తాను వెదకి మనస్సు చేతనో, జ్ఞానము లేదా ధ్యానము వలననో, ప్రాణ రోధమువలననో హృదయమునందు మునుగుము; అటుల హృదయమునంది ఆత్మ నిష్ఠుడవు కమ్ము


***********
 
మన జీవితంలో మనకున్న కష్టాలు, విషాదాలు, బాధలు చాలవన్నట్టు ప్రపంచం లోని విషాదాలను, బాధలను కష్టాలను కూడా కాగలించుకుంటున్నాము. ఎందుకో మనకీ అవస్థ. వింతలు వింతలు మన ప్రవర్తనలు. మనసుని కాసేపు కూడా స్థిమితంగా ఉండనివ్వటం లేదు మనం. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకని మనకు ఈ విషయం తెలియటం లేదు? మన నాగరీక ప్రకటనము కన్న మన ఆరోగ్యం మిన్న.

**********

Wednesday, May 10, 2017

తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత; భాషలు, జ్ఞానము; ఆస్తికత-నాస్తికత; భారతదేశంలోని వింతలు


తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత



తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత నేటి మత గురువులకు ఉంటే బాగుండును.
ఆయన గీతను చెఱపకుండా గీతను చిన్నది చేశాడు.; దాని పక్కన పెద్దగీత రాసి.

మన మతం గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఇతర మతాలను చిన్నబుచ్చక్కరలేదు. ఆ గీత గురించి ఏమీ అనకుండా తమ మతం గొప్పతనం, దాని శ్రేష్టత ప్రచారం చేసుకోవచ్చు. ఇతర మతాలు హీనమైనవి అని ప్రచారం చేయడం మూర్ఖత్వం​. తమది గొప్పమతం అని టముకు వేసుకోవచ్చు.

ఏదిఏమైనా​ అన్ని మతాల వారు అవస్థలు పడుతున్నారు.

ఏ మతమూ ఏ మానవునీ సుఖసంతోషాలలో ఉంచలేక పోతోంది. ఇంక ఈ అమాయక, మూర్ఖత్వపు ప్రచారాలెందుకో? అప్పనంగా ఇస్తున్న డబ్బులకోసం అయి ఉండవచ్చు.

మరో మతం వాళ్ళని ఊచకోత కోయడం కొన్ని మతాల దుర్లక్షణం. ఇది నాగరికత వెల్లివిరుస్తోంది అనుకుంటున్న
నేడు యథేచ్ఛగా జరగడం ప్రపంచంలో మేధావుల కొఱత వలన. రాజకీయం తప్ప వేరు విషయం తెలియని ప్రపంచ నాయకులు, మూర్ఖత్వం మూర్తీభవించిన మిత్రునికి గురువులు ప్రపంచంలో అలజడి, అస్తవ్యస్త పరిస్థితి, మానవ మారణహోమాలకు కారణం అవుతున్నారు.
మతం మతి భ్రమించి ఉన్మాదస్థితి లోనికి నెట్టబడుతూంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం పుస్తకాలకే పరిమితం అవడం దురదృష్టకరం.
మతం మానవ కల్యాణానికి కాక మానవ మారణహోమానికి కారణం కావడం, దానిని ఆపే సత్తా కల మేధావులు ప్రపంచంలో లేకపోవడం మరింత దురదృష్టం.

అందరమూ చేతులెత్తేసి విపత్కర పరిణామాలకు సిద్ధపడ్డట్టుంది.

***********
 భాషలు, జ్ఞానము

భాషలు, జ్ఞానము ఎవరూ శ్రద్ధాసక్తులతో నేర్చుకోవడం లేదు. చదువుకోవడం పరమార్థమే మారిపోయింది. భాషలు సరిగా రాకపోయినా, శాస్త్రజ్ఞానములు ( ప్రకృతి శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలు) లోతుగా నేర్వకున్నా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందుకని భాషాధ్యయనంపై నిర్లక్ష్యము. శాస్త్ర విజ్ఞాన సముపార్జనపై చిన్న చూపు. ఇది నేటి భారతదేశంలో చదువుల స్థితి (దుస్థితి).

ఎవరికీ జ్ఞాన సముపార్జనపై దృష్టి, ఆసక్తి, గౌరవము లేవు. ఎన్నో అపసవ్య మార్గములలో ఎందరో ఈజీ మనీ సంపాదించగలగడం మరొక కారణము; చదువు, సంస్కారం కాని, పాండిత్యాన్ని కాని, విజ్ఞానాన్ని కాని, జ్ఞానాన్ని కాని ఈయలేకపోవడానికి. తల్లిదండ్రుల్లో కాని, విద్యార్థులలో కాని చదువు పట్ల జిజ్ఞాస, అవగాహన, గౌరవం లేనంత కాలం , విద్యాసంస్థలు కాబూలీవాలాల చేతుల్లో ఉన్నంతకాలం చదువు‌ అబ్బదు. మనలాంటి సున్నిత మనస్కులము వాపోతూంటాము అంతే.
***********

భగవంతుని ఉనికిని నమ్మడం ఆస్తికత. భగవంతుడు లేడని నమ్మడం నాస్తికత. రెండూ నమ్మకాలే!

************

భారతదేశంలోని వింతలు

భారతదేశంలో ఉన్న అన్ని ఛిద్రాలకి భారతదేశంలోని కుహనా మేధావులు మూడింటిని బాధ్యులను చేస్తారు. వారి మేధాశక్తి అపూర్వము అనిపించేలా మాట్లాడతారు. వ్యాసాలు రాస్తారు. టిి.వి లోని చర్చల్లో పాల్గొని ఈ మూడింటిని దునుమాడేస్తారు. సంస్కార రహిత, అసభ్య భాష నిర్లజ్జగా ఉపయోగిస్తారు కూడా. వీరి వీరంగాలకు అడ్డు, అదుపు, ఆపూ ఉండవు. ఏ సైతానో వీరిలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు ఊగిపోతారు.

ప్రపంచం లోని ఇతర దేశములను, సంఘములను, అక్కడి పరిస్థితులను అసలు గమనిస్తారో లేదో తెలియదు. ఈ మూడింటిని ఆడిపోసుకోవడం మాత్రం వీరికి నిత్య కృత్యం. వీరిలో ఏమీ చదువుకోని, వివిధ అంశాలపై ఏ విధమైన పరిజ్ఞానము, జ్ఞానం, అవగాహన, కనీస ఇంగితం లేని కుల నాయకుల నుంచి, పత్రికా ప్రతినిధులు, అన్ని మీడియాలలోని ప్రముఖులు, రచయితలు, కవులు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాం అనుకున్న వాళ్ళు, వివిధ లలిత కళల్లో ప్రజ్ఞ కలవారు, నాస్తికులు, రేషనలిష్టులు, వివిధ వాదముల ప్రియులు ఉంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నారో లేరో తెలియదు. భారతదేశ ఆలోచనా, అవగాహనా ప్రపంచాన్ని మాత్రం ఏలేస్తున్నారు. ఛిద్రమూ చేస్తున్నారు. 

వీరికి ఆవేశం ఎక్కువ. అవగాహన తక్కువ. ఆ మూడింటిపై ద్వేష, విద్వేషాలు అపరిమితం. అనవసరమైన కక్ష. ఎవరు చెప్పినదాన్ని వీరు గణించరు.

తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. అందరూ తమ మాట వినాలంటారు. వినని వాళ్ళని అసభ్యంగా తిడతారు. తమని మించిన మేధావులు లేరనే భ్రమ, భ్రాంతులలో మునిగి తేలుతూ ఉంటారు.
వీరి మాటల, చేతల విచ్చలవిడితనం,​ మొండితనం సభ్య సమాజానికి అసహ్యంగా ఉంటుంది. అయినా నేడు భారతదేశంలో వీరే సంఘ, దేశ ఆలోచనా ధోరణిని శాసిస్తున్నారు.

వీరు దునుమాడే మూడూ: మగవారు, బ్రాహ్మణులు, హిందూ మతం/ధర్మం.

 

Tuesday, May 9, 2017

దైవము; Cross border terrorism; Reel life heroes and real life possibilities



దైవము
ఏ రూపాన్ని చూస్తే, ఏ నామాన్ని వింటే, స్మరిస్తే, ఏ తత్త్వాన్ని తెలుసుకుంటూంటే మనని మనం మరచిపోతామో అది దైవము.
***********
 Cross boarder terrorism

Iran, Afghanistan and India are suffering the disasters of cross border terrorism nurtured by their common neighbor;  but are not able to do anything beyond giving vain stern warnings. Even China is suffering the same from the same neighbor across the border.
Silent suffering of all these nations is hundred-fold emboldening the common neighbor to perpetuate the damage with impunity.
May be none of the suffering nations want to wage a war. That reality is further encouraging the common neighbor to be reckless. China must know the Islamic terrorism in its boarder province with that terrorist nation will cause grief sooner or later.
The other three neighboring the terrorist nation; must together should evolve a military plan to get rid of the common menace of cross border terrorism.

************* 

Reel life heroes and real life possibilities

Reel life heroes are posing as real life heroes to salvage the troubles of the citizens and are trying to cash their popularity of silver screen to convert into votes for their possible entry into politics. Many reel life heroes and heroines have done this earlier with not commendable effect and the present triers also will be the same. But the ordinary people super impose their reel adventures on real life and get themselves disillusioned and elect them to the disastrous consequences to the rest of the citizens and the nation. Very sad that voters are confused between reel life adventures and real life possibilities. Illusion and virtual influences always make people childish and sick in mind to believe in the impossibilities that; these reel life stars will transform their lives as they do in movies.