Showing posts with label తలపులు. Show all posts
Showing posts with label తలపులు. Show all posts

Thursday, March 29, 2018

కల్పనా సాహిత్యం ; మీమాంస; Strange Indian democracy!; తలపులు; Professions and India;


 కల్పనా సాహిత్యం
కథలు, నవలలను, గద్యమైనా, పద్యమైనా, గేయమైనా, కవితయైనా కల్పనా సాహిత్యమంటారు. ఆ కథ కానీ, నవల గాని నిజముగా జరిగినది కాదు. కల్పించి రాసినది. ప్రస్తుతము కథా, నవలా కల్పనా సాహిత్యాలుఎక్కువ మంది చేత గద్యము లోనే రాయబడుతున్నాయి.
కల్పనా సాహిత్యము కూడా సమాజాన్ని ప్రతిబింబించాలని ఒక వర్గము సాహితీ వేత్తలు, విమర్శకులు, రచయితలూ/రచయిత్రులు అంటారు. సాధారణముగా సమాజములో కనీళ్ళు, కష్టాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఒకరిని ఒకరు దోచుకోవడాలు, మోసం చేసుకోవడాలు, మోసం చేయడాలు, చంపడాలు, చావడాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ దినపత్రికలలో, టీవీల్లో, అంతర్జాల వార్తఆ మాధ్యమాలలో ఈ సమాజాన్నే మనకు చూపిస్తారు. మళ్ళీ కల్పనా సాహిత్యములో కూడా ఈ ధోరణి మాత్రమే ఉండాలని ఎందుకంటారో నాకు తెలియదు.
మనిషికి మానసిక వినోదము, మానసిక వికాసము, సాహిత్యము, ఇతర లలిత కళల వల్ల కలుగుతాయి. ప్రస్తుతము సమాజములో సినిమా అనే మాధ్యమము ద్వారా మనము అందరమూ మానసిక వినోదము పొందుతున్నాము. అలాగే ఐదు+ఐదు జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు కావలిసిన వినోదాన్ని రకరకాలుగా పొందుతున్నాము.
మానసిక వికాసము కావాలని మనలో చాలా మందిమీ అనుకోవడము లేదు. చదువు కొంత మానసిక వికాసాన్ని ఇస్తుంది. కానీ మనము చదువు రూపు రేఖలు మార్చేసి, ఒక కాగితము ముక్క తెచ్చిపెట్టే 18-20 ఏళ్ల శ్రమగా, ఖర్చుగా, ఆపై దానికి తగ్గ ప్రతిఫలము వస్తుందో రాదో తెలియకుండా, పట్టించుకోకుండా పిల్లల, మన శ్రమ, ఖర్చులతో పిల్లల జీవితాలతో, మనసులతో, జీవన గమ్యములతో జూదము ఆడుతున్నాము. అంతాతెలిసీ ఏమీ చేయ లేని నిస్సహాయస్థితిలో పడిపోయాము.
పిల్లలకు ఇంగిత జ్ఞానము కూడా నేర్పలేని దుస్థితిలో ఉన్నాము. పంచతంత్రము, నీతి శతకము, హితోపదేశ కథలు, జాతక కథలు, రామాయణ,మహాభారత, మహా భాగవత ఇతిహాసములలో చెప్పే కథలు, మనము మన పిల్లలకు చెప్పడము లేదు.
అలాగే తోటిమనుషులతో ఎలా మెలగాలి, మంచి, మర్యాద అంటే ఏమిటి, జీవితములో విలువలు అంటే ఏమిటి, కుటుంబము అంటే ఏమిటి, కుటుంబములో మన పాత్ర ఏమిటి, స్నేహము అంటే ఏమిటి, అనుబంధములు అంటే ఏమిటి, ఏవి బంధములు; ఈ విషయాల గురించి అస్సలు చెప్పడము లేదు.
మనిషి భాష దగ్గర నుంచి అనుకరణతో నేర్చుకుంటాడు. ప్రవర్తన, చదువు, జీవిత గమ్యాలు ఇవన్నీ అనుకరించే నేర్చుకుంటాడు, నిర్ణయించుకుంటాడు. ఈ సావాకాశాలు మన పిల్లలకి మనము ఇవ్వడము లేడు. దానికి తోడు మన జీవశైలిలు కూడా అభ్యంతరకరంగా, అధ్వాన్నముగా తయారయ్యాయి.
సాహిత్యము ఎక్కడా ఏవిధమైన పాత్ర పోషించకుండా భాషే సరిగ్గా నేర్చుకోకుండా జాగ్రత్త పడుతున్నాము.
ఇదివరకు నిరక్షరాస్యులైనా ఇంగితము బాగా కలిగి జీవితాన్ని నడుపోగల శక్తియుక్తులు ఉండేవి.
దానికి కారణమూ చిన్నప్పటినుంచి ఇంటో మంచి సాహిత్యమును నోటిమాటతో అయినా చెప్పుకోవడము వలన, చెప్పడము వలన.
ఎంతో మంది విద్యాలయములకు వెళ్లేవారు కాదు కానీ తమ జీవన స్థితిని బాగా ఉంచుకో గలిగే వారు. వృత్తి విషయములో నిబద్ద్ధతతో ఉండేవారు.
దీనికంతటికి పుస్తకములద్వారా గాని, పెద్దల మాటల ద్వారా గాని (పెద్దల మాటలు మంచి సాహిత్యము మీద ఆధారపడి ఉండేవి - చద్ది మూటలు అవి), జీవితానికి ఉపయోగమైన వివిధ విషయాలు నేర్చుకునే వారు, పాటించేవారు.
ఇప్పుడంతా విడతీసి, విభజించి "మంచి మాటలని" అంటూ, శత్రుత్వాలు పెంచే మాటలు చెబుతూ, చేతలు చేయిస్తు ఉన్నారు.
దీనికంతటికీ కారణము మన పిల్లలకు సరియైన చదువు అందక పోవడమే.
కల్పనా సాహిత్యము మానసిక వినోదంతో పాటు వికాసము కలిగించాలి.
ఇది మన దేశములో చాన్నాళ్లు జరిగింది. ఎట్టి పరిస్థితులలోను, ఎట్టి
విధముగానైనా విద్వేషములను రగిలించరాదు.
ప్రజల సుఖ శాంతులకు భంగము కలింగించ రాదు. అది సాహితీ స్రష్టలు, మేధావులు, పండితులు తప్పక పట్టించుకుని, పాటించుకోవలసిన విషయము.
ప్రతి కులానికి, మతానికి, ప్రాంతానికి, సిద్ధాంతానికి, ఉపజాతీయత్వానికి ఒకొక్క రకమైన మేధావులు తయారై; విద్వేషములను, శత్రుత్వములను రావణ కాష్ఠముగా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చేయడము బాధ్యతా రాహిత్వము.
సరియైన కల్పనా సాహిత్యాల్ని చదవక పోవడము వల్ల మనుషులు మృగాలకి భిన్నముగా ప్రవార్తించలేరు. ప్రవర్తించలేక పోతున్నారు. దాని దుష్ప్రభావాన్ని మనందరమూ అనుభవిస్తున్నాము.
కల్పనా సాహిత్యము చేయగలిగిన సాయము ఎప్పుడైనా, ఏ యుగములోనైనా అమోఘమైనది. మళ్ళీ మనదేశములో కల్పనా సాహిత్యము సమాజానికి మేలు చేసే విధముగా సృష్టించ బడుతుందని నా ఆశ. ప్రార్థన.
********
మీమాంస

"నేను రాసే కథలలో కథనం ఎక్కువగా ఆత్మాశ్రయంగా ఉంటుంది. అంటే నేను కథని ఉత్తమ పురుషలో నడుపుతాన్నమాట", అని
ఈ మాటలు మాట్లాడుతూ సభికులవైపు చూశాను. అందరి మొహాలు "ఏం మాట్లాడుతున్నారు?" అని అడగాలన్నట్టు వారి కవళికలు తెలిపాయి. సభికులలో ఎక్కువ మంది సాహితీ పిపాసులు, స్రష్టలు, ఉపన్యాసకులు, విమర్శకులు.
కొంచెం తెలుగులో చెప్పండి అని ఒకాయన తిరస్కారంగా అడిగాడు. ఈ మధ్య ఏమీ తెలియకపోవడం, భాష రాకపోవడం, ఒక
హోదా అయింది అనిపించింది. లేకపోతే, నేను భౌతిక శాస్త్రం చదువుకున్న వాణ్ణి. భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పదవీవిరమణ చేసిన వాణ్ణి.
నేనెంత, నా తెలుగెంత? అందులో నా ప్రవేశం ఎంత? ఏదో మాధ్యమిక పాఠశాల స్థాయిలో చదువుకున్న పాఠాలు, కావ్యాంశాలు. నా సర్వీసంతా ఆంధ్రేతర ప్రాంతాలలో, ప్రవాసాంధ్రునిగా గడిచిపోయింది.
నేను మాట్లాడే తెలుగు చిన్నప్పుడు స్నేహితులం
అంతా మాట్లాడుకున్న వ్యావహారిక భాష మాత్రమే.
విశ్వనాథ సత్యనారాయణ గారి భాష కాదు. గ్రాంథికం అసలే కాదు. గిడుగు వారి గురించి విన్నాం. వ్యావహారిక భాష విషయంలో ఆయన ఉద్యమం గూర్చి చదివాము. నేను మాట్లాడుతున్న భాష వ్యావహారిక తెలుగు; ఇంకా ఈయన తెలుగులో మాట్లాడమంటాడేమిటి అని బోలెడు ఆశ్చర్య పోయాను. నాకు ఇంతే తెలుగు వచ్చు. కావలిస్తే ఆంగ్లం లో చెబుతానన్నాను.
"I write most of my fiction in First person" అన్నాను.
కాని నా తెలుగుకి ఇంత గౌరవమిచ్చిన ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉత్సుకతతో ఆయనను సమీపించాను. ఆయన చరవాణిలో నిమగ్నమై ఉన్నారు. తరువాత ఎవరో చెప్పారు, ఆయన ప్రసిద్ధ పత్రికా రచయిత అని.
తెలుగు భాషలో మాట్లాడుతూంటే తెలుగు భాషలో మాట్లాడండి అనిపించుకున్న నా కొచ్చిన తెలుగు భాషలో మాట్లాడాలో? వద్దో? మీమాంసగా తయారైంది నాకు.

********

Strange Indian democracy!
If you divide citizens on the basis of religion, that too only on the basis of the word Hindu, it is communalism.
If you divide citizens on the basis of caste, community or region or language, it is not communalism.
******
It center does not give funds to the state governments, it is denying their constitutional right.
If state governments do not give funds to local bodies as guaranteed by construction it is not constitutional wrong committed by state governments.
*********
Professions and India
In India the only profession that is thriving is business. The ancient vocations agriculture and industry are sub-serving the business aspect of profession.
The noble professions teaching and providing health care are cornered and compromised by private entrepreneurs and the shine of these professions has long gone. Any other profession except doing business is not giving enough money for a decent living and every one is forced to do business with whatever profession one is.
The noblest profession of spiritual teaching has become the most polluted profession.
That is why the society is experiencing so much agony and trouble to meet to ends meet or live a dignified living unless resorted to business of some kind.
********
Continuous flow and or change of of thoughts and or feelings is functioning mind. Continuous state of experience is mood. Mind is dynamic, where as mood is static mind.
*******
తలపులు
తలపులను మార్చును కమనీయ కవనములుగ కవి
తలపులను మార్చును రమణీయ శిల్పములుగ శిల్పి
తలపులను మార్చును అందమైన బొమ్మలుగ చిత్ర కారుడు; 
తలపులను మార్చును రంగారు రచనలుగ రచయిత, 
వాగ్గేయకారుడు; సరిగమపదనిసల తలపులతో కలిపి 
రమ్యగీతములనిచ్చును సంగీతజ్ఞుడు

తలపులను నియమించలేక సతమతమగుదుము మనము; 
అనిష్ట తలపుల ఉధృతియే వేదన, వ్యథ, బాధ; సంతోషము నిచ్చు 
తలపులు కలుగుట హాయి, సుఖము; కాల స్పృహ, గమనము తలపుల సృష్టినే

తలపుల ఉనికియే మనసు; తలపుల తీవ్రతయే వలపు, 
సలుపు, రక్తి, భక్తి; తలపుల వరుసయే మనసు గతులు, 
గంతులు, మానసిక స్థితి గొంతులు;
తలపుల లేమియే శాంతి, ప్రశాంతత, ఆనందము

తలపులు నిండుకొనుటయే పూర్ణ స్థితి, ముక్తి, మోక్షం, 
నిర్వాణము; తలపులే మనిషి, లేమియే పరంధామము
******
How we use a thing is very important for our and others safety and well-being.
******
Better we give place to robots by ourselves disappearing!
******
Anything is possible in western diplomacy! They see issues only from their perspective!
********

Thursday, May 18, 2017

తలపులు మన మానసిక ఆరోగ్యము; అనురాగము-ఆలంబన;Education

తలపులు మన మానసిక ఆరోగ్యము

మనకు కలిగే తలపులు మన మానసిక ఆరోగ్యమునకు సంకేతం. ఉత్సాహం హాయినిచ్చే తలపులను, నిరుత్సాహం బరువైన భావములను కలిగిస్తాయి. మంచి స్నేహితులు నిర్మలమైన భావములను, హాయి నిండిన తలపులను కలిగిస్తారు.

***********

అనురాగము-ఆలంబన



నేర్చుకున్న ఈత మర్చిపోము
కలిగిన అవగాహన కరిగిపోదు

విరిసిన మల్లె గుబాళించును
మురిసిన మనసు తుష్టినొందును

ఆహ్లాదమందిన హృదయము అనురాగమందించును
ప్రహ్లాద వరదుని కలిసిన మనసు క్రుంగదు వీడిరాదు

రమణీయానుభవమున ముంచి తేల్చిన రమణి
హృదయ నాయిక ఎప్పటికిని మరులొలికించు ముదిత

రామమన్న ఆనందము మానసిక విరామమన్న శాంతి
మనసు రమణవిరమణములే మానసికకలాప ప్రశాంతులు

అంతయు వరదరాజస్వామి పేరిందేవుల కరుణా
కటాక్షములు; మొదలైన మన కథను కంచికి చేర్తురు

మనిషి జీవితము బుద్బుద ప్రాయము క్షణికము
నేర్చిన కూర్చిన కళలు శాస్త్రములు వేదాంతమంలు
తత్త్వములు; పంచిన పెంచిన మమతలు శాశ్వతములు
నరుడగును నారాయణుడు నారాయణీ ఉపాసనమున

ద్వైతాద్వైతముల ద్వంద్వముల
సంచరించి అలసిన మనసు, వ్యక్తి
కరిగి లీనమగుదురు పరునియందు
భక్తిని ముక్తిని పొంది నిర్మల మానసానుభవమున
జీవింతురు తరింతురు మానవులు
ప్రకృతీ పురుషుల అనురాగమున ఆలంబనన

************

Education

Education should happen in peace and should give pleasure but never pressure. Education must prepare a free spirit full of confidence, courage and compassion and knowledge. But this atmosphere is missing in many .educational institutions in India. especially in privately run commercial establishments. Neither the faculty nor the students are allowed to breathe freely.

Many kinds of restrictions and fears are put in the garb of "educating". Many parents are treated in an undignified way by the managements. Many parents do not have an idea of education and many are thinking education is a "free passage" to job. But the certificate obtained spending thousands and lakhs in various grades of education institutions does not guarantee any job.

The free spirit one should be is becoming a psychological wreck for not getting a job or knowledge.
Liberty is essential for getting educated. Current competitive and unpleasant establishments running educational institutions as factories and the teachers as just workers in a factory; such corporate entities can never make the hearts of students blossom and make mind illumined and enlightened. In essence they cannot educate the students.