Showing posts with label పెరట్లో మొక్కలు. Show all posts
Showing posts with label పెరట్లో మొక్కలు. Show all posts

Thursday, May 18, 2017

శ్రీ రమణ మహర్షి పలుకులు; పోతన; పెరట్లో మొక్కలు


శ్రీ రమణ మహర్షి పలుకులు

జీవాత్మ - మనస్సు

ప్రాణము అభివ్యక్తమయ్యే మార్గములలో మనస్సొకటి. ప్రాణ శక్తియే జీవనవ్యాపారముగా, దానిని తెలుసుకొను చైతన్యముగా (మనస్సుగా) వ్యక్తమౌతుంది. తలపు, గ్రహణా మనో వ్యాపారములే.

తలపు వ్యక్తిత్వములో ఒక దశ.

మనస్సు తలపు రూపు. జీవుడే, జీవ భావమే వ్యక్తి, వ్యక్తిత్వమూను. వ్యక్తిత్వానికి జీవుడని వ్యవహారము. మనస్సు జీవ శక్తి యొక్క రూపు. హృదయములో వసిస్తుంది. ఆత్మ చేతన మేధలో ప్రచలితము అవడమే మనకు మెలకువ రావడము, తలపులు, గ్రహించడము మొదలవడమూను.

జీవాత్మ తన్ను ఆవిష్కరించే పలురూపాల్లో తలపు ఒకటి.

శరీరములో మానసికముగా ఏర్పడిన "ఆసామీ" యే జీవాత్మ.

శరీరంలో ఏర్పడిన "ఆసామీ" నిదురిస్తూ ఉండడమే మోక్షము. ఆసామీ రహితమైన (బంధ, సంబంధ రహితమైన) గమనించే తెలివియే ఆత్మ.

ఆత్మ నీకు ఎఱుకయే. ఆత్మ నీ ఎఱుకయే.

*************


పోతన గారు ఎక్కడ నివసించారు అన్న చర్చలో సమయం గడిపే బదులు భాగవతంలోని ఆణిముత్యాల వంటి
పద్యాలను కంఠస్థం చేయడానికి ఆ సమయం ఉపయోగించడం ఆయనకు సరియైన నివాళి.
ఈ దిశలో ఎవరూ పయనించటం లేదు.

**********

పెరట్లో మొక్కలు

గెల వేసినది అరటి చిగురించినది తులసి
పెరట్లో మొక్కలు ముదమును కూర్చుచున్నవి

పనస తొనలు తీయదనము జామల దోరతనము
పసందుగా రుచి చూచు భాగ్యము కలిగె నేడు
మామిడి చెట్లు ఊరగాయలకు అందించె కాయలు
ఇచ్చె మధుర ఫలములనూ; నిత్య పంట కొబ్బరి; 

సపోటా నేరేడు పెరగవలె పెద్ద వృక్షములుగ అప్పుడిచ్చును
పూసి కాచి ఆరోగ్యమును కలిగించు మధుర ఫల రాజములను

ప్రకృతి పురుషుని కొఱకై చేయును ఎన్నో విందులు
ప్రకృతి లేక లేము మనము మన కలుములు సుఖములు