మంచున తడిసిన గులాబీలు
ముగ్ధ మనోహరములు, మంచున తడిసిన గులాబీ,
వలపున తడిసిన మనసుల సొగసులు;
ప్రణయము, ప్రకృతియు సుగంధములు
కుసుమ కోమలములు; వయసుకు తగ్గ అందములు,
ఆనందములు; ప్రియ హృదయాలిగనములు;
ప్రణయము లేని వయసు మసకబారిన మనసు
************
స్త్రీ పురుషులు వదలలేరు;
ముగ్ధ మనోహరములు, మంచున తడిసిన గులాబీ,
వలపున తడిసిన మనసుల సొగసులు;
ప్రణయము, ప్రకృతియు సుగంధములు
కుసుమ కోమలములు; వయసుకు తగ్గ అందములు,
ఆనందములు; ప్రియ హృదయాలిగనములు;
ప్రణయము లేని వయసు మసకబారిన మనసు
************
స్త్రీ పురుషులు వదలలేరు;
జనాలు వదలలేరు
జల్లికట్టు తమిళనాట
కోడిపందెములు తెలుగింట;
ఎవరేమన్నను ఏమిచేసినను
న్యాయస్థానాలు నిషేధించినను;
ప్రభుత్వాలు లోపాయికారీగా,
కోడిపందెములు తెలుగింట;
ఎవరేమన్నను ఏమిచేసినను
న్యాయస్థానాలు నిషేధించినను;
ప్రభుత్వాలు లోపాయికారీగా,
జనాలు మనస్ఫూర్తిగా కాగలించుకున్నందు
వల్ల జరిగితీరును; మిగతావన్నీ కబుర్లు;
జనాలు ఎవరిమాటా వినరు; సాంప్రదాయం
పేరుతో కొందరు, జూద ప్రియత్వం వల్ల ఇంకొందరు
వల్ల జరిగితీరును; మిగతావన్నీ కబుర్లు;
జనాలు ఎవరిమాటా వినరు; సాంప్రదాయం
పేరుతో కొందరు, జూద ప్రియత్వం వల్ల ఇంకొందరు
ఈ పందేలు మానరు; న్యాయస్థానాలు, జంతు
హక్కుల పోరాట వాదులు మిన్నకుండ వలసిందే
జూదము, తాగుడు, వ్యభిచారము, డ్రగ్స్, ఇతర
అటువంటి వ్యసనములు స్త్రీ పురుషులు వదలలేరు;
హక్కుల పోరాట వాదులు మిన్నకుండ వలసిందే
జూదము, తాగుడు, వ్యభిచారము, డ్రగ్స్, ఇతర
అటువంటి వ్యసనములు స్త్రీ పురుషులు వదలలేరు;
*********
ధన్యవాదములు-కృతజ్ఞతలు
ఏ రోజు ఏ పండగో తెలియని
అగమ్యగోచరంలోనికి నెట్టేస్తున్న
అగమ్యగోచరంలోనికి నెట్టేస్తున్న
పంచాంగ కర్తలు, సిద్ధాంతులు, స్వాములు
పండితులు; గందరగోళాలు సృష్టిస్తూ
టి. వి. ఛానెల్స్; పండగపై శ్రద్ధాసక్తులు
పోయే స్థాయిలో సిద్ధాంత రాద్ధాంతాలు
పండితులు; గందరగోళాలు సృష్టిస్తూ
టి. వి. ఛానెల్స్; పండగపై శ్రద్ధాసక్తులు
పోయే స్థాయిలో సిద్ధాంత రాద్ధాంతాలు
చివరకు వేదాంతులమై మానసికంగా భగవంతుని
అర్చిస్తే పోదా; పండుగలు చేయడం
టి. వి. ఛానెల్స్ లో చూస్తే పోదా; అన్న నిర్వేదానికి
మనల లోను చేస్తున్నవారికి నతులు,
ధన్యవాదములు కృతజ్ఞతలు
*********
ఫలితం శూన్యం-ఆయాసం మిగులు
ప్రస్తుత "సభ్య సమాజానికి" దేనిని గోప్యంగా ఉంచాలి, దేనిని టాం టాం చెయ్యాలి అనే విషయం అస్సలు తెలియదు.
సమాచార, సాంకేతిక సాధనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మన జీవితాలను అతలా కుతలం చేస్తున్న నేడు పెచ్చు పెరిగిన ఉత్సాహం తో మనల్ని మనమే ఎంతో ఇబ్బంది పెట్టుకుంటున్నాము.
మనకి సమాచార విప్లవం వచ్చిందో బుర్రలు సరిగా పని చేస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు. మనకి అక్కర్లేని విషయం లేదు. గుప్తంగా జరిగిపోవలసిన సంగతులని వీధికెక్కించుకుంటున్నాము. ఈ బహిరంగ వీరంగాలు ఏమిటో?
మనలో ఎంతోమందిమి సమాజ ఋగ్మతలను పోగొట్టే ప్రయత్నాలను ఏమీ చేయలేం; కాని నిరంతరం వాటి గురించి మాట్లాడుకుంటూ, వాదాలలో మునిగి తేలుతూ సమయాన్ని, ఓపికని వృథా చేసికుంటున్నాము.
మనలో ఒక 5 శాతం మందికి ఏ పనీ ఉండదు. పెద్ద ఆలోచనాపరులలా ప్రతిదాని మీదా విరుచుకుపడతాం. ప్రతి వారిమీద విరుచుకుపడతాం. ఇలా ఉందేమిటి, అలా ఉందేమిటి అంటూ ప్రతిదాన్నీ ఏకి పారేస్తాం.
మన దృష్టికి రాని సామాజిక సమస్య లేదు. మనచే గర్హించబడని విషయాలు, వ్యక్తులు లేరు. ఈ గందరగోళం అంతా మనకెందుకు అంటే కోపాలొస్తున్నాయి. ఒక బాధ్యతగల పౌరునిగా మనం స్పందించకపోతే నామోషీ అన్నట్లు నడుస్తున్నాయి వ్యవహారాలు. స్పందనలు.
ఈ హడావుడిలో 95 శాతం మంది తమ శక్తి కొలది కష్టపడి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి పాలకుల, ప్రభుత్వ యంత్రాంగం సాయాలు లేవు. పై పెచ్చు లంచాలు, అవినీతి. ఎవరు స్పందించాలో వారు స్పందించక, మనందరం అంతర్జాల సామాజిక సాలెగూళ్ళలో ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు.
రకరకాల సాంఘిక, సామాజిక విభజనలతో సతమతమవుతున్న మనం, తలొకరికి తలొక న్యాయం కావాలంటున్నాము. రాజకీయ నాయకులు ఈ భేదాలను, విభేదాలను చాకచక్యంగా ఉపయోగించుకుని అవినీతి శేఖరులై, అవినీతి పరుల కొమ్ము కాస్తూ నెట్టుకొస్తున్నారు. వీళ్ళని చూసి ప్రభుత్వోద్యోగులు అయిన కాడికి దోస్తున్నారు.
ఈ విషయాల్లో, ప్రభుత్వాలు, నాయకులు సరిగా వ్యవహరించాలి. అది లేనప్పుడు మన రోదన అరణ్యరోదనే అవుతుంది. ఎవరికివారు వారి విధుల నిర్వర్తిస్తూ, బాధ్యతలు వహిస్తూ జీవిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. మనం సామాజిక సాలెగూళ్ళలో ఎంత గొంతు చించుకున్నా, చిందులు వేసినా ఫలితం శూన్యం.
********
తర్కం సునిశితమైనది. రెండు వైపులా పదును కల కత్తి. ఎన్నో సార్లు తర్కం నిజాన్ని చూడలేదు. చూపించలేదు. గానుగెద్దులా అలా చుట్లు తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తర్కం ఆపేసి మౌనంగా ఉంటే నిజం తనంత తానే ప్రకటితమవుతుంది. తర్కం తత్త్వదర్శనాన్ని కలిగించడం కన్నా అడ్డడం ఎక్కువగా చేస్తుంది. అప్పుడు నమ్మకం మనలని ఒడ్డున పడేస్తుంది. శుభం భూయాత్!
********
ఎదవరి
ఎద అంటే హృదయము అనే అర్థం కూడా ఉంది కదా, అంచేత ఎదవరి అంటే ఎదలను (హృదయాలను, మనసులను) చదవగలవాడు అనే అర్థమూ తీసి కోవచ్చు ఈ పరంపరలో - చదువరి ....
ఎద, హృదయం అర్థం లో కవులు ఉపయోగించారండి. పశువు ఋతువు అనేది ఒక అర్థం. ఒక పదానికి నానార్థాలు ఉంటాయి కదా!
No comments:
Post a Comment