ఓంకారము
ఓంకారము గురించి వినని ముముక్షువులు ఉండరు. కాని ఓంకారము అంటే తెలిసిన వారు మాత్రము అరుదు. భారతీయ తత్త్వశాస్త్రానికి సంబంధించి విషయము విన్నవారు ఎక్కువ. అవగాహన చేసికున్నవారు తక్కువ. అంతా వినికిడి జ్ఞానమే. సంబంధిత గ్రంథములను లోతుగా చదివి, మననము చేసికొని, అనుభవంగా మార్చుకునేవారు చాలా తక్కువ. తమ వినికిడి మిడి మిడి జ్ఞానంతోనే అందరినీ ఆకట్టకోవాలని, తద్వారా ప్రసిద్ధులం కావాలని చాలా మందికి ఆరాటం. అందులో వారిని వారు ఉద్ధరించుకోవాలనే దృష్టి ఉండదు.
ఇలాంటి కంగారు మనుషులు వల్ల తత్త్వము తప్పుగా ప్రచారం అవుతోంది. ఇటువంటి వారి వల్ల లాభం కన్న నష్టం ఎక్కువ జరుగుతోంది. తమ మిడి మిడి జ్ఞానాన్ని అజ్ఞానం రూపంలో అందరికీ అందిస్తున్నారు.
అ-ఉ-మ లతో ఓంకారము తయారైందని ఒక ఉపనిషత్తు చెప్పింది. ఇతర ఉపనిషత్తులు, తత్త్వశాస్త్ర గ్రంథాలు ఓంకారాన్ని ప్రణవం అన్నాయి. శబ్దబ్రహ్మ సిద్ధాంతము స్ఫోట అంది. అద్వైత వేదాంతము మాయ అంది. ఆత్మజ్ఞానం చిదాభాసా అంది. ఓంకారము చిత్ శక్తి.
ప్రణవం అనే పదం ప్రాణం అనే పదం లోంచి వచ్చింది. ప్రణవము, ఓంకారము ప్రాణ శక్తులు. ఊపిరి యొక్క ఉచ్ఛ్వాస - నిశ్వాసముల నుంచి జనించినవి.
ఈ జగత్తంతా ప్రణవమయమనీ, మాయామయమనీ పెద్దలు చెప్పారు. ప్రణవం లోంచే అంతా, అన్నీ జనించాయని మనం విన్నాం. చదివాము.
ఈ హడావుడిలో అంతా, అన్నీ ప్రణవమయమంటే, కొందరు బుద్ధిమంతులు ఈ భౌతిక ప్రపంచం అంతా ప్రణవ జనితం అని వ్యాఖ్యానించారు. ఓంకారానికి, ప్రణవానికి, చిదాభాసకు, మాయకు, స్ఫోటకు ఈ బయటి భౌతిక జగత్తు నిర్మాణానికి, సృష్టికి ఏ విధమైన సంబంధం లేదు. భౌతిక శాస్త్రం ఆ సంగతులు చూసుకొంటుంది.
ఈ జగత్తు, ప్రపంచం, విశ్వం పదాలు వేదాంతలోని సాంకేతిక, పారిభాషిక పదాలు. వీటి తత్త్వార్థములు
వేరు. ప్రజల్లో ప్రాచుర్యమైన అర్థాలు వేరు.
వేరు. ప్రజల్లో ప్రాచుర్యమైన అర్థాలు వేరు.
వేదాంత పంశదశి ప్రపంచాన్ని ఈ విధంగా నిర్వచించింది:
శ్లో: అస్తి భాతి ప్రియం నామం రూపంచ ఇత్యంశ
పంచకం ;
ఆద్యత్రయం బ్రహ్మరూపం తతో ద్వయం జగద్రూపం
పంచకం ;
ఆద్యత్రయం బ్రహ్మరూపం తతో ద్వయం జగద్రూపం
ప్రపంచం ఐదు అంశలతో, అంశాలతో ఏర్పడింది.
అవి అస్తి (సత్), భాతి (చిత్), ప్రియం (ఆనందం), నామం, రూపం.
మొదటి మూడు అంశలు బ్రహ్మరూపం. చివరి రెండూ జగత్ రూపం. ఇలా తలపుల రూపమైన జగత్ లో బ్రహ్మము (ఆత్మశక్తి), మూడు పాళ్ళు, విషయములు - బయటి భౌతిక ప్రపంచంలోని వస్తువులు - జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించబడిన తన్మాత్రలు - విషయశక్తులు - నామము, రూపము రూపాలలో రెండు పాళ్ళు గా కలిసి ఉంటాయి.
సర్వం ఖలు ఇదమ్ బ్రహ్మా - ఉపనిషద్వాక్యము సారాంశం ఇదే.
ఇక్కడ ఇదమ్ అంటే మానసిక జగత్తు, మానసిక కార్యకలాపాలు జరగడం.
ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్
యత్ కిమ్ చ జగత్యాం జగత్
యేన త్యక్తేన బుంజీధాః ...
మా గృధః కస్యచిద్ధనమ్...
యత్ కిమ్ చ జగత్యాం జగత్
యేన త్యక్తేన బుంజీధాః ...
మా గృధః కస్యచిద్ధనమ్...
అనే ఈశావాస్య ఉపనిషత్తులోని ప్రథమ శ్లోకమూ ఈ సంగతినే ప్రస్తావిస్తోంది. ఇక్కడ ఈశ శబ్దం చిత్ శక్తికి, ఇదమ్, జగత్ పైన మనం వ్యాఖ్యలలో చర్చించుకున్న విధంగా మానసిక కార్యకలాపాలు, తలపులకు చెందుతాయి.
ఇప్పుడు
మాయా మయమ్ ఇదం జగత్- తత్త్వ వాక్యము మనకి తేలికగా అర్థమవుతుంది.
ఈ విధంగా మానసిక జగత్ మాయా మయం గాని, బయటి భౌతిక జగత్తు మాయామయం కాదు. జగత్తంతా ప్రణవమయమనీ, ప్రణవంతో నిర్మించి బడినదన్నా ఇదే అర్థము.
చిదాభాసా, మాయ, ప్రణవము, ఓంకారము, స్ఫోట - ఇవన్నీ ఒకే ఆత్మశక్తి కి వివిధ నామములు.
అలా ఓంకారము శ్వాస జనితము. ఓంకారము ధ్వని. ఇదే చిత్ శక్తి. ఈ చిత్ శక్తి దివ్య శక్తి, స్వర శక్తులుగా విడి అన్ని శారీరక, మానసిక కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది.
జ్ఞానేంద్రియాలు, మనస్సు ద్వారా, ఇతర అంతఃకరముల ద్వారా, జ్ఞానసముపార్జనము, చేసేటప్పుడు ఈ దివ్య శక్తిని ఆకాశ విభూతి అంటారు.
అంతఃకరణములు, కర్మేంద్రియాల ద్వారా భాషాధ్యయన, అధ్యాపనములు చేస్తున్నప్పుడు శక్తి రూపాన్ని స్వర శక్తి అంటారు. స్వర శక్తిని వాయువు యొక్క విభూతి అంటారు.
ఆకాశ, వాయువులే పంచభూతములలో ప్రధానమైనవి. తేజస్సు, అప్, అన్నము - మిగిలిన ఈ మూడు భూతాకాశ అంశలు ఆకాశ, వాయువుల నుంచి ఉత్పన్నమైనవి. ఇవీ పంచభూతములు.
మనం అనుకునే ఖగము, గాలి, నీరు, అగ్ని, భూమి కాదు.
మనం అనుకునే ఖగము, గాలి, నీరు, అగ్ని, భూమి కాదు.
ఆకాశము గమనికకు, జ్ఞానమునకు, జ్ఞాన శక్తికి జ్ఞానసముపార్జనమునకు ప్రతీక. జ్ఞాన అధ్యయనం, అధ్యాపనము ఈ శక్తి వల్ల, ద్వారా జరుగుతాయి.
వాయువు యాంత్రిక శక్తికి ప్రతీక. శారీరక, మానసిక
యాంత్రిక కార్యకలాపాలు అన్నీ వాయు విభూతి యైన స్వర శక్తి వల్ల, ద్వారా జరుగుతాయి.
యాంత్రిక కార్యకలాపాలు అన్నీ వాయు విభూతి యైన స్వర శక్తి వల్ల, ద్వారా జరుగుతాయి.
ఇది తత్త్వం. ఉపనిషత్తులు, షడ్ దర్శనములు, తదితర తత్త్వ శాస్త్ర గ్రంథాలు చర్చించిన పరమాత్మ తత్త్వం ఇదే.
అలా ఓంకారము శ్వాస జనితము. ధ్వని. మనకు వినిపించని ధ్వని.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!************
కాల గమనము-కాల స్పృహ-కాలాతీతతత్త్వము
నిజానికి కాలగమనము మన భ్రమ, భ్రాంతి. కాలమానము మన కల్పన. కాల ప్రవాహము అంటూ ఏమీలేదు.
వస్తు చలనాన్ని కాలముగా భ్రమ పడతాము మనము. అలాగే వస్తు పరిణామాన్ని కూడా కాలము అనుకుంటాము. అలాగే ఎదుగుదల, క్షీణతలనూ మనము కాలగమనము అనుకుంటాము.
మనిషి ఇతర జీవులు ఎదుగుతాయి, క్షీణిస్తాయి. మరణిస్తాయి. ఈ మార్పులు కాలగమనం వల్ల జరుగుతున్నాయి అనుకుంటాము. పరిణమించడం, మార్పులకు లోనవడం జీవుల లక్షణము. ఇందులో కాలగమనానికి ఎటువంటి పాత్ర లేదు.
వస్తు చలనము లోనూ, వస్తు పరిణామం లోనూ, జీవ పరిణామం లోనూ అంతర్గతంగా శక్తి పరిణామం ఉంది. శక్తి పరిణామం లేక కాలము కాని, కాల గమనము కాని లేవు.
కాలః పరిణామః అని తత్త్వ వాక్యము.
కాలః శక్త్యాః పరిణామః. కాలము శక్తి మార్పు చెందడం వల్ల కలుగుతుంది. శక్తి వస్తు స్థితిని మార్చడం వల్ల కలుగుతుంది. శక్తి పరిణామము, శక్తి ద్వారా పదార్థము స్థితి, గతులు మార్పులు చెందడం వల్ల కాలము కలుగుతుంది. శక్తి, పదార్థముల సంపర్కము, సంబంధం లేక కాల సృష్టి గాని, ఉనికి, స్పృహ గాని లేవు.
ఈ అవగాహనతో మనం మనసు, ఆలోచనలు, తలుపులు అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. మనకు కాల స్పృహ కలగడానికి తలపులు కారణము, ఆధారము. నిజానికి మనసు తలపుల వరుస మాత్రమే.
మనకు కాల స్పృహ, మెళకువ (జాగ్రత్), కల (స్వప్న) మానసిక దశలలో మాత్రమే కలుగుతుంది. ఈ రెండూ ద్వైత స్థితులు. ఇప్పుడు మన దృష్టి గమనిక - ప్రపంచం, లేక గమనిక - జగత్ లుగా విడి ఉంటుంది. ఉపనిషత్తులు దీనిని అహం-ఇదమ్ అంటాయి.
గమనిక-ప్రపంచం లుగా విడి ఉంటే అప్పుడు బాహ్య ప్రపంచ వస్తు గ్రహణం మనసు-జ్ఞానేంద్రియముల ద్వారా చేస్తుంది. అప్పుడే చిత్తము ఆ వస్తు గ్రహణం కలిగించే సుఖదుఃఖములను/అనుభవములను గ్రహించి వాసనలు గా, స్మృతి గా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. మళ్ళీ తదనంతరం అవసరమైనప్పుడు వెలికి తీస్తుంది.
బాహ్య ప్రపంచ భౌతిక వస్తుగ్రహణం చేస్తున్నప్పుడు మనము బహిర్ముఖ దృష్టి కలిగి ఉంటాము.
మనసే, జ్ఞానేంద్రియముల ద్వారా తను చేసిన గ్రహణలను మస్తిష్కంలో ఆంతర ప్రపంచం గా భద్రపరుస్తుంది. మనసు అలా, చిత్తము ఇందాక అన్నట్టు అనుభవములను మరల వెలికి తీసేటప్పుడు మనము అంతర్ముఖులము అవుతాము. అప్పటి మానసిక దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. మనసు అంతర్ ప్రపంచ గ్రహణం చేయడమే తలపులు కలగడం. మనం భావించడం.
బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులను మానసిక దృష్టులు అంటారు. ఈ దృష్టుల సమయంలో మాత్రమే మనకు కాల స్పృహ ఉంటుంది. ఇది తలపుల, అనుభవముల రూపంలో ఉంటుంది.
తలపుల రూపంలో మనం భూత, భవిష్యత్తులలో విహరిస్తాము. వర్తమానాన్ని గమనించడం ఆపేస్తాము. మానేస్తాము. వర్తమానంలో జీవించగలగడం గొప్ప తత్త్వావగాహనము. తత్త్వ సిద్ధి.
తలపులు, అనుభవములు అంతఃకరణ పరిణామములు. మనోబుద్ధ్యహంకారచిత్తములు అంతఃకరములు. అంతఃకరణములు చిత్ శక్తి విభూతులు. చిదాభాసా పరిణామములు. అలా మనకు కాల స్పృహ కలగడానికి కారణమైన తలపులు, అనుభవములు శక్తి పరిణామములే.
మనసు గ్రహణకు; చిత్తము వాసనలను కలిగించడానికి, ప్రేరేపించడానికి, స్మరించడానికి; బుద్ధి నిశ్చయానికి, తర్కానికి; అహంకారం వ్యక్తిత్వ సృష్టికి,
స్పృహకు ఉపయోగిస్తాయి.
స్పృహకు ఉపయోగిస్తాయి.
మెళకువతో కూడిన నిద్ర (జాగ్రత్ సుషుప్తి), గాఢనిద్ర (సుషుప్తి) అద్వైత స్థితులు. దృష్టి అహం(గమనిక)-ఇదమ్ లుగా విడి ఉండదు. విశ్రాంతమై ఉంటుంది. ఏ చిదాభాసా పరిణామములు చోటు చేసికోవు. అన్ని విధములైన మానసిక కార్యకలాపాలు విరమింపబడి
ఉంటాయి. ఇప్పటి దృష్టిని విశ్రాంత దృష్టి అంటారు.
మానసిక కార్యకలాపాలు జరగవు కనుక తలపుల, అనుభవముల రూపమైన కాల స్పృహ ఉండదు.
ఉంటాయి. ఇప్పటి దృష్టిని విశ్రాంత దృష్టి అంటారు.
మానసిక కార్యకలాపాలు జరగవు కనుక తలపుల, అనుభవముల రూపమైన కాల స్పృహ ఉండదు.
అందుకనే అద్వైత స్థితులు కాలాతీత స్థితులు. ఇప్పటి దృష్టి ఆత్మ దృష్టి. అహమ్-అహమ్ స్ఫురణా స్థితి.
ఇలా భౌతిక, మానసిక కాల స్పృహలు మనకు కలుగుతాయి. రెండూ మిథ్యలే. భ్రాంతులే. భ్రమలే.
వాస్తవములు కాదు.
వాస్తవములు కాదు.
భగవంతుడు కాల స్వరూపుడు, కాలాతీతుడు. శక్తి పరిణామములు ఆయనను అంటవు. భగవంతుడు అహంకార, మమకార రహితుడు, అతీతుడు. జ్ఞానీ అంతియే.
జీవ దృష్టిలో ఇదే మోక్షం, నిర్వాణం, మౌనము, శాంతము, ఆనందము. జీవైక్యమే కాలాతీత స్థితి.
భగవత్ స్వరూపమైన, కాల, కాలాతీత తత్త్వములకు నమస్కారము.
సమస్త సన్మంగలాని భవంతు!
శుభం భూయాత్!
సకలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
శుభం భూయాత్!
సకలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
**********
The study of scriptures, sciences and ideas and getting insight of them, learning of fine arts and performing them, are all meditation, including secular disciplines and are interpretations of reality and Truth.
*********
రాజకీయములన్న భారతదేశమున పార్టీ అధినేత కుటుంబపాలన
ఆ ఇంట్లో తరతరాలకు నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమపు అమలు;
కొందరు భజనపరుల పక్కనేసుకొని వారికి కులముల వారీగా తాయిలాలు అందించి తమ పాలేరుల చేసికొని ప్రభుత్వమున తామే, తమవారే "కలకాలముండుట"; ప్రజలకు చేసిన హామీలే ప్రతి ఎన్నికలో మరి మరి చేసి
మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయుట; వారి నెత్తిని చేయుంచుట.
***********
The content we read has influence on our mind. If we desire to be in tune with current events, they are most disturbing. Confining to devotional and spiritual works makes others dub us as otherworldly. It seems difficult to be both news savvy, cultured, civilized and the like and also be peaceful. Elders say contentment is to be aspired and owned. Let us be ourselves.
**********
All religious scriptures want welfare and well-being of human beings only.
All religions preach love for fellow humans only.
All words of religions are for compassion for living beings only and for protection and conservation of nature only.
But why is it currently religions have become so oppressive and repressive.
Because religions are hijacked by demons and even Gods are not able to do anything.
********
Being born as a human being is a celebration!
********
********
Being born as a human being is a celebration!
********
పురాణములు కథలు. రమ్యమైన కథలు. అవసరమైన రమ్యతలు. రమణీయమైన ఊహలు. సంసార సాగరం లో ఎడతెరిపి లేకుండా ఈదే మనకి
సతత తోటి ప్రయాణికులు. సాయం చేసే పథికులు.
అలసట తెలియనీయని ఉపశమనములు.
సతత తోటి ప్రయాణికులు. సాయం చేసే పథికులు.
అలసట తెలియనీయని ఉపశమనములు.
తత్త్వాన్ని ఆధారం చేసుకుని ఈ కథల రమ్యతను అవసరమైనంత వరకే ఆస్వాదించాలి. లేకపోతే మనం వాస్తవాన్ని మరుస్తాం.
**********
వాడిపోతున్న లతా నికుంజం
మౌర్యులపై ఆంద్ర శాతవాహనుల విజయపరంపరలలో
రాజరాజనరేంద్రుని కృష్ణరాయని
ధవళ కీర్తి చంద్రికలలో
నన్నయ మొదలు "కరుణశ్రీ" వరకు
జాలువారిన రసపద్యకవితా లహరులలో
రామదాసు అన్నమయ్య త్యాగరాజుల
సంగీత సాహిత్య మధుర సమ్మేళనములో
గురజాడ కందుకూరి జాషువా శ్రీశ్రీ దేవులపల్లులు
నక్షత్రాలై అలరారు నవ్యసాహితీ వినీలాకాశంలో
గోదావరి కృష్ణవేణీ పెన్న తుంగభద్రల
పవిత్ర నదీ జల ప్రవాహములో
అమరావతీ శిల్పసౌందర్యంలో
కూచిపూడి నాట్యంలో
నాగార్జున వేమన్న కొడవటిగంటిల
సునిశిత ఆలోచనా స్రవంతులలో
ప్రతిఫలించే తెలుగుదనం
అందమైన లతా నికుంజం
రూపు కోల్పోవుచున్నది చేతకాని వారి చేతులలో
వాడిపోతున్నది వివిధరీతులలో
మరింత సౌరభంతో
పరిమళిస్తూనే ఉండాలి
ఎలా???!!!
No comments:
Post a Comment