జీవన విధానము
తత్త్వ విచారములు మాత్రమే కాదు
తమ వారికై తపించుటలూ కావాలి;
భజనలు, అక్కడ తినుటలు కాదు
ఇంట్లో వారందరూ కలిసి చేయాలి భోజనాలు;
తమ వారికై తపించుటలూ కావాలి;
భజనలు, అక్కడ తినుటలు కాదు
ఇంట్లో వారందరూ కలిసి చేయాలి భోజనాలు;
భగవంతుని పై ప్రేమలో సహస్రాంశం
అయినా అయినవాళ్ళకు అందించాలి; దేవునికి
అభిషేకములు, పూజలతో పాటు, కావలసిన
వారికి సంతృప్తులూ కలిగించాలి; కుటుంబంతో
చెలిమియే అసలైన కలిమి; ఉద్యోగముతో
సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వాలి ఇంటికి
అయినా అయినవాళ్ళకు అందించాలి; దేవునికి
అభిషేకములు, పూజలతో పాటు, కావలసిన
వారికి సంతృప్తులూ కలిగించాలి; కుటుంబంతో
చెలిమియే అసలైన కలిమి; ఉద్యోగముతో
సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వాలి ఇంటికి
సన్యాసులు అమ్మలు బాబాలు స్వాములు
వారి ఆశ్రమములు కారాదు మన ధామములు
భగవన్నామస్మరణ చేసికుంటూ సంసార సాగరమును ఈదుటకై శక్తియుక్తులు వర్ధిల్లుటకై
వారి ఆశ్రమములు కారాదు మన ధామములు
భగవన్నామస్మరణ చేసికుంటూ సంసార సాగరమును ఈదుటకై శక్తియుక్తులు వర్ధిల్లుటకై
ప్రార్థించాలి; బతుకున కలుగు వడిదుడుకుల
తట్టుకొని సంయమనముతో జీవించు సౌభాగ్యమునకై వేడాలి సరసీరుహాక్షుని
శ్రీకంఠుని శరణనాలి ప్రశాంతతకై; పద్మనాభుడు
తట్టుకొని సంయమనముతో జీవించు సౌభాగ్యమునకై వేడాలి సరసీరుహాక్షుని
శ్రీకంఠుని శరణనాలి ప్రశాంతతకై; పద్మనాభుడు
భోళా శంకరుడు, మన వారు, మన దైవములు;
ముగురమ్మలు మన తల్లులు; వారి కరుణ చాలు
మన జీవితము హాయిగా సాగుటకు; ఆర్తులమో
జిజ్ఞాసువులమో అర్ధార్ధులమో అయ్యి జీవించవలె
ముగురమ్మలు మన తల్లులు; వారి కరుణ చాలు
మన జీవితము హాయిగా సాగుటకు; ఆర్తులమో
జిజ్ఞాసువులమో అర్ధార్ధులమో అయ్యి జీవించవలె
**********
********
వయసు మార్చును మన రూపులు
సొగసులు మార్చును బాలిక రూపులు
అంకురము మొక్కైనట్టు, మొగ్గ పూవైనట్టు
వచ్చి మార్పులు మార్చును చూపులు
***********
పుస్తకములు-నేను
పుస్తకముల ఒడిలో నేను
నా ఒడిలో పుస్తకములు
ఇది మా జన్మజన్మల బంధం
ఇప్పుడు ఆత్మీయ అనుబంధం
నా ఒడిలో పుస్తకములు
ఇది మా జన్మజన్మల బంధం
ఇప్పుడు ఆత్మీయ అనుబంధం
పుస్తకములు హస్త భూషణము కాక
మస్తిష్కంలో ఎన్నో సంగతులు పేర్చినవి
ఎంతో పాండిత్యము కలిగించి చదువును
ఆనందించు సద్భాగ్యమును ప్రసాదించినవి
మస్తిష్కంలో ఎన్నో సంగతులు పేర్చినవి
ఎంతో పాండిత్యము కలిగించి చదువును
ఆనందించు సద్భాగ్యమును ప్రసాదించినవి
చదువక పుస్తకాలు రోజు గడవదు
బుద్ధిని పదును పెట్టు క్షణములే
ఊపిరులై జ్ఞానయాగములై చదువుకున్న
వానినిగా చేసినవి; జంతువుకు భిన్నంగా
నన్ను తీర్చిదిద్దినవి; భామలవోలె ప్రియమార
భాషలు అలరించినవి; విశిష్టత కల్గించినవి
బుద్ధిని పదును పెట్టు క్షణములే
ఊపిరులై జ్ఞానయాగములై చదువుకున్న
వానినిగా చేసినవి; జంతువుకు భిన్నంగా
నన్ను తీర్చిదిద్దినవి; భామలవోలె ప్రియమార
భాషలు అలరించినవి; విశిష్టత కల్గించినవి
పుస్తకముల ఒడిలో నేను
*****
No comments:
Post a Comment