కాల నిర్ణయము
అర్ధరాత్రి ఆస్ట్రేలియాలో, మొదలగును ఒక తేదీ;
నలభై ఎనిమిది గంటల తరువాత అమెరికాలో
మారును ఆ తేదీ; మనిషి కల్పితమైన కాల గణన
సుడిగుండమై అహంకారయుత మనమును తిప్పి
తిప్పి వెతల, వేదనల అడుగుకు చేర్చును; కాలాతీత
తత్త్వము శక్తి, పదార్ధ పరిణామములకు అతీతము;
నలభై ఎనిమిది గంటల తరువాత అమెరికాలో
మారును ఆ తేదీ; మనిషి కల్పితమైన కాల గణన
సుడిగుండమై అహంకారయుత మనమును తిప్పి
తిప్పి వెతల, వేదనల అడుగుకు చేర్చును; కాలాతీత
తత్త్వము శక్తి, పదార్ధ పరిణామములకు అతీతము;
కాలప్రవాహము అనునది లేదు; అది మనిషి భ్రమ
శక్తి, లేక పదార్ధ పరిణామములే కాల గమనము;
శక్తి, పదార్ధము పరిణమించకున్న కాల గమనము
లేదు, భూత-భవిష్యత్-వర్తమానముల స్పృహ లేదు
శక్తి, లేక పదార్ధ పరిణామములే కాల గమనము;
శక్తి, పదార్ధము పరిణమించకున్న కాల గమనము
లేదు, భూత-భవిష్యత్-వర్తమానముల స్పృహ లేదు
మాయా రూప ఆత్మ శక్తి పరిణామమే కాలగమన
స్పృహకు కారణము; మనసు నిర్మితము కాలము;
నేను, నాది అను తలపుల వలన కలుగును
కాల స్పృహ; అహంకార, మమకారాతీతమైన,
శుద్ధ గమనిక రూపమైన ప్రజ్ఞానము కాలరహితము
కాలాతీతము; చిత్ శక్తీ పరిణామ రహితము, మానసాతీతము
భావాతీతము, శాంతము, మౌనము, ఆనందము

****************
అమెరికా విలాసం
ఇప్పటికీ అమెరికా వెళ్ళడం ఒక ఘనత
అమెరికా అల్లుళ్ళకు ఇంకా విపరీతమైన
గిరాకీ; సీనియర్ సిటిజన్ లు తమ తమ
సంతానము అమెరికాలో స్థిరపడ్డారని సంబరంగా
చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతూంటారు;
అమెరికా అల్లుళ్ళకు ఇంకా విపరీతమైన
గిరాకీ; సీనియర్ సిటిజన్ లు తమ తమ
సంతానము అమెరికాలో స్థిరపడ్డారని సంబరంగా
చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతూంటారు;
తాము అమెరికా వెళ్ళడం ప్రముఖంగా వెల్లడిస్తారు
అక్కడి తమ నివాస ఛాయాచిత్రాలు విరివిగా
దర్పంగా చూపిస్తూంటారు అంతర్జాలంలో; అమెరికా
ఎందరో భారతీయ మధ్యతరగతి వారి స్వర్గధామం;
అక్కడి తమ నివాస ఛాయాచిత్రాలు విరివిగా
దర్పంగా చూపిస్తూంటారు అంతర్జాలంలో; అమెరికా
ఎందరో భారతీయ మధ్యతరగతి వారి స్వర్గధామం;
ఒక దేశం భారతీయుల మనసును ఇంతలా ఆకట్టుకోవడం
దోచడం విస్మయజనితం; విస్మయభరితం; అమెరికా అనే
మాటే ఎందరి హృదయాలనో తహతహలాడిస్తుంది; గర్వంతో
నింపుతుంది; భారత పౌరసత్వం కన్న అమెరికా గ్రీన్ కార్డ్ మిన్న;
దోచడం విస్మయజనితం; విస్మయభరితం; అమెరికా అనే
మాటే ఎందరి హృదయాలనో తహతహలాడిస్తుంది; గర్వంతో
నింపుతుంది; భారత పౌరసత్వం కన్న అమెరికా గ్రీన్ కార్డ్ మిన్న;
లోకో భిన్న రుచిః; జనుల అహంభావ అహంకార ప్రకటనమునకు
అమెరికా పెద్ద ఆలంబన; అమెరికా సంబంధము లేని భారతీయులు
అధికులు కారని అమెరికాలో స్థిరపడ్డ ఎందరో భారతీయుల నిశ్చిత
అభిప్రాయం; భారతదేశం ఇందరు అమెరికా ప్రియులను కన్న ధన్య
అమెరికా పెద్ద ఆలంబన; అమెరికా సంబంధము లేని భారతీయులు
అధికులు కారని అమెరికాలో స్థిరపడ్డ ఎందరో భారతీయుల నిశ్చిత
అభిప్రాయం; భారతదేశం ఇందరు అమెరికా ప్రియులను కన్న ధన్య
*********************
ఏభై ఏళ్ళ “బ్రహ్మచారి”
ఏభై ఏళ్ళ “బ్రహ్మచారి” ఎన్నో వివాదములలో ముఖ్యుడు. నాలుగైదు కేసులలో నిందితుడు. కట్ డ్రాయర్ తో సినిమాలో నటిస్తే
ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం
కురిపిస్తున్నారు.
అలాగే ఎన్నో అవినీతి ఆరోపణలను ఎదుర్కొనేవారు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు.
ప్రజలను మభ్యపెట్టే, వారి అవసరాన్ని
వాడుకుందామనుకునే కాల్ మనీ నేరస్థులకు, గోల్డ్ టోపీ
వారికి అన్ని రాజకీయపక్షములనుంచీ వత్తాసు. బస్ టికెట్లను
బ్లాక్ లో అమ్ముకునే వాడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు.
విదేశములలో అక్రమముగా డబ్బు లావాదేవీలు జరిపేవాడు గౌరవనీయ కేంద్రమంత్రి.
ఇన్ని ఛండాలాలతో భారతదేశ ప్రజలు, భారతదేశం ఎలా
బ్రతుకులు ఈడుస్తున్నారో? ఎన్నాళ్ళు ఇలా ఈడవాలో?!
**********
భావ దిగంబరమైన మనసే ఆత్మ
వలువలు శరీరాన్ని కప్పుతాయి. వలువలని తీసేసినప్పుబు నిజ శరీర దర్శనం జరుగుతుంది. అనాచ్ఛాదిత దిగంబర శరీరం కనబడి రసస్థితి కలుగుతుంది. మనసు ఆ రసస్థితిలో లీనమై తన ఉనికిని కోల్పోయి నిర్మలమై ఆనందానుభవమవుతుంది.
అలా భావములు నిర్మలమైన మనసుపై ఆచ్ఛాదితమైన వలువలు. భావములు ఆత్మస్థితిపైన పేర్పుడులు.
ఆ భావములు అనే వలువలు తొలగిన లేదా తొలగించబడిన తరువాత నిజ మానసిక (ఆత్మ / బ్రహ్మము) దర్శనం కలుగుతుంది. భావ దిగంబరమైన మనసే ఆత్మ. భావాచ్ఛాదిత ఆత్మయే మనసు.

No comments:
Post a Comment