Monday, July 4, 2016

జీవిత సత్యములు - జీవన సందేశములు



జీవిత సత్యములు - జీవన సందేశములు

రోజు రోజుగ రోజులు గడిచిపోవును
వెలుగుతున్న కొవ్వొత్తి వలె ఆయుష్షు
క్షణ క్షణమునకు కరిగిపోవుచుండును;
మూన్నాళ్ళ ముచ్చటైననూ జీవితమును
నూరేళ్ళ పంటగా జవ్వని జంటగా మురియుచు
నెమ్మదిగ ఆహ్లాదముగ గడుపుచు నాజూకుగా
జీవితపు వివిధ దశలకు వీడ్కోలిచ్చుచు
తరువాతి దశలకు స్వాగతమిచ్చుచు గడపవలె
**** ****** ****** ********
"నిమిషము నిమిషమును మణులుగ కూర్చుచు
కాలపు హారమును నీ సాంగత్యమున సంగతిని
వెలిగంచుకొన వలె సఖా! రావోయి రసైక్యమునకు"
అని సఖియ గోములు పోవ ప్రవరుడైను పొంగి లొంగును
******** ********* ************
ఇక్కడ కలకాలముందుమని విద్య, ధనము
ఆర్జించవలెను; ఈ క్షణముననే యమ సదనమునకు
చనుదుమేమో అన్న శంకతో ధర్మమాచరింపవలెను
********** ‌‌‌‌‌ ********* ‌‌‌‌‌**********
ఉద్యమింపక ఏ పనియూ జరగదు, కోరికలు
తీరవు; సింహమైననూ, గుహలో నిద్రపోవుచున్న
మమ్ము తినుమని మృగములు తమంత తాము
నోటి వద్దకు వచ్చి వేడుకోవు; వేటాడితేనే తిండి
********* ‌‌‌‌‌ *********** ********
ఆకలితో మలమల మాడుచున్నవాడికి ఉడికిందా,
రుచిగా ఉందా అనేవి పట్టవు; ధనసంపాదనా రతునికి
బంధువనిగాని, గురువనిగాని విచక్షణ ఉండదు
కామాతురుల బరితెగింపులో సిగ్గు భయము ఉండవు
విద్య కావలెెననుకున్న వానికి సుఖము, నిద్ర ఉండవు
****** ‌ ‌‌‌‌‌ ********* ‌‌‌‌‌ **********
అగస్త్యుడు కుండలో పుట్టిన వాడు
పొట్టివాడు, నల్లని వాడు, అయినా
సముద్రాన్నమతా ఒక్క గుక్కలో ఔపోసన
పట్టేశాడు; ప్రతిభావ్యుత్పన్నతలు కలవారు
తమ బుద్ధి విశేషము చేతనే కార్యములు
సాధించుకుంటారుగాని తమకున్న పనిముట్టుల వల్ల కాదు
******* ‌‌‌‌ *********** ‌‌‌‌‌‌‌‌ **********
సూర్యుని సారథి తొడలు లేని వాడు
దారా? శూన్యమయమైన ఆకాశము
రథమునకా ఒకే చక్రము; అయినా
భాస్కరుడు ఉదయము మొదలు రాత్రి వరకు
వేగముగా ప్రయాణము చేస్తూ వెలుగు పంచుతాడు;
ప్రతిభావ్యుత్పన్నతలల కలవారు తమ బుద్ధి
విశేషము చేతనే కార్యములు సాధించుకుంటారు
గాని తమకు కల పనిముట్టుల సాయమున కాదు
********* *********** ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌************
దాటవలసినదా శతయోజనములు వెడల్పు కల
మహార్ణవము, జయించవలసినవాడా ‌అరివీర
భయంకరుడు, మహావీరుడు అయిన రావణబ్రహ్మ;
సైన్యమా కోతుల సమూహము; అయినా రామచంద్రమూర్తి
సముద్రాన్ని లంఘించి రావణుని హతమార్చి
సీతా విమోచనం కలిగించాడు; ప్రతిభావ్యుత్పన్నతలు
కలవారు తమ బుద్ధి విశేషము చేతనే కార్యములు సాధించుకుంటారు కాని తమ పనిముట్టుల వల్ల కాదు
*********** ‌‌‌‌‌ ************ ‌‌‌‌ *******
తనా శరీరము లేని వాడు, తన సహాయకులా
వసంతము, కోయిలలూ, తన బాణములా కుసుమాస్త్రములు, అయినా అనంగుడు
స్త్రీ పురుషుల మవస్సుల మథించి వారిని
అతలాకుతలం చేసి నిలువనీయడు;
ప్రతిభావ్యుత్పన్నతలు కలవారు తమ బుద్ధి
విశేషము చేతనే కార్యములు సాధించుకుంటారు
కాని తమ పనిముట్టుల సాయమున కాదు;

No comments:

Post a Comment