Thursday, April 28, 2016

రామబ్రహ్మమును


రామబ్రహ్మమును



పదచిత్రముల రచింతును పదకవితా
పితామహుడను కాను; అందరు దేవతలు
దేవుళ్ళపై స్తోత్రములు కూర్తును భక్తశిరోమణిని
కాను; ప్రస్థానత్రయమును వ్యాఖ్యానింతును;

శంకర భగవత్పాదులను, రామానుజులను
మధ్వాచార్యులను కాను; రాధామాధవుల
శృంగారమును వర్ణింతును గీతగోవిందకర్తను
కాను; ఆత్మజ్ఞానావగాహనపై వ్యాసములు

రచింతును, ఉపన్యాసములనిత్తును,అద్వైత
వేదాంత శ్రేష్ఠిని కాను; శబ్దబ్రహ్మ సిద్ధాంతమును,
స్ఫోట వాదమును భాషాశాస్త్ర మెళకువలను
ఔపోసన పట్టితిని పతంజలిని భర్తృహరిని కాను;

కాలము పై అన్ని శాస్త్ర దృష్టులను సమన్వయ పరుతును
భౌతిక, మానసిక, సాపేక్ష కాలములను దర్శింతును ఐన్ స్టైన్ ను
 కాను; అన్ని దర్శనములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో
చూతును, సూత్రకారుడను కాను; మనకు జ్ఞానము
కలుగు విధమును విశదపరచెదను; నూతనుడను

నా తీరు నాది; నా పరిధి నాది; నా ప్రత్యేకత నాది,
నా దారి నాది; నా వ్యాఖ్యానములు నావి; నా
సృష్టులు నావి; సమన్వయకర్తను నేను; సౌమ్యత
నా ప్రాణము; జ్ఞానార్జనము, మానవ ‌వికాసములు,

మానవత్వ ప్రబోధము మూడు కళ్ళు నాకు;
త్రినేత్రుడను కాను; శ్రీకంఠుడను, శ్రియఃపతిని
కాను నేను; వారి అంశను; వారికి అద్వైతుడను;
తల్లిదండ్రుల‌ దయను కల్గితిని; చేరెదను వారిని

4 comments:

  1. నేను పాఠకుడను, శ్రోతను జడుడనుకాను
    వినదగునెవ్వరు చెప్పిన అన్నసూక్తి వంటబట్టినవాడను
    మౌనవ్యాఖ్యా విశారదుడు శ్రీదక్షిణామూర్తి శిష్యపరమాణువుల దాసుడను

    ReplyDelete
  2. Nice sir. I could see a person who is well versed same time humble.

    ReplyDelete