బ్రహ్మ జ్ఞాన సంపన్నుల ప్రవర్తన
"బ్రహ్మ విద్ బ్రహ్మ ఏవ
భవతి" అని శాస్త్ర వచనము. బ్రహ్మమును తెలిసికొన్న వాడు బ్రహ్మమే
అవుతాడు - అని దీని అర్థము.
అవుతాడు - అని దీని అర్థము.
బ్రహ్మము అనగా ఆత్మ. "అయమ్ ఆత్మా బ్రహ్మా" అని ఉపనిషత్ వాక్యము.
ప్రజ్ఞానమ్ బ్రహ్మా - ఉపనిషత్ వాక్యము ప్రజ్ఞానమే బ్రహ్మము అంది. ప్రజ్ఞానము
అనగా గమనిక. దృష్టి.
బ్రహ్మజ్ఞానులు వట్టి గమనికగా ఉంటారు. దృష్టిలో వారికి విషయములు, విషయానుభవములు (వాసనలు -
స్థిరపడినవి - జ్ఞప్తిగా ఉన్నవి - జ్ఞప్తియందు ఉన్నవి)
ఉండవు. వారి మనసు కడిగిన అద్దము వలె ఉంటుంది. వారిది నిర్మల మానసము.
నిర్మల మానసమునే బ్రహ్మము అంటారు. నామ-భావ-వాసనా రహిత వస్తు పదార్థః
అని పదార్థ నిర్వచనము. బ్రహ్మము పదార్థము. బ్రహ్మ పదార్థము, ఆత్మ శక్తీ ఒకటే.
అని పదార్థ నిర్వచనము. బ్రహ్మము పదార్థము. బ్రహ్మ పదార్థము, ఆత్మ శక్తీ ఒకటే.
నిర్మలమానసయుతులైన బ్రహ్మజ్ఞానులు తలవడం, వ్యవహరించడం, వారి సంకల్పానుసారంగాక భగవత్ సంకల్పానుసారం ఉంటాయి. వారి
ప్యక్తిత్వము ఆత్మ/బ్రహ్మము నందు లీనమై ఉంటుంది. వారికి
వ్యక్తిత్వము లుప్తమై ఉంటుంది.
అందువల్ల వారికి అహంభావ, అహంకార, మమకారములు
ఉండవు. వారి సకల భావములు, చేష్టితములు
ఈశ్వర నిశ్చితములు. వారి పూర్వాశ్రమము ద్వారా సంబంధీకులు
చెంత చేరినప్పుడు ఉదాసీనులై ఉంటారు. కాని అంత జ్ఞాన పయోధిలో మునిగి ఉన్నా
ఇంగితమును వీడరు. భగవత్ సంకల్పానికి తమ"జ్ఞాని" స్థితిని, ఇతరులు
ఇచ్టిన ఆ"బిరుదుని" అడ్డురానివ్వరు.
శ్రీ రమణమహర్షి చేసినదదే. మాతృదేవతయైన
ఆయన తల్లి ఆయనతో కలిసి ఉండడానికి వచ్చినపుడు వారించలేదు. ఆహ్వానించనూ
లేదు. కాని మాతృదేవత ఉత్కృష్టతను తన ప్రవర్తన తో,
తల్లితో తాను వ్యవహరించిన తీరులో చూపించారు. అందరు కొమరుల వలె తల్లి అనారేగ్యములో ఆమెకు సేవ, శుశ్రూష చేశారు. జ్ఞానులైనా, అన్నిటికీ అతీతులైనా మాతృదేవత వద్దకు ఆ ప్రసక్తిని రానీయలేదు. మాతృసేవకు ఆ జ్ఞాని పదాన్ని అడ్డురానివ్వ లేదు.

ఆదిశంకరులూ తమ మాతృదేవత విషయంలో ఇలానే వ్యవహరించి, ఆ కాలపు ఛాందసుల మూర్ఖత్వమును లెక్కచేయక తమ మాతృదేవతకు
అంత్యక్రియలు నిర్వహించారు.
జ్ఞానులు ఇంగితజ్ఞులు. తాము జ్ఞానులమనే దృష్టి వారికి ఉండదు కాబట్టి, ఇతరుల ఆ
పరిగణనకు అతీతంగా ఇంగితము, కరుణ, ప్రేమ వహించి
తమ కార్యములను నిర్వహిస్తారు. వ్యవహరిస్తారు.
ఇతరుల భావముల పరిధి వారిని, వారి ప్రవర్తన ను, వ్యవహారములను
బంధించదు. నిర్ణయించదు.
సర్వము భగవత్ సంకల్పంగా భావించి భగవదర్పణముగా తమ కార్యములను, విధులను నిర్వహిస్తారు. సంఘం, సంఘంలోని పరిమిత జ్ఞానము - లౌకికము, పారలౌకికము - కల జనుల తలపులు, ఆక్షేపణలు, విమర్శలు, అడ్లు, వారి కార్యక్రమములను నిర్దేశించలేవు, నిర్ణయించలేవు.

సాధారణ సంఘ నియమములు, సాధారణ జనుల అభిప్రాయములు, అభిరుచులు, ఇష్టాయిష్టములకు
అనుగుణంగా వారి ప్రవర్తన ఉండకపోవచ్చు. ఉండచ్చు.
వారి కార్యములు భగవత్ సంకల్పంగా లోక కల్యాణార్ధంగా జరుగుతాయి. వారు తలచిన తలపులు, చేసిన చేష్టలు
వారికి తత్ క్షణం మాత్రము దృష్టిలో ఉంటాయి. ఆపై నీటిపై రాతల
వలె అదృశ్యమౌతాయి. వారికై వారు ఏమీ సంకల్పించుకోరు, చేసుకోరు, వ్యవహరించరు
గనక వీరి భావములు, కార్యములు, కార్యఫలములు
వారి జ్ఞాపకములుగా మారవు. వారి జ్ఞప్తియందు ఉండవు.
వారి తలపులు, చేష్టలు విశ్వకల్యాణానికే.
అందరి సుఖసంతోషాల కొరకే. మన మనశ్శాంతి కొరకే.
తథాస్తు! శ్రీరస్తు! సమస్త సన్మంగళాని భవంతు!
No comments:
Post a Comment