అభిమానము - దురభిమానము
మనుషులకు ఎవరినో ఒకరిని అభిమానించి తీరడం పుట్టుకతో వస్తుందనుకుంటా. తల్లిదండ్రులను, గురువులను అభిమానించడం, భగవంతుణ్ణి అభిమానించడం, కుటుంబ సభ్యులను అభిమానించడం, మిత్రులను అభిమానించడం అందరం చేస్తాము.
వీరిలో ఎవరినీ అభిమానించని వారు సినిమా నటీనటులను, రాజకీయనాయకులను, ఆశ్రమ నిర్వాహకులను, ఆధ్యాత్మిక గురువులను, సిద్ధాంతములను, ప్రాంతీయతను, కులాన్ని, మతాన్ని, ఆటగాళ్ళను వీరగా అభిమానించేసి, తమలోను, సంఘంలోనూ, గందరగోళం సృష్టిస్తారు. ఇది దురభిమానంగా తయారై అభిమానించడం అనేది ఒక వ్యసనంగా మారుతుంది. దీని దుష్ట ఫలితాలు వ్యక్తులు, సంఘం అనుభవిస్తారు.

అందుకనే బహుశా మన పెద్దలు నట, విట, ఇత్యాదులను, దూరంగా ఉంచేవారు. కళలు,
ఇత్యాది మనోరంజనకారకములు మనసును హరించి మనుషులను బానిసలుగా చేస్తాయి. ఆ
మోజులో వారు ఉచ్చనీచములు మరచి మద్యము, గంజాయి సేవించిన వారి వలె ఆ
మనోరంజకులకు మానసిక ఊడిగము చేస్తారు.
వారి వ్యక్తిత్వము, స్థాయి మరచి యువతీయువకులు, స్త్రీలు, పురుషులు నిజజీవితావ్ని ఉపేక్షించి ఈ మనోరంజకుల వినోదమాయలో సర్వమూ నిర్లక్ష్యము చేసి, జీవిత పరమార్ధము మరచి ఈ ఆకర్షణలో కొట్టుమిట్టాడుతారు.
చదువు, సంధ్య అటకెక్కి స్వాభిమానమూ పోగొట్టుకొని అలమటిస్తారు. ఇది వ్యక్తికి, సంఘానికీ కూడా మంచిది కాదు.
అభిమాన దురభిమానముల మధ్య ఎంతో అంతరముంది.
అభిమానము మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. దురభిమానం వ్యక్తిత్వాన్ని నాశనంచేసి మానసిక సమస్యలను, సాంఘిక సమస్యలను తెచ్చిపెడుతుంది. యువతీయువకులు సినీ నటీనటుల, క్రీడాకారుల పై, అటువంటి వారిపై, వాటిపై మోజును మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి.
వ్యక్తి సర్వ స్వతంత్రుడు. ఒక పరిధి మించి ఎవరికీ అడుగులకుమడుగులొత్తరాదు.

No comments:
Post a Comment