Life is a foreign language; all men mispronounce it. - Christopher Morley
************
నమ్మకము
నమ్మకము లేక శాంతి లేదు. బ్రతుకులో సుఖం లేదు. నమ్మకము కలిగి ఉండడమే అసలు చదువు. చదువువల్ల మనము వికసించాలి. ప్రశాంతత నొందాలి. అటువంటి చదువే చదువు. చదువు మనిషికి జీవనోపాధి కలిగించాలి. జ్ఞానం కలిగించాలి. బ్రతుకును జీవించడానికి సపద మనోబలం, ధైర్యము, చాతుర్యము ఇవ్వాలి. అటువంటి చదువు ఉపయోగకరమైనది. అవసరమైనది. చదువు మనసును బ్రతుకును ఉద్ధరించాలి. కరుణ, అనురాగములను పెంచాలి. మనలని మనుషులని చెయ్యాలి. భగవత్తత్వమును అర్థము చేసికొని దివ్యమైన తలపులతో జీవించేలా చేయాలి.
***********
We are many times crazy about and are die hard fans of the heroes and
heroines of the reel life. Why should not we be heroes and heroines in
our real life? Why should we remain as admirers for life? Let us be the
admired and adored.
****************
సింధు కన్యకు హరి అందం
అద్రి సుతకు హరుడందం
పుస్తకపాణికి బ్రహ్మ అందం
మనసుకు గోవింద ధ్యానమందం
*************
రాముడు శివుని ప్రతిష్ట చేసి అభిషేకించును, అర్చించును
శివుడు సతతము రామ నామమును జపియించును
నిటలాక్ష నీలమేఘ సంకాశ మేనివాడు అద్వైతులు, ఒకరే
ఒకటే స్మార్తులమై శివకేశవుల అభేదమును చాటింతము
శివుడు సతతము రామ నామమును జపియించును
నిటలాక్ష నీలమేఘ సంకాశ మేనివాడు అద్వైతులు, ఒకరే
ఒకటే స్మార్తులమై శివకేశవుల అభేదమును చాటింతము
************
Human beings learn everything by imitation and aping right from infancy, starting from talking; what all we see, hear, read, know, mingle with, make us ape and imitate that information. So it is always wise to be choosy in our reading, mingling and the like activities.
**********
నాటి యక్షప్రశ్నకు నేటి సమాధానం
మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టంలో యక్షుడు ధర్మరాజును ప్రపంచం లోని గొప్ప వింత ఏమిటి అని అడుగుతాడు.
నిత్యమూ మన కళ్ళ ఎదుట ఇందరు మరణిస్తున్నా మనం మాత్రం ఇక్కడ ఉట్టికట్టుకు వేలాడతాము, ఈ భూమి పై మనం శాశ్వతంగా ఉంటామనుకోవడం వింతల్లోకి వింత అని సమాధానం ఇస్తాడు.
ఇదే ప్రశ్నని యక్షుడు నాకు ఇప్పుడు వేసి ఉంటే, నేను ఇలా సమాధానం చెప్పేవాడిని.
ఇంజనీరింగ్ చదివిన వాళ్ళలో ఐదు శాతానికి మాత్రమే ఒక మాదిరి ఉద్యోగాలు వచ్చి మిగిలిన వారంతా నిరుద్యోగులు, చిరుద్యోగులుగా మిగిలి పోవడం నిత్యమూ చూస్తున్నా తమ ధన, మాన, ప్రాణములను, తమ పిల్లల ప్రాణములను కార్పొరేట్ స్కూళ్ల, కాలేజీల పరం చేస్తున్న తల్లిదండ్రుల సంఖ్య తామరతంపరగా పెరిగిపోవడం వింతల్లో కెల్లా వింత అని సమాధానం చెప్పేవాడిని.
అందరికీ ఇంగితం పెరగాలి అని నా ప్రార్థన.
ఎన్నో అందమైన, ఆకర్షణీయమైన, ఖరీదైన రకరకాల ఆభరణములు ధరించి నగల దుకాణం ప్రకటనలో పాల్గొనే సౌందర్యవతి నగలు ఆమె సొంతం కాదు, నగల దుకాణం యజమానివి. అలాగే మనం అనుభవించే సకల సంపదలకు యజమానులం మనం కాదు, యజమానులు భగవంతుడు, ప్రకృతీ.
************
జీవుడు సున్నయ్యె
పెన్నుతో పుస్తకంపై రాసే రోజులు పోయె
మన్నులో ఆటలాడుకొని పెద్దలచే
తిట్లు తిన్న రోజులునూ పోయె
ఆధునిక ఉపకరణములతో చదువు, ఆటలు
ముడిపడె; చదువన్న ఆటలన్న అర్థములు మారె
భౌతికముగ కష్టపడక నాజూకు నేర్చి నేడు
మనిషి తన శరీరమునే నిర్లక్ష్యము చేయుచుండె;
"శరీరమాద్యఖలుధర్మసాధనం" పోయి శరీర
విహిత కర్మములు ఉపకరణముల పాలాయె
జీవితము యాంత్రికమాయె జీవుడు సున్నయ్యె
మన్నులో ఆటలాడుకొని పెద్దలచే
తిట్లు తిన్న రోజులునూ పోయె
ఆధునిక ఉపకరణములతో చదువు, ఆటలు
ముడిపడె; చదువన్న ఆటలన్న అర్థములు మారె
భౌతికముగ కష్టపడక నాజూకు నేర్చి నేడు
మనిషి తన శరీరమునే నిర్లక్ష్యము చేయుచుండె;
"శరీరమాద్యఖలుధర్మసాధనం" పోయి శరీర
విహిత కర్మములు ఉపకరణముల పాలాయె
జీవితము యాంత్రికమాయె జీవుడు సున్నయ్యె
**********
భూగోళమున గందరగోళము
భూగోళమున గందరగోళము
అమ్మలు లేరు నేడు అందరు
ఉద్యోగములు చేయు ముద్దుగుమ్మలె
తండ్రులు లేరు నేడు అందరు
మరొకరిని జ్ఞానము అడుగువారే
ఉపాధ్యాయులు లేరు నేడు అందరు
యాజమాన్యముల ఊడిగము చేయు వారే
జ్ఞానులు లేరు నేడు అందరు కుటీర, భారీ
పరిశ్రమల వంటి ఆశ్రమములు నడుపు వారే
నా వారు లేరు నేడు అందరు
"కృత్రిమ - virtual " స్నేహితులే
బందుగులే అంతర్జాలమున
సాలెగూళ్లందు సమూహములందు
మనసున మనసు కలుపుట మరచె మనిషి
మర మనిషాయె తగ్గిరి ప్రాణ స్నేహితులు
ప్రాణమునకు ప్రాణమిచ్చు తల్లి తండ్రియును
గురువు దైవము వంటి అమ్మ నాన్నలు
అంతయు గందరగోళమాయె భూగోళమున **********
Tradition is like pole star; so are the wise words of seers. We may not reach pole star but we can take the direction it provides to chart the course of our life boat.
********
Women started saying women are equal to men in all aspects. Now it changed to women are more equal to men. Women now say that they do many things better than men. We, men, wish men and women remain equal.
*********
ప్రణయినితో చెట్టాపట్టాలేసుకుని/ ప్రణయ గీతములనాలాపించుకొనుచు/
రసగానమున మురియుచు ప్రేమ భాషణముల పరవశించుచు/
సఖి, ప్రకృతుల సోయగానాల కులుకుచు/
ప్రణయ వ్యాహ్యాళిని స్వర్గమును చవి చూచెద ప్రకృతిలో లీనమై
రసగానమున మురియుచు ప్రేమ భాషణముల పరవశించుచు/
సఖి, ప్రకృతుల సోయగానాల కులుకుచు/
ప్రణయ వ్యాహ్యాళిని స్వర్గమును చవి చూచెద ప్రకృతిలో లీనమై
No comments:
Post a Comment