మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 8
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
శబ్ద బ్రహ్మ సిద్ధాంతము అన్ని భాషలకు వర్తించే భాషా తత్త్వశాస్త్రం. దీనిని గురించి మరొకసారి.
సాంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అందగిస్తారు. పాశ్చాత్య లేక పంజాబీ డ్రెస్ ఆడువారికి సౌకర్యం అయిన ఈ రోజుల్లో సంప్రదాయ దుస్తులు ధరిస్తే అందంగా ఉంటారు, అలా ధరిస్తే బాగుండును అనుకోవడం ఒక నేరంగా పరిణమించింది ఈ రోజున. మేధావులు, ఉమెన్స్ లిబ్ వాళ్ళు, స్త్రీ వాదులు, స్త్రీ పురుషులను విడదీయడంలో ఎంతో సఫలీకృతులయ్యారు. ఆడ, మగా మధ్య దూరం బాగా పెరుగిపోతుంది. కలిసిమెలిసి ఉండి జీవితాలను పెంచుకోవాల్సిన, పండించు కోవలసిన వారు ఎడమొహం పెడమొహంగా తయారవుతున్నారు.
పెళ్ళికి ముందే ఆడువారికి, మగవారు, మొగుళ్ళ మీద తప్పుడు అభిప్రాయాలు కలిగించ బడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ప్రమాదాలు తెచ్చి పెడుతుంది కూడా. మగవారు ఆడువారిని బాధ పెట్టడానికి మాత్రమే ఉన్నారు; స్త్రీలను వేధించడం, ఎక్సప్లాయిట్ చేయడమే మగవారి ప్రవృత్తి అని బోధలు చేస్తున్నారు. స్త్రీలందరూ దేవతలని, పురుషులు రాక్షసులని పాఠాలు చెప్పబడుతున్నాయి. మంచి, చెడ్డ అందరిలోనూ ఉంటుందని ఎవరూ చెప్పడంలేదు. స్త్రీకి పురుషుడు ఏ విషయం లోనూ సాటిరాడనీ, స్త్రీ పురుషుల సమానత్వం మిథ్య అనీ అంటున్నారు. స్త్రీ అనే సూర్యుని ముందు వెల వెల బోయే దివిటీ పురుషుడని తీసిపారేస్తున్నారు. ఇన్నాళ్లలా స్త్రీ ని అణచి ఉంచడం పురుషునికి ఇక ఎంత మాత్రమూ వీలుకాదని ఘోషిస్తున్నారు మేధావులు, స్త్రీ వాదులు.
మిజోరమ్ యాత్రలో ఈ స్త్రీ పురుషుల భారతం ఏమిటంటే; మిజో అమ్మాయిలు సంప్రదాయ పరికిణీల దుస్తులలో ఎంతో అందంగా కనిపించారు. మన తెలుగు అమ్మాయిలు కూడా మన సంప్రదాయ దుస్తులైన ఓణీ, పరికిణీలలో ఎంతో అందంగా కనిపిస్తారు. కాని ఈ దుస్తులను ధరించడం దాదాపు మృగ్యమైపోయింది. వాళ్ళు ఓణీ, పరికిణీ ధరించి అందంగా కనిపించి కనువిందు చేయాలనుకోవడం Male chauvinism, improperly viewing women and writing about them అనే అపవాదు వస్తుందా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది.
సంప్రదాయ దుస్తులు ధరించిన మిజో అమ్మాయిలు ప్రకృతి వలె సుందరంగా కనిపించారు అని చెప్పాను కదా. మీ ఫొటోస్ తీసికోవచ్చా , నా వ్యాసములో పెడతాను అంటే వాళ్ళు ఎంతో సంతోషము గా ఒప్పుకుని ఫొటోస్ తీసికోనిచ్చ్చారు. మంచి పోజులు ఇచ్చారు కూడాను. స్త్రీ పురుషులిద్దరూ ప్రకృతి స్వరూపాలే అయినా స్త్రీలు ప్రకృతికి మరింత దగ్గరగా ఉంటారు. మరింత ప్రకృతి మయంగా ఉంటారు. A thing of beauty is a joy forever ; beauty lies in the eyes of the beholder . అనీ మనకు మాటలున్నాయి కదా.
సమాజములో మృగాళ్లు ఎక్కువ అయిపోయి స్త్రీలను చెరుస్తూ నానా భీభత్సము సృష్టిస్తున్న ఈ నాడు లలితముగా, రమణీయ దృష్టితో స్త్రీని, ఆమె సోయగాన్ని చూడడం కూడా విరసంగా మారింది. రసాస్వాదన కల మగవారిని, ఆడవారు అర్ధరాత్రి లేదా ఎప్పుడైనా ఒంటరిగా దొరికినప్పుడు వారిపై అత్యాచారం చేసే మగవారిని ఒకే రాటకు కట్టి మాట్లాడుతున్నఇప్పటి పరిస్థితులలో సౌందర్యము గురించి మాట్లాడడము వర్ణించడము కొద్దిగా risk గా తయారయ్యింది. పుర్రచేతివాద ధోరణి పుణ్యమా అని ప్రేమ కవిత్వం, శృంగార వర్ణనలు అంటరానివి అయిపోయాయి తెలుగునాట. బడుగుల కష్టాలు కలతలు, స్త్రీల పట్ల ప్రవర్తన, వారి విమోచన ల పై కవిత్వాలు అల్లడమే కవుల విధిగా మార్చేశారు విమర్శకులు. అట్టి పరిస్థితులలో ప్రకృతి సహజమైన స్త్రీ పురుష ఆకర్షణ, లలిత శృంగార భావముల గురించి కవనాలు చెప్పడం ఇంచుమించు నిషేధింప బడింది ఈ రోజుల్లో.
నా దృష్టిలో ఇది ఒక దుస్థితి. విచారకరమైన పరిస్థితి.
మా ఐజ్వాల్ (మిజోరమ్) యాత్ర 9
1-11-2017
ఐజ్వాల్ సందర్శనం
మేము మిజో భాష, దానిలో ఉన్న పాత రాత గ్రంథములు గురించి జరుగుతున్న సదస్సుకి వెళ్ళాము. దానికి ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ముఖ్య అతిథి. ఆ సదస్సు మిజో విశ్వవిద్యాల మిజో భాషా విభాగము నిర్వహిస్తోంది.
మిజోభాషా విభాగాధిపతి దానిని ఆంగ్లం, మిజో భాషలలో ప్రసంగించి ప్రారంభించారు. ఆయన అప్పటికి ప్రతి ఏడాది ఒక పుస్తకం చొప్పున 25 పుస్తకాలు ప్రచురించారు. మిజో భాష మీద, మిజో భాషలో. ఈ సదస్సులో అయన ప్రచురణా రజతోత్సవం కూడా కలిసి జరుగుతోంది.
నేను కూడా ఇన్నాళ్ళ గుంజాటన తరువాత నా పుస్తకములు నేనే చేతిచమురు భాగోతం లా ప్రచురించుకోవడం మొదలు పెట్టాను. మొదటగా The Hill -stream" అనే కవితా సంపుటిని వెలువరించాను. మరొకటి "Conversation with Lord Krishna" రాబోతోంది. ఇంకా చాలా రకముల పుస్తకములు ప్రచురణలు చెయ్యాలని ఉంది. చూద్దాము.
సదస్సు బాగా జరిగింది. ఆ సదస్సుకి ముగ్గురు Elders వచ్చారు. చర్చి fathers ని మిజోరమ్ లో Elders అంటారు. వీరు ముగ్గురు మిజోలె. ముగ్గురు 90 లు దాటినవారే. ఒకాయన శతాధిక వృద్ధులు (107) సంవత్సరముల వయస్సు ఆయనిది. అందులో ఒకాయన ఒక ప్లెడ్జి లాంటిది చేయించారు. School of Humanities Dean కూడా మాట్లాడారు. మిజో భాషని భారత రాజ్యాంగ 8వ అధికరణములో చేర్చే ప్రయత్నం మిజో భాషా పరిషత్తు చేస్తోందని, రాజకీయముగా కూడా మద్దతు లభించి ప్రయత్నం జరిగితే సద్యోఫలితం ఉంటుందని అన్నారు.
మన తెలుగాయన Prof . సుబ్బారావు గారు, Delhi యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు, ఈశాన్య రాష్ట్రాల భాషా పై చాలా ఉపయోగకరమైన పరిశోధన చేశారు. మేఘాలయ భాషలు కాశి, గారో భాషా మరియు మిజో భాషా సాహిత్యాలపై మంచి పరిశోధనలు చేశారు. ఆయనతో కాస్సేపు ముచ్ఛటించాము. ఆయన గొప్ప పండితుడు, పరిశోధకుడు. ముఖ్య మంత్రి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
అక్కడి మిజో విద్యార్థినీ విద్యార్థులతో ఫోటోలు దిగాము. సాంప్రదాయ దుస్తులలో మిజో అమ్మాయిలు ఏంటో అందముగా ఉన్నారు. కార్యక్రమములో మిజో భాషా విభాగపు విద్యార్థినీ విద్యార్థులు తో కూడిన coir మిజో పాటల మంచి సంగీత గానము చేశారు. గిటార్ తో ఒక విద్యార్థి బాగా సహకారము చేసాడు. సదస్సు చివర మిజో అమ్మాయిలూ అబ్బాయిలు పాడుతుండగా ఒక విద్యార్థి విద్యార్థిని మిజో నృత్యం చేశారు. ఎంతో కను విందుగా ఉంది. ఆ తరవాత భోజనం. మిజో సాంప్రదాయ భోజనం. మాంసాహారమూ ఉంటుంది. మేము వాళ్ళని అడిగి అందులోని శాకాహారము తెప్పించుకున్నాము. అన్నము సమోసా, పచ్చి కూరలు, ఒక వెజిటల్ కూర, అప్పడాలతో భోజనం చేసాము అనిపించాము.
ఆ తరువాత millenium మాల్ చూసాము. అక్కడనుండి ATC - Aizawl Theological College చూడడానికి వెళ్ళాము. ఈ కాలేజీ మిజోరమ్ లోని అన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద ఎత్తైన శిఖరం మీద ఉంది. అక్కడ వాతావరణం, నిశ్శబ్దం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
నేను French భాష నేర్చుకుంటున్నప్పుడు ఒక పాఠంలో ఇద్దరు వృద్ధ దంపతులు paris నుంచి వఛ్చి ఒక పల్లెటూరులో స్థిరపడతారు.
అప్పుడు భర్త భార్యతో : écoute se silence అంటాడు. Listen to the silence అని భావము. అంటే ఈ నిశ్శబ్దాన్ని విను అని అర్థం. నాకు ఆ మాట ఎంతో కూడా.
అటువంటి నిశ్శబ్దాన్ని అక్కడ నేను విన్నాను. ఎంతో ముగ్దుడనయ్యాను. ఇక్కడే ఉండిపోవాలని యాథాలాపంగా అన్నాను. దాని మీద Prof. జ్యోతికుమార్ గొప్ప వేళాకోళం చేశాడు. ఇప్పుడు ఈ వయసు లో మతం మారితే ఎలాగండీ? మా అందరి గతి ఏమిటి ; మీఇంట్లో వాళ్లు, madam ఎలాగ అంటూ చాలాసేపు కంగారుపడినట్టు నటించాడు. We enjoyed it so much.
ATC భారత దేశంలోని అన్ని డినామినేషన్ christian లకి Christian Theology లో training ఇస్తుంది.
ఆ తరువాత ఐజ్వాల్ ట్రాఫిక్ దాటుకొని మా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ కి చేరేసరికి బాగా శ్రా0తులము అయ్యాము. వెంటనే పడుకుని సేద తీరాము. మరునాడు తిరుగు ప్రయాణము. మేము మిజోరమ్ పర్యటనని ఎంతో ఆస్వాదించాము. తో గో తో To go to Mijoram and be there is a beautiful and peaceful spiritual pilgrimage. ఒక ప్రశాంతిని కలిగించే గాఢ ఆధ్యాత్మికానుభవము. అక్కడే ఉంటె చాలు మనసు నెమ్మది పొందుతుంది. ఏ ధ్యానాలు, ఉపాసనలు అవసరము లేదు. పర్వతములు, పర్వత శ్రేణులు, పర్వత సానువులు, లోయలు ఎంతో గొప్ప ధ్యానానుభవాన్ని, ఉపాసనానుభవాన్ని ఇస్తాయి. ఇటువంటి చోట్లకి వెళ్లడమే ప్రశాంతతను ఇస్తుంది. పెద్ద వృక్షములు పర్వతములపై దట్టముగా పెరిగి, పరచుకొని పచ్చదనం తో అలరారుతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అక్కడ పర్వత శ్రేణులన్నీ నిశ్శబ్ద నిలయాలు. మనుషులూ మంచివారు. స్నేహ స్వభావులు. మృదు మనస్కులు. శాకాహారము దొరుకుతుంది. ఒకే చోట మాంసాహారము, శాకాహారము విడి విడి గా దొరికే restaurant లు ఉంటాయి. విడిగా శాకాహార భోజనం దొరికే restaurants ఉండవు.
మరునాడు (2-11-2017) న మళ్ళీ Johny యే మమ్మల్ని విమానాశ్రయము దగ్గర దింపాడు. ఆతను టెన్త్ క్లాస్ ఫెయిల్. . అతని భార్య మిజోరమ్ యూనివర్సిటీలో Commerce Department లో Assistant Professor. ఈ వాస్తవము నన్ను ఎంతో ఉల్లాసపరచింది. సమతల ప్రదేశాల్లోని అమ్మాయిలకు ఏదైనా సందేశం ఇస్తుందా అనిపించింది . ఐజ్వాల్ నుంచి కలకత్తా అక్కడినుంచి మెయిల్ లో నిడదవోలు, అక్కడినుంచి Seshaadri Express లో భీమవరం చేరాము..

No comments:
Post a Comment