ప్రేమ-ప్రణయం
ప్రేమ గురించి, ప్రణయం గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకటి తలవకూడగని ప్రేమశాస్త్రజ్ఞుల మాట. ఒకరిలో ఒకరు కలిసిపోయి, ఇరువురూ ఒకటే అయినప్పుడు, జగత్తు కనిపింపదు, ఎవరికెవరూ కనిపింపరు. ఇరువురూ ఒక్కరే అయ్యి ప్రేమలో మునిగి తేలుతూంటారంతే. మిగతా ప్రవచనములు వారికి కాదు.
అంతలా మమేకం కానప్పుడు ప్రణయజీవులవడం, ప్రణయజీవులమనుకోవడం ప్రయాస మాత్రమే. ప్రేమలో ఉన్నంత సేపూ మెళకువ ఉండదు. మెళకువ రాదు. కలల బేహారులే వారు. తరవాత మెళకువ వచ్చేక తెలిసే వాస్తవము గురించి ఇప్పుడెందుకు? రసపట్టులో తర్కం, నిజం, వాస్తవం కూడదు. ప్రణయజీవులకు మొదలు, తుది ఒకరికొరరే.
అసలు మానవజీవితమే బుద్బుద ప్రాయము. ఏదీ శాశ్వతము కాదు. శాశ్వతము
అనుకుంటామంతే. అలా భ్రమ పడకపోతే వలపులూ లేవు, సలుపులూ లేవు. ప్రేమతత్త్వము
అసలు తత్త్వానికి భిన్నం కాదు. మరొక విధానము అంతే. గమ్యం అహంకార, అహంభావ
విస్మరణ. ప్రేమలో మమైక్యము అంతే. శుభం భూయాత్! ప్రణయజీవులు వర్ధిల్లాలి.
భ్రమపడని వారు, భ్రాంతి లేనివారు మామూలు మనుషులు కారు. మనందరం మనీషులమా
ఏమి?
ప్రేమ విశ్వైక భావనము. ప్రణయము యువతీయువకుల జన్మ సహజము.
*************
సర్వం భగవన్మయం
ప్రేమ విశ్వైక భావనము. ప్రణయము యువతీయువకుల జన్మ సహజము.
*************
సర్వం భగవన్మయం
సమస్తోదకములును గంగోదకములె
సమస్తతీర్థములును కాశీక్షేత్రములె
తలపులు భగవన్మయములైన
స్వగృహమె వైకుంఠము కైలాసమును
సకల కర్మసాక్షి సూర్యనారాయణమూర్తి
సమస్త జ్ఞానస్వరూరుడును దాతయు ముక్కంటి
వేదవేద్యుడును మోక్షప్రదాత శ్రీమన్నారాయణుడు
మనవారలైయుండ మన దరిచేరవు వెతలు దీనతలు దుఃఖములు;
సతత ఇష్టదైవనామ స్మరణమను తెప్పపై దాటెదము
సంసారాంబుధిని సమర్ధులమై
సమస్త జ్ఞానస్వరూరుడును దాతయు ముక్కంటి
వేదవేద్యుడును మోక్షప్రదాత శ్రీమన్నారాయణుడు
మనవారలైయుండ మన దరిచేరవు వెతలు దీనతలు దుఃఖములు;
సతత ఇష్టదైవనామ స్మరణమను తెప్పపై దాటెదము
సంసారాంబుధిని సమర్ధులమై
No comments:
Post a Comment