భారతదేశపు సంస్కృతి-గృహిణులు
గృహిణులు భారతదేశపు సంస్కృతికి పట్టుకొమ్మలు.
గృహిణుల వల్లే భారతదేశపు సంస్కృతి ఇప్పటి వరకు బ్రతికి ఉంది. గృహిణులు
కాని స్త్రీలు భారతీయ సంస్కృతిని ప్రసారము చేయలేరు. ప్రాచుర్యము కలిగించలేరు. స్వాతంత్ర్యము పేరిట, ఉగ్యోగపు బాధ్యతలతోను
ఎక్కువ మంది ఆడువారికి భారతదేశపు సంస్కృతి గురించి అనుభవము, అవగాహన
ఉండవు.
రెండు పడవల మీద రెండు కాళ్ళు వేసి చేసే ప్రయాణం, ఇవాళో, రేపో ఒక పడవ
మీంచి కాలు తీసేసి చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే
భారతీయ సంస్కృతి మూలన పడుతుంది. అన్ని సంస్కృతులు, అన్ని నాగరికతలు మనుషుల ఆదరణ, ఆచరణల బట్టి
జీవిస్తాయి. ఈ తరం గృహిణులైన ఆడువారి తరం తరువాత
భారతదేశపు సంస్కృతి బ్రతికి బట్ట కట్టడం కష్టం.
నిజానికి ఇవాళ భారతదేశపు సంస్కృతి జీవించినా, మరేమైనా
పెద్దగా పట్టించుకునేవారు ఎక్కువ మంది లేరు. ఆ ఉన్న కొద్ది
మందీ కూడ ముసలివారై పోయి, జీవించడంలో
అలసిపోయి, సంస్కృతిని కొనసాగించే ఓపిక లేక
అన్నవాళ్ళే. తెలిసిన వారు ఆచరించే వారు నేటి తరంలో చాలా అరుదై
పోయారు. కొనసాగించే శ్రద్ధ, ఓపిక, తీరిక ఉన్న
గృహిణులు నెమ్మదిగా అదృశ్యమై పోతున్నారు.
ఈ నిజ స్థితిలో భారతదేశపు సంస్కృతి ఆదరణకు, ఆచరణకు, నోచుకోక
శిథిలమైపోయే సావకాశం ఎక్కువ కనిపిస్తోంది. క్రొత్త నీరు వచ్చి పాత
నీటిని తోసిపారేసినట్టు అంతర్జాల మిళిత ఉద్యోగ, సాంఘిక
జీవనాలు ఏర్పడ్డ ఈ రోజుల ఆధునికత ముందు సంప్రదాయ
సంస్కృతి గురించి మాట్లాడడం వల్ల ఆయాసం మాత్రమే మిగులుతుంది.
నిష్ఠూరంగా అనిపించినా ఇది నిజం.
అందువల్ల మనం లోపాయికారీగా అనుసరిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయ
రహిత జీవనపథాన్ని కౌగలించుకొని ఉండి పయనించడమే బుద్ధిమంతుల లక్షణం.
భారత దేశపు సంస్కృతిని అనుసరించక, ఆచరించ లేక
ఆదరణ మాత్రం అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళలో చూపడం విదూషకం అనిపిస్తుంది.
శుభం భూయాత్!
************
రాజకీయము
ఆ ఇంట్లో తరతరాలకు నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమపు అమలు;
కొందరు భజనపరుల పక్కనేసుకొని వారికి కులముల వారీగా తాయిలాలు అందించి తమ పాలేరుల చేసికొని ప్రభుత్వమున తామే, తమవారే "కలకాలముండుట"; ప్రజలకు చేసిన హామీలే ప్రతి ఎన్నికలో మరి మరి చేసి
మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయుట; వారి నెత్తిని చేయుంచుట
***********
పరాన్నజీవులు
ఇంటి కన్న గుడి పదిలమనుకొనుచు
ఎందరొ సన్యాసము తీసికొని
పెంపుడు రాచిలకల వలె పలుకుచు
తత్త్వబోధలు చేయుచు ఆస్తులు
ఎందరొ సన్యాసము తీసికొని
పెంపుడు రాచిలకల వలె పలుకుచు
తత్త్వబోధలు చేయుచు ఆస్తులు
సంపాదించుచు ఆశ్రమములు
స్థాపించుకొనుచు; శక్తి అదృష్టముల మేరకు
కుటీర లేక భారీ పరిశ్రమ నిర్వాహకులై వెలుగు
ఈ వేళ గాజుముక్క రత్నమై ప్రకాశించుచున్నది
స్థాపించుకొనుచు; శక్తి అదృష్టముల మేరకు
కుటీర లేక భారీ పరిశ్రమ నిర్వాహకులై వెలుగు
ఈ వేళ గాజుముక్క రత్నమై ప్రకాశించుచున్నది
పనిలేక సోమరులై గృహస్థుల గేలిసేయుచు
వారి సంపాదనల మాత్రము స్వీకరించుచు
ఆచార్య స్వాములై ఆధ్యాత్మిక రంగమునేలు
వేషధారులు సంఘమునకు పెడవారు
వారి సంపాదనల మాత్రము స్వీకరించుచు
ఆచార్య స్వాములై ఆధ్యాత్మిక రంగమునేలు
వేషధారులు సంఘమునకు పెడవారు
బాధ్యతల వహించక ఏమాత్రము కష్టపడక
ఒడ్డున ఉండి ఈతపై ఉపన్యాసములనిచ్చు
స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు
గృహస్థులకు గుదిబండలు; పరాన్నజీవులు ఈ మూకలు
ఒడ్డున ఉండి ఈతపై ఉపన్యాసములనిచ్చు
స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు
గృహస్థులకు గుదిబండలు; పరాన్నజీవులు ఈ మూకలు
*************
But the quota, reservation Raj is flourishing:
Politicians cannot live or breathe
Without sloganeering quota word
******************
ప్రతి విషయానికి రెండు పార్శాలు ఉంటాయి.. ఒకదాన్ని గణిస్తే రెండవదాన్ని గణించలేము. లేడి పులికి ఆహారం. రెండింటి మీద ఒకేసారి సానుభూతి చూపించలేము. చూపించడానికి వీలుపడదు. ఏదో ఒక దానికే. పరస్పర విరుద్ధమైన ప్రయోజనములు కల రెంటిపై ఒకేసారి జాలి చూపించడానికి కుదరదు, మనమెంత మానవత కలవారమైనా.
No comments:
Post a Comment