Sunday, February 19, 2017

తెలుగు సంస్కృతి, జాతి సంస్కృతీ సాంప్రదాయములు

తెలుగు సంస్కృతి, జాతి సంస్కృతీ సాంప్రదాయములు

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా అమరావతిని తీర్చిదిద్దుతారట. ఒక సంఘాన్ని నియమించారు. దానికి ఒక బ్రిటిష్ ఆయన సంచాలకుడు.

ఆంధ్రప్రదేశ్ ఒక ఉప ముఖ్యమంత్రి గారు శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవంలో మనం మన సంస్కృతీ సంప్రదాయములను సంరక్షించుకొని భావి తరాలకు అందించాలని వాక్రుచ్చారు. పిలుపునిచ్చారు.
ఏది తెలుగు సంస్కృతి, ఏవి మన సంస్కృతీ సంప్రదాయములు?

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి (తెలుగు సంస్కృతికి ఘనంగా సేవ చేసిన, వివిధ కళా, శాస్త్ర, విజ్ఞాన, జ్ఞాన రూపాలలో అందించిన) తెలంగాణా ఈ పరిధిలోకి రాదు కదా) చెందిన తెలుగు వారిలో ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపించదు. ఎందరు మేధావులో అన్ని సంస్కృతులు.

మరి ఏర్పాటు చేసిన సంఘం వారికి అందిన సూచనలు, వారికి తెలిసినది, తెలుగు సంస్కృతి, సంస్కృతీ సంప్రదాయముల రూపంలో ప్రతిబింబింప చేస్తారేమో? వాటినే పరిరక్షించి భావి తరాలకు అందిస్తారేమో?
తెలుగు ప్రాంతంలోని మేధావులు ఏది తెలుగు సంస్కృతి అనే దాని మీద భేదాభిప్రాయములు కలిగి ఉన్నారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు, తామే మేధావులమనుకునే మేధావులు, ఇన్ని వేల ఏళ్ళ సంస్కృతీ సాంప్రదాయముల, తెలుగు సంస్కృతి యెక్క ఉనికిని ఈసడించుకొనే తామూ మేధావులమనుకునే మేధావులు, ఇది కాక ఏవేవో ఇజములు మాత్రమే సంస్కృతి అనే విద్యావేత్తలు, ఆలోచనాపరులు, ఈ సంస్కృతీ ప్రతిబింబాన్ని, పరిరక్షణను వేరు వేరు దిక్కులకి లాగే ప్రయత్నంలో ఏ తెలుగు సంస్కృతి ప్రతిబింబింపబడుతుంది, ఏ సంస్కృతీ సంప్రదాయములు పరిరక్షింపబడతాయి?

ఈ నాటికి నిర్దుష్టమైన తెలుగు భాషను రూపొందించుకోలేదు. నిజానికి తెలుగు భాషలో వివిధ ప్రకృతి శాస్త్రములలో, సాంఘిక శాస్త్రములలో, భాషా శాస్త్రములలో, మరి వివిధ జ్ఞాన పరంపరలలో ఏవిధమైన కృషీ జరగని ఈ రోజున ఏది తెలుగు సంస్కృతి? ఏవి సంస్కృతీ సాంప్రదాయములు? తెలుగుభాషలో విద్యాభ్యాసమని అదో గోల.

భౌతిక, రసాయన, జీవ, గణిత, ఇతర శాస్త్ర, సాంకేతిక విషయాలలో జ్ఞానానికి ఏమీ అందించని తెలుగువారు, తెలుగు భాషలో ఆయా శాస్త్రములలో ఏమీ గ్రంథాలు, కనీసం వ్యాసాలు ఇప్పటి అభివృద్ధికి అనుగుణంగా రూపొందించలేని, రాయలేని తెలుగువారు, తమ మాతృభాషనే సరిగా నేర్వని తెలుగువారు, కులముల, ప్రాంతముల, మతముల, ఇజముల కీచులాటలో శక్తి, యుక్తులు, సమయము వృథా చేసికునే తెలుగువారు, ఖండాంతరములకు కూడా తమ కుల గజ్జి, ప్రాంతీయ దురభిమానము పట్టుకెళ్ళే తెలుగువారు, ఏమీ తెలియని, ఏమీ చేతకాని, ఏ శాస్ర్రావగాహన, సంస్కృతీ, సాంప్రదాయముల, తత్త్వముల ఆకళింపు లేని రాజకీయ నాయకులకు సమస్తమును ధారాదత్తము చేసి, ఆ నాయకుల అజ్ఞానము, అహంకారము, ఆధారముగా ‌అన్ని సంస్కృతుల, నాగరీకముల, శాస్త్రముల ప్రాచుర్యము చేయవలసిన, చేస్తున్న తెలుగువారు ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తారు? ఏ సంస్కృతీ సాంప్రదాయములను పరిరక్షించుకొని భావి తరాలకు అందించుకుంటారు?

ఈ విషయమై స్పష్టమైన నిర్వచనము, అవగాహన, ఉదాత్తత, ఊహ లేక ఇజముల కొట్లాటలే సంస్కృతిగా చెల్లుబాటవుతున్న నేడు ఏ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించుకుంటాం? ఏ సంస్కృతీ సంప్రదాయములను పరిరక్షించుకొని భావి తరాలకు అందించుకుంటాం?

ఎందరో పెద్దలు జీవితాలు వెచ్చించి రూపొందించిన తెలుగు సంస్కృతి రాష్ట్రం విడిపోయినట్టు ముక్కలు, చెక్కలుగా అవుతుందా? అలా ఉంటుందా? ఏ సంస్కృతి సంరక్షింపబడుతుంది. తమిళుల లాగ మనం సంస్కృతిని పరిరక్షించుకోవడం లేదే అని తరచు నీరసపడే, అనుకరణకు పీట వేసే జనులకు వారిది ఏ నంస్కృతి?
రాజకీయనాయకుల ఎన్నికల వాగ్దానాలు వేరు; తెలుగు సంస్కృతి ప్రతిబింబించబడడం, సంస్కృతీ సాంప్రదాయములను పరిరక్షించుకోవడం, భావి తరాలకు అందించుకోవడం వేరు. తాము చేసిన ఎన్నికల వాగ్దానాలను రాజకీయ నాయకులు పట్టించుకోవలసిన, అమలుపరచవలసిన అవసరం లేదు.

కాని సంస్కృతీ సాంప్రదాయముల నిర్వచనము, అవగాహన, ఆకళింపు అమలుపరచాలంటే పండితుల, కళాకారుల, శాస్త్రజ్ఞుల, మేధావుల, తత్త్వజ్ఞుల కలయిక అవసరం ఉంది. సంస్కృతి, సంప్రదాయములు రాజకీయము కాదు. ఎందరిదో సమిష్టి కృషి.

ఏ ఒక్కదానిలోనూ ఏకీభవించని మేధావులు, పండితులు, శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు ఏ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ప్రయత్నము చేస్తారు? ఏ సంస్కృతి, సాంప్రదాయములను పరిరక్షించి భావితరములకు అందిస్తారు?
అమరావతీ నగర నిర్మాణంలా రాజకీయ నాయకుల కనుసన్నలలో తెలుగు సంస్కృతి ప్రతిబిబంబింపబడదు.
దానికోసం ఎందరో పండితులు, ఆచార్యులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు తమ తమ భేదాభిప్రాయములను మరచి, విడచి ఏకతాటి పైకి వచ్చి సమిష్టిగా కృషిచేస్తే తెలుగు సంస్కృతి అంటే ఏమిటో నిర్వచింపబడుతుంది. ప్రతిబింబించడం, పరిరక్షించడం, భావి తరాలకు అందించడం, ఒక్కొక్కటీ అంతంత పని.

పిల్లి మెడలో ఎవరు గంట, ఎలా కడతారో చూద్దాం.

మంచి జరుగాక అని ఆశిద్దాం

Disposable Writings ; Drunken driving - Pastime of the elite

Disposable Writings

We find many writings daily
Including ours; but how many
Are read? Fed up, many readers
Not even glance through most;


Disposable Writings are they giving
Pleasure only to the creator; neither fellow
Writers nor critics care for these creations;
Still why so many works get poured and

Writers, poets, fiction-writers, novelists
Continue creating? Is it a compulsive "disorder",
 That engulfs the literary creators? May be
Order and disorder continue following each

Other for Eternity; meanwhile languages are
Learnt, hearts and minds get inspired and
Express; without expecting any reward,
recognition or return; human nature is

Above money-making; transcends all
Appreciations, indifference or insinuations;
Writers are Divine in making and creation
So only writings pour in, disposable or distinct

**********

Drunken driving - Pastime of the elite

Drunk driving is fashion of the day
For the elite, the rich, the celebrities
But the price is paid by unsuspecting
Road users and pavement sleepers


Drinking had been a vice in good olden days;
It is a status symbol now for the men and women;
 the poor continue to drink but never kill;
only they kill themselves; no religion,
No preacher, no teacher can do anything
About the cultural habit of drinking; it seems

Only the poor spoil their health through drinking
But the haves evolve themselves as a nuisance
To the society with their elite partying and then
Taking to roads becoming non-hired killers with

Impunity; governments became helpless and
Legal system follows snail in pace in punishing
The drunken drivers; the lives of road users
Are at the mercy of elite and celebrity drunkards
Who take to roads fully drunk; there is no
 gender discrimination here; women too do it
 

Thursday, February 16, 2017

మనసు కలాప, విరమణ, రమణ స్థితులు; ఆల్ కౌంట్ పేక; కోరిక

మనసు కలాప, విరమణ, రమణ స్థితులు

వాస్తవము వేరు; మనసు మనకు చూపించే విధము వేరు. మనం మనసు చూపించిన దాన్ని బట్టి ఘర్షణ, సంఘర్షణ అనుభవిస్తాము. ఉత్సాహపడతాము. నిరుత్సాహ పడతాము. ధైర్యం తెచ్చుకుంటాము. భీరువులము అవుతాము. సంతోషపడతాము. వేదన, వ్యథ అనుభవిస్తాము.
అలా ఎన్నో సార్లు వాస్తవాన్ని సరిగా గమనించకుండానే, అంచనా వేయకుండానే దుఃఖపడతాము. ఖేదిస్తాము. మోదం తెందుతాము.

కాస్త నిదానిస్తే అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో తెలుస్తుంది. కాని మనసు రంగుటద్దములలో చూపినదానికి అనుగుణంగా మాత్రమే మన చర్యలు, ప్రతిచర్యలు ఉంటాయి. సుఖదుఃఖములు, ఖేద మోదములు ఉంటాయి.

అలా మనం ఎన్నోసార్లు వాస్తవంలో లేకపోయినా, జరగకపోయినా, అసలు నిజం గమనించకుండా మనసు తన స్వభావము కొద్దీ, పరిమితుల కొద్దీ చూపే అబద్ధాలలో చిక్కుకొని అలమటిస్తాము.

తలపుల, ఆలోచనల, భావముల రూపు మాత్రమే అయిన మనసు లేక మన మనుగడ లేదు. కానీ మన మనుగడ ఒక్క తలపులు, ఆలోచనల మీదే ఆధారపడి లేదు. మనకు విచక్షణ, ఊహాశక్తి, యుక్తి, సూక్ష్మబుద్ధి కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనసు పెట్టే ఆరళ్ళ నుంచి తప్పించుకోవచ్చు. వాస్తవ విరుద్ధంగా మనసు పెట్టే కంగారును తట్టుకోవచ్చు. కాస్త నిదానించాలి అంతే.

మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే అనే వేదాంతం లోకి వెళ్ళిపోకూడదు. మనసు మనకు గ్రహణకు, గ్రహింపుకూ ఉపయోగిస్తుంది. మానసిక కార్యకలాపములు లేక మనము లేము. నిజానికి మానసిక కార్యకలాపములే మనము.
కాని మానసిక కార్యకలాపములకు ఇవతల, అవతల కూడా మనమున్నాము. ముందూ, వెనుక కూడా మనకు ఉనికి ఉంది. రోజూ గాఢనిద్రలో మనసు ఉనికి లేదు. కాని గమనిక రూపంలో మనం ఉన్నాము.

మన అసలు ఉనికి గమనికగా. గమనికలోనికి మానసిక కార్యకలాపములు వచ్చి పోతూంటాయి. అనుభవములు కలిగి, కరిగి పోతూంటాయి. మానసిక కార్యకలాపములు శాశ్వతము కాదు. మానసిక కార్యకలాపములు సర్వకాల సర్వావస్థల యందు ఉండవు. మెళకువ, కల మానసిక దశలలో కలిగి, గాఢనిద్ర, జాగ్రత్ సుషుప్తిలలో మాయమవుతూంటాయి. మాయ అవుతూంటాయి. మానసిక శక్తి యొక్క మరయొక పేరే మాయ. మాయ చిత్ శక్తి. చిదాభాస. ప్రణవము. స్ఫోట.

మనసు, బుద్ధి, చిత్తము, అహంకారముల రూపైన అంతఃకరణములు మాయా విభూతులే. మాయా పరిణామములే. మాయ పురోధాన (ముందుకు) పరిణామం చెందితే అంతఃకరణములు ఏర్పడి మెళకువ, కల మానసిక దశలు ఏర్పడి మానసిక కార్యకలాపములు జరిగి విషయ, వషయానుభవ రూపములైన అంతర్, బాహ్య జగత్తులు దృష్టిలోకి వస్తాయి.

మాయ తిరోధాన (వెనుకకు) పరిణామం చెందితే మనసు, ఇతర అంతఃకరణములు మాయగా మారి మానసిక దశ గాఢనిద్ర (సుషుప్తి) గాని, జాగ్రత్ సుషుప్తి (తురీయము) గాని అయ్యి మనసు, ఇతర అంతఃకరణములు విరమణ పొంది విరామం చెందుతాయి. మానసిక కార్య కలాపములు విరమింపబడతాయి. అంతర్, బాహ్య జగత్తులు దృష్టిలో ఉండవు. కరిగిపోతాయి. అదృశ్యమవుతాయి. అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులు అంతమవుతాయి. విషయ, విషయానుభవ గ్రహణలు, గ్రహింపులు ఉండవు.

అప్పుడు మనలో శాంతి, ఆనందము, మౌనము వెల్లివిరుస్తాయి. మనము, మనము నిండుకొని మనము గమనికగా వెలుగుతాము. దృష్టి విశ్రాంతమవుతుంది.

మానసిక కార్యకలాపముల విరమణమే రమణము. రమణునితో సమము. రమణునితో, రమణునిలో ఐక్యము. మానసిక కార్యకలాపముల విరమణ స్థితియే రమణ స్థితి.

************

ఆకలి లేక అన్నం అవసరం లేదు; పంచభక్ష్య
పరమాన్నముల ఊసు లేదు; దప్పిక లేక మంచినీటి మాట రాదు;
నపుంసకునకు వాంఛ లేదు సంగమ దృష్టి లేదు;
ఇచ్ఛ ఉంటేనే అవసరం; లేకపోతే ఏదైనా అనవసరం
 ***********

చదువుచున్నాము కొరగాని చదువులు
ఉద్యోగము తేవు జ్ఞానమును అబ్బదు
మరెందుకో వేలకివేలుపోసి కొనుచున్నాము
లాటరీ టిక్కెట్టు చదువులు; ఆల్ కౌంట్ పేక ఆడుచున్నాము

Monday, February 13, 2017

ప్రేమ-ప్రణయం, సర్వం భగవన్మయం


ప్రేమ-ప్రణయం

ప్రేమ గురించి, ప్రణయం గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకటి తలవకూడగని ప్రేమశాస్త్రజ్ఞుల మాట. ఒకరిలో ఒకరు కలిసిపోయి, ఇరువురూ ఒకటే అయినప్పుడు, జగత్తు కనిపింపదు, ఎవరికెవరూ కనిపింపరు. ఇరువురూ ఒక్కరే అయ్యి ప్రేమలో మునిగి తేలుతూంటారంతే. మిగతా ప్రవచనములు వారికి కాదు.

అంతలా మమేకం కానప్పుడు ప్రణయజీవులవడం, ప్రణయజీవులమనుకోవడం ప్రయాస మాత్రమే. ప్రేమలో ఉన్నంత సేపూ మెళకువ ఉండదు. మెళకువ రాదు. కలల బేహారులే వారు. తరవాత మెళకువ వచ్చేక తెలిసే వాస్తవము గురించి ఇప్పుడెందుకు? రసపట్టులో తర్కం, నిజం, వాస్తవం కూడదు. ప్రణయజీవులకు మొదలు, తుది ఒకరికొరరే. 

అసలు మానవజీవితమే బుద్బుద ప్రాయము. ఏదీ శాశ్వతము కాదు. శాశ్వతము అనుకుంటామంతే. అలా భ్రమ పడకపోతే వలపులూ లేవు, సలుపులూ లేవు. ప్రేమతత్త్వము అసలు తత్త్వానికి భిన్నం కాదు. మరొక విధానము అంతే. గమ్యం అహంకార, అహంభావ విస్మరణ. ప్రేమలో మమైక్యము అంతే. శుభం భూయాత్! ప్రణయజీవులు వర్ధిల్లాలి. భ్రమపడని వారు, భ్రాంతి లేనివారు మామూలు మనుషులు కారు. మనందరం మనీషులమా ఏమి?

ప్రేమ విశ్వైక భావనము. ప్రణయము యువతీయువకుల జన్మ సహజము.

*************

సర్వం భగవన్మయం

సమస్తోదకములును గంగోదకములె
సమస్తతీర్థములును కాశీక్షేత్రములె
తలపులు భగవన్మయములైన
స్వగృహమె వైకుంఠము కైలాసమును
సకల కర్మసాక్షి సూర్యనారాయణమూర్తి
సమస్త జ్ఞానస్వరూరుడును దాతయు ముక్కంటి
వేదవేద్యుడును మోక్షప్రదాత శ్రీమన్నారాయణుడు
మనవారలైయుండ‌ మన దరిచేరవు వెతలు దీనతలు దుఃఖములు;
సతత ఇష్టదైవనామ స్మరణమను తెప్పపై దాటెదము
సంసారాంబుధిని సమర్ధులమై

Sunday, February 12, 2017

The Empowerment; కలలు; కాలాబాధితము; తర్కం; Social Activists

The Discrimination of different genre and kind

They say still women empowerment has not taken place in India. But how so many sophisticated ladies and girls participated in Women's Parliamentarians meeting at Guntur; and the congregation includes empowered women from all walks of life.

If employment and being in public life is empowerment then many boys and men are not empowered in present India. There is lot of unemployment among "not-fair sex" in our society. Which politician, NGO, government, women sympathisers take their cause?

Many males are living a life of non-dignity, deprivations of all kinds, and they do not have right to livelihood. Who champions for them?

Is it they have to languish like that as cheerless Individuals for life? Who brightens their lives? If all women are empowered and many men are not are all these liberals, intellectuals, legislators, governments comfortable?

Why this kind of discrimination against boys and men? All these should have sympathy for "not-fair sex" also.

It is a reality that governments, NGOs, intellectuals, women's liberators should have objective analysis of current social situation. Parroting 1950 situations in 2017 is ridiculous and sans commonsense. Let everyone get empowered, women and men also. Let us treat both equally and think of empowering both without bias.

Let us be realistic; neither pessimistic nor idealistic. Individuals must be motivated irrespective of their gender, caste, community, region, religion, ideology and like divisions.

Wish all concerned will take care of men and women and empower them based on their capabilities, efficiency, use to society and not merely based on gender, caste, community, region, religion, ideology and like.

***********



కలలెన్నో వస్తాయ మవకి. కలలకి కారణం తిన్న తిండా, విపరీతమైన ఆలోచనలా, లేక కల మానసిక స్ఖితి కలగడం సహజమా? ఎప్పుడూ మీమాంసే నాకు. మెళకువగా ఉండడం ఎంత సహజమో కలలు కనడం అంతే సహజం మనకు అనుకుంటా.
********** 
పాఠకులను, విమర్శకులను ఆకట్టుకోలేని కవి కవితలు అడవిని కాసిన వెన్నెలలు. కవులు ఆత్మతృప్తికై కవనములు వెలయించిన, కొండవాగుల ఉరకలు పరుగులై అవి అందములు చిందించుచూ వాటి ఉనికి "నాగరీకులకు" తెలియకున్ననూ అవి వసంతమున పొంగి పొరలి తమకై తాము పాడుకొను కోయిలల చందమున ప్రకృతిని నిండిఉండును. అందముగ ఆనందముల మునిగితేలును. ఆ కవితా సృష్టులు పాఠకుల, విమర్శకుల అలరించిన అవి మరింత శోభించును. ఎంతయినా సరసుల ఆస్వాదన రామణీయకత నిచ్చును కదా.
**********


దినపత్రిక విలువ ఒక రోజుకే పరిమితం
పెసరట్టు రుచి వేడిగా ఉన్నంత సేపే
ప్రజా ప్రతినిధి నొల్లుకోవడం ఐదేళ్ళ పర్యంతం
మంత్రులు అధికారమున్నంత వరకే ప్రముఖులు

ఆరోగ్యమున్నంత వరకే మనిషి ఖుషీ; జన్మ స్పృహ
కలిగినప్పుడే మోక్షమునందాసక్తి మొలుచును
అంతయు కాలానుగుణము; పరమాత్మతో ఏకమగుటే
శాశ్వతత్వము; కాలాతీతము కాలాబాధితము
*************

తర్కం

తర్కం సునిశితమైనది. రెండు వైపులా పదును కల కత్తి. ఎన్నో సార్లు తర్కం నిజాన్ని చూడలేదు. చూపించలేదు. గానుగెద్దులా అలా చుట్లు తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తర్కం ఆపేసి మౌనంగా ఉంటే నిజం తనంత తానే ప్రకటితమవుతుంది. తర్కం తత్త్వదర్శనాన్ని కలిగించడం కన్నా అడ్డడం ఎక్కువగా చేస్తుంది. అప్పుడు నమ్మకం మనలని ఒడ్డున పడేస్తుంది. శుభం భూయాత్!
***********




Saturday, February 11, 2017

భారతీయ తత్త్వశాస్త్రావగాహన - ఒక పరిశీలన; The Social activists

భారతీయ తత్త్వశాస్త్రావగాహన - ఒక పరిశీలన

భారతదేశమున తత్త్వశాస్త్రమును, బ్రహ్మజ్ఞానమును అర్థము చేసికున్న వారి కన్న అపార్థమో, సగము లేదా అసంపూర్తిగా అర్థము చేసికున్న వారే ఎక్కువ. అందుకే ప్రతి తరానికీ ఉపనిషత్తులకు, ఆస్తిక, నాస్తిక దర్శనములకు వ్యాఖ్యానములు చేయడం అవసరం.

కాలాన్ని బట్టి ఉపమానాలు మార్చాలి. పకృతిశాస్త్రముల జ్ఞానము పరిణమిస్తూ ఉంటుంది. తదనుగుణంగా వ్యాఖ్యలు వస్తే ఆ తరానికి అందుబాటులో ఉండి అవగాహన ఏర్పడడానికి సులువవుతుంది.

ఉదాహరణకి

బ్రహ్మ సత్ జగత్ మిథ్యా జీవో బ్రహ్మ ఏవ న అపరః

అద్వైత వాక్యాన్ని తీసికుందాం.

ఇందులో జగన్మిథ్యాత్వాన్ని గురించి చెప్పడానికి శంకరులు దక్షిణామూర్తి స్తోత్రములో అద్దములో ప్రతిబింబాన్ని ఉపమానంగా చెప్పారు

రమణులు సినిమా తెరపై బొమ్మల సామ్యము చెప్పారు.

భౌతిక శాస్త్రము, ఎలక్ట్రానిక్స్ తెలిసిన వారికి ఈ జగన్మిథ్యాత్వాన్ని, మాయా సృష్టి, వివర్తన పరిణామాన్ని మరింత సులువైన ఉపమానం చెప్పి తేలికగా ఆత్మజ్ఞానం అవగాహనకు వచ్చేలా చెయ్యవచ్చు.

మానసిక దశలు, మానసిక స్థితులు, అంతఃకరణములు, వాటి పరిణామములు, జ్ఞాన, కర్మేంద్రియములు, వాటి పనులు, మనిషి మానసిక కార్యకలాపములు జరిగే తీరుతెన్నులని, ఆత్మ, బ్రహ్మము, సగుణ, నిర్గుణ మీమాంసలు, ప్రపంచము, విశ్వము, సృష్టి, ప్రళయము వంటి వాటిని మరింత తేలికగా బోధించవచ్చు.
భక్తి, జ్ఞాన, కర్మ మార్గముల ఏకతని, భగవద్గీతాంతరంగములైన సాంఖ్యయోగములను, మనసుకు హత్తుకునేలా చెప్పవచ్చు.

బౌద్ధ, జైన దర్శనములలోని, షడ్దర్శనములలోని ఇచ్చిపుచ్చుకున్న ధోరణులు, సామరస్యముగా చెప్పవచ్చు. న్యాయవైశేషికములు, పూర్వ, ఉత్తర మీమాంసలు, బ్రహ్మసూత్ర వివిధ వ్యాఖ్యానములు, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శివాద్వైత, శాక్తాద్వైత సిద్ధాంతములు ఒకే తాటిపైకి ఎలా తేవచ్చో, వాటిలో ఉన్నాయనుకున్న వైరుధ్యములను ఎలా చక్కగా సమన్వయ పరచవచ్చో అందరుకీ తెలియజేయవచ్చు.

కాలము గురించి అప్పుడే ఊహ వస్తున్న పసికూనకు ఒకలా చెబుతాము. ఒకటో క్లాసు వానికి ఒకలా, పదోక్లాసు వానికి ఒకలా, డిగ్రీ వానికి ఒకలా, పి.జి. వానికి ఒకలా, పరిశోధనా విద్యార్ధికి ఒకలా చెబుతాము. విద్యార్ధి అవగాహనా సామర్ధ్యాన్ని బట్టి బోధనాస్థాయి ఉంటుంది.

ఐన్స్టైన్ సాపేక్షకాలావగాహన పదోక్లాసు అబ్బాయికి చెప్పం. చెప్పినా వానికి గందరగోళంగా ఉంటుంది. శాస్త్రములు అందరకు అవగాహనకు రావు. వారి చదువు, అవగాహనా సామర్ధ్యము విషయాన్ని అర్థము చేసికోవడంలో వారికి పరిమితులను విధిస్తాయి. ఎవరి మట్టుకు వారు వారి శాస్త్రపరిచయాన్ని పెంచుకొని, కాచి వడబోసి తమ అవగాహనా సామర్ధ్యాన్ని పెంచుకొని శాస్త్రరహస్యాలను, గహనమైన విషయాలను ఆకళింపు చేసుకోవాలి గాని తమ అవగాహనా సామర్ధ్య లేమిని శాస్త్రములను తిట్టడానికి ఉపయోగించకూడదు.

మన పరిమితులను ఒప్పుకొని వినయంగా అధ్యయనము చేసి శాస్త్రజ్ఞులు, పండితులు కావాలి.

అలాంటిదే భారతీయ తత్త్వశాస్త్ర అవగాహనా సరళి, క్రమము. కొందరు ప్రాథమిక స్థాయిలో, కొందరు మాధ్యమిక స్థాయిలో, కొందరు స్నాతకోత్తర స్థాయిలో, కొందరు పరిశోధనా స్థాయిలో ఆగిపోతారు. కొందరే కావ్యాలను, శాస్త్రాన్ని, తత్త్వాన్ని, వాటి స్థాయిలని అందుకోగలరు. ఇది మానవుని బుద్ధి సూక్ష్మతని బట్టి, బుద్ధి కౌశలాన్ని బట్టి ఉంటుంది.
మన అజ్ఞానము, అవగాహనా సామర్ధ్య లేమి, శాస్త్రములను, తత్త్వమును, కువిమర్శ చేయడానికి ఉపయోగించరాదు.

దురదృష్టవశాత్తు భారతదేశములో బావిలోని కప్పల వంటి కుహనా మేధావులు ఎక్కువైపోయి, తమకు రానిది, తమకు నచ్చనిది, తమకు అవగాహన కానిది, తాము ఆకళింపు చేసికోలేనిది ఎందుకు పనికిరానిది అని టముకులు వేస్తూ జ్ఞాన సముపార్జనకు ఎదగలేక పోతున్నారు. కువిమర్శలతో, ద్వేషభావ ప్రకటనలతో సరిపుచ్చుకుంటున్నారు.
ఏ చెట్టు లేని చోట, ఆముదపు చెట్టే మహావృక్షమైనట్టు నీరాజనాలు అందుకుంటున్నారు. భారతదేశములో విద్యాభ్యాసమూ జ్ఞాన సముపార్జనకు, పాండిత్య ప్రకర్ష, బుద్ధి నైశిత్యము పెంపొందించుకోవడానికి, శాస్త్ర, తత్త్వ, అవగాహనకూ ఎంతమాత్రమూ ఉపయోగించటం లేదు.

ఉద్యోగం కోసం మాత్రమే చదివే చదువులు, శాస్త్రజ్ఞులను, పండితులను, జ్ఞానులను, తత్త్వవేత్తలను తయారుచేయ
లేవు. జ్ఞాన సముపార్జన చేయక, ఉద్యోగమూ రాక భారత దేశంలో విద్యార్ధినీ విద్యార్ధులు తమ కాలాన్ని, డబ్బుని, శక్తి యుక్తులను వృథా చేసికుంటున్నారు.

దేనిలోనైనా ఉన్న తత్త్వాన్ని అవగాహన చేసికుంటే పుణ్యము, పురుషార్ధము, పరమార్ధమూను.

***********

The Social Activists

They eat meat and chicken for night meal and fight for saving tiger during day time.
They enjoy foreign brand wines at night. They educate slum dwellers and low income people about ills of consuming liquor during day time.
They lead rallies to create awareness about aids during day time. They enjoy each other without condoms during nights.

Wednesday, February 8, 2017

తరణము; దౌర్భాగ్యము - సౌభాగ్యము; వాడిపోతున్న లతానికుంజం

తరణము

ఓం నమో నారాయణాయ యని
అష్టాక్షరిని అస్తమానూ అనుకుంటూ
విహిత కర్మములను విధిగా చేయుచు
సగుణ నిర్గుణ ప్రపంచములలో అలవోకగ


మనసుతో, విరమింపబడిన మనసుతో
తలలో నాలుక వలె చరించుచు, భక్తి
జ్ఞాన మార్గములకు సమ గౌరవము చూపుచు,
సమముగ ఆచరించుచు ప్రపత్తితో నారాయణ

పదమును చేరి ఆ వైకుంఠమున మౌన
శాంతానందముల అనుభవించుచు
తత్పరత నొంది నిర్మల మనస్కుడనై
పరమాత్మ యందు అద్వైతముననుభవించుచు

సందడి లేని సంబరమున తేలియాడుచు
సడి లేని నిర్గుణ స్థితినొంది జీవించెద తరించెద

 ************

దౌర్భాగ్యము - సౌభాగ్యము

ప్రయాణం చెయ్యడానికి కిక్కిరిసిన ప్రమాదభూయిష్ఠమైన
షేర్ ఆటోలు; గతిలేక వాటిలో పౌరుల పయనాల ఇక్కట్లు
దూర ప్రయాణాలకు ప్రయాణీకుల పీల్చే ధరలతో లైసెన్స్
లేని ప్రైవేటు వాహనములు; కొండొకచో వేగమునకు

యమపురి కంపు ముచ్చటలును;
పాలకులు ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోరు;
అంతా అమరావతి మయం; విదేశాలకు విహారం;
ధనవంతుల వద్ద భిక్షాపాత్రతో పడిగాపులు;

ఐదు పది నక్షత్రాల హోటళ్ళలో సమావేశాలు,
ఉపన్యాసాలు; వచ్చునది లేదు బొచ్చెలో రాయి తప్ప
అంతా స్మార్ట్ నెస్; స్మార్ట్ నగరాలు, వగలు; ప్రజలకు
సెగలు; పాలనన్న వట్టి కబుర్లు మాత్రమే నన్న రాజకీయ

నాయకుల బుద్ధినైశిత్యము సర్వదా వందనీయము;
ఇట్టి ప్రజాస్వామ్యము, వంశీకుల,, గర్ల్ ఫ్రెండ్ ల
జన్మహక్కు; చెప్పుటకే కాదు చూచుటకును
అసహ్యముగనున్నది; నాయకులు, వారి కుటుంబీకులు

ఆడ మగ స్నేహితులు అంతా తయారే పాలనకు
భారతదేశమున ప్రజాస్వామ్యమన్న
ప్రజల దౌర్భాగ్యము; నాయకుల సౌభాగ్యము

***********

వాడిపోతున్న లతానికుంజం

మౌర్యులపై ఆంద్ర శాతవాహనుల విజయపరంపరలలో

రాజరాజనరేంద్రుని కృష్ణరాయని
ధవళ కీర్తి చంద్రికలలో


నన్నయ మొదలు "కరుణశ్రీ" వరకు
జాలువారిన రసపద్యకవితా లహరులలో


రామదాసు అన్నమయ్య త్యాగరాజుల
సంగీత సాహిత్య మధుర సమ్మేళనములో


గురజాడ కందుకూరి జాషువా శ్రీశ్రీ దేవులపల్లులు
నక్షత్రాలై అలరారు నవ్యసాహితీ వినీలాకాశంలో


గోదావరి కృష్ణవేణీ పెన్న తుంగభద్రల
పవిత్ర నదీ జల ప్రవాహములో


అమరావతీ శిల్పసౌందర్యంలో
కూచిపూడి నాట్యంలో

నాగార్జున వేమన్న కొడవటిగంటిల
సునిశిత ఆలోచనా స్రవంతులలో


ప్రతిఫలించే తెలుగుదనం
అందమైన లతా నికుంజం

రూపు కోల్పోవుచున్నది చేతకాని వారి చేతులలో
వాడిపోవుచున్నది వివిధరీతులలో

మరింత సౌరభంతో
పరిమళిస్తూనే ఉండాలి
ఎలా???!!!

Tuesday, February 7, 2017

Indian foreign policy; శ్రుతి, లయలు; Intellectualism, Love and Affection

Indian foreign policy

India fought tooth and nail to see that People's Republic of China gets admitted to the UN during Mr. Nehru's "liberal" and naive administration. His pet non-aligned idealism has been a grand failure when China attacked us.

The same People's Republic of China is fighting tooth and nail to block the ban of Azhar, the terrorist who masterminded many dastardly acts on India repeatedly and periodically using its position as permanent member of UN Security Council. Great reciprocation is being exhibited by China.

Foreign policies of countries​ must be devised and prepared by patriotic intellectuals sans prejudices who are full of foresight; should never be chartered by emotional and weak people. India is suffering the emotional deeds of Mr. Nehru perpetually. Bad luck India!

**************
శ్రుతి, లయలు

శ్రుతి, లయలు సంగీతానికి జీవితానికి అవసరం. 
శ్రుతి, లయల జ్ఞానము సంగీత జ్ఞానములో భాగము.
రాగజ్ఞానము సంగీత జ్ఞానములో భాగము.
శ్రుతి అంటే వేదము అనే అర్థమూ ఉంది. శ్రుతి సమ్మతంగా
జీవించమని సనాతన ఆర్షధర్మము చెబుతుంది.

అందులో ముఖ్యమైనవి జ్ఞానము, శాస్త్ర‌పరిచయము, చదువు వల్ల, పాండిత్యము వల్ల కలిగిన విచక్షణ, సంప్రదాయ వైభవము పట్ల, సంస్కృతీ పరిరక్షణము పట్ల అనురాగము, అవగాహన, గౌరవము ఉంటాయి. మనిషి నాగరీకుడు. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. నేర్పాలి. లేకపోతే ఆ చదువు వల్ల ప్రయోజనము లేదు.

శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాద పంకజం శంకరం లోక శంకరం

రాగము; అనురాగము, అనుకంపనల రూపములో మానవాళికి అత్యంత అవసరమైనది. మానవుల మనుగడ; ప్రేమ, అభిమానము, ఆత్మీయత, ఆప్యాయతలపైనే ఆధారపడి ఉంది. గృహ జీవనము, సాంఘిక జీవనము పరస్పరాను రాగము, అభిమానములు లేక, పంచుకోక ఇబ్బందికరంగా పరిణమించి సుఖశాంతులు లేకుండా పోతాయి.

లయ అంటే ఆంగ్ల భాషలో rythm. శివుడు లయ కారకుడు అంటే నాశనము చేసేవాడు అనికాదు. మన జీవితాలు లయబద్ధంగా సాఫీగా సాగేలా చూసే దైవవతంసము అని తాత్పర్యము. శివ, విష్ణు తత్పరమైన
మనసే మోక్షమునందిన, ధన్యత చెందిన ఆత్మ విభూతి. మనసు ఆత్మలో లయము చెందడాన్నే ముక్తి, భక్తి, మౌనము, శుద్ధజ్ఞానము, శాంతము, ఆనందము, నిరంతర ధ్యానము అంటారు.

శ్రుతి జనితమైన ఉపనిషత్ జ్ఞానము భారతీయ తత్త్వ శాస్త్రములకు పట్టుకొమ్మ.

అలా శ్రుతి, లయలు సంగీతాన్ని మన జీవితాలను సుసంపన్నం చేస్తాయి.

అందుకే సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము లేదని త్యాగరాజస్వామి ప్రకటించారు.

శ్రుతి, లయ యుతమైన సమ్మతమైన జీవితము మనిషికి ప్రశాంతయుతమైన జీవనాన్ని ఇస్తుంది.

శుభం భూయాత్!
సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
లోకాస్సమస్తాస్సుఖినో భవంతు!

*************

Intellectualism and Love and Affection

The world has many intellectuals who can incisively think and find solutions to many required or not required at all phenomenon. But there are very few who are ready to love their near and dear. What the world needs is love and affection first and then any intellect or grandness in public exhibition. We can live without any exhibitions but we can not live without sharing love and affection. Let us chose.

**************
 

Friday, February 3, 2017

భారతదేశపు సంస్కృతి-గృహిణులు; రాజకీయము; పరాన్నజీవులు



భారతదేశపు సంస్కృతి-గృహిణులు

గృహిణులు భారతదేశపు సంస్కృతికి పట్టుకొమ్మలు. గృహిణుల వల్లే భారతదేశపు సంస్కృతి ఇప్పటి వరకు బ్రతికి ఉంది. గృహిణులు కాని స్త్రీలు భారతీయ సంస్కృతిని ప్రసారము చేయలేరు. ప్రాచుర్యము కలిగించలేరు. స్వాతంత్ర్యము పేరిట, ఉగ్యోగపు బాధ్యతలతోను ఎక్కువ మంది ఆడువారికి భారతదేశపు సంస్కృతి గురించి అనుభవము, అవగాహన ఉండవు.
 
రెండు పడవల మీద రెండు కాళ్ళు వేసి చేసే ప్రయాణం, ఇవాళో, రేపో ఒక పడవ మీంచి కాలు తీసేసి చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భారతీయ సంస్కృతి మూలన పడుతుంది. అన్ని సంస్కృతులు, అన్ని నాగరికతలు మనుషుల ఆదరణ, ఆచరణల బట్టి జీవిస్తాయి. ఈ తరం గృహిణులైన ఆడువారి తరం తరువాత భారతదేశపు సంస్కృతి బ్రతికి బట్ట కట్టడం కష్టం.
 
నిజానికి ఇవాళ భారతదేశపు సంస్కృతి జీవించినా, మరేమైనా పెద్దగా పట్టించుకునేవారు ఎక్కువ మంది లేరు. ఆ ఉన్న కొద్ది మందీ కూడ ముసలివారై పోయి, జీవించడంలో అలసిపోయి, సంస్కృతిని కొనసాగించే ఓపిక లేక అన్నవాళ్ళే. తెలిసిన వారు ఆచరించే వారు నేటి తరంలో చాలా అరుదై పోయారు. కొనసాగించే శ్రద్ధ, ఓపిక, తీరిక ఉన్న గృహిణులు నెమ్మదిగా అదృశ్యమై పోతున్నారు.

నిజ స్థితిలో భారతదేశపు సంస్కృతి ఆదరణకు, ఆచరణకు, నోచుకోక శిథిలమైపోయే సావకాశం ఎక్కువ కనిపిస్తోంది. క్రొత్త నీరు వచ్చి పాత నీటిని తోసిపారేసినట్టు అంతర్జాల మిళిత ఉద్యోగ, సాంఘిక జీవనాలు ఏర్పడ్డ ఈ రోజుల ఆధునికత ముందు సంప్రదాయ సంస్కృతి గురించి మాట్లాడడం వల్ల ఆయాసం మాత్రమే మిగులుతుంది. నిష్ఠూరంగా అనిపించినా ఇది నిజం.

అందువల్ల మనం లోపాయికారీగా అనుసరిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయ రహిత జీవనపథాన్ని కౌగలించుకొని ఉండి పయనించడమే బుద్ధిమంతుల లక్షణం.

భారత దేశపు సంస్కృతిని అనుసరించక, ఆచరించ లేక ఆదరణ మాత్రం అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళలో చూపడం విదూషకం అనిపిస్తుంది.

శుభం భూయాత్!
************
 రాజకీయము

రాజకీయములన్న భారతదేశమున పార్టీ అధినేత కుటుంబపాలన
ఆ ఇంట్లో తరతరాలకు నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమపు అమలు;
కొందరు భజనపరుల పక్కనేసుకొని వారికి కులముల వారీగా తాయిలాలు అందించి తమ పాలేరుల చేసికొని ప్రభుత్వమున తామే, తమవారే "కలకాలముండుట"; ప్రజలకు చేసిన హామీలే ప్రతి ఎన్నికలో మరి మరి చేసి
మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయుట; వారి నెత్తిని చేయుంచుట
***********
పరాన్నజీవులు

ఇంటి కన్న‌ గుడి‌ పదిలమనుకొనుచు
ఎందరొ సన్యాసము తీసికొని
పెంపుడు రాచిలకల వలె పలుకుచు
తత్త్వబోధలు చేయుచు ఆస్తులు

సంపాదించుచు ఆశ్రమములు
స్థాపించుకొనుచు; శక్తి అదృష్టముల మేరకు
కుటీర లేక భారీ పరిశ్రమ నిర్వాహకులై వెలుగు
ఈ వేళ‌ గాజుముక్క రత్నమై ప్రకాశించుచున్నది

పనిలేక సోమరులై గృహస్థుల‌ గేలిసేయుచు
వారి సంపాదనల మాత్రము స్వీకరించుచు
ఆచార్య స్వాములై ఆధ్యాత్మిక రంగమునేలు
వేషధారులు సంఘమునకు పెడవారు

బాధ్యతల వహించక ఏమాత్రము కష్టపడక
ఒడ్డున ఉండి ఈతపై‌ ఉపన్యాసములనిచ్చు
స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాలు
గృహస్థులకు గుదిబండలు; పరాన్నజీవులు ఈ మూకలు
*************

The quota, license Raj is slowly dying
But the quota, reservation Raj is flourishing:
Politicians cannot live or breathe
Without sloganeering quota word



******************
ప్రతి విషయానికి రెండు పార్శాలు ఉంటాయి.. ఒకదాన్ని గణిస్తే రెండవదాన్ని గణించలేము. లేడి పులికి ఆహారం. రెండింటి మీద ఒకేసారి సానుభూతి చూపించలేము. చూపించడానికి వీలుపడదు. ఏదో ఒక దానికే. పరస్పర విరుద్ధమైన ప్రయోజనములు కల రెంటిపై ఒకేసారి జాలి చూపించడానికి కుదరదు, మనమెంత మానవత కలవారమైనా.