ఉపనిషత్సారము - ఉపనిత్సందేశము
శరీరము పంచభూతాత్మికము అంటే, ఆ మాట భౌతిక శరీరము గురించి కాదు. మానసిక శరీరమును గురించి.
మనలో కారణ, సూక్ష్మ, స్థూల శరీరములు ఏర్పడతాయి.

వీటిలో స్థూల శరీరము పంచభూతాత్మికము. ఈ మూడు శరీరములు మానసిక స్పృహలు మాత్రమే.
ఆకాశము గమనికకు; వాయువు యాంత్రిక క్రియలకు, కర్మలకు - స్వర శక్తికి; తేజస్సు దివ్య శక్తి, చిన్మాత్ర,ల సమాహారము, జ్ఞానార్జనకు, అధ్యయన, అధ్యాపనములకు; అప్ అంతఃకరణములకు; పృథివి తన్మాత్రల గ్రహణలకు, వ్యక్తీకరణలకు సంకేతములు.
కారణ శరీరము సత్త్వ గుణమునకు, సూక్ష్మ శరీరము రజోగుణమునకు, స్థూల శరీరము తమో గుణమునకు ప్రతీకలు.
అంతే తప్ప మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకసములకు ఈ పంచభూతాత్మిక స్థూల శరీరమునకు ఏమీ సంబంధము లేదు.
ఉపనిషత్తులు, వేదాంతము, మాట్లాడినది జ్ఞానము, ప్రజ్ఞానముల గురించి; జ్ఞాన, భాషా, శాస్త్ర, లౌకిక, అలౌకిక, కళా జ్ఞాన సముపార్జనము, అధ్యయన, అధ్యాపనములకు గురించి; మనసు స్వరూప, స్వభావముల గురించీ ప్రతిపాదించి, చర్చించాయి.
ఆత్మ, బ్రహ్మముల గురించి, మానసిక దశల, మానసిక దృష్టుల గురించి, భాషాజ్ఞాన స్వరూప, స్వభావముల గురించి, మానసిక ప్రపంచము, దాని స్వరూప, స్వభావముల గురించి, "నేను" అసలు స్వరూపమును గురించి కూడా మాట్లాడాయి.
ఆత్మ/బ్రహ్మము; మనసు, జీవబావనలు, ఇతర అంతఃకరణములైన బుద్ది, చిత్తము, అహంకారములు పుట్టు మరియు గిట్టు చోటు. పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అవస్థా యుతమైన పరా కూడా బ్రహ్మమే. ఇది భక్తి స్థితి. పశ్యంతీ అర్థ స్థితి. మధ్యమా, వైఖరీ లు విభక్తి స్థితులు. పరా తత్పర, తాత్పర్య స్థితి.
ఇదంతా బ్రహ్మజ్ఞానము, శబ్దబ్రహ్మసిద్ధాంతము. మాయ, ప్రణవము, స్ఫోటము, చిదాభాస ఇవన్నీ చిత్ శక్తి విభూతులు. మాటలు వేరుగాని ఈ శక్తీ స్వరూపములన్నీ ఒకటే. మన మానసిక కార్యకలాపములన్నీ మాయా పరిణామములు - తిరోధాన-పురోధాన చర్యలు.
ఇదంతా ఉపనిత్సారము. ఉపనిత్సందేశము.
ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!

No comments:
Post a Comment