Wednesday, August 26, 2015

ఉపనిషత్సారము - ఉపనిత్సందేశము

ఉపనిషత్సారము - ఉపనిత్సందేశము
శరీరము పంచభూతాత్మికము అంటే, ఆ మాట భౌతిక శరీరము గురించి కాదు. మానసిక శరీరమును గురించి.
మనలో కారణ, సూక్ష్మ, స్థూల శరీరములు ఏర్పడతాయి.

వీటిలో స్థూల శరీరము పంచభూతాత్మికము. ఈ మూడు శరీరములు మానసిక స్పృహలు మాత్రమే.
ఆకాశము గమనికకు; వాయువు యాంత్రిక క్రియలకు, కర్మలకు - స్వర శక్తికి; తేజస్సు దివ్య శక్తి, చిన్మాత్ర,ల సమాహారము, జ్ఞానార్జనకు, అధ్యయన, అధ్యాపనములకు; అప్ అంతఃకరణములకు; పృథివి తన్మాత్రల గ్రహణలకు, వ్యక్తీకరణలకు సంకేతములు.

కారణ శరీరము సత్త్వ గుణమునకు, సూక్ష్మ శరీరము రజోగుణమునకు, స్థూల శరీరము తమో గుణమునకు ప్రతీకలు.

అంతే తప్ప మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకసములకు ఈ పంచభూతాత్మిక స్థూల శరీరమునకు ఏమీ సంబంధము లేదు.

ఉపనిషత్తులు, వేదాంతము, మాట్లాడినది జ్ఞానము, ప్రజ్ఞానముల గురించి; జ్ఞాన, భాషా, శాస్త్ర, లౌకిక, అలౌకిక, కళా జ్ఞాన సముపార్జనము, అధ్యయన, అధ్యాపనములకు గురించి; మనసు స్వరూప, స్వభావముల గురించీ ప్రతిపాదించి, చర్చించాయి.

ఆత్మ, బ్రహ్మముల గురించి, మానసిక దశల, మానసిక దృష్టుల గురించి, భాషాజ్ఞాన స్వరూప, స్వభావముల‌ గురించి, మానసిక ప్రపంచము, దాని స్వరూప, స్వభావముల గురించి, "నేను" అసలు స్వరూపమును గురించి కూడా మాట్లాడాయి.

ఆత్మ/బ్రహ్మము; మనసు, జీవబావనలు, ఇతర అంతఃకరణములైన బుద్ది, చిత్తము, అహంకారముల‌ు పుట్టు మరియు గిట్టు చోటు. పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అవస్థా యుతమైన పరా కూడా బ్రహ్మమే. ఇది భక్తి స్థితి. పశ్యంతీ అర్థ స్థితి. మధ్యమా, వైఖరీ లు విభక్తి స్థితులు. పరా తత్పర, తాత్పర్య స్థితి.

ఇదంతా బ్రహ్మజ్ఞానము, శబ్దబ్రహ్మసిద్ధాంతము. మాయ, ప్రణవము, స్ఫోటము, చిదాభాస ఇవన్నీ చిత్ శక్తి విభూతులు. మాటలు వేరుగాని ఈ శక్తీ స్వరూపములన్నీ ఒకటే. మన మానసిక కార్యకలాపములన్నీ మాయా పరిణామములు - తిరోధాన-పురోధాన చర్యలు.

ఇదంతా ఉపనిత్సారము. ఉపనిత్సందేశము.

ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!

Thursday, August 20, 2015

తత్త్వము - మతము

తత్త్వము - మతము

తత్త్వము, మతము ఒకటి కావు. తత్త్వము మతాన్ని ప్రభావితము చేస్తుంది. మతము తత్త్వాన్ని ప్రభావితము చేయలేదు. భారతీయ తత్త్వశాస్త్రము, భారతదేశములో ఆచరింపబడుతున్న మతములు ఒకే రాటకు కట్టరానివి.

ఉపనిషత్తులలో ప్రారంభింపబడి, బౌద్ధము, జైనము, షడ్దర్శనములు, భగవద్గీత, ఇతర తత్త్వశాస్త్ర గ్రంథముల మీదుగా పయనించి, తరువాతి వ్యాఖ్యాతల, జ్ఞానుల మనసులలో సరిదిద్దుకొని, సరిదిద్దబడి, ఇప్పుడు మనకు లభించుచున్న, తత్త్వము మతము కాదు.

భారతీయ తత్త్వ శాస్త్రము మతము నుండి స్వతంత్రమైనది. ఉపనిషత్తులతో మొదలై ఇప్పుడు బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, బౌద్ధము, జైనము, స్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస (వేదాంతము), శబ్దబ్రహ్మసిద్ధాంతము (స్ఫోట వాదము - వ్యాకరణ సిద్ధాంతము) పేర్లతో పిలబడే తత్త్వము నిరంకుశమైనది. ఇది మతములతో సంబధములేకుండా, వాటికి సమాంతరముగా ఎదుగుతూ, మతములను, మతాచార్యులను ప్రభావితము చేస్తూ, వారికే అతీతమై, ఒక ప్రత్యక అవగాహనగా నేటికీ వెలుగుతూ మన మనస్సులను వెలిగిస్తోంది.

ఉపనిషత్తులు బౌద్ధ, జైన తత్త్వములను ప్రభావితము చేసాయి. ఇవి మూడూ షడ్దర్శనముల పుట్టుకకూ, వాటి ఎదుగుదలకూ కారణమయ్యాయి. ఆపై ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్రములు, భగవద్గిత లతో కూడిన ప్రస్థానత్రయము శంకరులను, రామానుజులను, మధ్వాచార్యులను అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము లుగా వ్యాఖ్యానింపజేసాయి. ఇవి భక్తి, జ్ఞాన, కర్మ మార్గములుగా మనకి అందాయి. ఆయా మతములూ జనించాయి. వీటితో పాటు మరికొన్ని చిన్ని, చిన్ని, చిల్లర మల్లర మతములూ పుట్టాయి.

ఉపనిషత్తులు, బౌద్ధము, జైనము, శబ్దబ్రహ్మ సిద్ధాంతము, షడ్దర్శనములు, చార్వాకము, ఇప్పటి ప్రాచ్య, పాశ్చాత్య వాదములు, సిద్ధాన్తములు, (ఉదా: rationalism, communism, atheism, various social justice isms, and similar isms and theories) తత్త్వ శాస్త్రము క్రింద వస్తాయి.

ముఖ్యముగా ఉపనిషత్తులు, జైనబౌద్ధములు, షడ్ దర్శనములు తరువాతి వ్యాఖ్యాతలు, జ్ఞానులు మనసు స్వరూప స్వభావముల గురించి, మనస్తత్త్వాన్ని గురించి, చదివి, చర్చించి, ఆలోచించి, జ్ఞానమును అనుభవించి తమ తమ సిద్దాంతములను ప్రకటించారు.

Indian philosophical and spiritual systems have uniquely and thoroughly presented their experiences, observations, studies, feelings, intuition, understanding, insight, ideas, discussions, agreements. opposition, in relation to both software and hardware of human consciousness, mind and their functions in their own way. In addition to this, Sabdabrahma Siddhaanta (Sphotavaada) presented the theory of language acquisition and communication.

అలా భారతీయ తత్త్వ శాస్త్రము, మతములు వేరు. మతము ఆచరణకు, ఆచారములకు సంబందింఛినది. తత్త్వము consciousness and mind (ఆత్మా/బ్రహ్మము, మనోబుద్ధ్యహంకారచిత్తములకు (అంతః కరణములు), జ్ఞాన, కర్మేన్ద్రియములకు వాటి చర్యలకు సంబంధించినది. శబ్దబ్రహ్మ సిద్ధాంతము, స్ఫోట వాదములలో - భాష స్వరూపము, దాని అవస్థా భేదములు, అందులోని విజ్ఞాన, జ్ఞాన అంశములు విశదముగా, వివరముగా చర్చించబడ్డాయి. ఇవ్వబడ్డాయి. వీటికి మతముతో సంబంధము లేదు. ఈ అవగాహన మానవలోకము అంతటికి సంబంధించినది. జాతి, మత, కుల, ప్రాంత, భాషా, సిద్ధాంత, దేశ, ఖండములకు అతీతముగా మానవులందరికీ సంబంధించినది. ఉపయోగ పడేది.

భారతీయ తత్వశాస్త్రము, భారత దేశములో అనుసరించబడే మతములు, నాస్తికత, ఇతర సిద్ధాంత, రాద్ధాంతములు  సమాంతరములు.

భారతీయ తత్త్వ శాస్త్రము జీవనది. ఎవరైనా అందులో తానమాడవచ్చు

తత్త్వము అందరికీ. మతము వారి వారికి.

సత్యం జ్ఞానం అనంతం  బ్రహ్మా!

Saturday, August 15, 2015

The Secluded Place

The Secluded Place

Many desire to do penance
At a Secluded Place
Away from maddening crowd
And distracting surrounding world;

Will they find it?
Can they do penance
There un-distracted
Even if they find one?

Mind by being present always
Distracts; not the maddening crowd
Nor surrounding world causes any disturbance;

Resting the mind in its source
Is the desirable penance;
Not a Secluded Place on earth
But a secured place within
Is the right place and aim for penance;

That place is Divine and Secluded
Let us do penance to rest mind there
We find peace and mind becomes serene
Even though we are in the maddening crowd
Or disturbing surroundings

That is the Desirable Secluded Place
Aim for penance and mind to reside,
And Be

Thursday, August 13, 2015

తమస్సు - తమోగుణము

తమస్సు - తమోగుణము
ఉపనిషత్తులు, షడ్దర్శనములు, శబ్దబ్రహ్మసిద్ధాంతము, తత్సంబంధ భారతీయ తత్త్వములు, తత్త్వ మీమాంసలు, వైజ్ఞానిక, ఆస్తిక దృష్టులతో వెలువడ్డాయి, వ్యాఖ్యానించబడ్డాయి. ప్రస్తుతము చాలామందికి శంకరుల, రామానుజుల, మధ్వాచార్యుల, తదితర వ్యాఖ్యానముల గురించి మాత్రమే తెలుసు.
ఉపనిషత్ ప్రతిపాదనలను జ్ఞానబోధమీమాంసా పరంగా కూడా వ్యాఖ్యానించవచ్చు. అప్పుడు మనకింతవరకు తెలిసిన ఈ విషయములను కొత్త కోణంలో చూసినప్పుడు మనకు వింతగా కనిపించి ఒప్పుదల చూపనీయవు. కాని శాస్త్రము శాస్త్రమే.
మనకు విశాల దృక్పథము ఉంటే కొత్త విషయాలను ఆకళింపు చేసికోవడానికి ప్రయత్నిస్తాము.
ఆధ్యాత్మిక గ్రంథములలో తమస్సు, తమోగుణము పదాలు అస్తమానూ వస్తాయి.
మనలో ఆత్మ ఉండి మన జ్ఞాన, విజ్ఞాన, భాషాజ్ఞాన సముపార్జనకు అవసరమైన మానసిక కార్యకలాపములను జరపడానికి, జరపడానికి కావలసిన శక్తినీ (చిచ్ఛక్తిని) ఇస్తూ, జరిపిస్తూ ఈ మానసిక కార్యకలాపములను గమనించే వీలునూ కలిగిస్తోంది.
మనలో అస్తమానూ ఉండేది ఆత్మ దశ. దీనిపై మూడు మానసిక దశలు కలిగి పోతూంటాయి.
అవి:
జాగ్రత్ (మెళకువ),
స్వప్న (కల),
సుషుప్తి‌ (గాఢనిద్ర).
సుషుప్తి‌ మానసిక దశలో మనసు, ఇతర అంతఃకరణములైన బుద్ధ్యహంకారచిత్తములు (లోని పనిముట్టులు) పనిచేయక విరమణలో ఉంటాయి. ఈ దశలో మానసిక కార్యకలాపములేవీ జరగవు. గ్రహణలు, గ్రహింపులు, క్రియలు, ప్రతిక్రియల కలాపము విరమింపబడి పూర్ణ శాంతి మనసై, నిరాకుల స్థితి అనుభవమై ఉంటుంది.
జాగ్రత్, కల మానసిక దశలలో అన్ని అంతఃకరణములు పనిజేసి సకల మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి.
మనసు మాధ్యమము ద్వారా జ్ఞానేంద్రియములు బయటి భౌతిక ప్రపంచము తో అనుసంధానింప బడి గ్రహణలు, తద్వారా కలిగిన అనుభవములు, గ్రహింపులు, వరుసగా మనసు, చిత్తముల ద్వారా గ్రహింపబడి అంతర ప్రపంచంగా, వాసనలుగా భద్రపరుపబడతాయి. ఇది బహిర్ముఖ దృష్టి.
మళ్ళీ చిత్తము, ఈ వాసనలను (విషయానుభవములను) ప్రేరేపించి సుఖదుఃఖములను కలిగించి, మనసుచే తదనుగుణ విషయములను అంతర ప్రపంచంనుంచి గ్రహింపజేసి, జగత్ (గ్రహిత విషయములను‌) ను, భావముల రూపంలో దృష్టికి తెచ్చి కర్మేంద్రియములద్వారా క్రియలను, ప్రతిక్రియలను ఆచరింపజేస్తుంది.
కల మానసిక దశలో అంతఃకరణములన్నీ, కర్మేంద్రియములు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. అందువల్ల బయటి భౌతిక ప్రపంచముతో అనుసంధానముండదు. శరీరము బయట
ఏం జరుగుతోందో తలియదు.
మెళకువ, కల మానసిక దశలను ద్వైత స్థితి అంటారు. సుషుప్తి‌, ఆత్మ దశ లను అద్వైత స్థితి అంటారు. ఆత్మ దశను జాగ్రత్ సుషుప్తి‌, శుద్దాహం, ప్రజ్ఞానము, ముక్తము అనీ అంటారు.
ఆత్మ దశలో మెళకువ (జాగ్రత్) ఉంటుంది. అన్నీ తెలుస్తాంటాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల అనుసంధానం ఉంటుంది. కావాలనుకుంటే, అవసరమైతే ద్వైత స్థితి కలిగి అంతఃకరణములు పనిజేసి మానసిక కార్యకలాపములు జరుగుతాయి వద్దనుకుంటే ఆగి, అంతఃకరణలు విరమింపబడతాయి. అద్వైతానుభవము దృష్టిలో, విశ్రాంత దృష్టిగా ఉంటుంది.
సుషుప్తిలో ఈ వీలుండదు. ఏదీ తెలియదు. దీనినే తమస్సు అంటారు. కొందరు జ్ఞానరాహిత్యాన్ని తమస్సు అంటారు.
మనకు లౌకిక, ఆధ్యాత్మిక, భాషా, కళా జ్ఞానములు, ఏ ఇతర జ్ఞానమైనా కలగాలంటే త్రిపుటి ఏర్పడాలి.
గ్రహణ "జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము" గా విడాలి. ఇది అద్వైత స్థితిలో జరగదు. ద్వైత స్థితి లోనే త్రిపుటి ఏర్పడుతుంది.
త్రిపుటి రూపములు
ధ్యాత - ధ్యానము - ధ్యేయము
కర్త - క్రియ. - కర్మ
తెలుసుకునేవాడు-తెలుసుకోవడం- తెలుసుకునేవస్తువు
జ్ఞాతగా మాత్రమే ఉంటే‌ అది సత్త్వ గుణము. ఇప్పుడు జ్ఞాతను ప్రాజ్ఞుడు అంటారు. ఇది విశ్రాంత దృష్టి. గమనిక మాత్రము.
జ్ఞాత దృష్టిలో అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములుంటే రజో గుణము. ఇప్పుడు జ్ఞాతను తైజసుడు అంటారు. ఇది అంతర్ముఖ దృష్టి.
అంతఃకరణములద్వారా జ్ఞాత విషయాన్ని గ్రహిస్తే అది తమో గుణము. ఇప్పుడు జ్ఞాతను వైశ్వానరుడు అంటారు.
గుణము అంటే ముడి.
దృష్టి అంతఃకరణములద్వారా‌ విషయములకు, విషయానుభవములకు ముడిపడి ఉంటే రజస్తమోగుణములు. వీటితో ముడిపడక వట్టి గమనికగా ఉంటే‌ సత్త్వ గుణము.
గుణమును న్యాయవైశేషికములు, సాంఖ్యయోగములు కూడా ప్రతిపాదించాయి.
జాగ్రత్ సుషుప్తి‌, విశ్రాంత దృష్టి యైన ఆత్మదశ పై, ఆత్మదృష్టిపై జాగ్రత్, స్వప్న, సుషుప్తులు మనకి తెలిసీ తెలియక రోజూ ఆనతాయి. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను పొంది విశ్రాంత దృష్టిని కోల్పోయి మానసికముగా, శారీరికముగా చరిస్తాము.
జ్ఞాత, జ్ఞేయములు లేని జ్ఞానము ప్రజ్ఞానము.
"ప్రజ్ఞానమ్ బ్రహ్మా"
శుద్ధజ్ఞానము అన్నా, శుద్దాహం అన్నా ఇదే.
"అహం బ్రహ్మాస్మి"
జ్ఞానుల, ఋషుల, మునుల స్థితి ఇది. నిర్గుణ స్థితియన్నా ఇదే.
గుణములు కలుగక మానసిక కార్యకలాపములు జరుగవు.
తమస్సు అంటే ఏ గ్రహణా, గ్రహింపు లేని, ఏమీ తెలియని‌ జ్ఞానరహిత దృష్టి. నిర్గుణ స్థితి కాదు. మెళకువ (తెలుస్తూ) ఉండదు. శరీర అంతర్, బహి అనుసంధానం ఉండదు.
గమనించే తెలివి ఆత్మ. ఇది ప్రకాశము.
గమనికలో ఏమీ లేకపోవడం తమస్సు. ఇది చీకటి.

ఈ రచన బ్రహ్మజ్ఞానముపై ఆధారపడి రచింపబడినది.

Sunday, August 9, 2015

సంసారము, పూర్ణభక్తి-ప్రేమ-జ్ఞానము

సంసారము

సంసారమంటే మనస్సంసారమే. మనకు కలిగిన అనుభవముల వలన జనించే తలపులు, వ్యక్తీకరణలు ఈ మానసిక సంసారములో భాగము. మన చిన్నతనంనుంచీ మనసు మాధ్యమమున జ్ఞానకర్మేంద్రియముల ద్వారా, బుద్ది, అహంకారము, చిత్తముల ద్వారా గ్రహించిన విషయములు, విషయానుభవములు మనలో ప్రపంచంగా, వాసనలుగా స్థిరపడతాయి. మన అహంభావ, అహంకార, మమకారములు, వ్యక్తి, వ్యక్తిత్వ భావనల సమాహారమే అహంకారము. బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. తర్కిస్తుంది.
వాసనలు మన విషయానుభవములే. మనసు విషయాన్ని, విషయసమూహాన్నీ ప్రపంచంగా మారుస్తుంది, గ్రహిస్తుంది, చిత్తము విషయానుభవములను జ్ఞప్తిగా మార్చి మరల అనుభవములుగా దృష్టికి తెస్తుంది. ఈ అనుభవములు తలపులుగా మారి అనుగుణంగా వ్యక్తమౌతాయి. ఇదంతా మన మెళకువ, కల మానసిక దశలలో జరుగుతుంది. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను కలిగి ఉంటాము.
ఇలా మానసికంగా కలాపించడమే సంసారములో చిక్కుకోవడము. భార్యా\బిడ్డలను ఇతర ప్రాపంచిక బంధములను, ఆస్తిపాస్తులను, పేరు, ప్రతిష్టలను కలిగి ఉండడం మాత్రమే కాదు. అన్నీ వదలి పెట్టేశాను అనుకున్న సన్యాసి, స్వామి, అమ్మ, బాబా, సాధు, సంత్ లకు ఈ మానసిక హడావుడి అంతా ఉంటే వారు పైకెంత చెప్పినా సంసారంలో చిక్కుకున్నవారే.
భార్య లేక భర్త, పిల్లలు, ఇంటి బాధ్యతలు ఆధ్యాత్మికతకు ఎన్నడూ అడ్డంకులు కావు. పైపెచ్చు సహాయకారులు కూడా. అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులలో చిక్కుకున్న మనసు కలాపములను విరమించుకొని విశ్రాంత దృష్టి యుత కావడమే సంసారమును అధిగమించుట.
నేను ఫలానా వ్యక్తిని ( సంసారిని, స్వామిని, సన్యాసిని, అమ్మను, బాబాను మొదలైన అన్వయములు) అనే స్పృహా రహితంగా వర్తించడమే, జీవన యానం చేయడమే ఋషి లక్షణం. మౌనము, ఆనందము, నిరంతర ధ్యానమై ప్రశాంతతను అనుభవముగా చేసికొనడమే. అటువంటివారే సంసారమును అధిగమించినవారు. ఇతరులందరూ, వారి వేషభాషలేవైనా, సంసారులే.

పూర్ణభక్తి-ప్రేమ-జ్ఞానము

పూర్ణభక్తియే జ్ఞానము. భక్తి అంటే ఇష్టదైవమందు పరమమైన ప్రేమను కలిగి ఉండడం. అలా పరిపూర్ణమైన ప్రేమయే జ్ఞానము. భక్తి, ప్రేమ, జ్ఞానము కలిగినప్పుడు మన వ్యక్తిత్వము వాటిలో లీనమైపోతుంది. మనము‌ అని విడిగా ఉండము. మన ఉనికి భక్తిగా, ప్రేమగా, జ్ఞానముగా మారిపోతుంది. అహంకార, మమకారములు కరిగిపోతాయి. అహంకార, మమకారములు అంతరిస్తే మిగిలి ఉండేది ప్రశాంతత. ఆనందము. మనసుని పరుని వశము చేయడం; "పర వశము" చేయడంకూడా, ఆధ్యాత్మిక సాధనయే. మన మన తత్త్వములను, స్వభావములను బట్టి మనము మన వ్యక్తిత్వాన్ని భక్తి, ప్రేమ, జ్ఞానములలో ఒకదానిలో లీనం చేస్తాము. పరమాత్మలో అంత:కరణముల విలీనమే వక్తిత్వ విస్మరణము, నిర్మూలనము. మోక్షము, ముక్తి ఇవే.

Saturday, August 8, 2015

Bans and amusing reactions!, Elections and governance in India

Bans and amusing reactions

In Tamilnadu all political parties are demanding imposition of prohibition because consuming liquor is so spread, many school children are coming to schools drunk. Similarly when school going students and adults.who consume liquor are nusense to society and also are spoiling their health, prohibition is demanded.

In the same breath, when school going children and adults view porn content on the internet and become nusense and dangerous to society in addition to spoiling their psychological health and demeanor, why porn sites not be banned?

Why many celebrities and "intellectuals"are vehemently opposing ban on porn sites as infringing their privacy and are silent on imposing prohibition, and drinking is also a privacy issue and " private" affair?

Drinking, consuming liquor, drugs, opium and rave party stuffs equally spoil the physical and psychological health of individuals. Everyone knows this. Then why this foolishness in opposing certain bans and being silent on certain other bans?

This selective concern and opposition for some bans only, are subjective, political, and biased.

Elections and governance in India

In our country every six months or so an election is due and is being held in one state or other. Thus every political party and both central and respective state government are in election mode and mood through out the year. Until 1967 both parliament and state assembly elections were being held simultaneously.

That pattern and schedule were disturbed in 1971 and never reached normalcy. The zig zag pattern is continuing with disastrous consequences to the polity and nation. Governments can not administer focussing almost all their attention on elections.

Governments can neither take policy decisions nor implement already taken policy decisions as election code of conduct will be in force perpetually.

By taking some legislative measure the normalcy of simultaneous conduct of elections for parliament and all state assemblies should be restored; else lot of money, time, energy of governments, political parties, bureaucrats and citizens are wasted on conduct of elections with very little or no time for decision-making and implementation of development works and citizens to concentrate on their day to day lives.
********
In test cricket the efficiency of a batsman also equally depends on his art and technique of leaving balls; in ODIs the art of batsman is in striking the ball and scoring runs.