We humans waste most
of our time in praising, admiring, appreciating, adoring and spreading all
good, good leaders, culture, and everything good on earth.
But we do not have
time, aptitude or desire to practice all that is good. Humans are experts in
vain talk
*******
గ్రీష్మం-వసంతం
మంత్రాల కన్నా తుప్పర్లు ఎక్కువైనట్లు
ప్రస్తుతం భారతదేశంలో సమాజంలో అనుసరణ కన్న ఉపదేశాలు, సంప్రదాయ, సంస్కృతులను పొగుడుతూ, తమని తాము పొగుడుకుంటూ పెట్టే పోస్టులూ
ఎక్కువై పోయాయి.
పాటించకుండా ఏ సంస్కృతి, సాంప్రదాయం నిలవవు. ఎంతసేపూ వేరే వాళ్ళు అనుసరించాలనే తాపత్రయమే తప్ప తామూ
అనుసరించాలనే దృష్టే లేదు.
ఎదుటి వారికి
చెప్పేటందుకే నీతులున్నాయి.
అసలు వేటిని అనుసరించాలి, వేటిని వదిలెయ్యాలి అనే విషయాలు ఈ నిరంతర
ఉపదేశ కర్తలకు, ఉపన్యాస
శిరోమణులకు తెలియదు. దేశ,కాల
పరిస్థితులకు అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలు మార్చడమూ తెలియదు.
కాని పుంఖానుపుంఖాలుగా పోస్ట్లు మాత్రం
సంస్కృతి, సంప్రదాయాల
గురించి పెట్టేస్తోంటారు. ఈ హడావుడి తగ్గించి తాము పొగుడుతూ ఉటంకించే సాంప్రదాయ, సంస్కృతులను తాము ఆచరిస్తే నెటిజన్లకు సగం
గందరగోళం తగ్గుతుంది.
ఎవరి బతుకు వారు బతకగల నేర్పు, చాకచక్యం, అవగాహన, ఆకళింపు ఎందరికో ఉన్నాయి. వారి మానానికి
వారిని వదిలేస్తే అంతా వసంతమే. లేకపోతే నిరంతర గ్రీష్మమే.
**********
నెటిజన్ల
ఇగో, బాధ్యతారాహిత్యం - మిగతా వారి కష్టాలు
ఈ రోజుల్లో చాలా మంది అంతర్జాతీయ
సాలెగూళ్ళలోని తమ పోస్ట్లలో తప్పుడు వర్ణక్రమం రాసి దానిని ఫోన్ మీదికి
నెట్టేస్తున్నారు. ఆ సాలెగూళ్ళలో ఎడిట్ సౌకర్యం ఉన్నా ఉపయోగించుకోవడం లేదు. ఇక్కడ
వారికి వారి ఇగో అడ్డు వస్తోందో,
వారికి
వర్ణక్రమమే తెలియదో!
వారు ఆచరిస్తున్న వర్ణక్రమ దోషాల వల్ల వాళ్ళు
ఏం చెబుదామనుకుంటున్నారో ఇతరులకు ఏమీ అర్థం కావటం లేదు అన్న స్పృహే ఉండటం లేదు ఈ
నెట్జన్ ఔత్సాహికులకు.
వారి
అపభ్రంశపు రాతలు చదివేవారి వర్ణక్రమ జ్ఞానానికి, ఓపికకి పరీక్ష పెడుతున్నాయి. ఈ నిర్లక్ష్యం
వారికి భాష పట్ల కల అగౌరవాన్ని, వారి పోస్ట్లు
చదివే తోటి నెటిజన్ల కష్టాల పట్ల కరుణా రాహిత్యాన్ని తెలియజేస్తూ అందరితోనూ ఆటలాడుకుంటున్నాయి. వర్ణక్రమ దోషాలు దేశంలో అవినీతిలా విపరీతంగా పెరిగిపోయాయి.
చదివే తోటి నెటిజన్ల కష్టాల పట్ల కరుణా రాహిత్యాన్ని తెలియజేస్తూ అందరితోనూ ఆటలాడుకుంటున్నాయి. వర్ణక్రమ దోషాలు దేశంలో అవినీతిలా విపరీతంగా పెరిగిపోయాయి.
***********
బేబీ కేర్
సెంటర్ టు వృద్ధాశ్రమం
కొందరు ఆడ, మగ ఇల్లు
వదిలేసి బయటే ఎక్కువగా తిరగాలని ఎందుకనుకుంటున్నారో! అర్థరాత్రి, అపరాత్రి అనకుండా తిరుగుతారట. వారికి ఏం జరగకుండా సమాజం బాధ్యత వహించాలట.
అసలు వారు చేసే ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, వ్యవహారాలే
వారిని రోజంతా ఇంట్లో లేకుండా బయటే ఉంచుతున్నాయి.
నిజానికి
ఇల్లు తన ఆకర్షణ, అవసరం, విలువ కోల్పోయింది. ఎప్పుడైతే ఇల్లాలు
మరణించడం మొదలైందో, ఆ క్షణమే
ఇల్లు మన జీవితాల్లో తన పాత్ర కోల్పోయింది. దానికి తోడు కొత్తరకం కుర్రకారుకి
వంట, ఇంటి వ్యవహారాలూ చూసుకోవడం రాదు. చూసుకోవాలనే ఇచ్ఛ లేదు. ఒక వేళ ఉన్నా సమయం లేదు.
వంట, ఇంటి వ్యవహారాలూ చూసుకోవడం రాదు. చూసుకోవాలనే ఇచ్ఛ లేదు. ఒక వేళ ఉన్నా సమయం లేదు.
పసికందులకు, ముసలివగ్గులకు ఇంట్లో చోటు లేదు. బేబీ కేర్
సెంటర్లు, వృద్ధాశ్రమాలు
ఇంటికి ప్రత్యామ్నాయంగా మారడానికి, ఎదగడానికి వాతావరణం అనుకూలమౌతోంది.
భవిష్యత్తులో ఇవి ఇంటిని పూర్తిగా త్రోసిరాజని ఇంటికి చెక్ పెడతాయి.
అంచేత ఇల్లు, ఇల్లాలు నెమ్మదిగా మన జీవితాల్లోంచి
శాశ్వతంగా శెలవు తీసి కుంటారు. అమ్మలంటూ ఉండరు. గృహిణులు అనే మాట వినిపించదు.
ముందు తరాల జీవితాలు బేబీ కేర్ సెంటర్ లో
మొదలై, స్కూల్లోకి
పరిణమించి, విద్యాలయాల్లో
వికసించి, ఉద్యోగాలలో
జీవం పోసుకొని, పబ్ లు, ఫుడ్ జాయింట్లలలో బతికి వృద్ధాశ్రమాలలో ఈ
పృథివికి వీడ్కోలు చెబుతాయి.
*********
ఫేస్బుక్
ఘోషలు, హైరానాలు
ఫేస్బుక్ లాంటి అంతర్జాల మాధ్యమాలు వచ్చిన
తరువాత భావ ప్రకటన ఎక్కువైంది. అదే వేగంతో లోతైన అధ్యయనం, అవగాహన తగ్గుతున్నాయి. వాటి ప్రకటనా తగ్గుతోంది.
ఇలా తగ్గడానికి ఫేస్బుక్ వంటి అంతర్జాల
మాధ్యమాల్లో పోస్టింగ్స్ తామరతంపరగా పెరగడం కాకపోవచ్చు. కానీ కాలక్షేపం బఠానీల
ముందు ఆకళింపు వెనుకబడడం సహజమేమో!
అందరమూ
సున్నితమైన హృదయాలు కలిగి, మనసు కలగి
ఎన్నో ప్రతిస్పందనలను అలవోకగా,
ఆవేశంగా, నీతిపరులమై, సంఘ సంస్కర్తలమై పోస్ట్ చేస్తున్నాము. న్యాయమూర్తులం అవుతున్నాం. ఫేస్బుక్ ను న్యాయస్థానం చేస్తున్నాము. ఈ నిరసనలను, తీర్పులను ఎవరూ పట్టించుకోరని మనకు తెలియదు.
ఆవేశంగా, నీతిపరులమై, సంఘ సంస్కర్తలమై పోస్ట్ చేస్తున్నాము. న్యాయమూర్తులం అవుతున్నాం. ఫేస్బుక్ ను న్యాయస్థానం చేస్తున్నాము. ఈ నిరసనలను, తీర్పులను ఎవరూ పట్టించుకోరని మనకు తెలియదు.
బయటి ప్రపంచంలోని నేరస్థులందరూ కరడు కట్టిన
హృదయాలు కలవారు. రాతి గుండెల వారు. వారికి సంస్కారం, నాగరికతా, మనం నినదించే సంస్కృతి
ఏమీ పట్టవు. వారికి ఏ విషయంలోనూ భయభక్తులు లేవు. అటువంటి వారు సంఘ జీవనాన్ని నిర్దేశిస్తున్నారు. వారిపై ఫేస్బుక్ ఏ విధమైన ప్రభావం చూపించలేదు. శిక్షించబడతాం అనే భయం ఒక్కటే వారిని, వారి అసాంఘిక కార్యకలాపాలని, క్రూరత్వాన్ని కొంత నిగ్రహించ గలదు. ఆ భయం వారికి అణుమాత్రమూ లేదు.
హృదయాలు కలవారు. రాతి గుండెల వారు. వారికి సంస్కారం, నాగరికతా, మనం నినదించే సంస్కృతి
ఏమీ పట్టవు. వారికి ఏ విషయంలోనూ భయభక్తులు లేవు. అటువంటి వారు సంఘ జీవనాన్ని నిర్దేశిస్తున్నారు. వారిపై ఫేస్బుక్ ఏ విధమైన ప్రభావం చూపించలేదు. శిక్షించబడతాం అనే భయం ఒక్కటే వారిని, వారి అసాంఘిక కార్యకలాపాలని, క్రూరత్వాన్ని కొంత నిగ్రహించ గలదు. ఆ భయం వారికి అణుమాత్రమూ లేదు.
అదీ కాక ఎందరో నెటిజన్లు ఏదో వాదానికో, సిద్ధాంతానికో, మత మౌఢ్యానికో కొమ్ము కాసే
సామాన్యులు. వీరి ఫేస్బుక్ ఘోష అరణ్య రోదనమే.
మిగతా వారికి అమితమైన చిరాకే.
సామాన్యులు. వీరి ఫేస్బుక్ ఘోష అరణ్య రోదనమే.
మిగతా వారికి అమితమైన చిరాకే.
ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, చట్టాల అమలు, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై గౌరవం, భయభక్తులు సరిగా ఉంటేనే నేరముల సంఖ్య
తగ్గుతుంది. ఇది మరచి అంతర్జాల మాధ్యమాల్లో పోస్ట్ చేసే తమ సామాజిక స్పృహ ఏదో
చేస్తుందని నమ్మడం అతి పసితనం. అమాయకత్వం. ఇంగితం లేకపోవడం.
సమయం వృథా చేసికోవడం. లేనిపోని హైరానా పడడం.
సమయం వృథా చేసికోవడం. లేనిపోని హైరానా పడడం.
**********
డబ్బు లేక మనుగడే
లేదు. ప్రేమా, దోమా తిండిపెట్టలేవు, అవసరాలు తీర్చలేవు.
*********
స్థాయీ భేదం
ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అందరి కోసం కాదు
క్వాంటం మెకానిక్స్ అందరికీ అర్థం కాదు; రీమాన్ గణితం కొందరికే; అలాగే ఎన్నో శాస్త్రాలలోని ఎన్నో
చదువులు; అవి మన స్థాయికి దిగవు; దిగిరావు; మనమే ఆ స్థాయికి ఎదగాలి
క్వాంటం మెకానిక్స్ అందరికీ అర్థం కాదు; రీమాన్ గణితం కొందరికే; అలాగే ఎన్నో శాస్త్రాలలోని ఎన్నో
చదువులు; అవి మన స్థాయికి దిగవు; దిగిరావు; మనమే ఆ స్థాయికి ఎదగాలి
ఈ కోవలోకే
ఉపనిషత్తులు, వేదాంత గరిమ, షడ్దర్శనములు చేరతాయి; మనకి అర్థం కాలేదు
కనుక, మనకి వాటి స్రష్టలంటే ద్వేషం కనుక
వాటి విలువ తగ్గదు; ప్రపంచం వాటికి హారతి పడుతూనే ఉంటుంది; మన సంకుచిత తత్త్వం
బయట పడి ఈసడించ బడుతుందంతే; మన
అజ్ఞానపు అరచెయ్యి జగత్తులోని జ్ఞాన ప్రకాశాన్ని అడ్డలేదు
కనుక, మనకి వాటి స్రష్టలంటే ద్వేషం కనుక
వాటి విలువ తగ్గదు; ప్రపంచం వాటికి హారతి పడుతూనే ఉంటుంది; మన సంకుచిత తత్త్వం
బయట పడి ఈసడించ బడుతుందంతే; మన
అజ్ఞానపు అరచెయ్యి జగత్తులోని జ్ఞాన ప్రకాశాన్ని అడ్డలేదు
30-9-2018:
ఎవరు ప్రకృతిని
అతిక్రమిస్తారో వారిని ప్రకృతి శిక్షిస్తుంది.
*********
తల్లి కాచిన పాలు
తండ్రి తోడు
సంతానం పెరుగు
తండ్రి తోడు
సంతానం పెరుగు
*********
అల్పుల పని
వేటాడి వెంటబడి వేటాడి వేట కత్తులతో, గొడ్డళ్లతో మనుషులను ఘోరముగా నరికి చంపు రాక్షసులున్న సంఘముననే
ప్రకృతి విలయములు సంభవించినపుడు, ప్రమాదములు జరిగినపుడు వెతికి వెతికి
ఊపిరులున్నవారిని బయటకు తీసి రక్షించు
దయామయులు, కరుణాంతరంగులు, పరోపకారులు
ఉందురు
ఊపిరులున్నవారిని బయటకు తీసి రక్షించు
దయామయులు, కరుణాంతరంగులు, పరోపకారులు
ఉందురు
మనిషి మనిషికీ
తత్త్వం వేరు, ప్రకృతి వేరు
కరుణ వేరు, పగ, కక్ష, కార్పణ్యాలు వేరు
కరుణ వేరు, పగ, కక్ష, కార్పణ్యాలు వేరు
మనుషులంతా ఒక రకమే కాదు
భిన్న ధ్రువాల వారుందురు; సజ్జనులు,
దుర్మార్గులు; అపకారులు, సర్వజన శ్రేయోకాములు
మృగములు, నేరస్థులు, ఉగ్రవాదులు, అత్యంత
భిన్న ధ్రువాల వారుందురు; సజ్జనులు,
దుర్మార్గులు; అపకారులు, సర్వజన శ్రేయోకాములు
మృగములు, నేరస్థులు, ఉగ్రవాదులు, అత్యంత
పరోపకారులు భూమిపై వసించుచున్నారు
ఈ తేడాలు అన్ని దేశాల్లో, ప్రాంతాల్లో, సంఘాల్లో,
కులాల్లో, మతాల్లో, అన్ని లింగములలో కలవు
అన్ని ఛిద్రాలకు ఒకటి రెండు కులాలను, మతాలను,
ఈ తేడాలు అన్ని దేశాల్లో, ప్రాంతాల్లో, సంఘాల్లో,
కులాల్లో, మతాల్లో, అన్ని లింగములలో కలవు
అన్ని ఛిద్రాలకు ఒకటి రెండు కులాలను, మతాలను,
ప్రాంతాలను, లింగాలను, దేశాలనూ తప్పుపట్టడం
సంస్కార రహితంగా దూషించడం అల్పుల పని
సంస్కార రహితంగా దూషించడం అల్పుల పని
**********
మనము
చదివినను చదువకున్నను
గొప్ప గొప్ప రచనలకు ఏమీ లోటు లేదు
గొప్ప గొప్ప రచనలకు ఏమీ లోటు లేదు
మనము నమ్మినను నమ్మకున్నను భగవతత్త్వములు ఏమీ
కోల్పోవు
మనం భజించినను
భజించకున్నను
దివ్యత్వములకేమీ నష్టం లేదు
దివ్యత్వములకేమీ నష్టం లేదు
మనకు అర్థమైనను కాకున్నను విజ్ఞాన శాస్త్ర
విషయములకు ఏమీ లోటు లేదు
మన అల్పత్వము అనల్పాన్ని కొలువ లేదు మన
జ్ఞానరాహిత్యం జ్ఞానభాండాగారం ఉనికికి మొప్పం కాదు
జ్ఞానరాహిత్యం జ్ఞానభాండాగారం ఉనికికి మొప్పం కాదు
అల్పుడెపుడు పల్కునాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
********
Morality is to be taken care of by
culture, tradition, "civilization" and "religion".
*******
చదువు
పరమార్థము తత్పరత
జీవితంలో ఒక స్థాయికి వచ్చాక అనవసరమైన
విషయాలను చర్చించే పుస్తకాలను ఎంత తక్కువ చదివితే అంత మంచిది. అనవసర వాదులాటలలో
ఇరుక్కోకుండా మన పొల్లు మనం పోసుకుంటూ ఉండడం తెలివైన పని.
వర్తమానంలో జరుగుతున్న అన్ని విషయాల మీద, సంఘటనల మీద, మన అభిప్రాయాలు చెప్పి తీరవలసిందే అని మన్ని
ఎవరూ బలవంతం చెయ్యటం లేదు.
మనం మన్ని
నియంత్రించుకుంటే మనకి మనం ఎంతో ఉపకారం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎంతో మానసిక
శక్తిని, మానసిక
సమయాన్ని ఆదా చేసుకుని, మనశ్శాంతి
నిండిన హృదయంతో జీవిస్తాము.
ఆధ్యాత్మిక పథంలో పయనిస్తున్న వారు ఎంత
తక్కువగా కొత్త విషయాలు చదివితే అంత మంచిది.
ఒకసారి ఒక ముముక్షువు శ్రీ రమణ మహర్షిని
అద్వైతం గొప్పదా, విశిష్టాద్వైతం
గొప్పదా, ద్వైతం
గొప్పదా అని అడిగితే, ఊడ్చి పారవేయ
వలసిన చెత్తలో, ఇది రత్నం, ఇది ముత్యం, ఇది వజ్రం అని ఎన్నడం అనవసరం అన్నారు.
మనం చదువుకున్నదంతా మర్చిపోయి తీరవలసిన సమయంలో
ఇంకా చదవడం అనవసరం.
A spirituality aspirant person
has to unlearn, relearn and delearn what is relearnt. His mind should be like a
clean slate.
శుభ్రంగా కడిగి, తుడిచిన అద్దంలా మనసుండాలి. చదివిన
చదువులన్నీ ప్రతిబంధకాలే. ధ్యానం ద్వారా ధ్యాత, ధ్యేయములను నెమ్మదిగా లేకుండా చేసికొని
నిరంతర ధ్యానంగా నిలవడమే ధ్యానానికి పరాకాష్ట.
చదివిన దాని సారాన్ని అనుభవంగా మార్చుకుని ఆ
అనుభవంగా నిలిచి ఉండడమే "వేదాంత వాక్యేషు సదా రమంతే" అంటే.
చదువు తనను తాను కరిగించు కొని తత్పరంగా, తాత్పర్యంగా మారాలి.
అన్ని వేదాంతాల సారమూ, తాము విశ్రాంత దృష్టి సమయంలో అదృశ్యమై
ఉండడమే. పరమార్థమవడమే. పరమాత్మగా ఉండడమే.
*******
ఈ రోజున మనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిగత జీవితం లేదు. మన జీవితానికి సంబంధించిన ప్రతి అంశము బహిరంగ చర్చ అయిపోతోంది. దానిపై ఎవరి నోరు వారు పారేసుకుంటున్నారు. మన జీవితం ఇలా బహిరంగం అయిపోవడం చాలా ఇబ్బందిగా, చిరాకుగా తయారైంది. మన జీవితం గురించి మనం ఆలోచించుకునే సావకాశమే లేదు. ఎవడో మేధావి ఆలోచిస్తాడు మనందరం వాణ్ణి తు చ తప్పక అనుసరించాలి.
********
ఇప్పుడు
రాసే రాతలు, రచనలు రచయితల/రచయిత్రుల, కవులు/కవయిత్రుల పేరు ప్రఖ్యాతుల కొరకు, వీలైతే ధన
సంపాదనకూ ఉపయోగ పడుతున్నాయి తప్ప పాఠకులకు జీవన విధాన నిర్ణయం లో అస్సలు ఉపయోగ
పడడం లేదు లేదా చాలా అరుదుగా ఉపయోగ పడుతున్నాయి.
ఈ సారస్వత సృష్టి అంతా మనుషుల ప్రకృతి, మనస్తత్వాలు చదివి, ఆకళింపు చేసుకుని చేస్తున్నది కాదు. ఏవో
దుష్కరమైన ఆదర్శాలు వల్లిస్తూ,
పుష్కలమైన
ద్వేషంతో సాంప్రదాయ రాహిత్యాన్ని బాధ్యతా రహితంగా ప్రచారం చేయడానికి
ఉపయోగించుకుంటున్నవి.
సాహిత్యం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
********
మనసుతో మనసుకు
మంచి మాటలు చెప్పే వారు లేరు. మనుషులంతా యంత్రములతో, కుతంత్రములతో, కుమ్ములాటలతో బిజీ.
******
మనిషి
జీవితంలో తిండికి, బట్టకి, ఉండడానికి
లోటు లేక పోవడం ఒక వైపు, మనసును స్థిమిత పరచే ఆత్మీయులతో కలిసి
ఆహ్లాదంగా జీవించడం ఒక వైపు,
తన వీలుని
బట్టి తోటివారికి ఉపయోగ పడడం ఒక వైపు, పరంధాముని
నిత్యమూ స్మరిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమించడం ఒక వైపు;
ఇన్ని వైపులా సజావుగా ఉండి సుఖశాంతులతో
నిండిన జీవితమే పండినట్టు. వీటిలో ఏది లేకపోయినా మనిషికి అశాంతి, ఆవేదన, వ్యథ.
********
ప్రతినిధులు
శాసనాలు చెయ్యడానికి ఎన్నికై "పరిపాలన" చేస్తున్నారు. గవర్నమెంట్
ఉద్యోగాలకై ఎవరినీ రిక్రూట్ చేసుకోవటంలేదు అరకొర భత్యంతో పూర్తి స్థాయి పని
చేయించుకుంటున్నారు, శ్రమ దోపిడి చేస్తున్నారు, గవర్నమెంట్ వారు, ప్రైవేటు వారు. లేని వాళ్ళకి కొందరికి ఏవో
పథకాలంటూ మసిపూసి మారేడు కాయ చేసి అందర్నీ మోసగిస్తూ వారి పబ్బం వారు
గడుపుకుంటున్నారు నాయకులు. వారు చేసే దోపిడీకి, అన్యాయానికి, మోసానికీ, అవినీతికి అడ్డూ ఆపూ లేవు. మనందరం కులాలు, మతాలు, ప్రాంతాలు, ఉప జాతీయతలు అంటూ నాయకుల మోసానికి ప్రాణం పోస్తూ జీవచ్ఛవాలలా బతుకుతున్నాం. ఈ
దుష్పరిపాలనకు, దుష్పరిణామాలకు ఇప్పుడప్పుడే అడ్డు కట్ట
పడేలా లేదు.
***********
నేటి సంఘంలో
చాలా మంది వాళ్ళ వాళ్ళ జీవితాలు జీవించడం మానేసి, వాళ్ళకి
సంబంధించని విషయాలపై, సంఘటనలపై ఫేస్బుక్ లో తిట్టుకోవడం, "కొట్టుకోవడం" ఎక్కువైంది. బహుశా
వీళ్ళందరికీ చేయడానికి వేరే పనులు లేనట్టున్నాయి.
అన్ని విషయాలపై, సంఘటనలపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయని, ఎవరూ
ఇంకోళ్ళ అభిప్రాయాలు పట్టించుకోరని తెలిస్తే చాలా మంది ఈ దెబ్బలాటల్లో ఇరుక్కోరు.
*******
ప్రపంచంలో
ఎన్నో సంగతులు మన ఇష్టాయిష్టాల ప్రకారం జరగవు. రోజు రోజూ వచ్చే వార్తలు చదివి, మన మనసు పాడు చేసుకోవడం అనవసరం. అన్ని సంగతులు మనకి తెలియక్కరలేదు.
మనకు ఇష్టాయిష్టాలు ఉండడం చాలా తేలికైన, సులువైన విషయం. కాని సంఘటనలు వాటికి అనుగుణంగా జరగాలి అనుకోవడం పసితనం. మనం
చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఊరికే ఆవేశపడి పోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
ప్రపంచాన్ని మనం శాసించలేము. మనకు ఎంతో గొప్ప
సంస్కారం ఉందని, సాంస్కృతికంగా ఎంతో
ఘనమైన వారము అనుకొని అంతా మన ఊహలకు అనుగుణంగా జరిగే సావకాశం లేదు. ఇది గమనిస్తే శాంతి. సుఖము.
ఘనమైన వారము అనుకొని అంతా మన ఊహలకు అనుగుణంగా జరిగే సావకాశం లేదు. ఇది గమనిస్తే శాంతి. సుఖము.
*********
అక్రమ సంబంధాలు న్యాయస్థానం
పరిధిలోకి రావని,
ఇవి వ్యక్తిగత నీతి నియమాలకీ, సాంప్రదాయ బద్ధతకీ సంబంధించినవని ఉన్నత న్యాయస్థానం
ఉద్దేశం కావచ్చు.
No comments:
Post a Comment