Friday, September 14, 2018

Mind; ప్రకృతి ఆవేశం; ఫేస్బుక్

Mind is consciousness tuned to and in contact with worldly objects, affairs and issues. Consciousness is, mind tuned to and in absorption in its source.
*******

ప్రపంచాన్ని అర్థం చేసికొని జీవించే వాళ్ళ కన్న అపార్థం చేసుకుని గొడవ, గోల చేస్తూ అశాంతి రేకెత్తించే వారు సంఘంలో చాలా చాలా ఎక్కువగా తయారయ్యారు.
*********
We try to take help from all but ourselves. Life is more bearable if we choose proper people as dear ones, if near ones are not, some solace will be there. Others will always are partial in helping. Better is self-reliance. Life is a series of experiences, pleasant and unpleasant. We may not get help when required from others physically and psychologically.
Life is mind management.
*********
ప్రపంచంలో ఏదీ మనం అనుకున్నట్లు, మనకు కావలసినట్టు జరగదు. మనం సర్దుకు బ్రతకాల్సిందే.
******
అనుభవము మానసిక స్థితి. తలపు మానసిక గతి.
*********
కవిత్వముచే ఆకర్షింప బడుటకు వ్యక్తికి సరస హృదయం ఉండాలి. ఆస్వాదన తెలియాలి. స్పందన కల మనసుండాలి. సారస్వత పరిచయం, ఆసక్తి ఉండాలి. భాషపై పట్టు ఉండాలి. వస్తువుని బట్టి మెచ్చుకోగల కుశలత ఉండాలి. ఇవి కొందరిలోనే ఉంటాయి. అందుకనే చాలా తక్కువ మంది కవిత్వం వైపు ఆకర్షింప బడతారు.
**********
ఉపాసకులు, స్వాములు, సన్యాసులు, మత గురువులు, ఆశ్రమ నిర్వాహకులు మనల్ని ఉద్ధరించడం కన్న తమని తాము మనం ఇచ్చిన డబ్బు, ఇతరములతో ఉద్ధరించుకుంటారు. చివరికి జోగీ, జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు మిగులుతాం మనం, ఉద్ధరింపు మర్చిపోయి.
***********
అంతర్జాల మాధ్యమాల్లో మగవారి దౌర్జన్యాలను, దౌష్ట్యాన్ని, క్రూరత్వాన్ని చీల్చి చెండాడే అతివల ఇంట్లోని మగవారెవరూ ఈ దుర్లక్షణాలు లేని వారై ఉంటారు. ఎంతో వినమ్రులు, మంచి వారై ఉంటారు. అటువంటప్పుడు ఆ స్త్రీలు జీవితాన్ని హాయిగా గడపక ఎందుకు మిగతా మగవాళ్ళని పట్టించుకుంటారు?
లోకంలో చీకటి, వెలుగులు; రాత్రింబవళ్ళు; మంచి చెడ్డలు ఉంటూనే ఉంటాయి.
***********
30 ఏళ్ళ క్రితం మనం పండుగలు చేసుకోవడం టి.వి. లోకి మారింది.
ఇప్పుడు పండుగలు చేసికోవడం ఫేస్బుక్ లోకి మారింది.
*******
ఈ ప్రపంచంలో గురువులకు, ఉపదేశాలకు, ప్రవచనాలకు లోటు లేదు. చెప్పినట్టు చేసేవారే లేరు. తాము చెప్పింది చేసే గురువులూ లేరు.
*********
ప్రకృతి ఆవేశం
కాయగూరలను, ఫల పుష్పములను
చూచిన తోడనే మనసు పరవశమందును
ప్రకృతి అందములు, రంజనములు పలు విధములు;
రమణియొ, ఏరో, సెలయేరో, జలపాతమొ, నదియొ,
సాగరమొ, అన్నియు తమ తమ సొగసులతో కనువిందు సేయును; ప్రకృతి ఒడిలో జీవించుట
జీవిత పరమార్థము; కాని ప్రకృతి విధ్వంసాన్ని ప్రకృతి
ఓపలేదు; ప్రకృతి ఆవేశానికి అడ్డు, ఆపులు లేవు
ప్రకృతి అలరించును; హద్దు మీరిన, పొంగి, విచక్షణ కోల్పోయి, ఆలోచన లేక ఆవేశంతో ప్రళయం సృష్టించును
********
హిందూ మతాన్ని రక్షించేందుకు కొందరు, భక్షించేందుకు కొందరు నడుం కట్టారు; ఎవరు గెలుస్తారు? తెలియదు; రక్షించే వారిలో చేరలేదని
మనల్ని విమర్శించేవారు ఎందరో? అసలు హిందూ
మతం అంటే ఏమిటి? అందులో ఎన్ని తెగలున్నాయో
ఈ రక్షకులకు తెలియదు; భక్షకులకూ ఆత్రం, డబ్బాశ
చూపించడం తప్ప మత సూత్రాలే తెలియవు; మతాలు మనుగడ కోల్పోతున్న నేడు ఏ మతం
మన్నుతుంది? మతానుయాయులను ఉద్ధరిస్తుంది?
అశాంతి సృష్టించడం తప్ప భక్షకులకు మరేమీ తెలియదు
********
Judging is not necessary many times.
But we are innately driven by tendencies to judge and comment rather than merely observe.
*******
Consciousness of experiences, thoughts, feelings, utterances of individual and acting, reacting and interacting to them is jeevatma - జీవాత్మ - जीवात्मा।
Consciousness of peace, bliss, silence, unoccupied awareness is paramatma - పరమాత్మ - परमात्मा.
The commonness between them is the consciousness.
Pure consciousness is source of mind and thus perceived world - విశ్వం, జగత్ - विश्वं, जगत्, and activities associated with and through them, both as instrumental - నిమిత్త - cause and substantance - ఉపాదాన - cause.
If peace is in awareness it is state of non-duality.
If ego, mental activities are in awareness it is a duality.
*******
మనకి ఇష్టం లేనివి, కష్టం కలిగించే పోస్ట్ లు ఎక్కువగా కనిపించే ఫేస్బుక్ లో గంటల తరబడి ఎందుకు కూచుంటున్నాం? మనకే తెలియదు. కాలక్షేపం. ఇంకా?
బహుశా గంజాయి వనంలో తులసి మొక్క లాగ ఉపయోగ పడే, ఇన్స్పిరేషన్ ఇచ్చే రెండు మూడు మాటల కోసం ఇదంతా భరిస్తున్నామేమో; ఈ అలజడి అంతా. మన సృష్టీ సరస హృదయులను
చేరుతుందేమోనని ఆశ కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకే అభ్యంతర, భీభత్స కరమైన, జుగుప్స కలిగించే పోస్ట్ లను ఈ ఆశతో భరిస్తున్నామేమో!
*********
ఎవరూ ఎవరికీ చేసింది ఏమీ లేదు,
కాని ఓట్లేయండి అంటూ మళ్ళీ తయారు;
ప్రజాస్వామ్యమున రాజకీయ నాయకుల
మోసానికీ దోపిడీకి లేదు అడ్డుకట్ట;
ఎవరినో ఒకరిని ఎన్నుకొని తీరాలి
ఇదేమి ప్రజాస్వామ్యమో, ఎదురు తిరగాలి
ప్రేమ లేదు దేశంపై, శక్తి యుక్తులు ముందే సున్న;
వంశ పారంపర్యంగా ఎన్నుకోండని ప్రచారం, ఏం
నిపుణతలున్నాయని వీరిని ఎన్నుకోవాలని ఎందరివో
ప్రశ్నలు; సమాధానం లేదు; ఎన్నుకోండి అంతే!
********
ప్రతివారిని రచయితలను చేసిన ఫేస్బుక్
రచనా లోకంలో విప్లవం తీసుకువచ్చిన ఝరి;
అంతర్జాల సాలెగూటి మాధ్యమాల్లో మిన్న

భాషోపయోగముపై దృష్టి నిలపక 
తోచినది రాసి పోస్టు చేసేసి నిలిచి;
లైకులకై, కామెంట్లకై ఎదురుచూపు
మనం రాసినదే రెండోసారి చదవని మనం ఎవరి పోస్టులు చదువుతాం? ఎవరిని అభినందిస్తాం?
ఆ రచనలూ పెళ్ళికాని యువతలా అలమటిస్తాయి
ఇందులోనే పోటీలు, పోట్లాటలు, కాట్లాటలు
కాంట్రాక్టుల అభినందనలు, అభిశంసనలు
అంతర్జాల మాధ్యమాల్లో మకటాయమానమైనది
ఫేస్బుక్; అందరి కాలక్షేపం బఠానీలు ఫేస్బుక్



No comments:

Post a Comment